మురారీ .. సత్య ని లోపలికి తీసుకువెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .
రచన , మురారి సత్య ని లోపలికి తీసుకువెళ్ళారు . ఆ తరువాత యశ్వంత్ స్వామీజీ దగ్గరికి వచ్చి స్వామీ ..
సత్య ఆరోగ్యం ఇక నిలకడ మీద ఉన్నట్టేగా .. అన్నాడు యశ్వంత్ .. శివ కూడా యశ్వంత్ పక్క కొచ్చి నిలబడ్డాడు .
ఇక ఆమె ని ఏ క్షుద్ర శక్తీ ఏమీ చేయలేదు .. మీరు ఇక ఆమె కోసం చింతించనవసరం లేదు నాయనా ? అని
అన్నారు.. స్వామీజీ .
చిరునవ్వు తో .. మా మురారి మొహం లో మళ్ళి చిరునవ్వు వచ్చిందంటే అది మీవలనే స్వామీ .. మీకెలా
కృతజ్నతలు చెప్పాలి .. ? ఓ మాట తోనే తీరిపోయే ఋణం కాదు ఇది స్వామీజీ అన్నాడు శివ .
నిజమే నాయనా .. మన మధ్య ఋణానుబంధాలు .. ఒక మాటతో తీరిపోయేవి కావు .. నువ్వన్నది నిజమే ..
అన్నారు స్వామీజీ ..
మన మధ్యా .. ఆశ్చర్యం గా ఉంది స్వామీజీ .. ఏమంటున్నారు ? అన్నాడు శివ .
చూడు శివా ... మీ నాన్న గారు రక్షణ శాఖ లో పనిచేసేవారు .. అవునా ? అన్నారు స్వామీజీ ..
అవును .. ఆ విషయo మీకెలా తెలుసు ? ఆశ్చర్యం గా అడిగాడు శివ .
స్వామీజీ చిరునవ్వుతో .. మీ తాత గారు కూడా రక్షణ శాఖ లోనే ఉండేవారు .. అంతేనా నీకు తెలిసింది ...
అన్నారు స్వామీజీ ..
ఆశ్చర్యం .. వ్యక్తీకరించారు యశ్వంత్ ,శివ .
కానీ మీకు తెలియంది ఒకటుంది .. మీ తాత గారి తాత గారు ఈ ఒకప్పుడు ఈ కోట కి సంరక్షకుడుగా ఉండేవారు .
అది నీకు తెలియదు .. కర్తవ్యమ్ పాటిస్తూనే ఆయన మరణించారు .. ఆంగ్లేయుల దాడి లో ఊరవతల ఉన్న కోట
నాశనమై పోయింది .. ఆంగ్లేయులు మీ తాత గార్ని పొట్టన పెట్టుకున్నారు .. చనిపోయేటప్పుడు రాచ కోటకి రక్షణ
కల్పించ లేక పోయానన్న అసంతృప్తి .. అతడిలో మిగిలిపోయింది .. దాని ఫలితమే ఈనాడు ఈ కోట ని సంరక్షణ
కల్పించ డానికి నువ్వు వెతుక్కుంటూ వచ్చావు .. ఆయన ఆసంతృప్తి ... ఇప్పటి నీ జన్మ.. బాధ్యత .. అన్నారు
స్వామీజీ ..
మాట రాక మౌనం గా ఉండిపోయాడు శివ .
స్వామీజీ మరి నేను .. నేనెలా ఇక్కడికి రాబడ్డాను . మాకు విధాత్రి కూడా చెప్పింది .. మేమీ కార్యానికి ఎంచుకో
బడ్డామని .. మీ మాటల బట్టి .. శివ ఎందుకు ఎంచుకోబడ్డాడో అర్థమైంది ... అన్నాడు యశ్వంత్ ఆత్రుత గా .
అతడు చిరునవ్వు తో .. నీ జన్మ రహస్యం తెలుసుకోవాలని యోచిస్తున్నావా ? సరే విను .. విధాత్రి మొదట నీకే
ఎందుకు కన బడిందో తెలుసా ? నీవు పునర్జన్మ ఎత్తిన వాడవు కనుక .. అన్నారు స్వామీజీ .
స్వామీ .. అంటే .. అన్నాడు యశ్వంత్ అయోమయం గా ..
అతడు చిన్నగా నవ్వి .. విధాత్రి కి పొరుగు రాజ్యమైన విజయ నగరం యువరాజు తో సంభంధం నిశ్చయించారు . ఆ
యువరాజు అనిరుద్ధుడు .. మైత్రీ సంభందాలతో పాటు సంభంధం కూడా ఏర్పరచుకుంటే రాజ్యం మళ్ళి పఠిస్టం
అవుతుందని మహారాజు భావించారు .
అనిరుద్ధుడు కూడా విధాత్రి అందానికి ముగ్ధుడై ఆమె నే వరించాలని నిర్ణయించుకున్నాడు కూడా . కానీ పెద్ద
కుమార్తె వైజయంతి ని అలక్ష్యం చేయడం హేమావతి భరించలేక పోయింది .
చిన్నరాణి వసుంధర ని నానా మాటలంది . దానితో వసుంధర ముందు వైజయంతి కె మనువు చేయమని మహా
రాజుకి విన్నవించుకొన్నది . వసుంధర మాటల వెనుక ఆంతర్యం గ్రహించిన మహారాజు వసుంధర తో అప్పటికే
వైజయంతి వలపు బాట లో పయనిస్తున్నదని ఆ మాట తనతో విన్నవించిందని చెప్పారు మహారాజు .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment