నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతుంది రచన ..
ఓ పక్క మహల్ లో నిశ్చింత గా నిద్రపోయే అవకాశం కలిగినందుకు సంతోషం , నాన్న కోరిక తీర్చ బోతున్నా నన్న
ఆనందం ఆమె ని నిలువనీయటం లేదు .. కిటికీ లోంచి వెన్నెల ప్రసరిస్తూ ఆమె మోము ని ముద్దాడు తోంది ..
నిద్ర పట్టేలా లేదు నాకు .. కానీ .. రెండు గంటలకే లేచి సిద్ధం కావాల్సి ఉంటుంది .. అప్పుడే 11గం అవుతోంది ..
ఇంకెంతో సమయం లేదు .. నిద్రపోవాల్సిందే .. అనుకొని బలవంతంగా కళ్ళు మూసుకొంది రచన ..
ఆమె కళ్ళు మూత పడగానే యశ్వంత్ రూపం ఆమె కళ్ళలో మెదిలింది . ఆమె పెదవులపై అప్రయత్నం గా
చిరునవ్వు.. కళ్ళు తెరచి లేచి కూర్చుంది రచన . ఒక్కసారి యశ్వంత్ తో మాట్లాడాలి .. నా మదిలో ఆనందం తన
తో పంచుకుంటే గానీ నిద్ర పట్టేలా లేదు . అనుకొని మంచం దిగి .. గది బయటికి వచ్చింది ..
ఆమె గది దాట గానే వెంటనే వచ్చే గది సత్య , మురారిలది .. గది తలుపు దగ్గరగా వేసుంది .. బహుశా వారికి
కూడా నిద్ర లేదేమో .. అయినా వారిని డిస్తర్బ్ చేయకూడదు .. అని ముందుకి నడచి యశ్వంత్ వాళ్ళ గది
ముందు నిలబడి .. నిద్రపోయుంటారా .. అనుకుంటూనే .. శివ కూడా ఉండుంటాడు గా .. డోర్ నాక్ చేస్తే బెటర్
అనుకుంటూ తలుపు మీద చిన్నగా తట్టింది ..
లోపల్నుంచి శివ వాయిస్ ... కం ఇన్ .. అని
డోర్ ని ముందుకి తోసి లోపలికి చూసింది .. మంచం మీద శివ ఒక్కడే ఉన్నాడు .. రచన ని చూసి .. ఓహ్
యువరాణి రచనా వర్మ గారా .. అన్నాడు తమాషాగా ..
రచన చిరునవ్వుతో .. బావుంది పిలుపు గానీ .. నువ్వింకా నిద్రపోలేదా .. అంటూనే తన కళ్ళతో రూం అంతా కలయ
జూసింది రచన .
నువ్వు యశ్వంత్ కోసం వచ్చావా ? తానింకా బయటే ఉన్నాడు .. వెన్నెలలో విహరిస్తున్నాడే మో .. అన్నాడు శివ .
చిరునవ్వు నవ్వి .. సరే .. నే వెళ్లి తనని నిద్రపొమ్మని చెప్పి వస్తాను శివా .. నువ్వు నిద్రపో .. త్వరగా లేవాలి కదా ..
అంది రచన .
అలాగే రచనా .. గుడ్ నైట్ .. అన్నాడు శివ .
రచన గుడ్ నైట్ చెప్పి తలుపు దగ్గరగా వేసి బయటకి నడిచింది .. మహల్ ద్వారం దాటి బయట అంతా కలయ
జూసింది .. వెన్నెల వెలుగులో అంతా క్లియర్ గా కనబడుతోంది ఆమె కి యశ్వంత్ కనబడ లేదు .. ఎక్కడున్నాడు ?
అనుకుంటూనే మెట్లు దిగి పచ్చిక లో అడుగుపెట్టింది .. చుట్టూరా వెదికింది .. ఎక్కడా ఆమెకి యశ్వంత్ కనబడ
లేదు .. అరె .. ఏడీ మనిషి .. అనుకుంటూనే గేటు దాకా నడిచింది .. గేటు దాటి బయటకి వెళ్ళాడా / అనుకుంటూ
గేటు దాట బోతూ .. సాయంత్రం స్వామీజీ చెప్పిన మాటలు అప్రయత్నం గా గుర్తుకొచ్చాయి ఆమె కి .
" రేపు కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకూ ఎట్టి పరిస్థితుల లోనూ నీవు మహల్ ప్రధాన ద్వారం దాటి వెళ్ళకూడదు "
అని ..
అవును .. నేనీ గేటు దాట కూడదు .. అనుకుంటూ .. మళ్ళి నిరాశ గా వెనుదిరిగింది రచన .. లోపలకి
వెళ్లబోతుండగా గమనించింది ఆమె .. బయట వెహికల్ లేక పోవటం ..
అరె .. ఈ టైం లో ఎవ్వరికీ చెప్పకుండా యశ్ వెహికల్ తీసుకొని ఎక్కడకి వెళ్ళాడు ? అంత అవసరం ఏముంది ?
అనుకుంటూనే తన గది వైపు నడచింది రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment