నేనే వెలుగులు చిమ్మే దీపాన్నే అయిపోతా ..
నేనే ఉరిమే మబ్బుల కరిగించే కళ నవుతా ..
శీతాకాలపు వెచ్చని ఎండను నేనే అవుతా ..
వేసంకాలపు చల్లని గాలిగా విహరిస్తుంటా ..
నింగి నేల ని కలిపే హరివిల్లవుతా ..
నింగి ని నేలకు దింపే విరిజల్లవుతా ..
పచ్చని కోకే కట్టిన పుడమి ని నేనై పోతా ..
వెన్నెల పంచే శరత్కాలపు పున్నమి నవుతా ..
అన్నెం పున్నెం ఎరుగని పాపల చిరునవ్వవుతా ..
అన్నం పెట్టె రైతన్నకి ఓదార్పవుతా ..
వారు వీరని తేడా చూపని మనసై పోతా ..
మానవత్వపు పరిమళాలని వెదజల్లెస్తా ..
బంధాలను పెనవేసుకు పోయే ప్రేమై పోతా ..
అన్యాయాన్ని ఎదురించే ధైర్యాన్నై పోతా ..
సమన్యాయం లోనే శాంతి ఉందనే భావన నవుతా ..
భువి పైనే స్వర్గాన్ని నిలబెట్టి చూపిస్తా
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment