ఆమె వైపు పరీక్ష గా చూసి .. నువ్వెందుకు ఇంకా ఇక్కడ ? వెళ్ళు అన్నాడు యశ్వంత్ ..
ఆమె వెళ్లేందుకు వెనుదిరిగింది .. వెనక నుంచి .. ఒక్కనిమిషం .. అంటూ ఆమె వైపు వచ్చాడు యశ్వంత్ .
ఆమె ఆగింది కానీ యశ్వంత్ వైపు తిరగలేదు .. యశ్వంత్ కి ఆమె వీపు మాత్రమే కనిపిస్తుంది ..
నువ్వు మూగ దానివి కావు .. కదా వెంగమ్మా ? అదే సమాధుల దగ్గరి కి వెళ్లి మాట్లాడుతున్టావు మనుషులతో
కాకుండా ... అన్నాడు యశ్వంత్ వెటకారంగా .
ఆమె చివుక్కున వెనుదిరిగి చూసింది ... ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం తో పాటు కోపం ..
ఏంటి అలా చూస్తున్నావు ? మాకెలా తెలిసిందనా ? అసలు నిన్ను చూస్తేనే నువ్వు మూగ దానిలా కనబడవు
ఐనా రహస్యాలని చేదించడమే మా పని .. నువ్వు ఆ బసవ రాజు వంసీకురాలివే అయున్టావు కదూ .. అన్నాడు
యశ్వంత్ ..
వెంగమ్మ గట్టిగా నవ్వింది తెరలు తెరలుగా నవ్వింది .. అవున్రా .. నేను మూగదాన్ని కాదు .. కానీ నా గొంతు
విన్నవాడు బతకడు .. ఒకవేళ వాడు బతికితే నేను బతకను .. అందుకే ఇన్నాళ్ళు మూగదానిలా బతుకు సాగ
దీశాను .. నీ చావు నువ్వే వెతుక్కుంటూ పోతావు .. ఇదుగో విను .. నేను మాటడుతున్నా .. ఈ ఊరిలో నా
ఒక్కదానికే ఎరుక .. ఏ చావు ఎవరి ఖాతాలో అనేది ... ఈ చావు .. ఈచావు .. ఆ పిశాచి ఖాతా లోదే .. వైజయంతి ..
వైజయంతే బలి తీసుకుందిరా .. అని అరిచింది వెంగమ్మ రాక్షసంగా ..
ఏం మాట్లాడుతున్నావు ? వైజయంతి ని , ఆ బసవరాజు నీ వీరస్వామి బంధించి వేశాడు .. ఆ తరువాతే రత్నం
అక్కడికి వెళ్ళాడు .. కాబట్టి వైజయంతి ఇతడిని చంపే అవకాశమే లేదు .. కంగారుగా అన్నాడు యశ్వంత్ .
మూర్ఖుడా .. నువ్వన్నది నిజమే .. గానీ .. నే చెప్పేదీ నిజమే .. అది నీకే తెలుస్తుంది .. అని వెళ్ళు .. వెళ్లి నీ చావుని
వెతుక్కో .. పో .. అంది వెంగమ్మ ..
నోర్ముయ్ .. ఎవ్వరి చావు ఎవరు చూస్తారో చూద్దాం ? వీరాస్వామి ఎక్కడున్నాడో నీకు తప్పని సరిగా తెలిసి ఉండి
ఉంటుంది చెప్పు .. ఎక్కడున్నాడు ? గద్దించి అడిగాడు యశ్వంత్ ..
ఆమె నవ్వి .. ఇటునుంచి దక్షిణానికి వెళ్ళు .. అది యమ దిశ .. వెళ్లి చూసుకో .. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు .
అంది వెంగమ్మ .
వ్వాట్ ? అన్నాడు యశ్వంత్ ..
ఆమె నవ్వుతూ .. ఎందుకో పైకి చూసింది .. ఆమె పైకి చూడటం గమనించి యశ్వంత్ కూడా పైకి చూశాడు ...
ఓ చెట్టు కొమ్మ విరిగి పడబోతుంది .. కరెక్ట్ గా దానికిందే ఉన్నాడు యశ్వంత్ . క్షణం లో అప్రమత్తమై ఒక్క అంగలో
పక్క కి దూకాడు .. కొమ్మ కింద పడింది .. త్రుటిలో ప్రమాదం తప్పింది .
యశ్వంత్ మెల్లిగా లేచి నిలబడి వెంగమ్మ కోసం చూశాడు .. ఆమె అక్కడ లేదు .. చుట్టూ చూశాడు .. ఆ కొద్ది
సమయం లో ఆమె అక్కడినుంచి ఎలా అదృశ్యమయ్యిందో అర్థం కాలేదు యశ్వంత్ కి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment