కరిగిపోయే క్షణాలని .. మరిగిపోయే మనసుని ..
నియంత్రించలేని అసహాయత అసమర్థత కాదులే ..
మరవలేని స్మృతులను . మరలరాని రోజులను ..
స్మరించకుండా ఉండలేకపోవటం అపరాధమయితే కాదులే ..
గుండె నిండా వెల్లువైన ప్రేమ తాకిడి కి ఆనకట్ట వేయలేని
కనుల చెలియలి కట్ట దాటిన కన్నీటి వరద నను ముంచనీ ..
పెదవి పైన మాసి పోని పూల ఋతువు ని ఆహ్వానించనీ ..
పొదివి పట్టి ఓదార్పు నిచ్చే మనసు కై వెతుకులాట సాగనీ ..
మసకబారిన ఎద గూటిలో వెండి వెన్నెల పరచు కొనే ..
రోజు కొరకు వేచి చూడటమే .. అలవాటుగా మార్చుకోనీ ..
నన్నిలా బ్రతకనీ ...............
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:
Nice
thank you sridevi garu..
elaa unnaaru?/
Post a comment