Thursday, 15 May 2014

రుధిరసౌధం 147


గడియారం వైపు చూసింది .. సమయం 12గం అని చూపిస్తోంది .. ఈ సమయం లో ఎవరు అని అనుకుంటూనే ..

వెళ్లి తలుపు తెరచింది ..

ఎదురుగా విక్రాంత్ ..

విక్కీ .. నువ్వా ? ఆశ్చర్యానందాలతో అంది గిరిజ .

అతడు చిరునవ్వు తో వంగి ఆమె పాదాలకి నమస్కరించాడు .. లేచి , నన్ను క్షమించమ్మా .. ఈ సమయం లో

నిన్ను డిస్టర్బ్ చేసినందుకు .. నిన్ను ,రచన ని సర్ప్రైజ్ చేద్దామనుకుని అనుకున్న డేట్ కంటే ముందే బయల్దేరాను

బట్ ఫ్లైట్ లేట్ అయింది .. అన్నాడు విక్రాంత్ .



అతడి వంక వాత్సల్యం తో చూస్తూ .. ముందు లోపలి కి రా నాన్నా .. అంది గిరిజ .. గుమ్మానికి అడ్డు తొలగుతూ ..

విక్కీ లోపలికి వచ్చాక .. అమ్మా .. రచన నిద్రపోతోందా ? అని అడిగాడు ..

రచన గురించి అడగగానే కాస్త తొట్రుపాటు కి లోనైంది గిరిజాదేవి ..

ఏంటమ్మా ? సమాధానం చెప్పవు .. నేనోచ్చానని తెలిస్తే ఎంత నిద్రలోనైనా లేస్తుంది .. నాకు తనని చూడాలని

ఆత్రుత గా ఉంది .. అన్నాడు విక్రాంత్ .

నాన్నా .. రచన ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళింది .. ఇంట్లో లేదు .. నువ్వు ముందు ఫ్రెష్ ఆవు .. భోజనం

పెడతాను .. అంది గిరిజ .

చెల్లెలు ఇంట్లో లేదనగానే మొహం చిన్నబోయింది విక్కీ కి ..

ఎప్పుడొస్తుందమ్మా ? అని అడిగాడు .. వ

వచ్చేస్తుంది రా .. నువ్వు ముందు ఫ్రెష్ అయి రా .. వెళ్ళు .. అంది గిరిజ ..

లేదమ్మా .. నేను తినే వచ్చాను .. నా గదిలో కి వెళ్లి నేను ఫ్రెష్ అయి పడుకుంటాను .. నువ్వు పడుకో అమ్మా ..

అని .. ఉదయం రచన కి ఫోన్ చేద్దాం .. అని గదిలోకి నడిచాడు విక్కీ .

అతడిని చూస్తూ రచన రావణ పురం వెళ్లిందని విక్కీ తో ఎలా చెప్పను ? రచన తన మాట వినలేదని అంటాడు ..

అని చిన్నగా నిట్టూర్చి మెయిన్ డోర్ లాక్ చేసి తన గదిలోకి నడచింది గిరిజ .

                                                  *****************************

బాలయ్య వాళ్ళ వెనుక వారికి తెలియకుండా అనుసరిస్తున్నారు యశ్వంత్ బృందం ..

ఇంతలో ఏదో చప్పుడు విని వారు వెనక్కి తిరగబొయెలొగా ముగ్గురూ పొదల చాటున దాక్కున్నారు ..

బాలయ్య .. ఏదో చప్పుడు వినిపించింది .. చూసిరా పో .. అన్నాడు వీరస్వామి .

ఏదో జంతువూ .. ఇంత రాత్రి వేళ ఈ అడవిలోకి ఎవ్వరొస్తరు ? పద పోదాం .. ఇంకా శానా దూరం పోవాలి కదా

అన్నాడు .. బాలయ్య .. చుట్టూ పరికిస్తూనే .

సర్లే .. ఈ పొదల కాడినుంచి మలుపు తిరిగిపోతే తొందరగా పోతాం ఆడికి .. పదండి .. అని చెబుతూ ముందుకి

నడిచాడు వీరస్వామి . సరస్వతి వారి చేతుల్లో పెనుగులాడుతూనే ఉంది ..

వాళ్ళ సవ్వడి దూరం కాగానే పొదల చాటు నుండి బయటకి వచ్చారు యశ్వంత్ బృందం ..

వాళ్ళు బయటికి వచ్చేసరికి బాలయ్య వాళ్ళు కనబడలేదు ..

యశ్ .. ఎటు పోయారు వాళ్ళు ? మిస్ అయ్యం మనం .. అన్నడు కంగారుగా మురారి ..

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: