Thursday, 26 June 2014

రుధిరసౌధం181ఆ ముగ్గురి ముందు ఓ వెలుగు ప్రత్యక్షమై .. చిరునగవు తో విధాత్రి నిలబడింది ...

మీరు నా సహాయాన్ని అర్థించి నప్పటికీ శాంతియుతం గా సమస్యని పరిష్కరించారు .. మీ తెలివి పట్ల నేను

నమ్మకాన్ని మరింత పెంచుకున్నాను .. యశ్వంత్ .. రేపే పౌర్ణమి .. రచన చేతుల మీదుగా ఆలయ ద్వారం తెరువ

బడాలి .. దీపాలు వెలగాలి .. దానికోసం మీముందున్న ఒక్కొక్క ఆటంకం దానికదే తొలగించ బడుతుంది .. అన్ని

సక్రమం గా జరగబోతున్నాయి .. ఈ రెండు రోజుల్లో ప్రతి సంఘటన మిమ్మల్ని ఆశ్చర్య చకితులుగా చేస్తుంది ..

అలాగే ఓ ఆపద కూడా పొంచి ఉంది .. అన్నింటికీ సిద్ధం గా ఉండండి అంది విధాత్రి ..

తప్పుకుండా యువరాణి .. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే .. సత్సంకల్పం ముందుకు నడిపిస్తుంది అని ఇప్పటి

వరకూ మా అనుభవాలే మాకు తెలియజేసాయి ... మీ కోరిక నెరవేరుతుంది .. అన్నాడు యశ్వంత్ .

ఆమె చిరునవ్వు తో .. అవును .. నెరవేరబోతోంది ... త్వరలోనే దెయ్యాల కోట గా పిలవబడిన ఈ మహల్ ప్రేమ

సౌధం గా మారబోతుంది ... మా వంశీకుల గుర్తుగా భవిష్యత్ తరాలకి ఆహ్వానం పలకబోతుంది .. వంశాభివృద్ధి

జరగబోతుంది .. అంది విధాత్రి .

యశ్వంత్ ... శివ , మురారి లు ఆమె కి వినయంగా నమస్కరించారు .

వెళ్ళండి .. సమయం మించక ముందే మీ పని ముగించుకోండి .. అంది విధాత్రి .

అలాగే యువరాణి .. అని ముగ్గురు అక్కడ్నించి కదిలారు ...

                                                     *************************

స్నానం ముగించుకొని సరస్వతి ఇచ్చిన పరికిణి , వోణి లో తెలుగింటి అమ్మాయిలా జడ వేసుకొని అద్దం లో తనని

తాను చూసుకొంది రచన . ఆమె మొహం ఆమె కె ముద్దొచ్చింది ..

వెనక నుంచి సరస్వతి రావడం అద్దం లో కనబడే సరికి వెనక్కి తిరిగింది రచన ..

అరరె .. ఎంత అందం గా ఉన్నారు మీరు ? నా దిస్టే తగిలేలా ఉంది అని కాటుక తీసి రచన చెవి వెనకాల అద్దింది

సరస్వతి .

చిన్నగా నవ్వి .. సరస్వతీ .. తాత వచ్చాడా ? అని అడిగింది రచన .

వచ్చాడమ్మ .. యశ్వంత్ బాబు ని కలిసి వచ్చాడమ్మ .. యశ్వంత్ బాబు వాళ్లకి బాలయ్య దొరికాడంట.. ఊరందరి

ముందు అన్ని నిజాలు బయట పెట్టబోతున్నరంట .. మిమ్మల్ని , నన్ను సిద్ధం గా ఉండమన్నా రట .. బాబు

మంచితనాన్ని తాత వేనోళ్ళ పొగిడాడు .. మంచోడమ్మ  యశ్వంత్ బాబు ... ఆయన్ని ఏ పిల్ల చేసుకుంటుందో గని

చాల అడురుస్టం చేసుకుని ఉండాలా .. కదమ్మా ? అంది సరస్వతి ..

సరస్వతి మాటలకి నవ్వు వచ్చింది రచన కి ..

ఆహా .. మీ యశ్వంత్ బాబు ని చేసుకోవాలంటే అంత అదృష్టం కావాలా ? మరీ అంత లేదులే .. ఇంకో మాట చెప్పు

అంది గడుసుగా రచన .

నేను యశ్వంత్ బాబు ని అంటుంటే మీరు .. ఇలా అంటున్నారంటే .. కొంపదీసి .. యశ్వంత్ బాబు .. మా

యువరాణి  మనసు దోచుకోలేదు కదా .... అంది కొంటె గా సరస్వతి ..

సరస్వతి మాటలకి రచన బుగ్గలో సిగ్గుల మందారం పూసింది .. చిరునవ్వుతో సరస్వతి కేసి చూసింది రచన .

ఆహా .. అర్థమయిన్దమ్మా .. చాల సంతోషం .. మీ నోట్లో పంచదార పోయాలి .. తీసుకొస్తానుండండి .. అని లోపలి కి

పరుగు తీసింది సరస్వతి .

అలా పెరటి గట్టు మీదే కూర్చుని తనలో తానె నవ్వుకొంది రచన .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

స్వర్ణమల్లిక said...

Ante ee rendu rojulu maku kuda twists untayannamata.

రాధిక said...

కళ్యాణి గారు ట్విస్ట్ లు లేకుండా మీలాంటి అభిమానుల్ని ఎలా కీప్ అప్ చేయగలం చెప్పండి ? ఉత్కంట లేకుండా

ఈ కథ ని ఊహించలేం .. కాబట్టి మీరు ఊహించిన దాని కంటే భిన్నం గా రాయటానికి ప్రయత్నిస్తున్నాను ...