అతడు మౌనం గా ఉన్నాడు .. కళ్ళలోంచి ఒక్క చుక్క కూడా నేల రాలటం లేదు .. అతని చూపు శూన్యం లో
ఏదో వెతుకుతున్నట్లు ఉంది ...
యశ్వంత్ అతని మానసిక స్థితి ని అంచనా వేయసాగాడు ..
బహుశా అతని మెదడు వాస్తవాన్ని అర్థం చేసుకోలేక పోతుండ వచ్చు .. అతని మనసు కొడుకు మరణాన్ని
జీర్ణించుకోలేక పోతుండ వచ్చు . ఈ నిజాన్ని అతడు స్వీకరిస్తే ఇక అతడు బతకక పోనూ వచ్చు .. మానసికం గా
బలహీనుడై పోయినట్టు కనిపిస్తుండవచ్చు .. ఇలాంటి స్థితి లో అతడిని శత్రువు గా ఎలా చూడగలను ? కాసింత
ఓదార్పు అతనికి అవసరమేమో .. అనుకొని భూపతి వైపు నడచి అతని ముందు నిలబడ్డాడు యశ్వంత్ ..
అతడు మాత్రం యశ్వంత్ వైపు చూడలేదు ..
భూపతి గారూ .. ఏం మాట్లాడాలో .. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు .. మిమ్మల్ని మీరు
నియంత్రించు కోండి .. అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ మాటలకి అతడు యశ్వంత్ వైపు చూసాడు .. ఆ చూపులో ఏ భావమూ లేదు ... మెల్లిగా నోరు పెగల్చు
కొని .. యశ్వంత్ ని చూసి ఎవరు నువ్వు ? అని అడిగాడు భూపతి .
అతడి వైపు ఆశ్చర్యం గా చూసాడు యశ్వంత్ .. యశ్వంత్ నే కాదు .. మిగిలిన వారందరూ భూపతి వైపు
అయోమయం గా చూశారు .
అయ్యా .. అలా అడుగుతారెంటి ? ఆ బాబు వల్లే .. మీరు రోడ్ మీద పడ్డారు .. అలాంటి వ్యక్తి ని ఎవ్వరని
అడుగుతరేంటి? అన్నాడు శంకరం ఆశ్చర్యం గా భూపతి ని చూస్తూ ..
అప్పుడు శంకరం వైపు చూసి .. ఇంతకీ నువ్వెవరు ? అని అడిగాడు భూపతి ..
ఈసారి శంకరం వంతయ్యింది ఆశ్చర్యానికి లోను కావటం ..
వెంగమ్మ ఆశ్చర్యం గా భూపతి ని చూస్తూ అతనికి ఎదురుగా వచ్చి నిల్చుంది ..
ఎవ్వరు మీరంతా ? ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ ? నన్నే ఎందుకు అలా చూస్తున్నారు .. అని చెట్టు పై వేలాడు
తున్న శవాన్ని చూస్తూ .. అరె .. ఎవరు వాడు ? భలే ఎక్కాడే చెట్టు .. ఎలా ఎక్కాడు ..? నేను ఎక్కుతానే .. అని
చెట్టు వైపు వడివడిగా నడచి చెట్టెక్క దానికి ప్రయత్నించసాగాడు భూపతి .
యశ్వంత్ బాబూ .. ఏమిటిదంతా ? భూపతి అలా మాట్లడుతున్నాడేంటి ? భూపతి ప్రవర్తనని ని వింతగా చూస్తూ
అన్నాడు శంకరం .
బాధగా కళ్ళు మూసుకొని మళ్ళి తెరచి .. భూపతి చేసిన పాపాలకి ఆ భగవంతుడే శిక్ష వేసినట్టున్నాడు శంకరం
గారూ .. కొడుకు ని అలా చూసి అతని కి మతి స్థిమితం తప్పినట్టుంది .. ముందు అతడిని ఆ చెట్టు దగ్గరనుండి
తీసుకొచ్చి జాగ్రత్త గా చూసుకోండి .. అని ఒక్కసారి బాధగా నిట్టూర్చాడు యశ్వంత్ .
అయ్యో .. భూపతిగారు పిచ్చివారై పోయారా ? అయ్యో .. అయ్యో ... భగవంతుడా .. గట్టిగా గోల పెట్టాడు శంకరం .
ఈలోపు బాలయ్య శవాన్ని కిందికి దించాడు .. నేల పై పరుండ బెట్టాడు .. రత్నంరాజు మృతదేహం వైపు సునిశితం
గా చూశాడు .. అతని ఒంటి మీద గాయాలు అవీ చూస్తుంటే ఎవరో బలమైన వ్యక్తి అతడిని బలం గా ఎత్తి ఎటు
వైపు పడితే అటు విసిరి వేస్తే తగిలిన దెబ్బల్లా ఉన్నాయి ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment