అప్పట్లో మా తాత గారు మహారాజు కి గురువుగా వ్యవహరించేవారు .. ఆయన మహారాజు కి
జరిగిన వాటన్నింటికి కారణం మహల్ లో తాంత్రిక శక్తులు నెలకొనడమే నని .. దైవత్వాన్ని ఈ మహల్ కోల్పో
నున్నదని ,దైవం కూడా స్థాన భ్రంశం కానున్నదని , అన్నింటికీ కారణం వైజయంతి హేమావతిలని చెప్పారు .
మహారాజు కోపం తో ఊగిపోయాడు .. వైజయంతి గదికి వెళ్లి నిలదీశాడు .. దానికి వైజయంతి నవ్వుతూ ఇంకా
అప్పుడే అయిపోలేదని యువరాజు ని , విదాత్రిని కుడా కనికరించేది లేదని చెప్పింది ..
దానితో అదుపు తప్పిన ఆవేశం తో మహారాజు వైజయంతిని ముక్కలు , ముక్కలు గా నరికాడు .. బసవరాజు
ని ఉరితీయించాడు .. కానీ ఆరోజు భయంకర అమావాస్య .. వైజయంతి ని చంపి సమస్య ని పరిష్కరించానని
రాజు భావించాడు .. గానీ వైజయంతి చనిపోయిన దగ్గరి నుండి ప్రతి రాత్రి కోటలో ఎవరో ఒకరు మృత్యువాత
పడటం మొదలయ్యింది . దుష్ట శక్తుల స్వైర విహారం మొదలయ్యింది .. దేవాలయం సింహద్వారం కూలి పోయింది
హేమావతి కూతురు పోయిన బాధలో మరణించింది .. మహారాజు వైజయంతి చనిపోయిన నెల కి అదే అమావాస్య
రోజున రక్తం కక్కుకోని చనిపోయాడు . యువరాజు విక్రముడు ఏం చేయాలో పాలుపోక గురువుగారిని సంప్రదిస్తే
రానున్నవి గడ్డు రోజులే గాని మంచి రోజులు కావు .. కోటలో వివాహం జరగాలి .. వెళ్లి అనిరుద్దునితో మాటలాడి
ముహూర్తం నిర్ణయించుకొని విధాత్రి పెళ్లి జరిపించమని ఆయన చెప్పారు . ఆ పిమ్మట యువరాజు అనిరుద్ధుడి
రాజ్యానికి పయన మయ్యాడు .
మహల్ లో జరుగుతున్న విపరీతాలకి తన పెళ్ళే కారణ మని బాధతో ఉన్న విధాత్రి పెళ్లి ని త్యజించాలను కుంది
పూర్వపు పరిస్థితులని మళ్ళి ఎలా తీసుకురాగలనని గురువు గారిని సంప్రదించింది . అంతట గురువు గారు
ఇదంతా శాప వశాత్తు జరిగినది .. ఫలితం అనుభవించక తప్పదని .. గుళ్ళో ఉన్న దేవత గుడి అపవిత్రం కావడం
తో గుడిని విడిచి వెళ్ళిపోయిందని చెప్పారు .
తమ వంశాన్ని కాపాడుకుందుకు ఏమి చేయాలని అడిగింది విధాత్రి ..
3రోజుల పాటు భోజనాన్ని త్యజించి అమ్మవారిని తదేక దీక్ష తో అర్చించి మౌన ముద్ర వీడకుండా చివరి రోజు
అమ్మవారి గుడిలో దీపాలు వెలిగించి .. అమ్మవారికి అభిషేకాదులు నిర్వహించి సహస్ర యాగం చేసినచో ఈ
పరిసరాలలో ఉన్న తాంత్రిక శక్తులు దూరం గా పారిపోవటమే కాకుండా మహల్ కి దేవత రక్షణ లభిస్తుందని
గురువుగారు చెప్పారు . ఆమె అందుకు అంగీకరించి దీక్ష చేపట్టింది . కానీ మహల్ ని వదిలి వెళ్ళని వైజయంతి
ఆత్మ ప్రళయ భయంకరమై అనిరుద్దునితో సంప్రదింపులు జరపటానికి వెళ్ళిన విక్రముడికి అటవీ మార్గం లో
ప్రమాదం సృష్టించింది .. ఆ ప్రమాదం లో విక్రముడు చనిపోయాడని విక్రముడితో వెళ్ళిన వాళ్ళు భావించి మహల్
కి తిరిగి వచ్చి విధాత్రి పూజలో ఉన్నదని తెలియక ఆమె కి తెలియజేసారు . అన్న మరణం తో వంశ నాశనం
జరిగిపోయిందని తలంచి రెండురోజులుగా దీక్ష లో కూర్చున్న ఆమె తట్టుకోలేక .. అమ్మా .. నేను .. నా అన్న కోసం
అన్న పానీయాలు విడిచి నిను అర్చిస్తుంటే నువ్వు నన్ను మోసగించి నా అన్న ని కూడా దూరం చేస్తావా ?
అని ఆగ్రహోదగ్రురాలై పూజని విడిచి గుడి ని దాటి బయటకి వచ్చేసింది విధాత్రి .
అని ఆపారు స్వామీజీ ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment