యస్వంత్ సుమారుగా ఒక కిలోమీటర్ కంటే కాస్త ఎక్కువగా నడిచాడు .. ఇంతలో ఎక్కడ్నుంచో సన్నగా ఓ
మూలుగు వినబడింది .. యశ్వంత్ చెవులు రిక్కించి విన్నాడు .. ఆ మూలుగు వినిపిస్తున్న వైపు దట్టం గా
పొదలు ఉన్నాయి .. ఆ పొదలు వైపు టార్చ్ వేసి చూశాడు .. ఎవ్వరూ కనబడలేదు .. కానీ మూలుగు లో కొంచెం
తీవ్రత కనబడింది ..
ఖచ్చితం గా అక్కడ ఎవ్వరో ఉన్నారు .. అనుకుంటూ పొదల వైపు నడిచాడు యశ్వంత్ .. పొదలకి అటువైపు
ఎవ్వరివో కాళ్ళు కనబడ్డాయి .. నొసలు చిట్లించి ఎవరదీ ? అని గద్దించాడు యశ్వంత్ ..
ఆ మాటకి .. స్పందన గా .. న.. న్ను .. ర .. క్షించన్దీ ... అని దీనం గా అన్నదో మగ గొంతు ..
యశ్వంత్ పొదలని దాటి అటువైపు వెళ్లి చూశాడు .. అతి దీన స్థితిలో పడున్నాడు వీరాస్వామి .. అతని వొళ్ళంతా
రక్తసిక్తం గా ఉంది .. అతని పరిస్థితి చూస్తె ఇంకెంత సేపో అతడు బతుకుతాడని అనిపించలేదు యశ్వంత్ .. కి .
యశ్వంత్ ని చూడటం తో అతని కళ్ళలో చిన్న ఆశ మిణుక్కు మంది ..
వీరాస్వామి .. నువ్విక్కడ .. ఎవరు .. ఎవరు చేసారు ఇదంతా ? అన్నాడు యశ్వంత్ ఆందోళన నిండిన గొంతుతో ..
అతడు .. మాటలు కూడబలుక్కుని .. అన్నాడు .. వై .. జ .. య0.. తీ .. అని .
కానీ .. కానీ .. నువ్వు ఆమె ని బందించావు గా .. మరి ఎలా ఇదంతా ? బొంగురు పోతున్న కంఠo తో అన్నాడు
యశ్వంత్ .
అవును .. బంధించాను .. రెండు జాడీల్లో బంధించి .. నేలలో పాతి పెట్టాలనుకున్నాను .. దానికి కొన్ని ఘడియలు
బలం చేకూరుస్తాయి .. అటువంటి సమయం లో పూజ చేసి పాతి పెట్టాలని అనుకున్నాను .. ఆ జాడీ లని ఆ
పాడుబడ్డ కోటలోనే ఓ గదిలో ఉంచాను .. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను .. బసవడి ఆత్మ ని పాతి పెట్టాను ..
తరువాత వైజయంతి పాతి పెడుతుండగా ఎక్కడినుండి ఊడిపడ్డాడో భూపతి కొడుకు .. పెద్దగా ధాత్రీ .. ధాత్రీ అంటూ
అరుస్తూ వచ్చాడు .. మంత్రం మధ్యలో ఉండగా నన్ను అక్కడ చూశాడు ..
ఏదో ఆ పిల్ల కి అపకారం చేస్తున్నాననుకున్నాడో ఏమో .. నన్ను లేపి కొట్టాడు .. మంత్రం మధ్యలో ఆగకూడదు
ఆగిపోయింది .. ఏం పాతి పెడుతున్నావ్ ఇక్కడ ? ధాత్రి నేం చేసావు అనుకుంటూ నేనెంత చెప్పిన వినకుండా
ఆ గోతిని బలం గా తిరిగి తవ్వాడు .. గునపం జాడీ కి తగిలింది .. జాడీ లోంచి వైజ.. యంతి .. బయటికి వచ్చింది .
పగతో రగులు తున్న ఆత్మ బంధింప బడి అది తిరిగి విడుదల అయితే అది ప్రళయ భయంకరమే అవుతుంది .
వైజయంతి అలా బయటికి వచ్చేసరికి ఎదురుగా ఉన్నది భూపతి కొడుకు ..
ఆమెనలా చూసి బెదిరిపోయాడు .. అతడిని చిత్రహింసలు పెట్టి అతడి ని దూరంగా విసిరి వేసింది .. నాకు తెలిసి
అతని ప్రాణం పోయుండాలి .. అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వీరాస్వామి ..
అంటే వైజయంతి మళ్ళి .. అని అన్నాడు యశ్వంత్ బాధగా ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment