Powered By Blogger

Saturday, 9 August 2014

రుధిర సౌధం 217గురువుగారు అనిరుద్దునితో చెప్పారు .. ఈమె కి ఇప్పట్లో విముక్తి లేదు .. క్షుద్ర శక్తుల నీడ ఈమె ఆత్మ పై పడింది

కావున రెండు దశాబ్దాలు ఈమె ముక్తి కై ఎదురు చూడవలసి ఉంటుందని చెప్పారు గురువుగారు .

మరి ఒక మానవ మాత్రుడి నైన నేను రెండు దశాబ్దాలు ఈమె ఆత్మని ఎలా సంరక్షించగలను  ? అని ప్రశ్నించాడు

అనిరుద్ధుడు .

చింతించకు నాయనా .. ఈ జాడీ ని ఒక చోట నువ్వు భద్రం గా ఉంచవచ్చు .. అని మహల్ లోని పూజ గదిలో

పై ఉపరితలం లో ఉన్న చిన్న చీకటి కొట్లో ఈ జాడీ ని భద్రపరచు .. ఆ చోటు ఈమె కి క్షేమదాయకం .. సమయంవచ్చినపుడు ఈమె కి ఆ తల్లి దీవెనల వల్ల విముక్తి లభించటమే కాక పరిశుద్ధు రాలై ఆత్మ నివేదనం కూడా

చేయగలుగుతుంది .. అని చెప్పారు గురువుగారు .

అనిరుద్ధుడు అలాగే చేశాడు .. తర్వాత తన రాజ్యానికి వెళ్లి బసవరాజు కంటే శక్తి వంతుడిని వెతకటం లో నిమగ్న

మయ్యాడు .. అతని అన్వేషణ ఫలించింది .. ముళ్ళు ని ముల్లు తోనే తీయాలనే తలంపు తో .. తాంత్రిక శక్తుల

సహాయం తోనే బసవరాజు ని అంతమొందించాడు అనిరుద్ధుడు .. కానీ బసవరాజు ఆత్మ గా మహల్ ఆవరణ

లో తిరగటం .. వైజయంతి ఆత్మ గా తిరగటం వలన అందరూ మహల్ ని వదిలి వెళ్ళిపోయారు .. మహారాజు

వసుంధర దేవి కి ఇచ్చిన ఈ ప్రేమసౌధం , రుధిర సౌధం గా మారిపోయింది .. ఆత్మ గా మారిన తరువాత కూడా

మహల్ నాదే నన్న భావన వైజయంతి లో పోలేదు ..

యువరాజు ఆరోగ్యం బాగుపరచుకుని వచ్చేసరికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి .. ఇక ఈ మహల్ తో

పనేముందని  విరక్తి తో అతడు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాడు .. తరువాత అతడు మళ్ళి పెళ్ళిచేసుకుని

వంశం  వృద్ధి చేసుకున్నాడు .. కాలం మారింది .. విక్రముడి వారసులు మహల్ కోసం వచ్చారు .. కానీ వారివల్ల

కాలేదు .. వారి జీవితాలలో ఇది ఒక సాధించలేని విజయం గానే ఉండిపోయింది . అనిరుద్ధుడు తన తమ్ముడుకి

పట్టం కట్టి తాను పెళ్ళికి దూరమయ్యాడు .. ఆంగ్లేయులు అతడి రాజ్యం మీద దాడి చేసినప్పుడు అతడు వీర

మరణం పొందాడు .. గురువుగారి ఆజ్ఞ మేరకు ఊరవతల ఉన్న అడవిలో అమ్మవారిని ప్రతిష్టించి తాను బ్రతికి

ఉన్నన్నాళ్ళు అమ్మవారిని అర్చించాడు అనిరుద్ధుడు .. ప్రేయసి ని మరవలేక ఆమె కోసం ఒంటరిగా మిగిలి

పోయాడు ... అతని కోరిక విధాత్రి తో జీవితం పంచుకోవటం .. విధాత్రి ని కోల్పోతున్నప్పుడు అతడు మనసులో

ఒక్కటే అనుకున్నాడు .. మరు జన్మ అంటూ ఉంటె ఆమె తో నా జీవితం సాగేలా చూడు తల్లీ అని ... ఆ తల్లి

అతడి మొర విన్నది .. అతడికి మళ్ళి పునర్జన్మ ప్రసాదించింది .. అన్నారు స్వామీజీ ..

అంటే .. అంటే .. ఉద్వేగం గా అన్నాడు యశ్వంత్ .

అవును .. నీవే ఆ అనిరుద్దునివి .. రచన ని పెళ్లి చేసుకోవటానికి జన్మించావు .. గుడి తలుపులు తెరిచాక రచన లో

విధాత్రి లీనమై ఆత్మ నివేదన చేస్తుంది .. మిగిలిపోయిన పని పూర్తి చేసేందుకే మనమంతా ఇప్పుడు ఇక్కడ

ఉన్నాం .. అన్నారు స్వామీజీ .

అంతా ఓ కలలా అనిపిస్తుంది స్వామీజీ .. అన్నాడు శివ .

కానీ మురారికి , సత్య కి ఈ మహల్ తో ఎటువంటి సంభంధం లేదు .. వారు స్నేహధర్మం , కర్తవ్యమ్ నిర్వహించ

డానికే వచ్చారు . బలహీనులు కావటం వలెనే వారే ఎక్కువగా పీడింప బడ్డారు .. కానీ వారు దీర్ఘాయుష్మంతులు

జాతక బలం గల వారు .. ప్రమాదం ఏమీ ఉండదు .. అన్నారు స్వామీజీ .

ఎందుకో స్వామీజీ మాటలు విన్నాక రచన మీద మరింత ప్రేమ పెరిగింది యశ్వంత్ కి . అతని పెదవులపై సన్నని

చిరునవ్వు నాట్య మాడింది .

 ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

స్వర్ణమల్లిక said...

Radhika garu, rachana Amma, annayya. Bayaluderi chalaa rojulu ayindi. Varini kuda mahal chercheseyandi tondaragaa. Valla kante naake tondaragaa undi.

రాధిక said...

Very funny kalyani garu..kani kathalo inka tellavaaraali kada..so wait..inka ratri gadavaali kadaa