Powered By Blogger

Tuesday, 5 August 2014

రుధిర సౌధం 214

ఆడది కోరుకున్నవాడిని చేసుకోవడం లోనే తృప్తి ని పొందుతుందని అందువల్లనే ఆమె కోరిక ని తీర్చేందుకే సిద్ధం

అయ్యానని మహారాజు చెప్పిన పిమ్మట వసుంధర వైజయంతి ప్రేమించిన వరుని వివరాలు చెప్పమని కోరింది .

అతడొక విప్లవ వీరుడని.. సామాన్యుడై నప్పటికీ బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా పోరాడుతున్నాడని చెప్పాడు

మహారాజు . వసుంధర సంతసించి అక్క హేమావతి దగ్గరకి వెళ్లి వైజయంతి ప్రేమ విషయం ఆమె తల్లి కి

తెలియజేసింది , అంతట ఒక సామాన్యుడికి తన కుమార్తె నిచ్చి , విధాత్రి కి మాత్రం ఒక యువరాజు నిచ్చి పెళ్లి

చేయాలనుకోవడం హేమావతికి రుచించలేదు .. కుమార్తె కి పరిపరి విధాల చెప్పి చూసింది .. కానీ వైజయంతి

వినలేదు . ఇక లాభం లేదనుకుని హేమావతి తాంత్రిక విద్యలు తెలిసిన తన అన్న బసవరాజు ని రహస్యం గా

పిలిపించి వైజయంతి ప్రేమించిన వాడిని చంపించింది .. బాధతో ఉన్న కుమార్తె కి అది తన తండ్రి చేసిన పనే నని

నమ్మించింది .. ఆమె మనసులో తల్లి , మేనమామ కలిపి విషాన్ని నింపారు .. అనురాగ మూర్తులు గా ఉన్న

అక్క చెల్లెళ్ళను విడదీసారు .. మహారాజు వసుంధర , వసుంధర సంతానాన్ని మాత్రమె ప్రేమిస్తారని అందుకే

వైజయంతి సంతోషాన్ని ఆవిరి చేశారని నమ్మ బలికారు . వైజయంతి అది నమ్మింది ..

మెల్లిగా ఆమె ని చెడు ఆలోచనల బారిన పడవేశారు . రాజ్యం పోయినా .. మహల్ తనకి చెందవలసింది కానీ

వసుంధర కి చెందిందని .. చివరికి తమకి నిలువ నీడ లేకుండా చేయటమే మహారాజు , వసుంధర ల ఉద్దేశ్యమని

ఆమె చెవుల్లో నూరిపోశారు .. దాని ఫలితం గా వైజయంతి మహారాజు ని కలిసి అనిరుద్ధుని తో వివాహం తనకే

జరిపించమని అడిగింది .. కానీ అప్పటికే విధాత్రి ని వలచి ఉన్నాడు అనిరుద్ధుడు గాన అతడు నిన్ను పెళ్లి

చేసుకొనడు .. జరిగింది ఏమైతేనేమి నీకు మంచి సంభంధం చూసి పెండ్లి జరిపిస్తానని చెప్పాడు మహారాజు .

కానీ అందుకు ఒప్పుకొనలేదు వైజయంతి .. అనిరుద్ధుడే తనకి భర్త కావాలని పట్టు పట్టుకు కూర్చుంది ...

మహారాజు చేసేది లేక వధువు ని మార్చే విషయమై అనిరుద్దునితో సంప్రదిస్తే .. విధాత్రే మానసికం గా నా భార్య

అని అందులో మార్పు జరిగేది లేదని అనిరుద్ధుడు తేల్చి చెప్పాడు ..

దానితో వైజయంతి పంతానికి హద్దు లేకుండా పోయింది .. న్యాయం గా ఓడించలేక ఇక లాభం లేదని అన్యాయం

గా యావదాస్తి ని హస్తగతం చేసుకొని అనిరుద్ధుడిని దక్కించుకోవాలనే తలంపు కి వచ్చింది .. ఆ క్షణం లో ..

ఆమె కి తన మేన మామ బసవరాజు సరైన మార్గమని తోచింది .

క్షుద్ర పూజలను ప్రోత్సహించింది .. మహల్ లో ఉన్న వైష్ణవీ మాత పూజ ని విడిచి తాంత్రిక శక్తులను

ఆహ్వానించింది.

రహస్యంగా జరుగుతున్న ఈ పూజలకి బలి కావలసి వస్తే వసుంధర ని బలిచ్చింది ... మహల్

వసుంధర మరణం తో బావురు మంది .. విధాత్రి మాత్రం వైష్ణవీ దేవి ని ఎంతగానో ఆరాదించేది .. తాంత్రిక సక్తులకి

ఆటంకం గా దేవీ పూజలు మారటం తో .. గుడి ని మూయించి వేయాలని పన్నాగం పన్నారు ..

యువరాజు విక్రముడి భార్య ని తదుపరి తమ మాయా శక్తులతో లొంగ దీసుకున్నారు .. ఆమె యువరాజు

చూస్తుండ గానే బిడ్డతో సహా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది .. మహల్ లో జరుగుతున్న అనూహ్య

సంఘటన లకి మహారాజు , యువరాజు , విధాత్రి బిత్తరపోతే వైజయంతి , హేమావతిలు సంతోషం లో

ఓలలాడారు .


ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: