అయ్యో ... అంటే చివరి రోజు పూజ జరగనే లేదు .. అన్నాడు శివ .
అవును .. ఆనాడు క్షణికమైన ఆవేశం తో విధాత్రి పూజ పూర్తి చేయలేదు .. సరికదా అన్న కోసం పొలిమేర దాటి
అడవికి పయన మైంది . కానీ ఆమె కి అన్న జాడ తెలియరాలేదు .. దానితో వేగులతో అనిరుద్దునికి సందేశం పంపి
దుఃఖితు రాలై .. తిరిగి కోట కి చేరింది .
పూజ ని మధ్యలో ఆపివేయటం తగని పనియని గురువుగారు ఆమె ని మందలించారు .. అదే సమయం లో
మహల్ లో క్షుద్ర శక్తుల నీడలు కనబడటం మొదలైంది . ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవసాగారు .. ఆ భయంకర
స్థితి ని తట్టుకోలేక గురువుగారినే తగిన ఉపాయం చెప్పమని కోరింది యువరాణి విధాత్రి .
పూజ సగం లో ఆగిపోయింది కావున తిరిగి ఆ పూజ చేయటానికి నీవు అర్హురాలివి కావు అని తేల్చి చెప్పారు
గురువు గారు . దానితో నిరాశ చెందిన ఆమె .. అయితే మరో మార్గమే లేదా ? అని అడిగింది విధాత్రి .
ఉంది కానీ .. అని గురువుగారు చెప్పటానికి సంశయించారు.
సంశయానికి తావివ్వకకుండా సలహా చెప్పండి .. ఏమైనా నేను చేస్తాను అని మాటిచ్చింది విధాత్రి .
అయితే అమ్మవారికి ఆత్మ నివేదనం చేయాలి .. భౌతిక శరీరాన్ని వదిలి ఆత్మ గా పూజలు నిర్వహించాలి ..
భౌతిక శరీరాన్ని వదిలే ముందు శరీరం , ఆత్మ మలినం సోకనిదై ఉండాలి .. అంటే కన్నె గానే మరణించాలి ...
వివాహాన్ని త్యజించాలి .. కానీ శరీరం నుండి ఆత్మ విడివడిన తర్వాత క్షుద్ర శక్తుల పాలు కాకూడదు .. అని
హెచ్చరించారు గురువుగారు .
కానీ విధాత్రి అనిరుద్దునికి మనసైతే ఇచ్చింది .. తనని పెళ్ళాడాలని ఎదురుచూస్తున్న అతడి నుంచి అనుమతి
తీసుకోవాలని అతడిని రమ్మని కబురు పంపింది . అనిరుద్ధుడు వచ్చాడు .. ఆమె మనవి ని తోసి పుచ్చ లేక
బరువెక్కిన గుండె తో అంగీకరించాడు .
విధాత్రి ఆత్మ నివేదనానికి సిద్ధపడింది .. కానీ అదే సమయం లో బసవరాజు బతికే ఉన్నాడని గురువు గారికి అర్థ
మయింది . అతడిని చంపడానికి వెళ్ళిన సైనికులు రాజు ని మోసం చేశారు . విధాత్రి ఇలా ఆత్మ నివేదనానికి
సిద్ధపడిందని తెలియగానే అతడు మహల్ తలుపులు తట్టాడు .. అనిరుద్ధుడు అతడిని ఎదుర్కొన్నాడు ..
మాయా శక్తి తో అనిరుద్దునితో పోరాడాడు బసవరాజు .. మానవ శక్తి ఓడిపోయింది .. అనిరుద్ధుని బంధించి
వేసాడు ..
అదే సమయం లో గుడిలో హోమగుండం ముందు దేవిని అర్చిస్తూ ఆత్మ నివేదనం చేస్తున్నానని చెబుతూ
విధాత్రి హోమగుండం లో దూకేసింది .. ఆమె శరీరం నుండి ఆత్మ విడివడుతున్నపుడు బసవరాజు ఆమె ఆత్మ ని
ఒక జాడీ లో బంధించాడు .. అని ఊపిరి తీసుకున్నారు స్వామీజీ .
అంటే ఆమె త్యాగం కూడా వ్యర్థ మై పోయింది.. ఎందుకని స్వామీ అమ్మవారు ఆమె సంకల్పాన్ని నెరవేర్చలేదు ?
ఇంకా భక్తీ కి అర్థమేముంటుంది ... ?అన్నాడు ఆవేశం గా యశ్వంత్ .
అతడు చిన్నగా నవ్వి లేదు నాయనా ? ఎవ్వరైనా ఖర్మ ఫలితాలని అనుభవించక తప్పదు .. ఆమె త్యాగానికి
ఈ మహల్ శుద్ధి కాలేక పోయినా ఆ అమ్మవారు ఈ వంశం నాశనం కాకుండా చూసింది .. యువరాజు ని ఒక
అటవీ తెగ వారు కాపాడారు .. అతడికి ఆయుర్వేద వైద్యం చేశారు .. అతని ప్రాణాలను నిలిపారు .. అన్నారు
స్వామీజీ .
ఓహ్ .. మరి ఆ తర్వాతేం జరిగింది ? అని అడిగాడు శివ .
బసవరాజు కన్నుగప్పి కొందరి నమ్మకస్తుల వలన అనిరుద్ధుడు తప్పించుకున్నాడు .. అంతే కాదు నైవేద్యం కాని
విధాత్రి ఆత్మ ఉన్న జాడీ ని కూడా సంగ్రహించి గురువుగారిని కలిసాడు అనిరుద్ధుడు .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment