ఇప్పుడు చెప్పు .. ఏం జరిగింది ? నీ మనసులో ఏదో ఆందోళన ఉంది .. అది గ్రహించలేనంత పిచ్చి వాళ్ళం కాము
మేము .. అది నీకూ తెలుసు .. అన్నాడు శివ ..
శివా .. అసలు .. అని యశ్ ఏదో చెప్పబోతుండగా అక్కడికి రచన వచ్చింది ..
మీ ఇద్దరూ ఇక్కడ ఉన్నారా ? స్వామీజీ పూజ కి అన్ని సిద్ధం చేశారు .. సత్య ని స్నానం చేపించి బట్టలు మార్చి
తెమ్మన్నారు.. మురారి సత్య దగ్గర ఉన్నాడా ? అని అడిగింది ఆమె .
హ . నువ్వెళ్ళు .. మేము స్వామీజీ దగ్గరకి వెళ్తాం .. అన్నాడు యశ్వంత్ .
సరే .. అయితే .. నేను సత్య ని సిద్ధం చేసి తీసుకొస్తాను .. అన్నట్టు పూజ దగ్గర సరస్వతి ఉంది .. తనని ఓసారి
ఇక్కడకి రమ్మని చెప్పండి .. సత్య ని సిద్ధం చేయడం లో నాకు సహాయం చేస్తుంది కదా .. అంది రచన .
సరే రచనా .. అని ముందుకి కదిలారు ఇద్దరూ .. రచన సత్య గది వైపు నడిచింది ..
చెప్పు యశ్ .. నువ్వు చెప్పేదాకా ఇక్కడ్నుంచి మేము కదిలేది లేదు .. కష్టమో , నష్టమో కలసి అనుభవించడమే
అన్నాడు శివ నడుస్తూనే ..
నువ్వు మొండివాడివి శివా .. నేను సత్యాలా మరెవరికి ఏ ప్రాబ్లం రాకూడదు ..అందువల్లే శివా .. అన్నాడు
యశ్.
ఏదో ఒకటి లేకుండా ఉండదని తెల్సు .. బట్ నువ్వు మాతో చెప్పాలను కోవటం లేదు యశ్ అన్నాడు శివ
బాధగా .
సరేరా .. చెప్తున్నా .. నీ మనసులో ఉంచుకో .. రచన కి అస్సలు తెలియ కూడదు .. మీరు సత్య కోసం వెళ్లి
నప్పుడు స్వామీజీ నాతొ మాట్లాడారు .. ఆయన మాటల్ని బట్టి మనం ఇంకేదో విపత్కర పరిస్థితి ని
ఎదురుకోవాల్సి ఉంటుందని .. అర్థమైంది .. అది చాల భయానకం గా ఉండొచ్చు .. ఎందుకంటే వైజయంతి
బంధింపబడింది తప్ప .. అంతం చేయబడలేదు .. కాబట్టి సమస్య తీవ్రం గా ఉంటుందేమో శివా .. అన్నాడు యశ్ .
ఓహ్ ఓహ్ .. యష్ .. మనం ఇంకా పోరాటం చెయ్యాల్సి ఉంటుంది అంతే కదా .. నువ్వుదీనికే ఇలా
అయిపోతే ఎలా యశ్వంత్ ? ఇంత ఆనందం లోనూ ఓ ప్రాబ్లం రానుందని మనకి విధాత్రి ముందే చెప్పింది .. కానీ
అంతిమ విజయం మనదే అని కూడా చెప్పింది కదా .. మనం మంచి పని చేస్తున్నాం యశ్వంత్ .. ఆటంకాలు
ఎదురైనా ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఉంది .. నువ్వు ఆ విషయం ఎలా మర్చిపోయావు ? అన్నాడు శివ
స్థిరంగా ..
యష్ పెదవులపై చిరునవ్వు విరిసింది .. ప్రతీ ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ ఉండాలి శివా అన్నాడు మనస్ఫూర్తిగా .
అవునా ? అలా అయితే నవ్వెయ్ మరి అన్నాడు శివ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment