Thursday, 15 May 2014

రుధిర సౌధం 146

ఆరోజు సాయంత్రం అక్కడ రావణ పురం లో రచన పాడుబడ్డ కోటకి పయనం అవుతున్న సమయం లోనే ఇక్కడ

ముంబై లో తన ఇంట్లో వీణ వాయిస్తూ మనసు ని శాంత పరచుకొంటుంది గిరిజ . బిడ్డ ఆపదలో ఉండటం తల్లి

మనసు ముందే గ్రహిస్తుందో ఏమో ఆమె మనసు కలవరంగానే ఉంది . ఆ సమయం లోనే కాలింగ్ బెల్ మోగింది ....

వొడిలో ఉన్న వీణకి పక్కకి పెట్టి వెళ్లి తలుపు తీసింది గిరిజ .

 నమస్కారమమ్మా .. అంటూ ఎదురుగా గోపాలస్వామి .

నువ్వా ? స్వామీ ... స్వామీజీ ఏమన్నా కబురు పంపారా అని అడిగింది గిరిజ ఆత్రుతగా ..

అవునమ్మా ........ స్వామీజీ వారి స్వస్థలానికి బయలు దేరి వెళ్ళాలని సంకల్పించారు .. మీతో ఈ కబురు

చెప్పమన్నారు .. అన్నాడు గోపాలస్వామి .

అవునా ? ఇంత హటాత్తుగా రావణ పురం వెళ్ళాలని సంకల్పించారా ? ఆమె మనసు లో కలవరం మాటల్లో

ఉత్పన్న మవుతుంది .

అవునమ్మా .. ఈరాత్రి కె బయలుదేరుతున్నాం .. వస్తాను అమ్మా .. అని వెనుదిరిగాడు గోపాలస్వామి .

సాయంత్రం జరిగినదంతా గుర్తు చేసుకున్న ఆమె మనసు నిలువ నీయక పోవటం తో మంచం దిగి కిటికీ తలుపు

తెరచి ఆలోచన లో  మునిగిపోయింది .

స్వామీజీ ఇలా హటాత్తుగా బయలుదేరటం వెనుక అంతరార్థం రచన ప్రమాదం లో ఉందని కాదు కదా ... స్వామీజీ

తో పాటూ నేను బయల్దేరి ఉంటే బావుండేది .. కానీ విక్రాంత్ వస్తానని చెప్పాడే .. తను వచ్చేసరికి రచనా లేక నేను

లేకపోతె బాధపడతాడు . పైగా రచన తన అన్న తో తను రావనపురం వెళ్ళిన సంగతి చెప్పవద్దని మాట తీసుకొంది .

రానున్న రెండు రోజులలో పౌర్ణమి ఉంది .. నేనిలా తప్పుగా ఆలోచిస్తున్నాను గానీ ఒకవేళ రచన గాని ఆలయం

జాడ కనుగొన్నదేమో .. అందువలనే రామనానంద మహర్షి ఇలా హటాత్తుగా బయలుదేరారేమో .. నా రచన

అనుకొన్నది  సాధించగలదు .. అందులోనూ తన తండ్రి పట్ల అవ్యాజ్యమైన ప్రేమ కలది .. అందుకే తన తండ్రి కోరిక

నెరవేర్చటం కోసం తన అన్న హక్కు ని కాపాడటం కోసం ఇంత సాహసిస్తోంది . తల్లిగా మనస్ఫూర్తిగా తనని

ఆశీర్వదిస్తాను . తన పూర్వీకుల ఆశీస్సులు .. తరతరాలుగా వైష్ణవీ మాత ఆలయానికి పురోహితులు అయిన

కుటుంబానికి రామనానంద మహర్షి ఆశీస్సులు ఆమెకి తప్పని సరిగా ఉంటాయి .. అనుకొంటూ వర్ధన రావు

ఫోటో వద్దకు నడచి "మీరు మన బిడ్డని ఆశీర్వదించండి " అని అంది గిరిజ .

ఆమె కళ్ళలో " వర్ధన రావు తన బిడ్డలతో సంతోషంగా గడపడం "మెదలి కన్నీళ్ళతో తడసిన చెంపలని

తుడుచుకొంది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కి పడింది గిరిజ .

ఇంకా ఉంది   

మన "రుధిర సౌధం " సీరియల్ 150 వ ఎపిసోడ్ కి చేరువ కాబోతున్న సందర్భం లో "నా రచన " బ్లాగ్ రీడర్స్

అందరికి సదా కృతజ్ణతలు ..

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: