అతడు ఆ స్థితి లోనూ ఓ పిచ్చి నవ్వు నవ్వాడు .. వైజయంతి ఇంకా శక్తి వంత మయ్యింది.. నా నుండి తాంత్రిక
శక్తినీ .. అనేక క్షుద్ర శక్తులని తోడ్కొని నన్ను ఈ పరిస్థితి కి తెచ్చి మీకోసమే బయలు దేరింది .. ఇప్పుడే .. నన్ను
బతికించండి .. నేను మిమ్మల్ని కాపాడతాను .. అన్నాడు వీరాస్వామి ..
హ .. అని అతడిని లేపడానికి ప్రయత్నించాడు యశ్వంత్ . కానీ పైనుంచి ఓ చెట్టు ఊడ తానంతట అదే దిగి వచ్చి
వీరాస్వామి మెడచుట్టు ఉచ్చ్చు బిగించి అతడ్ని యశ్వంత్ చేతుల్లోంచి పైకి లాక్కు పోయింది ..
జరిగిన పరిణామానికి హతాశుడై పైకి చూశాడు యశ్వంత్ ... వీరాస్వామి గిలగిలా తన్నుకుంటూ ప్రాణం
వదిలేసాడు ..
ఓహ్ గాడ్ .. గట్టిగా అరిచాడు యశ్వంత్ .. కానీ హటాత్తుగా ఆ మఱ్ఱి ఊడ వీరాస్వామి శవాన్ని ఊయల అటు ఇటూ
ఊపసాగింది .. మొదట మెల్లిగా .. తరువాత మెల్లగా వేగం పెరిగి అతడ్ని ఎక్కడికో దూరం గా నెట్టి వేసింది ..
భయంగా కళ్ళు మూసుకున్నాడు యశ్వంత్ .
అతనికి ఓ క్షణం రత్నం రాజు ఎలా మరణించి ఉంటాడో అర్థం అయింది .. మెల్లిగా కళ్ళు తెరచి చూశాడు ..
చంద్రుడిని మబ్బులు కమ్మేసాయేమో మొత్తం చీకటిగా ఉంది .. ఇంతలో మరో మఱ్ఱి ఊడ మెల్లిగా అతని వైపు
పాక్కుంటూ రాసాగింది .. శబ్దం విని అప్రమత్తమై అక్కడనుంచి పరుగుతీసాడు యశ్వంత్ .. అతణ్ణి
వెంబడించసాగింది ఆ మర్రి ఊడ .. పరిగెడుతూనే చురుగ్గా ఆలోచిస్తున్నాడు యశ్వంత్ .. ఎలా తప్పించుకోవాలి
దీని నుండి ..? దీని అర్థం వైజయంతి ఇక్కడే ఉంది .. మహల్ వైపు వైజయంతి వెళ్ళకూడదు .. నా ప్రాణం
తీయకుండా వైజయంతి ఇక్కడ నుండి పోదు .. తన దృష్టి ని నా వైపే ఉంచాలి .. పౌర్ణమి ఘడియలు వచ్చేవరకు
నేను నా ప్రాణం కాపాడుకుని తీరాలి .. నన్ను హింస పెట్టె పనిలో వైజయంతి మిగతా అంతా మర్చిపోవాలి .. ఈ
ప్రయత్నం లో నా ప్రాణం కోల్పోయినా ఫరవాలేదు .. అనుకొని పరుగు తీస్తున్నాడు యశ్వంత్ .. కానీ అతడి
ఎడమ కాలిని పట్టుకొంది మఱ్ఱి ఊడ .. వేగం గా పరుగుతీస్తున్న అతడు ఒక్కసారిగా కింద పడ్డాడు .. అంతే
శరవేగంగా మఱ్ఱి ఊడ అతణ్ణి ఈడ్చుకు పోయింది .. బాధగా అరుస్తున్నాడు యశ్వంత్ . అతని వీపు గీరుకు
పోతోంది ...
అదే సమయం లో శివ యశ్వంత్ ని వెదుకుతున్నాడు .. ఎక్కడని వెదకను యశ్ నిన్ను .. అని అనుకోకుండా
అడవి వైపు చూశాడు శివ ..
ఎవరో స్త్రీ లాంతరు పట్టుకోని అడవి నుండి వస్తున్నది ..
ఈ టైం లో ఎవరబ్బా ? అని సైకిల్ ని ఆమె వైపు పోనిచ్చాడు .. దగ్గరికి వెళ్లి చూస్తే ఆమె వెంగమ్మ ..
నువ్వా ? ఈ సమయం లో అడవినుంచి వస్తున్నావు ? ఏంటి ఏం పని నీకు ? గద్దించాడు శివ .
ఆమె అతడివైపు నిర్లక్ష్యం గా చూసి .. నవ్వింది ..
నిన్నే .. ఇంత రాత్రి వేళ అడవిలో నీకేం పని ? అన్నాడు శివ కోపంగా ..
ఆమె సమాధానం చెప్పక తన గుప్పెట లోని ఓ వస్తువు ని శివ కి చూపింది .. అది వాచ్ .. యశ్వంత్ ది .
ఇది .. ఇది .. నీకేక్కడిది ? అని ఆమె చేతిలోంచి కంగారుగా ఆ వాచ్ ని తీసుకొని .. యశ్ అడవికి వెళ్లాడా ? అని
నేనింకా లేట్ చేయకూడదు .. అని వెంటనే సైకిల్ ని అడవిలోకి పోనిచ్చాడు .. శివ .
కంగారుగా వెళ్తున్న అతడిని చూస్తూ క్రూరంగా నవ్వుకొంది వెంగమ్మ .
*********************
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment