ఇక వెళ్ళండి నాయనా ... వెళ్లి నిద్రపోండి .. అన్నారు స్వామీజీ ..
అలాగే స్వామీ .. ఈరోజు మాకొక దివ్యమైన అనుభూతి ని మిగిల్చింది .. ఉదయాన్నే మళ్ళి కలుస్తాం స్వామీ ... అని
శివ యశ్ వైపు తిరిగి పద యశ్ .. అన్నాడు .
నువ్వెళ్ళు శివా .. నేనొస్తాను .. అన్నాడు యశ్ ..
సరే అని మహల్ వైపు కదిలాడు శివ .
ఏమిటి నాయనా ? ఇంకేమైనా తెలుసుకోవాలా ? అని అడిగారు స్వామీజీ ..
ఆ.. అని .. లేదు .. లేదు .. స్వామీజీ .. అన్నాడు యశ్వంత్ కాస్త తొట్రుపాటుగా ..
ధైర్యం గా ఉండు నాయనా .. అమ్మవారి రక్ష నీవెంట ఉంటుంది .. సరేనా ? ఇక నేను నా స్థానానికి వెళ్లి ఉదయం
పూజ కి సంసిద్ధం చేసుకోవాల్సిన వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది .. అన్నారు స్వామీజీ ..
సరే .. స్వామీ .. అని వంగి స్వామీజీ పాదాలను స్పర్సించాడు యశ్వంత్ .
మనఃస్ఫూర్తి గా అతన్ని దీవించి తనకి కేటాయించిన గది వైపుకి కదిలారు స్వామీజీ .
స్వామీ .. మీకు తెలీదు .. నా జన్మ రహస్యాన్ని తెలుసుకున్న నా హృదయం ఇప్పుడు ఎంతగా ఉప్పొంగుతుందో
.. అని మనసులో అనుకొని .. ఇక కాసేపు నిద్ర పోవాలి వెళ్లి .. అనుకొని వెనుదిరగబోతూ కాకతాళీయం గా గేటు
వైపు చూశాడు యశ్వంత్ . హడావుడిగా బాలయ్య పరుగుతీస్తూ వస్తున్నాడు ..
ఏమైయుంటుంది .. ఇంత రాత్రి వేళ కంగారుగా వస్తున్నాడు .. అనుకుంటూనే అతని వైపు నడిచాడు యశ్వంత్ .
బాలయ్య పరుగున యశ్వంత్ దగ్గరికొచ్చి .. అయ్యా .. అయ్యా .. రత్నం బాబు చనిపోయాడయ్యా .. అన్నాడు
వగరుస్తూ ..
వ్వాట్ .. అదిరిపడ్డాడు యశ్వంత్ .
అవునయ్యా .. దారుణం .. దారుణం గా చచ్చి పడున్నాడయ్యా .. ఆ అడవిలో .. ఏడుస్తున్నట్లు చెప్పాడు బాలయ్య .
మై గాడ్ .. అసలెలా జరిగుంటుంది ? అడవిలో జంతువు లేమన్నా .. అన్నాడు యశ్వంత్ గొంతు బొంగురు బోయి .
అది జంతువుల పనిలా లేదయ్యా ... మాటల్లో చెప్పలేనయ్యా .. ఆ బాబు ని అలా చూస్తుంటే మనసు తరుక్కు
పోయిన్దయ్యా ... ఆ బాబు కొంచెం తుంటరి వాడే ... గాని మంచి వాడు .. భూపతి లాంటోడు గాదయ్యా .. అన్నాడు
బాలయ్య .. దాదాపు ఏడుస్తూ ..
బాలయ్య .. బాధపడకు .. పద .. ముందు మన మక్కడికి వెళ్దాం .. అని ముందుకి రెండు అడుగులు వేసి .. ఆగి ,
బాలయ్య ఈ విషయం ఎట్టి పరిస్థితుల లోనూ ధాత్రి కి తెలియకూడదు .. తెలిసిందంటే రేపు జరగాల్సిన పుణ్య
కార్యం అంతా ఇబ్బందిలో పడిపోతుంది .. అన్నాడు యశ్వంత్ .
అలాగేనయ్యా .. అని తల ఊపాడు బాలయ్య .
యశ్వంత్ రెండు అంగల్లో వెహికల్ ని చేరాడు .. బాలయ్య ఎక్కి కూర్చున్న తరువాత .. వెహికల్ స్టార్ట్ చేసాడు .
వెహికల్ బాలయ్య చెప్పిన దారిలో దూసుకు పోయింది ... యశ్వంత్ మనసు మాత్రం కలవరం గా ఉంది ... ఈ
వార్తః తెలిసి రచన గనుక మహల్ దాటిందంటే కొన్నేళ్ళ కిందట జరిగిన తప్పే మళ్ళి జరగోచ్చు .. అలా జరగకూడదు
అని స్థిరం గా అనుకున్నాడు యశ్వంత్
********************
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment