ఆమె అరవడం మానేసి నీరసం గా ముగ్గు మధ్యలో పడిపోయింది .. స్వామీజీ ఆమె చెంతకి వెళ్లి ఆమె చేయి ని
అందుకొని రక్షాదారాన్ని కట్టారు .. తరువాత .. మురారి వైపు చూసి .. రా నాయనా .. వచ్చి ఆమె మొహం మీద
కొంచెం ఈ నీటిని చల్లు .. రా .. అని పిలిచారు .
అయోమయంగా సత్య ని , స్వామీజీ ని చూస్తూ అతను అందించిన నీటిని తీసుకుని సత్య దగ్గరకి వెళ్లి ఆమె ని తన
ఒడిలోకి తీసుకొని ఆమె మొహం పై నీటిని చిలకరించాడు .. నీళ్ళు పడగానే తుళ్ళి పడి .. మెల్లిగా కళ్ళు తెరచి
చూసింది సత్య .. కళ్ళు తెరవగానే తనవైపే ఆశగా చూస్తున్న మురారీ ని చూసి .. నీరసం గా .. మురారీ .. అంది
సత్య .. ఆమె అలా అనగానే .. సత్యా .. లవ్ యు .. అంటూ ఆమె ని తన గుండెలకి హత్తు కున్నాడు మురారి .
యశ్ .. అంటూ ఆనందం గా శివ యశ్ ని హత్తుకున్నాడు .. చెమర్చిన కళ్ళతో యశ్ కుడా శివ ని హాగ్
చేసుకున్నాడు ..
రచన కళ్ళు ఆనంద భాస్పాలను వర్షిస్తున్నాయి ..
ధాత్రమ్మా .. సత్యమ్మకి బాగై పోయింది .. బాగైపొయిన్దమ్మా అంది సంతోషం గా సరస్వతి .
రచన మెల్లగా తల ఊపి స్వామీజీ వైపు నడచి అతని పాదాలకి నమస్కరించింది .. స్వామీజీ .. మీరు .. మీరు
సత్య కి పునర్జన్మ ప్రసాదించారు .. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో .. అని మాట బరువెక్కి ఆగిపోయింది రచన .
అతడు చిరునవ్వు నవ్వి .. సత్య , మురారిల వైపు చూసారు .. సత్య ని గట్టిగా గుండెలకి హత్తుకునే కన్నీళ్ళతో
నమస్కరించాడు మురారి .. అతని కళ్ళలో భావం స్వామీజికి ప్రస్ఫుటం గా అర్థమైంది .. నవ్వుతు తల ఊపారు
రమణానంద మహర్షి ..
తరువాత రచన వైపు తిరిగి .. కన్నీళ్లు తుడుచుకుంటున్న ఆమె ని చూసి .. చిన్నారీ .. ఇంకెందుకు బాధ .. నీ
స్నేహితురాలికి నయమై పోయింది .. కొంచెం నీరసం గా ఉంటుంది అంతే .. రెండు రోజుల్లో కోలుకుంటుంది ..
డాక్టర్ కి చూపిస్తే సరి .. అన్నారు నవ్వుతూ స్వామీజీ .
కానీ స్వామీజీ .. ఈ ఊరిలో డాక్టర్ లు ఎవ్వరూ లేరు .. అంది రచన .
రేపు ఉదయానికి వస్తాడులే డాక్టర్ .. చూస్తాడు .. మందులు ఇస్తాడు .. సరేనా ? అన్నారు స్వామీజీ ..
ఆశ్చర్యంగా చూస్తున్న రచన ని చూసి .. రేపు గోపాలం ఇక్కడికి చేరుకుంటాడు ,.. తనకి బస ఏర్పాటు చేయు
తల్లీ .. అన్నారు స్వామీజీ .
గోపాల స్వామీ కూడా వస్తున్నారా ? చాలా సంతోషం స్వామీ .. అంది రచన .
వెళ్ళు .. వెళ్లి నిద్రపో .. తల్లీ ఉదయాన్నే లేవాల్సి ఉంటుంది .. నీవు ఉదయాన్నే 5 గం కి గుడి ద్వారం తెరవవలసి
ఉంది .. రేపు చంద్ర కాంతులు వికసిస్తున్న వేళలో గుడిలో దీపాలు పెట్టవలసి ఉంటుంది .. అన్నారు స్వామీజీ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment