హా .. ఉందనే అనుకోవాలి మహల్ లో అంతా .. కానీ ఇంకా మిగిలే ఉంది మురారీ .. వివరంగా అంతా ఇప్పుడు
చెప్పలేను .. సమయం లేదు .. నేను బయటికి వెళ్తున్నాను .. మరో రెండు గంటల్లో అంతా లేస్తారు .. నేను
,యశ్వంత్ చిన్న పనుండి బయటకి వెళ్లాం అని చెప్పు .. ఇంకా అడిగితె మహర్షి పంపారని చెప్పు .. అన్నింటికన్నా
ముఖ్యం రచన .. తనసలు ఈ మహల్ దాటి బయటికి వెళ్ళకూడదు .. ఎటువంటి స్థితిలో కూడా .. మహల్ కి నువ్వే
రక్షణ గా ఉండాలి .. నేను ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా యశ్వంత్ తో పాటుగా వస్తాను .. అన్నాడు శివ .
శివా .. నాకేం అర్థం కావడం లేదు .. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనూ వస్తాను .. అన్నాడు మురారి .
లేదు మురారీ .. నువ్విక్కడ ఉండటం అవసరం .. సత్య ని కూడా నువ్విప్పుడు వదలి ఉండటం అంత మంచిది
కాదు .. అయినా ఎక్కువ నేను డిస్కస్ చేయలేను .. ప్లీజ్ నేను చెప్పింది చెయ్ .. అన్నాడు శివ .
అలాగే శివా .. గన్ తీసుకు వెళ్ళు అన్నాడు మురారి .
బహుశా గన్ తో పనిలేక పోవొచ్చు .. ఎనీవే .. బాయ్ మురారీ .. అని ఫాస్ట్ గా మెట్లు దిగి మహల్ బయటున్న
సైకిల్ తీసుకొని బయట పడ్డాడు శివ .
ఏమయ్యుంటుంది ? ఇంత కంగారుగా ఉన్నాడు శివ .. యశ్వంత్ కోసం వెళ్తున్నానన్నాడు .. యశ్వంత్ ఏమైనా
సమస్యలో ఉన్నాడా ? ఏంటో ఏమీ చెప్పలేదు .. బట్ నేను వెయిట్ చేయడం మంచిది .. వాల్లోచ్చేవరకు ఇక్కడ
మేనేజ్ చేయటం నా బాధ్యతే .. అనుకుంటూ .. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు మురారి .
******************************
సర్ర్ మని వెహికల్ ఆగిన సవ్వడి విని మూతలు పడుతున్న కళ్ళని బలవంతం గా తెరచి ఏమైంది డ్రైవర్ ? అని
అడిగాడు విక్కీ .
గిరిజ మాత్రం విండో కి తల ఆనించి నిద్రపోతోంది .. మంచి నిద్రలో ఉండటం వల్ల నెమో ఆమె కి ఆ సౌండ్ కి మెలకువ
రాలేదు .
టైర్ పంచర్ అనుకుంటా సర్ .. అని డోర్ తెరచి కిందకి దిగాడు డ్రైవర్ ..
ఓహ్ .. అని చుట్టూ చూశాడు విక్కీ .. చుట్టూ అంతా అడవిలా ఉంది .. రోడ్ మీద వారి వెహికల్ తప్ప వేరే వెహికల్
కూడా ఏమీ కనబడటం లేదు .. గిరిజ వైపు చూశాడు ఆమె గాఢ నిద్రలో ఉంది .. ప్చ్ .. అని నిట్టూర్చి తానూ
కాబ్ దిగి డ్రైవర్ పక్కకొచ్చి నిల్చున్నాడు ..
ఫర్లేదు సర్ .. టైర్ మార్చేస్తాను .. అన్నాడు డ్రైవర్ .
సరే త్వరగా కానీ .. ఇదంతా అడవిలా ఉంది .. ఏ జంతువులు ఉన్నాయో ఏమో .. అని చుట్టూ పరికించి
చూడసాగాడు విక్కీ . వెన్నెల వెలుగు లో రోడ్ కి ఇరువైపులా ఉన్న చెట్లు జుట్టు విరబోసిన దెయ్యాల్లా ఉన్నాయి .
అతడు విసుగ్గా చేతికి ఉన్న వాచ్ ని చూసుకున్నాడు .. అప్పుడు సమయం సరిగ్గా 12 గం .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment