హోమగుండం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్చరిస్తున్నారు రమణానంద మహర్షి .
ఎదురుగా హోమగుండం కి ఇంకో వైపు న పెద్ద ముగ్గు వేసి ఉంది .. ఆ ముగ్గు చుట్టూ మట్టి కుండలు పెట్టి వాటిలో
దీపాలు పెట్టి ఉన్నాయి ...
యశ్వంత్ , శివ వెళ్లి ఓ పక్క గా నిల్చున్నారు .. శివ ఆ ఏర్పాట్లన్నీ విచిత్రం గా చూస్తున్నాడు ..
యశ్ .. ఇదంతా నమ్మటానికే ఆశ్చర్యంగా లేదూ .. ఇవన్నీ మూఢ నమ్మకాలని కొట్టి పడేసేవాళ్ళం .. బట్ నౌ
వుయ్ ఆర్ ఏక్సేప్టింగ్ ఆల్ థిస్ .. అన్నాడు శివ .. ఆశ్చర్యం గా చూస్తూ ..
మనిషి ఎంత తెలివైన వాడైనా ఆ మనిషి ని సృష్టించిన వాడు ఇంకా తెలివైన వాడని మర్చి పోకూడదు కదా శివా ..
అన్నాడు యశ్వంత్ .
మెల్లిగా మహర్షి కళ్ళు తెరచి .. యశ్వంత్ వైపు చూశారు .. వెళ్లి అమ్మాయి ని తీసుకురండి .. అన్నారు ..
అలాగే స్వామీ .. అని ముందుకి కదల బోతూ .. ఆలోపే అక్కడికి సత్య ని తీసుకు వస్తున్న రచన , మురారిలను
చూసి ఆగిపోయాడు యశ్వంత్ .
స్వామీజీ కూడా వారిని చూసి .. అమ్మాయి ని ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెట్టండి అన్నారు ..
మురారి ,రచన ఇద్దరూ సత్య ని ముగ్గు మధ్యలో కూర్చో బెట్టి ఓ పక్కగా నిల్చున్నారు .. సరస్వతి కూడా అంత
వరకూ ఏదో పనిలో రచన కి సాయపడిందేమో .. వచ్చి రచన పక్కగా నిలుచుంది .
రచనా .. ఇలా వచ్చి అమ్మాయి మీద ఈ కమండలం లోని ద్రవాన్ని చల్లు తల్లీ .. అన్నారు మహర్షి .
రచన ఆయన చేతిలోని కమండలం తీసుకొని అందు లోని ద్రవం సత్య మీద చల్లింది ..
అచేతనావస్థ లో ఉన్న ఆమె లో ఒక్కసారిగా చలనం కలిగింది .. తన తల పట్టుకొని అమ్మా అని పిచ్చిదానిలా
అరచింది ..
ఆమె అలా బాధ గా అరవగానే .. సత్యా .. అంటూ ఆమె వైపు రాబోయిన మురారి ని చేతితోనే వారించారు మహర్షి
నిస్సహాయంగా ఆమె వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు మురారి .. యశ్వంత్ , శివ మురారి దగ్గర కొచ్చి
ధైర్యంగా ఉండు మురారీ .. అన్నారు ..
మహర్షి మళ్లి కళ్ళు మూసుకొని మంత్రాలు జపించసాగారు .
సత్య బాధగా అరుస్తుంది .. రచన , సరస్వతి , యశ్ , శివ , మురారి ఆమె వైపు ఆవేదన గా చూస్తూ ఉన్నారు .
దాదాపు 30 నిమిషాల తరువాత స్వామీజీ కనులు తెరచి ఓ రక్షాదారాన్ని మంత్రించి తానున్న స్థానం నుంచి
లేచి సత్య ఉన్న ముగ్గు చుట్టూరా ఆ దారాన్ని ఓ గీత లా గుండ్రం గా వేస్తూ వచ్చారు .. ఆ దారం గుండ్రం గా
ముగ్గు చుట్టూ వేసాక కమండలం లోని నీటిని దానిపై చల్లగానే ఆ దారం చుట్టూ మంటలు రేగాయి ..
సత్యా .. అంటూ ఆందోళన గా అరిచాడు మురారి .
మహర్షి మురారి వైపు చూసి .. చింతించకు నాయనా .. ఆమె చుట్టూ ఉన్న భూతావరణం ఈ మంటల్లో మాడి
మసై పోతుంది .. అన్నారు .
చిత్రం గా కాసేపట్లో మంటలు ఆరిపోయి సత్య వదనం లో ప్రశాంతత అగుపించింది
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment