నిజమే యశ్ .. ఆ హారం తో వాడెం చేసుకుంటాడో .. ఈ మహల్లో వైజయంతి అన్న క్యారెక్టర్ లేదన్న మాట ఎంత
ప్రశాంతత నిస్తుంది . యు డిడ్ ఏ రైట్ జాబ్ రచన .. అన్నాడు శివ .
అది నీ ఫ్రెండ్ కి చెప్పు ... చూడు ఇంకా పేస్ ఎలా పెట్టాడో .. నాకు పనుంది నే వెళ్తున్నా .. అని అక్కడ్నించి వెళ్లి
పోయింది రచన .
ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు ? అన్నాడు శివ .
శివా .. వీరస్వామి కి ఆ హారం ఎంత ప్లస్ అవ్వకపోతే భూపతిని కూడా కాదనుకుంటాడు . ముందు ఆ హారం గొప్ప
తనం ఏంటో తెల్సుకోవాలి .. వాడేందుకు ఆ హారం కావాలనుకుంటున్నాడో మనం తెల్సుకోవాలి అన్నాడు
యశ్వంత్ .
ఎంత గొప్ప హారమైనా సరే ఇప్పుడు అదే వైజయంతి సమస్య కి పరిష్కారం .. మనం దానిని ఇవ్వకుంటే
సమస్య మళ్ళి వెనక్కి వస్తే .. అమ్మో ఊహించడానికే భయంగా ఉంది .. లేట్ ఇట్ బి .. వదిలేద్దాం ...
నువ్వింకా దాని గురించి ఆలోచించకు అన్నాడు శివ .
సాలోచన గానే తల ఊపాడు యశ్వంత్ .
*********************
కాలి నడకన పయనం సాగిస్తున్న రమణానంద మహర్షి నాసికా పుటలకి అద్భుత మైన సువాసన తాకింది ...
అతడి పెదవుల పై చిరునవ్వు విరిసింది ..
అడుగులు మరింత వేగం గా ముందుకి పడసాగాయి ..
వనమంతా అత్యంత సౌందర్య భరితం గా ఉంది .. దగ్గరలోనే ఉన్న సెలయేటి గలగల మంద్రంగా వినబడుతుంది .
చిరుగాలి ఆప్యాయంగా స్పర్శిస్తుంది ...
అతడు ముందుకి నడుస్తున్న వాడల్లా ఒక్క క్షణం హటాత్తుగా ఆగిపోయాడు .
అతడి కనులకి కనబడుతున్న దృశ్యం అతడిని మంత్ర ముగ్దుడిని చేసింది .
సెలయేటి ఒడ్డున ఆసనం లా ఉన్న ఓ రాతి మీద ఓ స్త్రీ వయ్యారం గా కూర్చుని ఉంది .. ఆమె పెదవులు సన్నని
కూనిరాగం తీస్తున్నాయి ... ఆ రాగానికి తాళం వేస్తున్నట్టు ఉంది సెలయేటి సడి .
ఆమె విరబూసిన కురులు చిరుగాలికి నాట్యం చేస్తున్నాయి ...
అతడు టక్కున తేరుకుని ఆమె వైపు నడచి ఆమె ముందు మోకరిల్లాడు ...
ఆమె చిరునవ్వుతో అతడిని చూసింది ...
అమ్మా .. మళ్ళి ఇన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం .. ఈ దీనుడిని ఇలా కనికరించావా తల్లీ .. అన్నాడు చిప్పిల్లిన
కన్నీటి చూపులతో రమణానందుడు .
నేను నీ కొరకే వేచి ఉన్నాను రమణానంద ... మనసు సంతోషం లో తేలియాడుతుంది .. నా ఇంటికి నేను
చేరుకోబోతున్న సంతోషం సుమా ఇది ... ముహూర్తం నీ ద్వారా నిర్ణయింప బడుతుంది .. మరి నేను నీ కొరకు
వేచి ఉండక తప్పదు కదా .. అంది ఆమె సుమధుర స్వరం తో ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a Comment