Powered By Blogger

Friday, 29 August 2014

రుధిర సౌధం 233

చూశారా ? నేను దారి వెతుక్కుంటున్నాను .. మీరు నాకు తోడుగా ఉండి దారి చూపబోతున్నారు .. మీరన్నట్టు

ఇదంతా విధి లీల .. అన్నాడు గోపాల స్వామి .

అవును .. పదండి వెళ్దాం .. అన్నాడు యశ్వంత్ .. ముందుకి నడుస్తూ ..

అతని సరసనే నడుస్తూ .. ఇంతకీ మీరిక్కడ ఎందుకు ఉన్నట్టో ? అన్నాడు గోపాల స్వామి ..

అదంతా ఓ పెద్ద కథ .. మనం ఎంత త్వరగా మహల్ ని చేరుకుంటే అంత మంచిది .. అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. అయితే మనం ఆ కథ చెప్పుకుంటూనే నడవోచ్చుగా .. మీకేం అభ్యoతరం లేకుంటే   .. అన్నాడు గోపాలం .

మీకు రచన తెలుసా ? అని అడిగాడు యశ్వంత్ ..

హా .. తెలుసు .. బాగా తెలుసు .. గిరిజమ్మ గారు కూడా .. అన్నాడు గోపాలస్వామి ..

ఓహ్ .. అయితే వినండి .. అంటూ జరిగిన సంఘటన లన్నీ చెబుతూ కాస్త సమయం లోనే వెహికల్ దగ్గరికి

చేరుకున్నాడు యశ్వంత్ .


ఇంత జరిగిందా ? అందుకేనా స్వామీజీ ఉన్నట్టుండి ఇక్కడకి పయన మయ్యారు .. అన్నాడు గోపాల స్వామి ..

అవునండీ .. ఇది మన వెహికల్ .. పదండి .. అని డోర్ ఓపెన్ చేశాడు యశ్వంత్ .. గోపాల స్వామి లోపల

కూర్చున్నాక .. డోర్ వేసి .. డ్రైవింగ్ సీట్ వైపు నడిచి డోర్ తీసి స్టీరింగ్ వైపు చూశాడు .. తను పెట్టిన నోట్ లేదు ..

అయితే శివ వచ్చుంటాడా ? కానీ మరి నన్ను కలవలేదు .. అనుకుంటూనే ఇంజిన్ స్టార్ట్ చేశాడు యశ్వంత్ ..

అయితే .. ఇప్పుడు ఆ పిశాచం మహల్ కె వెళ్లి ఉంటుందా ? అని అడిగాడు గోపాలం .

ఏం మీకు భయంగా ఉందా ? అన్నాడు యశ్వంత్ .

అతడు చిన్నగా నవ్వి .. అక్కడ మా గురువు గారు ఉన్నారు .. గతాన్ని , భవిత ని వర్తమానం లోనే చూడగలరు

ఆయన .. అయినా ఆ జగత్జనని ఆశీస్సులు మనల్ని ఎల్లవేళలా కాపాడతాయి .. అన్నాడు గోపాలం .

నిజమే .. కానీ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది .. మన క్షేమం కోసం కాదు .. ఊరి ప్రజల క్షేమo కోసం .. నిన్న

స్వామీజీ మహల్ ప్రాంగణం చుట్టూరా నవధాన్యాలు చల్లుతుంటే చూసాను .. వైజయంతి లోపలకి రాకుండా అలా

చేశానని ఆయన అన్నారు .. కానీ రెచ్చి పోయి వైజయంతి ఊరి మీద పడితే .. సమస్య అవుతుంది .. అన్నాడు

యశ్వంత్ ..

లేదు .. స్వామీజీ .. ఊరి ప్రజల ను రక్షించడానికి కూడా ఏదో చేసే ఉంటారు .. సరిహద్దులను మంత్రించి ఉంటారు .

అలా అయితే ఆమె మహల్ ప్రాంగణం చుట్టూ తిరగగలుగుతుందేమో గని ఊరిలోనికి ప్రవేశించలేదు .. అన్నాడు

గోపాలం ..

అటువంటి ఏర్పాటు కూడా ఉంటుందా ? స్ట్రేంజ్ .. అన్నాడు యశ్వంత్ .. డ్రైవ్ చేస్తూనే .

ఉంటుంది కానీ .. ఒక చిన్న సమస్య ఉంది .. పూజ నిర్వహిస్తున్నవారే ఆమె ని మహాల్లోకి ఆహ్వానిస్తే మాత్రం

వైజయంతి లోపలికి రాగలుగుతుంది  .. అన్నాడు గోపాల స్వామి .

కానీ .. రచన వైజయంతి ని ఎందుకు లోపలికి ఆహ్వానిస్తుంది ? అలా జరగదు అన్నాడు యశ్వంత్ .

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 28 August 2014

రుధిర సౌధం 232

యశ్వంత్ బలవంతం గా కళ్ళు తెరిచాడు .. తలంతా బరువుగా ఉంది .. ఒక్కక్షణం తనని తాను చూసుకున్నాడు ..

వొళ్ళంతా మట్టి కొట్టుకు పోయింది .. లీలగా తనకెదురుగా ఎవ్వరో ఉన్నారని గుర్తించి .. కళ్ళు పెద్దవి చేసి చూశాడు .

ఎదురుగా ఓ వ్యక్తి .. నుదుటి పై విభూతి రేఖలు .. కాషాయ వస్త్రాలు .. మోహంలో అవ్యాజ్య మైన ప్రశాంతత ...

చిరునవ్వు తో తన వైపు చూస్తున్నాడు .. వయసు మాత్రం ఓ ముప్ఫయ్ ఉంటాయి ..

మెల్లిగా లేచి నించుని .. మీరూ .. అన్నాడు యశ్వంత్ ..

అతడు చిన్నగా నవ్వి .. నన్ను గోపాల స్వామి అంటారు .. నేనీ దారి వెంట వెళ్తుండగా మిమ్మల్ని చూశాను ..

ఇక్కడ స్పృహ తప్పి పడి ఉన్నారు .. అందుకే మీ పై నీళ్ళు చల్లి లేపాను .. బహుశా నేను పొరబడ లేదుగా .. మీరు

ఇచట నిద్రించుట లేదుగా .. అన్నాడతను తమాషాగా .

యశ్వంత్ చిరునవ్వు నవ్వి కాసేపటి క్రితం జరిగిన దానిని గుర్తు తెచ్చుకున్నాడు ..


' రాకాసి మఱ్ఱి ఊడలు అతడ్ని అలానే ఈడ్చుకు పోతున్నాయి .. అతడు ఆలోచిస్తున్నాడు ఎలా వీటి బారి నుండి

తప్పించుకోవాలి అని .. అప్పుడు గుర్తుకు వచ్చింది అతడికి .. స్వామీజీ కట్టిన తాయెత్తు .. స్వామీజీ కట్టిన

తాయెత్తు కూడా వీటి నుండి నన్ను రక్షించలేదా? అనుకుంటూనే జై వైష్ణవీ మాతా .. అని ఒక్క ఉదుటున కాలి

ని అందుకొని ఆ ఊడ ని ఒదిలించు కోడానికి ప్రయత్నించాడు యశ్వంత్ .. అసంకల్పితం గా ఆ ఊడ కి అతని

చేతికి  ఉన్న తాయెత్తు తగిలింది .. అంతే అంత వరకూ అతడ్ని ఈడ్చుకుపోతున్న ఊడ ఒక్కసారిగా అతడి కాలిని

విడిచిపెట్టింది .. అంత వేగంగా వెళ్తూ అది ఒక్కసారిగా విడిచి పెట్టడం తో .. అక్కడ కాస్త పల్లం గా ఉండటం తో

దొర్లుకుంటూ కొంత దూరం లో పడిపోయాడు యశ్వంత్ .. అప్పుడే ఏదో చెట్టుకొమ్మ తలకి గట్టిగా తగిలింది ..

అంత వరకే అతని కి గుర్తుంది .. బహుశా ఆ తరువాత స్పృహ కోల్పోయినట్టున్నాను .. అనుకుని తన చేతికి

కట్టి ఉన్న తాయెత్తు వంక ఆరాధన గా చూసుకున్నాడు యశ్వంత్ .

ఏమిటీ ? మీరేదో ఆలోచనలో పడ్డట్టు ఉన్నారు .. అన్నాడు అతను ..

ఏం లేదండీ ? మీరు .. ఇంత రాత్రి వేళ .. బహుశా ఆ భగవంతుడు నాకోసమే మిమ్మల్ని పంపి ఉండుంటాడు ..

అన్నాడు  యశ్వంత్ .

నేను రావణ పురం వెళ్ళవలసి ఉన్నది .. అందులకే ఈ దారి వెంట వెళ్తున్నాను .. బహుశా దగ్గరలోనే ఉన్నానను

కుంటున్నాను .. అన్నాడు గోపాల స్వామి .

రావణ పురమా ? ఆ ఊళ్ళో మీకేంటి పని ? నేనూ అక్కడికే వెళ్ళాలి అన్నాడు యశ్వంత్ అతడి వైపు ఆసక్తి గా

చూస్తూ ..

అవునా ? ఆ ఊరిలో మా గురువుగారు ఉన్నారు .. రమణానందుల వారు .. వారిని కలవాల్సి ఉంది .. నా వెంట

పూజా సామాగ్రి ఉన్నది .. అది సకాలం లో వారికి అందించ వలసి ఉన్నది .. అన్నాడు గోపాలస్వామి ..

ఓహ్ .. మీరు రాణి మహల్ కె వస్తున్నారా ? స్వామీజీ మాదగ్గరే ఉన్నారు .. రేపు ఒక శిష్యుడు వస్తున్నాడు ..

అని మీకోసమే చెప్పారనుకుంటా.. సంతోషం గా అన్నాడు యశ్వంత్ ..

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 27 August 2014

రుధిరసౌధం 231

అరె .. అదే వెహికల్ .. అని సైకిల్ వెహికల్ వైపు పోనిచ్చాడు శివ . వెహికల్ దగ్గరికి చే రుకొని .. చుట్టూ చూశాడు

శివ .

ఎక్కడా యశ్వంత్ జాడ కనబడ లేదు .. ఇక్కడ నుంచి యశ్వంత్ ఎక్కడికి వెళ్ళుంటాడు ? అనుకుంటూ వెహికల్

స్టీరింగ్ వైపు అప్రయత్నం గా చూశాడు శివ . అక్కడ యశ్వంత్ పెట్టిన ఉత్తరం శివ కంట పడింది ..

వెంటనే వెళ్లి తనదగ్గరున్న ఇంకో కీ తో డోర్ తెరచి ఆ లెటర్ చేతిలోకి తీసుకున్నాడు శివ .

శివా ..

       నాకోసం వెతుక్కుంటూ వస్తావని తెలుసు .. రత్నంరాజు చనిపోయాడు శివా .. అతని చావు మామూలు

స్థితి లో లేదు .. భయానకం గా ఉంది .. వైజయంతి పనేనని అనుమానం గా ఉంది .. కానీ ఖచ్చితం గా చెప్పలేను

ఆ విషయం తెలుసుకుందుకే దక్షిణం వైపు వెళ్తున్నాను .. ఎందుకంటే వీరాస్వామి కూడా ప్రాణాపాయ స్థితిలో

ఉన్నాడేమో అని తెలుసుకోడానికి .. అతని ఆచూకి ఇప్పుడు ముఖ్యం ..

శివా .. నువ్వోచ్చేసరికి నేను ఏ స్థితిలో ఉంటానో నాకు తెలీదు .. ఎందుకంటే మహల్ నుండి బయల్దేరే సమయానికే

స్వామీజీ చెప్పిన ప్రమాదం వైపు వెళ్తున్నానని పించింది .. సో .. మళ్ళి కలుద్దాం ..

                                                                                                                       యశ్

ఉత్తరం చదవగానే .. ఓహ్ గాడ్ .. సంథింగ్ రాంగ్ .. నేనూ .. అటువైపే వెళ్ళాలి .. అని సైకిల్ ని దక్షిణం వైపుకి

మళ్ళించాడు శివ .. కొంత దూరం వెళ్ళాక చెట్ల ఊడలకి వేలాడుతూ అతి భయంకరం గా కనిపించింది వీరస్వామి

శవం . అతన్ని అలా చూడగానే ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది శివ కి .. వెంటనే తేరుకొని .. ఇక్కడే ఎక్కడో

ఉండుండాలి యశ్వంత్ .. అని తలంచి ...  యశ్ .. వేర్ ఆర్ యు .. గట్టిగా అరిచాడు శివ ..

అతని అరుపు ఆ అడవంతా ప్రతిధ్వనించి కొమ్మల్లో ఉన్న గుడ్లగూబలు దూరంగా ఎగిరిపోయాయి ..

కొంచెం ముందుకి పరిగెత్తి .. మళ్ళి గట్టిగా అరిచాడు శివ .. శివ కి కీచు రాళ్ళ శబ్దాలు తప్ప వేరే ఏం వినబడలేదు ..

అయ్యో .. యశ్ .. ఎక్కడున్నావు .. ఎక్కడున్నా నువ్వు బాగానే ఉండి ఉంటావు యశ్ .. నాకు తెలుసు .. కానీ

ఆ వీరస్వామి గాడ్ని చూస్తేనే నువ్వే స్థితిలో ఉన్నావోనని భయం కలుగుతుంది .. అనుకుంటూ చుట్టూ చూస్తూ

అక్కడ పరిసరాలన్నీ వెతికాడు శివ . ఎక్కడా యశ్వంత్ జాడ తెలియ రాలేదు ..

యశ్వంత్ వీరస్వామి ప్రాణాపాయ స్థితి లో ఉన్నాడని ఎలా ఊహించాడు ? నిజంగానే ఇక్కడ వీరస్వామి చచ్చి

పడున్నాడు .. అది ఆ మఱ్ఱి చెట్టు ఊడలు అతని మేడచుట్టు బిగుసుకోనేలా .. అంటే .. అనుమానం లేదు ..

వైజయంతి ఇస్ బ్యాక్ .. అయితే యశ్వంత్ మహల్ వైపే రిటర్న్ అయుంటాడా ?ఇప్పుడు నేను యశ్వంత్ కోసం

వేదకనా లేదంటే మహల్ కి వెళ్లి వైజయంతి వల్ల ఏ సమస్యా రాకుండా వాళ్ళని కాపాడనా ? అని ఆలోచించాడు శివ

నేను మహల్ కె వెళ్ళటం సమంజసం .. ఎందుకంటే యశ్ కారణ జన్ముడు .. తనకేం కాదు .. ఒకవేళ తానూ

మహల్ కే వెళ్లి ఉండొచ్చు కూడా .. కాబట్టి మహల్ దగ్గరకి వెళ్ళాలి .. అందర్నీ అప్రమత్తం చేయాలి .. అని పరుగున

సైకిల్ దగ్గరికి వచ్చి తిరుగు పయనమయ్యాడు శివ .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 26 August 2014

రుధిరసౌధం 230

స్వామీజీ మళ్ళి తన గదిలోకి వెళ్లి కూర్చున్నారు .. స్వామీజీ వెనుకనే వెళ్ళిన మురారి .. స్వామీజీ .. మీతో కొంచెం

సేపు మాట్లాడొచ్చా అన్నాడు..

రా నాయనా .. సందేహ నివృత్తి చేసుకోవటం తప్పేం కాదే .. ఇలా వచ్చి కూర్చో .. అని అన్నారు స్వామీజీ

ఆప్యాయంగా .

మురారి వెళ్లి అతని కెదురుగా కూర్చున్నాడు ... పక్కనే ఉన్న అమ్మవారి పటానికి నమస్కరించి .. స్వామీజీ వైపు

చూసి ... స్వామీ .. మాతరం సైన్స్ నే నమ్ముతుంది .. ఇలాంటి వన్ని కొట్టిపడే స్తుంది.. కానీ ఇప్పుడు మా

అనుభవాలు .. మరోలా చెబుతున్నాయి .. ఆత్మ అనేది ఉంది .. అది చనిపోయిన తరువాత కూడా

మనగలుగుతుంది  అని .. అన్నాడు స్వామీజీ .

అవును నాయనా .. కాలం ఎంత మారినా .. విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా మనిషి మెదడు కి అందని

సత్యాలెన్నో ఈ విశ్వ గర్భం లో దాగి ఉన్నాయి .. ఆనాడు మహా భారత కాలం లో శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీత లో

ఆత్మ గురించి సవివరంగా చెప్పబడింది కదా .. ఆత్మ నాశనం లేనిది .. మనిషి బట్టలను ఎలా మార్చుకుంటా డో

అలాగే ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది .. అన్నారు స్వామీజీ .

స్వామీజీ .. మరైతే వైజయంతి ఆత్మ కి నాశనం లేనట్టేనా ? మరి అలాంటప్పుడు ఈ సమస్య ఎలా పరిష్కార మవు

తుందో మీరే చెప్పండి ? అన్నాడు ఆసక్తిగా మురారి ..

మంచి ప్రశ్న నాయనా .. నే చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం .. ఆత్మ నాశనం లేనిది .. కానీ ఏ ఆత్మ అయితే

కోరికలు తీరకుండా బంధ విముక్తి లేకుండా గాలిలో తిరుగాడుతూ ఉంటుందో ఆ ఆత్మ దుష్టాత్మ కాగలదు .. అలాగే

ఏదైనా సత్కార్యం కొరకై బంధ విముక్తి కి నోచుకోక పరమాత్మ లో లీనమవటానికి ప్రయత్నించే ఆత్మ కి దైవం

తోడుగా ఉండగలదు .. నీ అనుమానం .. ఒక  దుష్టాత్మ దురుద్దేస పూరితమై , నాశనం లేనిడైతే పరిణామాలు

దారుణం గా ఉంటాయనేగా .. అన్నారు స్వామీజీ .

  
అవును స్వామీజీ .. పరిష్కారం ఎలా ? గుడిలో దీపాలు పెట్టి మహల్ లో పూజలు నిర్వహించడం వల్ల వైజయంతి

మహల్ ని వీడిపోవోచ్చు .. కానీ ఆమె వేరొక చోట ఇటువంటి సమస్యే కలగజేస్తే .. అన్నాడు మురారి .

అవును నాయనా .. కానీ ఏ ప్రేతాత్మ కైనా తమ కోరికల నుండి , దురుద్దేశాల నుండి విముక్తి లభియిస్తే వారికీ

గతజన్మ జ్ఞాపకాలు ఉండవు .. భవ భందాల నుండి విముక్తి పొందిన ఆత్మ పరమాత్మ లో లీనం కాగలదు ..

అన్నారు స్వామీజీ .

మరి .. వైజయంతి కి అటువంటి ముక్తి లభిస్తుందా ? మహల్ తనకే దక్కాలన్న కోరిక ఇప్పటికీ ఆమెని దహిస్తూ

ఉంటే ఆమె కి ముక్తి ఎలా లభిస్తుంది స్వామీజీ ? అన్నాడు మురారి .

కోరిక అనేది అశాశ్వత  మైనది నాయనా .. ఆ కోరిక వెనక ఉన్న పూర్వాపరాలు గ్రహించినప్పుడు దాని నుండి

విముక్తి పొందే మార్గం ఉదయిస్తుంది .. ఒక ప్రేతాత్మ గా ఈ మహల్ ని అనుభవిమ్పలేనని ఆమె కి అర్థం

అయినప్పుడు ఆమె ఆ కోరిక నుండి విముక్తురాలవుతుంది .. అన్నారు స్వామీజీ .

కానీ వైజయంతి కి ఆ విషయం అర్థం అవుతుందా స్వామీజీ ? అన్నాడు మురారి ..

అవుతుంది నాయనా .. అందుకోరకే కదా మన ఈ విశ్వ ప్రయత్నం .. ఆత్మ నాశనం లేనిదే కానీ సమస్య పరిష్కారం

లేనిది కాదు .. అన్నారు స్వామీజీ .

మీతో మాట్లాడుతున్నపుడు మనసులో ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది స్వామీజీ .. అన్నాడు మురారి .

స్వామీజీ చిరునవ్వు తో తల పంకించారు .

                                                             ******************

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 25 August 2014

రుధిర సౌధం 229

పరుగు పరుగున మహల్లోకి చేరుకొని సరాసరి స్వామీజీ గది ని చేరి తలుపు కొట్టాలనే తలంపు కి కూడా రాకుండా

తటాలున తలుపులు బార్లా తెరచి స్వామీజీ .. అని గట్టిగా అరిచాడు మురారి ..

ఆ సమయం లో స్వామీజీ నిద్రపోతున్తారనుకొని తలంచాడు మురారి .. కానీ దానికి భిన్నంగా ఆయన అమ్మవారి

పటం ముందు కూర్చుని ధ్యానం లో ఉన్నాడు అతడు ..

ఒక్క క్షణం తటపటాయించిన .. ఇది ఆలోచించాల్సిన సమయం కాదు .. అని తలచి .. అతని ముందుకి వెళ్లి

స్వామీజీ .. క్షమించండి .. నేను మిమ్మల్ని ధ్యానం నుండి బయటకి రమ్మని అర్థిస్తున్నాను .. అన్నాడు మురారి ..

స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరచి మందహాస వదనం తో .. కంగారు పడకు నాయనా .. వైజయంతి మహాల్లోకి

ప్రవేశించలేదు .. అన్నారు స్వామీజీ ..

స్వామీజీ .. నిజంగానా ? కానీ .. అని ఆగిపోయాడు మురారి సందేహం గా ..

మహల్ చుట్టూ నవధాన్యాలు చల్లట మైనది .. కాబట్టి ఆమె లోపలికి రాలేదు .. అన్నారు స్వామీజీ .

స్వామీజీ .. నవధన్యాలకే ఆమె కట్టుబడి పోతుంది అంటారా ? అన్నాడు మురారి .. అనుమానంగా ..

అవి మంత్రించిన నవధాన్యాలు నాయనా ? అమ్మవారి రక్ష .. అని తనవైపు సందేహం గా చూస్తున్న మురారి

వైపు చూసి .. అనుమానం గా ఉందా ? పద .. స్వయంగా నువ్వే ఆ పిశాచి విఫల యత్నాలను చూద్దువు గానీ ..

అని కూర్చున్న చోటి నుంచి లేచి గది బయటికి నడిచారు స్వామీజీ ..

సంకోచంగా అతణ్ణి అనుసరించాడు మురారి ..

ఇద్దరూ మహల్ ద్వారం దగ్గరికి వచ్చేసరికి అప్పటికే మహల్ గేటు దగ్గర నుండి లోపలికి రావటానికి విఫలయత్నం

చేస్తుంది వైజయంతి .

కానీ ఆమె అడుగు పెట్టిన చోటల్లా భగ్గుమని మంటలు వస్తున్నాయి .. ఆమె కోపం గా వీరి వైపు చూసింది ..

చూడు .. నీ కళ్ళతో నీవే చూడు .. ఆమె లోపలికి రాలేదు నాయనా .. నువ్వు నిశ్చింత గా ఉండు .. అన్నారు

స్వామీజీ ..

మురారి .. ఆనందం గా తల ఊపాడు .. నిజమే స్వామీ .. కానీ కానీ .. అని మళ్ళి అనుమానం గా చూసాడు మురారి

చెప్పు నాయనా .. ఇప్పుడు మళ్ళి ఏం అనుమానం కలిగింది ? అని అడిగారు స్వామీజీ .

స్వామీ .. మనమంతా లోపలే ఉన్నాం .. కానీ .. యష్ , శివ .. బయటే ఉన్నారు .. అసలు బంధింప బడి ఉన్న

వైజయంతి బయటకేలా వచ్చింది ?  అసహనం గా అన్నాడు మురారి ..

 నువ్వు  వారి కొరకు చింతించకు నాయనా ... సర్వం ఆ జగన్మాత చూసుకుంటుంది .. ఎట్టి పరిస్థితుల లోనూ

మీరెవ్వరు మహల్ ప్రధాన ద్వారం దాటి బయటికి పోకండి .. అని లోపలికి నడిచారు స్వామీజీ ..

ఆతడి వైపు మంత్ర ముగ్ధుడి లా చూశాడు మురారి ..

నన్ను .. నా భవనం లోకే పోకుండా చేస్తారా ? మిమ్మల్ని  సర్వ నాశనం  కావిస్తాను .. గట్టిగా అరుస్తుంది

వైజయంతి...

అవేవీ చెవిన వేసుకోకుండానే స్వామీజీ  వెంట నడిచాడు మురారి .
       
ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

తొలకరి ప్రేమ

ఆకాశ వీధి లో అలా .. అందాల చందమామలా ..

వేసింది లే వలా .. చెలి సన్న జాజిలా ..

ఘుమఘుమల సౌరభాల జోలలా ..

మధురోహల సంతకాలలా .. చేసేటి వేళలా ..

మది వెలుపల వేచి ఉన్నదేమో అతిథి లా ..

తెరిచెను తలుపులు తలపలా .. ఆహ్వానం తెలుపలా

అంటూ మనసుకి తెలిపిన వయసు చురుకలా ..

తానోచ్చే ఓ పరువం లా .. కలిసొచ్చే పరిచయం లా ..

కమ్మేసే ఆ మబ్బుల్లా .. నే గగనం అయితే తానే నిలువెల్లా ..

కురిసే పొగమంచుల్లా .. నన్నే దాచేసావే చలికాలపు ఉదయం లా ..

ఆషాడపు చినుకుల్లా .. వాసంతపు చిగురుల్లా ..

నువ్వు నాలో ప్రేమని మొలకెత్తించు ఇలా ..

విరబూసిన హృదయం లా .. వరమిచ్చిన సమయం లా ..

నువ్వు నన్నే కలిసావే నా ప్రతిబింబం లా ..

హేమంత తుషారం లా .. అరవిచ్చిన కుసుమం లా ..

ముద్దోచ్చావే ఆనందానికి ప్రతిరూపం లా ..

మధుర సంగీతం లా .. ఉరికే జలపాతం లా ..

నను ఉక్కిరి బిక్కిరి చేశావే తొలకరి ప్రణయం లా ...    


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 22 August 2014

రుధిర సౌధం 228

 శివ వెళ్ళినప్పటి నుండి ఎంత నిద్రపోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు మురారికి .. పక్కనే నిశ్చింతగా

నిద్రపోతున్న సత్య కేసి చూశాడు .. ఆమె మొహం లో ప్రశాంతత .. కానీ కళ్ళ కింద నల్లని చారలు ఆమె నిద్రలేమి ని

తెలియజేస్తున్నాయి .. చాలా కష్టపడ్డావు సత్యా నువ్వు .. ఇక పై ఎప్పుడు నువ్వు కష్ట పడకుండా చూసుకునే

బాధ్యత నాదే .. అనుకున్నాడు మురారి .. మెల్లిగా మంచం మీంచి లేచి గది బయటికి వచ్చాడు మురారి ..

మనసు మాత్రం కలవరం గా ఉంది .. "టైం ఒంటి గంట కావొస్తుంది .. మరో గంట లో అంతా లేస్తారు .. ఈలోపు అలా

గాలికి బయట తిరిగితే సరి .. యశ్వంత్ వాళ్ళు వచ్చేస్తారేమో .. "అని మహల్ బయటికి నడిచాడు మురారి .

బయట అంతా చల్లని గాలి వీస్తుంది .. వెన్నెల వెలుగు వాకిలంతా పరచుకొని ఉంది .. గాలికి మహల్ గోడలకి

అలంకరించిన పూల సువాసన అతని నాసిక పుటలను తాకుతుంది ..

హటాత్తుగా ఏం జరిగి ఉండుంటుంది ? యశ్వంత్ , శివ ఆ ఇద్దరూ అంత కంగారు పడి ఇక్కడ్నుంచి వెళ్ళారు ..

వైజయంతి సమస్య కూడా లేదు .. మరేం జరిగి ఉండుంటుంది ? అతనికి హటాత్తుగా రత్నం రాజు గుర్తుకు వచ్చాడు

కొంపదీసి అతని విషయం లో గానీ వీళ్ళిద్దరూ వెళ్ళలేదు కదా .. అతనికి ఏమైనా ప్రాబ్లం .. అనుకుంటూనే

కాకతాళీయం గా మహల్ గుమ్మటం వైపు చూశాడు మురారి ..

చాలా ఎత్తు లో ఉంటుంది రాణి మహల్ గుమ్మటం .. అక్కడనుంచి నుంచి చూస్తె బహుశా రావణ పురం  ఊరు

అంతా కనబడుతుంది .. పూర్వ కాలం లో అక్కడ సైనికులు నిలబడి కోటకి రక్షణ ఇచ్చేవారు .. దూరం నుండే

శత్రువుల రాక ని కనిపెట్టడానికి ఏర్పాటు అది ..

అక్కడ కి వెళ్లి చూస్తే యశ్వంత్ వాళ్ళు కనిపిస్తారేమో .. ఓ సారి చూస్తె పోలా .. అని అటువైపు కదిలి గుమ్మటం

పైకి వెళ్ళే మెట్ల దగ్గరికి చేరుకున్నాడు మురారి ..  కాసేపట్లోనే గుమ్మటం పైకి చేరుకున్నాడు మురారి .. అతని

అంచనా నిజమే .. గుమ్మటం పైనుండి చూస్తూ ఉంటె పడమర వైపంతా ఊరు .. తూర్పు వైపు కొండలు .. దక్షిణం

వైపు అడవి .. ఉత్తరం వైపు పచ్చిక మైదానం కనబడుతున్నాయి .. గాలి విసురుగా వీస్తుంది ..

నైస్ వ్యూ .. అనుకుంటూనే పున్నమిని ఆహ్వానిస్తున్న చంద్రుని చూశాడు మురారి ..

పెద్దగా కనబడుతున్నాడు చంద్రుడు .. నిజం గా ఈరోజు చంద్రుడు ఎంతో అందం గా ఉన్నాడు .. అనుకున్నాడు

మురారి .. కానీ చంద్రుని వైపు చూస్తున్న అతని కళ్ళలో నిశ్చింత మెల్లగా మాయం కాసాగింది ..

ఓ భయంకర రూపం మహల్ వైపే రావటం కనబడుతుంది .. అతడు  కళ్ళు నులుముకుని మళ్ళి చూశాడు ..

ఆ భయంకర రూపం  ... వైజయంతి ... ఆమె కళ్ళలో కోపం ప్రళయభయంకరమై.. ఆమె వేస్తున్న అడుగులు

మృత్యు ధంకా మోగిస్తున్నాయి ..

కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించింది మురారికి .. అపాయం దగ్గర కె వస్తుంది .. అతని మెదడు

హెచ్చరించింది .. అంతా హాయిగా నిద్రపోతున్నారు .. ఏం చేయాలి ఇప్పుడు ? మహర్షి .. మహర్షి .. గారికి చెప్పాలి

... ఆలోచన వచ్చిందే తడవుగా కిందికి పరుగుతీశాడు  మురారి ..

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 21 August 2014

రుధిర సౌధం227


అతడు ఆ స్థితి లోనూ ఓ పిచ్చి నవ్వు నవ్వాడు .. వైజయంతి ఇంకా శక్తి వంత మయ్యింది.. నా నుండి తాంత్రిక

శక్తినీ .. అనేక క్షుద్ర శక్తులని తోడ్కొని నన్ను ఈ పరిస్థితి కి తెచ్చి మీకోసమే బయలు దేరింది .. ఇప్పుడే .. నన్ను

బతికించండి .. నేను మిమ్మల్ని కాపాడతాను .. అన్నాడు వీరాస్వామి ..

హ .. అని అతడిని లేపడానికి ప్రయత్నించాడు యశ్వంత్ . కానీ పైనుంచి ఓ చెట్టు ఊడ తానంతట అదే దిగి వచ్చి

వీరాస్వామి మెడచుట్టు ఉచ్చ్చు బిగించి అతడ్ని యశ్వంత్ చేతుల్లోంచి పైకి లాక్కు పోయింది ..

జరిగిన పరిణామానికి హతాశుడై పైకి చూశాడు యశ్వంత్ ... వీరాస్వామి గిలగిలా తన్నుకుంటూ ప్రాణం

వదిలేసాడు  ..

ఓహ్ గాడ్ .. గట్టిగా అరిచాడు యశ్వంత్ .. కానీ హటాత్తుగా ఆ మఱ్ఱి ఊడ వీరాస్వామి శవాన్ని ఊయల అటు ఇటూ

ఊపసాగింది .. మొదట మెల్లిగా .. తరువాత మెల్లగా వేగం పెరిగి అతడ్ని ఎక్కడికో దూరం గా నెట్టి వేసింది ..

భయంగా కళ్ళు మూసుకున్నాడు యశ్వంత్ .

అతనికి ఓ క్షణం రత్నం రాజు ఎలా మరణించి ఉంటాడో అర్థం అయింది .. మెల్లిగా కళ్ళు తెరచి చూశాడు ..

చంద్రుడిని మబ్బులు కమ్మేసాయేమో మొత్తం చీకటిగా ఉంది .. ఇంతలో మరో మఱ్ఱి ఊడ మెల్లిగా అతని వైపు

పాక్కుంటూ రాసాగింది .. శబ్దం విని అప్రమత్తమై అక్కడనుంచి పరుగుతీసాడు యశ్వంత్ .. అతణ్ణి

వెంబడించసాగింది ఆ మర్రి ఊడ .. పరిగెడుతూనే చురుగ్గా ఆలోచిస్తున్నాడు యశ్వంత్ .. ఎలా తప్పించుకోవాలి

దీని నుండి ..? దీని అర్థం వైజయంతి ఇక్కడే ఉంది .. మహల్ వైపు వైజయంతి వెళ్ళకూడదు .. నా ప్రాణం


తీయకుండా వైజయంతి ఇక్కడ నుండి పోదు .. తన దృష్టి ని నా వైపే ఉంచాలి .. పౌర్ణమి ఘడియలు వచ్చేవరకు

నేను నా ప్రాణం కాపాడుకుని తీరాలి .. నన్ను హింస పెట్టె పనిలో వైజయంతి మిగతా అంతా మర్చిపోవాలి .. ఈ

ప్రయత్నం లో నా ప్రాణం కోల్పోయినా ఫరవాలేదు .. అనుకొని పరుగు తీస్తున్నాడు యశ్వంత్ .. కానీ అతడి

ఎడమ కాలిని పట్టుకొంది మఱ్ఱి ఊడ .. వేగం గా పరుగుతీస్తున్న అతడు ఒక్కసారిగా కింద పడ్డాడు .. అంతే

శరవేగంగా మఱ్ఱి ఊడ అతణ్ణి ఈడ్చుకు పోయింది .. బాధగా అరుస్తున్నాడు యశ్వంత్ . అతని వీపు గీరుకు

పోతోంది ...

అదే సమయం లో శివ యశ్వంత్ ని వెదుకుతున్నాడు .. ఎక్కడని వెదకను యశ్ నిన్ను .. అని అనుకోకుండా

అడవి వైపు చూశాడు శివ ..

ఎవరో స్త్రీ లాంతరు పట్టుకోని అడవి నుండి వస్తున్నది ..

ఈ టైం లో ఎవరబ్బా ? అని సైకిల్ ని ఆమె వైపు పోనిచ్చాడు .. దగ్గరికి వెళ్లి చూస్తే ఆమె వెంగమ్మ ..

నువ్వా ? ఈ సమయం లో అడవినుంచి వస్తున్నావు ? ఏంటి ఏం పని నీకు ? గద్దించాడు శివ .

ఆమె అతడివైపు నిర్లక్ష్యం గా  చూసి .. నవ్వింది ..

నిన్నే .. ఇంత  రాత్రి వేళ అడవిలో నీకేం పని ? అన్నాడు శివ కోపంగా ..

ఆమె సమాధానం చెప్పక తన గుప్పెట లోని ఓ వస్తువు ని శివ కి చూపింది .. అది వాచ్ .. యశ్వంత్ ది .

ఇది .. ఇది .. నీకేక్కడిది ? అని ఆమె చేతిలోంచి కంగారుగా ఆ వాచ్ ని తీసుకొని .. యశ్ అడవికి వెళ్లాడా ? అని

నేనింకా లేట్ చేయకూడదు .. అని వెంటనే సైకిల్ ని అడవిలోకి పోనిచ్చాడు .. శివ .

కంగారుగా వెళ్తున్న అతడిని చూస్తూ క్రూరంగా నవ్వుకొంది వెంగమ్మ .

                                                    *********************

ఇంకా ఉంది

                                   
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 20 August 2014

రుధిర సౌధం226


యస్వంత్  సుమారుగా ఒక కిలోమీటర్ కంటే కాస్త ఎక్కువగా నడిచాడు .. ఇంతలో ఎక్కడ్నుంచో సన్నగా ఓ

మూలుగు  వినబడింది .. యశ్వంత్ చెవులు రిక్కించి విన్నాడు .. ఆ మూలుగు వినిపిస్తున్న వైపు దట్టం గా

పొదలు ఉన్నాయి .. ఆ పొదలు వైపు టార్చ్ వేసి చూశాడు .. ఎవ్వరూ కనబడలేదు .. కానీ మూలుగు లో కొంచెం

తీవ్రత కనబడింది ..

ఖచ్చితం గా అక్కడ ఎవ్వరో ఉన్నారు .. అనుకుంటూ పొదల వైపు నడిచాడు యశ్వంత్ .. పొదలకి అటువైపు

ఎవ్వరివో కాళ్ళు కనబడ్డాయి .. నొసలు చిట్లించి ఎవరదీ ? అని గద్దించాడు యశ్వంత్ ..

ఆ మాటకి .. స్పందన గా .. న.. న్ను .. ర .. క్షించన్దీ ... అని దీనం గా అన్నదో మగ గొంతు ..

యశ్వంత్ పొదలని దాటి అటువైపు వెళ్లి చూశాడు .. అతి దీన స్థితిలో పడున్నాడు వీరాస్వామి .. అతని వొళ్ళంతా

రక్తసిక్తం గా ఉంది .. అతని పరిస్థితి చూస్తె ఇంకెంత సేపో అతడు బతుకుతాడని అనిపించలేదు యశ్వంత్ .. కి .

యశ్వంత్ ని చూడటం తో అతని కళ్ళలో చిన్న ఆశ మిణుక్కు మంది ..

వీరాస్వామి .. నువ్విక్కడ .. ఎవరు .. ఎవరు చేసారు ఇదంతా ? అన్నాడు యశ్వంత్ ఆందోళన నిండిన గొంతుతో ..

అతడు .. మాటలు కూడబలుక్కుని .. అన్నాడు .. వై .. జ .. య0.. తీ .. అని .

కానీ .. కానీ .. నువ్వు ఆమె ని బందించావు గా .. మరి ఎలా ఇదంతా ? బొంగురు పోతున్న కంఠo తో అన్నాడు

యశ్వంత్ .

అవును .. బంధించాను .. రెండు జాడీల్లో బంధించి .. నేలలో పాతి పెట్టాలనుకున్నాను .. దానికి కొన్ని ఘడియలు

బలం చేకూరుస్తాయి .. అటువంటి సమయం లో పూజ చేసి పాతి పెట్టాలని అనుకున్నాను .. ఆ జాడీ లని ఆ

పాడుబడ్డ కోటలోనే ఓ గదిలో ఉంచాను .. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను .. బసవడి ఆత్మ ని పాతి పెట్టాను ..

తరువాత వైజయంతి పాతి పెడుతుండగా ఎక్కడినుండి ఊడిపడ్డాడో భూపతి కొడుకు .. పెద్దగా ధాత్రీ .. ధాత్రీ అంటూ

అరుస్తూ వచ్చాడు .. మంత్రం మధ్యలో ఉండగా నన్ను అక్కడ చూశాడు ..

ఏదో ఆ పిల్ల కి అపకారం చేస్తున్నాననుకున్నాడో ఏమో .. నన్ను లేపి కొట్టాడు .. మంత్రం మధ్యలో ఆగకూడదు

ఆగిపోయింది .. ఏం పాతి పెడుతున్నావ్ ఇక్కడ ? ధాత్రి నేం చేసావు అనుకుంటూ నేనెంత చెప్పిన వినకుండా

ఆ గోతిని బలం గా తిరిగి తవ్వాడు .. గునపం జాడీ కి తగిలింది .. జాడీ లోంచి వైజ.. యంతి .. బయటికి వచ్చింది .

పగతో రగులు తున్న ఆత్మ బంధింప బడి అది తిరిగి విడుదల అయితే అది ప్రళయ భయంకరమే అవుతుంది .

వైజయంతి అలా బయటికి వచ్చేసరికి ఎదురుగా ఉన్నది భూపతి కొడుకు ..

ఆమెనలా చూసి బెదిరిపోయాడు .. అతడిని చిత్రహింసలు పెట్టి అతడి ని దూరంగా విసిరి వేసింది .. నాకు తెలిసి

అతని ప్రాణం పోయుండాలి .. అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వీరాస్వామి ..

అంటే వైజయంతి మళ్ళి .. అని అన్నాడు యశ్వంత్ బాధగా ..

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 18 August 2014

రుధిర సౌధం 225


శివ వైపు ఆశ్చర్యంగా చూస్తూ .. అంతా బాగానే ఉందా శివా ? అని అనుమానం గా అడిగాడు మురారి .

హా .. ఉందనే అనుకోవాలి మహల్ లో అంతా .. కానీ ఇంకా మిగిలే ఉంది మురారీ .. వివరంగా అంతా ఇప్పుడు

చెప్పలేను .. సమయం లేదు .. నేను బయటికి వెళ్తున్నాను .. మరో రెండు గంటల్లో అంతా లేస్తారు .. నేను

,యశ్వంత్ చిన్న పనుండి బయటకి వెళ్లాం అని చెప్పు .. ఇంకా అడిగితె మహర్షి పంపారని చెప్పు .. అన్నింటికన్నా

ముఖ్యం రచన .. తనసలు ఈ మహల్ దాటి బయటికి వెళ్ళకూడదు .. ఎటువంటి స్థితిలో కూడా .. మహల్ కి నువ్వే

రక్షణ గా ఉండాలి .. నేను ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా యశ్వంత్ తో పాటుగా వస్తాను .. అన్నాడు శివ .

శివా .. నాకేం అర్థం కావడం లేదు .. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనూ వస్తాను .. అన్నాడు మురారి .

లేదు మురారీ .. నువ్విక్కడ ఉండటం అవసరం .. సత్య ని కూడా నువ్విప్పుడు వదలి ఉండటం అంత మంచిది

కాదు .. అయినా ఎక్కువ నేను డిస్కస్ చేయలేను .. ప్లీజ్ నేను చెప్పింది చెయ్ .. అన్నాడు శివ .

అలాగే శివా .. గన్ తీసుకు వెళ్ళు అన్నాడు మురారి .

బహుశా గన్ తో పనిలేక పోవొచ్చు .. ఎనీవే .. బాయ్ మురారీ .. అని ఫాస్ట్ గా మెట్లు దిగి మహల్ బయటున్న

సైకిల్ తీసుకొని బయట పడ్డాడు శివ .

ఏమయ్యుంటుంది ? ఇంత కంగారుగా ఉన్నాడు శివ .. యశ్వంత్ కోసం వెళ్తున్నానన్నాడు .. యశ్వంత్ ఏమైనా

సమస్యలో ఉన్నాడా ? ఏంటో ఏమీ చెప్పలేదు .. బట్ నేను వెయిట్ చేయడం మంచిది .. వాల్లోచ్చేవరకు ఇక్కడ

మేనేజ్ చేయటం నా బాధ్యతే .. అనుకుంటూ .. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు మురారి  .

                                            ******************************

సర్ర్ మని వెహికల్ ఆగిన సవ్వడి విని మూతలు పడుతున్న కళ్ళని బలవంతం గా తెరచి ఏమైంది డ్రైవర్ ? అని

అడిగాడు విక్కీ .

గిరిజ మాత్రం విండో కి తల ఆనించి నిద్రపోతోంది .. మంచి నిద్రలో ఉండటం వల్ల నెమో ఆమె కి ఆ సౌండ్ కి మెలకువ

రాలేదు .

టైర్ పంచర్ అనుకుంటా సర్ .. అని డోర్ తెరచి కిందకి దిగాడు డ్రైవర్ ..

ఓహ్ .. అని చుట్టూ చూశాడు విక్కీ .. చుట్టూ అంతా అడవిలా ఉంది .. రోడ్ మీద వారి వెహికల్ తప్ప వేరే వెహికల్

కూడా ఏమీ కనబడటం లేదు .. గిరిజ వైపు చూశాడు ఆమె గాఢ నిద్రలో ఉంది .. ప్చ్ .. అని నిట్టూర్చి తానూ

కాబ్ దిగి డ్రైవర్ పక్కకొచ్చి నిల్చున్నాడు ..

ఫర్లేదు సర్ .. టైర్ మార్చేస్తాను .. అన్నాడు డ్రైవర్ .

సరే త్వరగా కానీ .. ఇదంతా అడవిలా ఉంది .. ఏ జంతువులు ఉన్నాయో ఏమో .. అని చుట్టూ పరికించి

చూడసాగాడు విక్కీ . వెన్నెల వెలుగు లో రోడ్ కి ఇరువైపులా ఉన్న చెట్లు జుట్టు విరబోసిన దెయ్యాల్లా ఉన్నాయి .

అతడు విసుగ్గా చేతికి ఉన్న వాచ్ ని చూసుకున్నాడు .. అప్పుడు సమయం సరిగ్గా 12 గం .

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

కవితా హృదయం ... : చల్లగ కురిసెను వెన్నెలా .

కవితా హృదయం ... : చల్లగ కురిసెను వెన్నెలా .:        చల్లగ కురిసెను వెన్నెలా .. ఆ జల్లు కి తడసినదీ ఇలా ..        పున్నమి  జాబిలి జిలుగులా ... సిరి వన్నెల పూతల తళుకులా  ..        ఆ...

రుధిర సౌధం224

 షిట్ .. తప్పించు కుంది .. అనుకొని ఇప్పుడేం చేయాలి ? వెళ్లి వీరస్వామి ని కలవాలి .. నిజం గా అతడు చావు

బతుకుల మధ్య ఊగిసలాడు తున్నాడా ? చూడాలి .. ఈ విషయం కన్ఫర్మ్ చేసుకుని తీరాలి .. అంటూ వెహికల్

వైపు నడిచాడు యశ్వంత్ ..

కాసేపట్లో యశ్వంత్ వెహికల్ దగ్గర ఉన్నాడు .. వెహికల్ డోర్ తెరచి లోపల ఉన్న జర్కిన్ తీసుకొని వేసుకున్నాడు .

టార్చ్ చేతిలోకి తీసుకొని డోర్ వేయబోతు .. నేనేవ్వరికి చెప్పకుండా వచ్చేసాను .. శివ కి విషయం తెల్సు కనుక

నన్ను వెతుక్కుంటూ వస్తాడేమో .. నేనెక్కడికి వెల్లబొయెదీ తనకి తెలియజేయడం మంచిది .. అని వెహికల్

లోపల స్టీరింగ్ దగ్గర ఉన్న చిన్న నోట్బుక్ తీసుకుని శివ కి చిన్న నోట్ రాసి ఆ పేపర్ ని స్టీరింగ్ దగ్గరే పెట్టేసాడు ..

యశ్వంత్ .. తరువాత వెహికల్ లాక్ చేసి దక్షిణ దిశ గా నడవటం మొదలుపెట్టాడు .

                         ****************************************************

మంచి నిద్రలో మునిగి ఉన్న శివ కి ఎందుకో ఏదో దాబ్ మని పడ్డ సౌండ్ వినిపించి టక్కున లేచాడు ...

ఫ్లవర్ పోట్ కింద పడిన చప్పుడు అది ... శర శరా పారిపోతున్న ఎలుక ని చూసి .. ఓహ్ .. ఇంకా ఈ మహల్ లో

మీరు కూడానా ? అని మంచం మీంచి లేచి కింద పడున్న పోట్ ని సరి జేశాడు శివ .

మళ్ళి మంచం వైపు వెళ్ళబోతూ .. టైం చూశాడు .. 12 అవుతోంది .. యశ్వంత్ గదికి వచ్చినట్లు లేడే .. ఇంత

వరకూ బయటే ఉన్నాడా ? ఓసారి చూస్తే ... అని గది బయటకి వచ్చాడు శివ .

మహల్ అంతా నిశ్శబ్దం గా ఉంది .. అందరూ నిద్రపోతున్నారు .. అని రెండడుగులు రచన గది వైపు వేసాడు ..

రచన గది తలుపు ఓరగా కాస్త తెరచే ఉంది .. మంచం మీద గాఢ నిద్రలో ఉంది రచన .

రచన కూడా నిద్రపోతుంది .. మరి వీడోక్కడే బయట ఏమ్చేస్తున్నట్టు ... అనుకుంటూ కొంపదీసి ఏదైనా ప్రాబ్లం

... వచ్చుంటుoదా ? ఒకవేళ అలానే ఐతే .. యశ్వంత్ కి నేను తోడుగా ఉంటానని చెప్పాగా .. నాకు చెప్పకుండా

ఎక్కడికి వెళ్ళాడు ? మనసు ఎందుకో యశ్వంత్ ప్రమాదం వైపే వెళ్ళాడని పిస్తుంది .. అనుకుంటూ మహల్

బయటికి వచ్చి చూశాడు   శివ . బయట వెహికల్ కనబడ లేదు ..

అంటే ఏదో జరిగింది .. కార్ కూడా బయట లేదంటే .. ఇక నేను ఆలస్యం చేయకూడదు .. యశ్వంత్ ఎక్కడున్నది

తెలుసుకోవాలి .. కానీ యశ్వంత్ లానే ఎవరికీ తెలియకుండా వెళ్తే .. కంగారు పడి రచన బయటకి వచ్ఘ్చేయ కూడదు .
కొన్నేళ్ళ క్రితం జరిగిన తప్పే మళ్ళి జరగ కూడదు .. నేను మురారి కి చెప్పే వెళ్తాను .. అని మళ్లి మహల్ లోకి

పరుగు తీశాడు శివ .

సత్య , మురారి లు ఉన్న గది తలుపు కొట్టాడు శివ .

కళ్ళు నులుము కుంటూ తలుపు తీశాడు మురారి . ఎదురుగా శివ ని అతని మొహం లో కంగారు ని చూసి ..

హే శివా .. ఏమైంది ? అని అడిగాడు కంగారుగా ..

సత్య నిద్రపోతోందా ? అని అడిగాడు శివ .

వెనక్కి తిరిగి సత్య వైపు బాధగా చూసి .. హా .. నిద్రపోతోంది .. ఏమైంది ? అని అడిగాడు మురారి .

అతని చేయి పట్టుకుని పక్కకి తీసుకు వచ్చాడు శివ .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 16 August 2014

రుధిర సౌధం 223
ఆమె వైపు పరీక్ష గా చూసి .. నువ్వెందుకు ఇంకా ఇక్కడ ? వెళ్ళు అన్నాడు యశ్వంత్ ..

ఆమె వెళ్లేందుకు వెనుదిరిగింది .. వెనక నుంచి .. ఒక్కనిమిషం .. అంటూ ఆమె వైపు వచ్చాడు యశ్వంత్ .

ఆమె ఆగింది కానీ యశ్వంత్ వైపు తిరగలేదు .. యశ్వంత్ కి ఆమె వీపు మాత్రమే కనిపిస్తుంది ..

నువ్వు మూగ దానివి కావు .. కదా వెంగమ్మా ? అదే సమాధుల దగ్గరి కి వెళ్లి మాట్లాడుతున్టావు మనుషులతో

కాకుండా ... అన్నాడు యశ్వంత్ వెటకారంగా .

ఆమె చివుక్కున   వెనుదిరిగి చూసింది ... ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం తో పాటు కోపం ..

ఏంటి అలా చూస్తున్నావు ? మాకెలా తెలిసిందనా ? అసలు నిన్ను చూస్తేనే నువ్వు మూగ దానిలా కనబడవు

ఐనా రహస్యాలని చేదించడమే మా పని .. నువ్వు ఆ బసవ రాజు వంసీకురాలివే అయున్టావు కదూ .. అన్నాడు

యశ్వంత్ ..

వెంగమ్మ గట్టిగా నవ్వింది తెరలు తెరలుగా నవ్వింది .. అవున్రా .. నేను మూగదాన్ని కాదు .. కానీ నా గొంతు

విన్నవాడు బతకడు .. ఒకవేళ వాడు బతికితే నేను బతకను .. అందుకే ఇన్నాళ్ళు మూగదానిలా బతుకు సాగ

దీశాను .. నీ చావు నువ్వే వెతుక్కుంటూ పోతావు .. ఇదుగో విను .. నేను మాటడుతున్నా .. ఈ ఊరిలో నా

ఒక్కదానికే ఎరుక .. ఏ చావు ఎవరి ఖాతాలో అనేది ... ఈ చావు .. ఈచావు .. ఆ పిశాచి ఖాతా లోదే .. వైజయంతి ..

వైజయంతే బలి తీసుకుందిరా .. అని అరిచింది వెంగమ్మ రాక్షసంగా ..

ఏం మాట్లాడుతున్నావు ? వైజయంతి ని , ఆ బసవరాజు నీ వీరస్వామి బంధించి వేశాడు .. ఆ తరువాతే రత్నం

అక్కడికి వెళ్ళాడు .. కాబట్టి వైజయంతి ఇతడిని చంపే అవకాశమే లేదు .. కంగారుగా అన్నాడు యశ్వంత్ .

మూర్ఖుడా .. నువ్వన్నది నిజమే .. గానీ ..  నే చెప్పేదీ నిజమే .. అది నీకే తెలుస్తుంది .. అని వెళ్ళు .. వెళ్లి నీ చావుని

వెతుక్కో .. పో .. అంది వెంగమ్మ ..

నోర్ముయ్ .. ఎవ్వరి చావు ఎవరు చూస్తారో చూద్దాం ? వీరాస్వామి ఎక్కడున్నాడో నీకు తప్పని సరిగా తెలిసి ఉండి

ఉంటుంది చెప్పు .. ఎక్కడున్నాడు ? గద్దించి అడిగాడు యశ్వంత్ ..

ఆమె నవ్వి .. ఇటునుంచి దక్షిణానికి వెళ్ళు .. అది యమ దిశ .. వెళ్లి చూసుకో .. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు .

అంది వెంగమ్మ .

వ్వాట్ ? అన్నాడు యశ్వంత్ ..

ఆమె నవ్వుతూ .. ఎందుకో పైకి చూసింది .. ఆమె పైకి చూడటం గమనించి యశ్వంత్ కూడా పైకి చూశాడు ...

ఓ చెట్టు కొమ్మ విరిగి పడబోతుంది .. కరెక్ట్ గా దానికిందే ఉన్నాడు యశ్వంత్ . క్షణం లో అప్రమత్తమై ఒక్క అంగలో

పక్క కి దూకాడు .. కొమ్మ కింద పడింది .. త్రుటిలో ప్రమాదం తప్పింది .

యశ్వంత్ మెల్లిగా లేచి నిలబడి వెంగమ్మ కోసం చూశాడు .. ఆమె అక్కడ లేదు .. చుట్టూ చూశాడు .. ఆ కొద్ది

సమయం లో ఆమె అక్కడినుంచి ఎలా అదృశ్యమయ్యిందో అర్థం కాలేదు యశ్వంత్ కి .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 15 August 2014

రుధిర సౌధం 222కానీ స్వతహాగా రత్నం బలమైన వాడే .. అతడిని అలా చేయాలంటే ఆ హంతకుడికి అంత కన్నా వేయిరెట్లు బలం

ఉండాలి .. అతడి పొట్టలో చెట్టు కొమ్మలు చొచ్చుకు పోయి ఉండటం తో ప్రేవులు బయటికి తన్నుకొచ్చాయి ..

యశ్వంత్ కి అతడిని అలా చూస్తున్నప్పుడు కంటిలోనీరు కట్టలు తెగింది .. అతడి నవ్వు మొహం గుర్తుకు వచ్చింది

.. అతడు తమతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి .. " యశ్వంత్ గారూ .. ఈసారి మీరు బొంబాయి వెళ్ళినప్పుడు

నన్నూ తీసుకు పొండి .. మీలా నేను స్టైల్ గా తయారవ్వాలి " అన్న అతని అమాయకపు మాటలు గుర్తుకు

వచ్చాయి ..

ఎలా ? ఎలా రత్నం ఈ పరిస్థితి కి వచ్చుంటాడు ?  అతడి మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది .. రచన చెప్పిన

ప్రకారం వైజయంతి , బసవరాజులు బంధించ బడి ఉన్నారు .. మరి రత్నం కి ఆ పాడుబడ్డ కోటలోఎవరు ఈ పరిస్థితి

కి కారణం అయి ఉంటారు ? అని ఆలోచిస్తున్నాడు యశ్వంత్ .

యశ్వంత్ బాబూ .. ఏం చేయమంటారు ? అని అడిగాడు బాలయ్య .

బాలయ్యా .. భూపతి గారి జీపు నీకు నడపడం వచ్చు కదా .. అని అడిగాడు యశ్వంత్ .

వచ్చని తల ఊపాడు బాలయ్య .

వెంటనే రత్నం శవాన్ని పట్నం తీసుకుపో .. పోలీస్ స్టేషన్ లో జరిగింది చెప్పి శవపరీక్ష  చేయించు .. ఈ ఘాతుకం

చేసింది ఎవ్వరో మనకి తెలియాలి అన్నాడు యశ్వంత్ .

అలాగే బాబూ .. అన్నాడు బాలయ్య .

శంకరం గారూ మీరూ వెళ్ళండి బాలయ్య తో పాటూ .. భూపతిని కూడా జాగ్రత్త గా తీసుకువెళ్ళండి .. నేను రేపు

మిమ్మల్ని కలుస్తాను అన్నాడు యశ్వంత్ .

అంతా మౌనం గా తల ఊపారు .

బాలయ్య వెహికల్ వైపు వెళ్లబోతుండగా .. బాలయ్యా .. ఒక్క నిమిషం .. ఇలా రా .. అని పిలిచాడు యశ్వంత్ .

బాలయ్య .. దగ్గరికి వచ్చి ఏందయ్యా ? అన్నాడు .

చూడు ,,రేపు మహల్లో జరగబోయే పూజ ఈ ఊరందరి మంచి కోసం .. ఆ పూజ మీ దాత్రమ్మే చేయాలి .. తనకి

పూజ పూర్తి అయ్యేవరకు ఈ విషయం తెలియకూడదు .. అది ఈ ఊరికి మంచిది కాదు .. అన్నాడు యశ్వంత్

అలాగేనయ్యా .. నేను జాగ్రత్త పడతాను .. పోలీస్ బాబు కి మీరు పంపారని చేబుతానయ్యా .. అన్నాడు బాలయ్య .

హా .. అని అన్నట్టు నీకు వీరాస్వామి ఎక్కడ ఉంటాడో తెలుసా ? అని అడిగాడు యశ్వంత్ .

ఆడా ? ఊరవతల .. లేదంటే దెయ్యాల దిబ్బ .. అదే ఆ పాడుబడ్డ కోట కాడ .. లేదంటే బసవడి సమాధి కాడ ..

ఉండొచ్చు బాబూ .. అన్నాడు బాలయ్య .

సరే .. మీరు వెళ్ళండి .. అన్నాడు యశ్వంత్ .

బాలయ్య .. జీపు వైపు నడిచాడు .. శంకరం బలవంతం గా భూపతి ని జీపు ఎక్కిస్తున్నాడు .. కాసేపట్లో జీపు

అక్కడ్నించి కనుమరుగై పోయింది .. చిన్నగా నిట్టూర్చి వెనుదిరిగే సరి వెంగమ్మ అసహనం గా చూస్తూ కని

పించింది .. యశ్వంత్ కి .

ఇంకా ఉంది


రుధిర సౌధంమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 14 August 2014

రుధిర సౌధం 221

అతడు మౌనం గా ఉన్నాడు .. కళ్ళలోంచి ఒక్క చుక్క కూడా నేల రాలటం లేదు .. అతని చూపు శూన్యం లో

ఏదో వెతుకుతున్నట్లు ఉంది ...

యశ్వంత్ అతని మానసిక స్థితి ని అంచనా వేయసాగాడు ..

బహుశా అతని మెదడు వాస్తవాన్ని అర్థం చేసుకోలేక పోతుండ వచ్చు .. అతని మనసు కొడుకు మరణాన్ని

జీర్ణించుకోలేక పోతుండ వచ్చు . ఈ నిజాన్ని అతడు స్వీకరిస్తే ఇక అతడు బతకక పోనూ వచ్చు .. మానసికం గా

బలహీనుడై పోయినట్టు కనిపిస్తుండవచ్చు .. ఇలాంటి స్థితి లో అతడిని శత్రువు గా ఎలా చూడగలను ? కాసింత

ఓదార్పు అతనికి అవసరమేమో .. అనుకొని భూపతి వైపు నడచి అతని ముందు నిలబడ్డాడు యశ్వంత్ ..

అతడు మాత్రం యశ్వంత్ వైపు చూడలేదు ..

భూపతి గారూ .. ఏం మాట్లాడాలో .. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు .. మిమ్మల్ని మీరు

నియంత్రించు కోండి .. అన్నాడు యశ్వంత్ ..

యశ్వంత్ మాటలకి అతడు యశ్వంత్ వైపు చూసాడు .. ఆ చూపులో ఏ భావమూ లేదు ... మెల్లిగా నోరు పెగల్చు

కొని .. యశ్వంత్ ని చూసి ఎవరు నువ్వు ? అని అడిగాడు భూపతి .

అతడి వైపు ఆశ్చర్యం గా చూసాడు యశ్వంత్ .. యశ్వంత్ నే కాదు .. మిగిలిన వారందరూ భూపతి వైపు

అయోమయం గా చూశారు .

అయ్యా .. అలా అడుగుతారెంటి ? ఆ బాబు వల్లే .. మీరు రోడ్ మీద పడ్డారు .. అలాంటి వ్యక్తి ని ఎవ్వరని

అడుగుతరేంటి? అన్నాడు శంకరం ఆశ్చర్యం గా భూపతి ని చూస్తూ ..

అప్పుడు శంకరం వైపు చూసి .. ఇంతకీ నువ్వెవరు ? అని అడిగాడు భూపతి ..

ఈసారి శంకరం వంతయ్యింది ఆశ్చర్యానికి లోను కావటం ..

వెంగమ్మ ఆశ్చర్యం గా భూపతి ని చూస్తూ అతనికి ఎదురుగా వచ్చి నిల్చుంది ..

ఎవ్వరు మీరంతా ? ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ ? నన్నే ఎందుకు అలా చూస్తున్నారు .. అని చెట్టు పై వేలాడు

తున్న శవాన్ని చూస్తూ .. అరె .. ఎవరు వాడు ? భలే ఎక్కాడే చెట్టు .. ఎలా ఎక్కాడు ..? నేను ఎక్కుతానే .. అని

చెట్టు వైపు వడివడిగా నడచి చెట్టెక్క దానికి ప్రయత్నించసాగాడు భూపతి .

యశ్వంత్ బాబూ .. ఏమిటిదంతా ? భూపతి అలా మాట్లడుతున్నాడేంటి   ? భూపతి ప్రవర్తనని ని వింతగా చూస్తూ

అన్నాడు శంకరం .

బాధగా కళ్ళు మూసుకొని మళ్ళి  తెరచి .. భూపతి చేసిన పాపాలకి ఆ భగవంతుడే శిక్ష వేసినట్టున్నాడు శంకరం

గారూ .. కొడుకు ని అలా చూసి అతని కి మతి స్థిమితం తప్పినట్టుంది .. ముందు అతడిని ఆ చెట్టు దగ్గరనుండి

తీసుకొచ్చి జాగ్రత్త గా చూసుకోండి .. అని ఒక్కసారి బాధగా నిట్టూర్చాడు యశ్వంత్ .

అయ్యో .. భూపతిగారు పిచ్చివారై పోయారా ? అయ్యో .. అయ్యో ... భగవంతుడా .. గట్టిగా గోల పెట్టాడు శంకరం .

ఈలోపు బాలయ్య శవాన్ని కిందికి దించాడు .. నేల పై పరుండ బెట్టాడు .. రత్నంరాజు మృతదేహం వైపు సునిశితం

గా చూశాడు .. అతని ఒంటి మీద గాయాలు అవీ చూస్తుంటే ఎవరో బలమైన వ్యక్తి అతడిని బలం గా ఎత్తి ఎటు

వైపు పడితే అటు విసిరి వేస్తే తగిలిన దెబ్బల్లా ఉన్నాయి ..


ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 13 August 2014

కవితా హృదయం ... : ఎందుకు ?

కవితా హృదయం ... : ఎందుకు ?: తీయనైన కలలు కన్న కనుల నుండి జాలు వారు కన్నీరు ఉప్పన .. ఎందుకు ? కమ్మనైన మాటలెన్నో చెప్పిన నీ మనసు నాకు చేదు జ్ఞాపకాలు పంచె నెం...

రుధిర సౌధం 220చిక్కటి వెన్నెల వెలుగులో దారిని వెతుక్కుంటోంది యశ్వంత్ నడుపుతున్న వెహికల్

ఇక్కడి నుండి  నడవ వలసిందే బాబూ .. ఈ బండి వెళ్ళదు .. అన్నాడు బాలయ్య ..

వెహికల్ ని ఓ పక్కగా ఆపి , దిగి .. జేబు లో చెయ్యి పెట్టి ఓ సారి గన్ బయటికి తీసి మళ్ళి లోపల పెట్టి ... బాలయ్య

వైపు చూసి .. ఇప్పుడెటు ? అని అడిగాడు యశ్వంత్ .

అటువైపు పోవాలయ్యా .. అలా వెళ్తే దగ్గర .. 10 నిమిషాల్ల చేరుకోవోచ్చు .. అన్నాడు బాలయ్య ..

బాలయ్య చూపిన వైపు చూసాడు యశ్వంత్ .. గుబురుగా పొదలు .. దట్టమైన అడవి ... అటువైపు నడక

సాగించారు .

బాలయ్య చెప్పింది నిజమే కొంత దూరం వెళ్లేసరికి శంకరం గొంతు వినిపిస్తుంది ..

అయ్యా ... అయ్యా .. చూడ 0డ య్యా .. ఎంత ఘోరం జరిగిందో ... ఆ బాబు కి ఇంత కష్టం ఏందయ్యా .. అని

ఏడుస్తున్నాడు శంకరం .

యశ్వంత్ బాబూ .. భూపతి వాళ్ళు కూడా చేరుకున్నట్టున్నారు .. అన్నాడు బాలయ్య ..

హా .. అని ముందుకి నడిచే సరికి కొంత దూరం లో భూపతి ,శంకరం , వెంగమ్మ ,మరో ముగ్గురు మగవాళ్ళు కన

బడ్డారు .. యశ్వంత్ రెండు అంగల్లో అక్కడికి చేరుకున్నాడు ..

కానీ అతనికి శవం కనబడ లేదు .. మొహం ప్రశ్నార్థకం గా పెట్టి చూస్తున్న యశ్వంత్ కి .. బాలయ్య .. అయ్యా ..

అటు చూడండి .. పైకి చూపించాడు .. అంతే ఒక్కసారిగా అదిరి పడ్డాడు యశ్వంత్ .

అక్కడ ఎత్తైన చెట్టు కొమ్మ పై రక్తం ఓడుతూ కనిపించాడు రత్నం రాజు .. అతడి కుడి చేయి శరీరం నుండి వేరు

కావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు .. కొమ్మ మీద అతడి పొట్ట ఆనించి ఉంది .. కళ్ళు తెరచే ఉన్నాయి ..

ఆ కళ్ళలో భయం .. అలానే .. ఉంది .. చెట్టు కొమ్మ మీద నుంచి రక్తం బొట్లు గా కారుతూనే ఉంది .. అతడి స్థితి

యశ్వంత్ కళ్ళలో కన్నీటిని నింపింది ..

చూడండి బాబూ .. చూడండి .. మా రత్నం బాబు పరిస్థితి .. అని గట్టిగా అరిచాడు శంకరం .

భూపతి మాత్రం మౌనం గా ఉన్నాడు .. అతని కళ్ళలో అంతులేని శూన్యం కనబడుతుంది .. వెంగమ్మ మొహం లో

మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేదు ..

బాలయ్యా .. శవాన్ని కిందికి దించలేదేమి .. ? అని అడిగాడు గొంతు బొంగురు పోతుంటే యశ్వంత్ .

అక్కడున్న వారిలో  ఒకడు .. ఏ దెయ్యమో ఇతడిని చంపిందయ్యా .. శవాన్ని ముట్టుకుంటే ఏం జరుగుతుందో

అని భయం కలిగి ఆగిపోయాం .. అన్నారు .

అదేం లేదు .. బాలయ్యా .. ముందు శవాన్ని దించండి .. ఏం కాదు .. వెళ్ళండి .. అన్నాడు యశ్వంత్ ... పైకి అలా

అన్నా .. యశ్వంత్ కి రత్నం ఎలా మరణించాడో అర్థం కాలేదు .. ఇంత దారుణం గా .. ఇంత కర్కశం గా .. అతని

చావుకి కారణ మైన వాళ్ళు ఎవ్వరు ? అని ఆలోచించ సాగాడు .. బాలయ్య యశ్వంత్ ఇచ్చిన ధైర్యం తో చెట్టు

ఎక్కసాగాడు .

యశ్వంత్ సాలోచన గా నే భూపతి వైపు చూశాడు ..

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 11 August 2014

రుధిర సౌధం 219
నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతుంది రచన ..

ఓ పక్క మహల్ లో నిశ్చింత గా నిద్రపోయే అవకాశం కలిగినందుకు సంతోషం , నాన్న కోరిక తీర్చ బోతున్నా నన్న

ఆనందం ఆమె ని నిలువనీయటం లేదు .. కిటికీ లోంచి వెన్నెల ప్రసరిస్తూ ఆమె మోము ని ముద్దాడు తోంది ..

నిద్ర పట్టేలా లేదు నాకు .. కానీ .. రెండు గంటలకే లేచి సిద్ధం కావాల్సి ఉంటుంది .. అప్పుడే 11గం అవుతోంది ..

ఇంకెంతో సమయం లేదు .. నిద్రపోవాల్సిందే .. అనుకొని బలవంతంగా కళ్ళు మూసుకొంది రచన ..

ఆమె కళ్ళు మూత పడగానే యశ్వంత్ రూపం ఆమె కళ్ళలో మెదిలింది . ఆమె పెదవులపై అప్రయత్నం గా

చిరునవ్వు.. కళ్ళు తెరచి లేచి కూర్చుంది రచన . ఒక్కసారి యశ్వంత్ తో మాట్లాడాలి .. నా మదిలో ఆనందం తన

తో పంచుకుంటే గానీ నిద్ర పట్టేలా లేదు . అనుకొని మంచం దిగి .. గది బయటికి వచ్చింది ..

ఆమె గది దాట గానే వెంటనే వచ్చే గది సత్య , మురారిలది .. గది తలుపు దగ్గరగా వేసుంది .. బహుశా వారికి

కూడా నిద్ర లేదేమో .. అయినా వారిని డిస్తర్బ్ చేయకూడదు .. అని ముందుకి నడచి యశ్వంత్ వాళ్ళ గది

ముందు  నిలబడి .. నిద్రపోయుంటారా .. అనుకుంటూనే .. శివ కూడా ఉండుంటాడు గా .. డోర్ నాక్ చేస్తే బెటర్

అనుకుంటూ తలుపు మీద చిన్నగా తట్టింది ..

లోపల్నుంచి శివ వాయిస్ ... కం ఇన్ .. అని

డోర్ ని ముందుకి తోసి లోపలికి చూసింది .. మంచం మీద శివ ఒక్కడే ఉన్నాడు .. రచన ని చూసి .. ఓహ్

యువరాణి రచనా వర్మ గారా .. అన్నాడు తమాషాగా ..

రచన చిరునవ్వుతో .. బావుంది పిలుపు గానీ .. నువ్వింకా నిద్రపోలేదా .. అంటూనే తన కళ్ళతో రూం అంతా కలయ

జూసింది రచన .

నువ్వు యశ్వంత్ కోసం వచ్చావా ? తానింకా బయటే ఉన్నాడు .. వెన్నెలలో విహరిస్తున్నాడే మో .. అన్నాడు శివ .

చిరునవ్వు నవ్వి .. సరే .. నే వెళ్లి తనని నిద్రపొమ్మని చెప్పి వస్తాను శివా .. నువ్వు నిద్రపో .. త్వరగా లేవాలి కదా ..

అంది రచన .

అలాగే రచనా .. గుడ్ నైట్ .. అన్నాడు శివ .

రచన గుడ్ నైట్ చెప్పి తలుపు దగ్గరగా వేసి బయటకి నడిచింది .. మహల్ ద్వారం దాటి బయట అంతా కలయ

జూసింది .. వెన్నెల వెలుగులో అంతా క్లియర్ గా కనబడుతోంది ఆమె కి యశ్వంత్ కనబడ లేదు .. ఎక్కడున్నాడు ?

అనుకుంటూనే మెట్లు దిగి పచ్చిక లో అడుగుపెట్టింది .. చుట్టూరా వెదికింది .. ఎక్కడా ఆమెకి యశ్వంత్ కనబడ

లేదు .. అరె .. ఏడీ మనిషి .. అనుకుంటూనే గేటు దాకా నడిచింది .. గేటు దాటి బయటకి వెళ్ళాడా / అనుకుంటూ

గేటు దాట బోతూ ..  సాయంత్రం స్వామీజీ చెప్పిన మాటలు అప్రయత్నం గా గుర్తుకొచ్చాయి ఆమె కి .

" రేపు కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకూ ఎట్టి పరిస్థితుల లోనూ నీవు మహల్ ప్రధాన ద్వారం దాటి వెళ్ళకూడదు "


అని ..

అవును .. నేనీ గేటు దాట కూడదు .. అనుకుంటూ .. మళ్ళి నిరాశ గా వెనుదిరిగింది రచన .. లోపలకి

వెళ్లబోతుండగా గమనించింది ఆమె .. బయట వెహికల్ లేక పోవటం ..

అరె .. ఈ టైం లో ఎవ్వరికీ చెప్పకుండా యశ్ వెహికల్ తీసుకొని ఎక్కడకి వెళ్ళాడు ? అంత అవసరం ఏముంది ?

అనుకుంటూనే తన గది వైపు నడచింది రచన .

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది