Powered By Blogger

Saturday, 19 July 2014

రుధిర సౌధం 200 వ భాగం

అప్పుడే స్నానం ముగించుకొని అద్దం ముందు నిలబడి తన రూపాన్ని అపురూపం గా చూసుకొంది  రచన .

 అసలు నా గురించి పట్టించుకొనే సమయమే లేక పోయింది .. గుడి కార్యక్రమం ముగిసాక బలేశ్వర్ కి చెప్పాలి

జాబు   రిజైన్ చేస్తున్నాన్నని .. అమ్మ తో నా ప్రేమ కోసం చెప్పేయాలి .. యశ్వంత్ ని ప్రేమిస్తున్నాను అంటే

కాదనదు .. పైగా  సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బు అయిపోదుా  అమ్మ .. అని తనలో తానె నవ్వుకొంది రచన ..

చెవులకి జూకాలు తగిలించి .. తలారా స్నానం  చేసిన జుట్టు ని సుతారం గా దువ్వుకొని రెడీ అయి మహల్ బైటికి

వచ్చింది రచన .

బయటకి రాగానే ఎదురుపడ్డాడు తాత(సరస్వతి తాత ) .

తాతా .. నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా ? చిరునవ్వుతో అడిగింది రచన .

ఎక్కడమ్మా ? పని తెమిలితేనా ? ఒక్కసారి బయటకి వచ్చి చూడమ్మా .. మహల్ చుట్టూ పూల మాలల తో

అలంకరించారు మనవాళ్ళు .. అన్నాడు తాత .

అవునా ? అని చుట్టూ చూసింది రచన .

మహల్ గోడలకి బంతిపూల దండలు వేలాడుతున్నాయి ..

మహల్ అంతా కాగడాల వెలుతురులో దేదీప్యమానం గా వెలుగుతోంది ..

ఆమె కళ్ళల్లో అసంకల్పితం గా కన్నీరు నిండింది ... ఆమె కళ్ళల్లో కన్నీరు చూసి .. తాత అడిగాడు ..

అమ్మా .. ఇదంతా చూసిన ఆనందం లో నీ కళ్ళు వర్షిస్తున్నాయి .. మాకూ ఆనందం గా ఉండమ్మా .. ఎన్నో ఏళ్ళ

నిరీక్షణ ఫలించినట్టు .. అన్నాడు తాత .

అవును తాతా .. నా మనసులో భావాలని నేనిప్పుడు చెప్పలేను .. కానీ .. ఈ ఆనందం జన్మజన్మలకి సరిపోతుంది

అంది చెమర్చిన కళ్ళతో రచన .

అమ్మా .. ఆలయం పౌర్ణమి రోజు తెరవాలన్న నీ నిర్ణయం సముచితమైనదే గానీ ముహూర్తం నిర్ణయించాల్సిన

అవసరం కూడా ఉంది తల్లీ .. అన్నాడు తాత .

అవును తాతా .. ఎవరు నిర్ణయించాలో ఆ తల్లే చూసుకోవాలి .. పౌర్ణమి ఘడియలు ఎప్పుడు మొదలవుతున్నా

యన్నది నాకు చెప్పండి తాతా .. అంది రచన .

ఈరాత్రి గడవాలి .. తెల్లవారు ఘడియలలోనే చతుర్దశి పోయి పౌర్ణమి వస్తున్నది .. ఈ పౌర్ణమి .. మిగులు తగుల్లు

లేకుండా రేపటి రోజంతా పౌర్ణమి .. నిండు పౌర్ణమి .. శుభం తల్లీ .. అన్నాడు తాత .

నిజమే తాత .. ఇదంతా ముందే అంతా నిర్ణయింపబడినట్టు ఉంది కదూ  తాతా .. అంది రచన చుట్టూ పరికిస్తూ .

ఎవరికొసమైనా చూస్తున్నావా అమ్మా ? అన్నాడు తాతా .

అవును తాతా .. చీకటి పడుతోంది గా .. యశ్ , శివ కనబడరేం ? అంది రచన .

వాళ్ళు బయటికి వెల్లారమ్మ .. అన్నాడు తాత .

ఓహ్ .. అని లోపలి కి వెళ్ళబోతూ బాలయ్య వగరుస్తూ రావడం చూసి .. ఆగి .. బాలయ్య వైపు నడచి ..

ఏమైంది బాలయ్యా ? ఎందుకంత కంగారు పడుతున్నావు ? అంది రచన .

అమ్మాయి గారూ ... రత్నం రాజు బాబుగారు ఉదయం నుండి కనబడటం లేదు కదమ్మా .. వెళ్లి కనుక్కురమ్మని

యశ్వంత్ బాబు చెప్పారమ్మ .. వగరుస్తూ అన్నాడు బాలయ్య .

అవునా ? మరి నువ్వు కనుక్కున్నావా ? ఎక్కడున్నాడు అతను ? అంది రచన .

అమ్మా .. నిన్న నాతో పాటే సరస్వతి ని తీసుకెళ్ళటానికి మరో ఇద్దరు వచ్చారు కదా .. వాళ్ళు అక్కడి నుండి పారి

పోయి భూపతి ఇంటికి ఉదయాన్నే వచ్చి రత్నం బాబు గార్ని కలిసారట . మీరు ఆ పాడుబడ్డ కోటలో ఉన్నారని

చెప్పారట . అంతే .. వాళ్ళు చెప్పే మిగతా మాటలేం వినకుండా వెంటనే రత్నం బాబు జీప్ తీసుకొని వెళ్లిపోయారట .

ఆ బాబు మీకోసమే ఆందోళన పడ్డారట అమ్మాయి గారూ .. అన్నాడు వగరుస్తూ బాలయ్య ..

మై గాడ్ .. రత్నం రాజు .. చాలా పిరికి వాడు .. అలాంటిది .. తను .. తను .. కొంపదీసి ఆ పాడుబడ్డ కోట వైపు

వెళ్లాడ?  అయినా ఇంతవరకూ వెనక్కి రాక పోవటానికి కారణం ఏమై యుంటుంది ? కంగారుగా అంది  రచన .

అయ్యో .. అతడెందుకు ఆ కోట వైపు వెళ్ళాలి ? అయినా .. ఈ విషయం నువ్వెళ్ళి భూపతి తో చెప్పు బాలయ్య ..

తన కొడుకు కోసం అతడే చూసుకుంటాడు .. అన్నాడు తాత .

లేదు తాతా .. నా మనసెందుకో కీడు సంకిస్తుంది .. ఏదో జరిగింది .. రత్నం కి చాల భయం . అంత ధైర్యం గా కోట

దగ్గరికి  వెళ్ళడు .. ఐనా ఆ దారిలోకి జీప్ వెళ్ళదు .. అని సాలోచన గా .. బాలయ్య వైపు చూసి ...

బాలయ్యా .. నువ్వు ఓ పని చెయ్ .. కోటకి వెళ్ళే దారిలో జీప్ ఎక్కడైనా ఉందేమో చూడు .. భయపడి రత్నం

ఎక్కడైనా ఉండిపోయాడేమో... అంది రచన .

అలాగే అమ్మాయి గారు .. అని తల ఊపాడు బాలయ్య .

నీతో పాటు ఇంకెవర్నైనా తీసుకు వెళ్ళు .. ఒంటరిగా నువ్వు కూడా వెళ్ళకు .. ఒకవేళ ఎక్కడైనా జీప్ కనిపిస్తే నాకు

వెంటనే వచ్చి చెప్పు బాలయ్య .. అంది రచన .

అలాగే నమ్మా .. అని అక్కడి నుండి కదిలాడు బాలయ్య .

రచన మనసంతా అదోలా అయిపొయింది .. రచన నలా చూసిన తాత .. అమ్మాయ్ .. నువ్వు   ఇతర విషయాలకి

లొంగకూడదు .. గుడి తెరిచే లోపు ఆటంకాలు ఎన్నైనా రావొచ్చు .. కానీ నీ దృష్టి ఈ కార్యం మీదనే ఉండాలి

అర్థమైందా ? అన్నాడు తాత .

అలాగే తాత .. నేను వెంటనే యశ్వంత్ వాళ్ళని కలవాలి .. మీరు ఇక్కడుంటారా ? అని అడిగింది రచన .

అలాగేనమ్మా .. వెళ్లిరా .. అన్నాడు తాత .

వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది రచన .

                                                   ******************************
ఇంకా ఉంది


రుధిర సౌధం 201 వ భాగం కొరకు వేచి చూడండిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: