ఆ :ఓ క్షణం నిరాశ గా .. మరో క్షణం నీ శ్వాస గా ..
పదే పదే మనస్సుకే జవాబు చెబుతుండగా ..
అ :నా జగం నువ్వే కదా .. నా సగం నువ్వే కదా ..
పడే పదం నీ వైపుకే .. దూరాన్ని తరిమేందుకే ..
అ :నిరంతరం .. నిరీక్షణం .. కోరింది నీ వీక్షణం ..
ఆ :ఈ అంతరం .. తరం కాదు ఒక్కటి కావడం ........
అ :నీ మదిలో సందేహమే కమ్మితే .. ప్రేమ నే వెలుగు నే చూడలేవే మరి ..
ఆ :నా హృదే నిజాన్నే అన్వేషించితే .. ప్రేమయే అంబరమై కనబడదా మరి
అ: కులమంటూ మతమంటూ భేదాలు కనలేని ప్రేమే కదా ఓ చెలీ .....
ఆ :అధికులమంటూ .. వలదంటూ పరదాలు మూసేసే సంఘం ఇది .. తెలీదా అది
అ :నీకోసమై ఆ నింగి నొదిలి ఇల చేరునే జాబిలీ ..
నీ ప్రేమకై నా హద్దులే చెరిపేసి రానా చెలీ .. ......... ఓ క్షణం
ఆ :?నువ్వింతలా అడిగితె కాదనలేని అసహాయతా .. నువ్వింక నను చేరితే అవుననలేని దౌర్భాగ్యత ..
అ :నాలోన నిను వెతికితే తనువెల్లా ఉన్నావుగా .. మరి నీలోన నను వెతికితే నీ కన్నీట కరిగించావుగా ..
ఆ :గతమంతా చేదయినా విష జ్వాల పాలైనా .. గాయాల నయినా మాన్పేది ప్రేమా ..
అ :అవగత మైన నీ మది ని నా గుండె లో దాచి రక్షించుకోగలనే నమ్మకమే ప్రేమా ..
ఆ :అంతస్థు లెన్నైనా నింగిని తాకలేవంటు .. చాటింది ఈ ప్రేమ గెలుపే కదా
వద్దంటే పెరిగేది కాదంటే మరిగేది .. ఈ ప్రేమ తీరింతే ఓ ప్రియతమా ..
అ :నీ ప్రేమకై ఈ దిక్కుల్ని ఎదురించి రానా చెలీ
కులమొద్దు మతమొద్దు అంతస్తు చూడొద్దు
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
"కులమొద్దు మతమొద్దు అంతస్తు చూడొద్దు" కేవలం సినిమాలో డైలాగులే రాధిక,ఇవి 99%వాస్తవం కావు.రచన బాగుంది.
Post a comment