పరుగు పరుగున మహల్లోకి చేరుకొని సరాసరి స్వామీజీ గది ని చేరి తలుపు కొట్టాలనే తలంపు కి కూడా రాకుండా
తటాలున తలుపులు బార్లా తెరచి స్వామీజీ .. అని గట్టిగా అరిచాడు మురారి ..
ఆ సమయం లో స్వామీజీ నిద్రపోతున్తారనుకొని తలంచాడు మురారి .. కానీ దానికి భిన్నంగా ఆయన అమ్మవారి
పటం ముందు కూర్చుని ధ్యానం లో ఉన్నాడు అతడు ..
ఒక్క క్షణం తటపటాయించిన .. ఇది ఆలోచించాల్సిన సమయం కాదు .. అని తలచి .. అతని ముందుకి వెళ్లి
స్వామీజీ .. క్షమించండి .. నేను మిమ్మల్ని ధ్యానం నుండి బయటకి రమ్మని అర్థిస్తున్నాను .. అన్నాడు మురారి ..
స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరచి మందహాస వదనం తో .. కంగారు పడకు నాయనా .. వైజయంతి మహాల్లోకి
ప్రవేశించలేదు .. అన్నారు స్వామీజీ ..
స్వామీజీ .. నిజంగానా ? కానీ .. అని ఆగిపోయాడు మురారి సందేహం గా ..
మహల్ చుట్టూ నవధాన్యాలు చల్లట మైనది .. కాబట్టి ఆమె లోపలికి రాలేదు .. అన్నారు స్వామీజీ .
స్వామీజీ .. నవధన్యాలకే ఆమె కట్టుబడి పోతుంది అంటారా ? అన్నాడు మురారి .. అనుమానంగా ..
అవి మంత్రించిన నవధాన్యాలు నాయనా ? అమ్మవారి రక్ష .. అని తనవైపు సందేహం గా చూస్తున్న మురారి
వైపు చూసి .. అనుమానం గా ఉందా ? పద .. స్వయంగా నువ్వే ఆ పిశాచి విఫల యత్నాలను చూద్దువు గానీ ..
అని కూర్చున్న చోటి నుంచి లేచి గది బయటికి నడిచారు స్వామీజీ ..
సంకోచంగా అతణ్ణి అనుసరించాడు మురారి ..
ఇద్దరూ మహల్ ద్వారం దగ్గరికి వచ్చేసరికి అప్పటికే మహల్ గేటు దగ్గర నుండి లోపలికి రావటానికి విఫలయత్నం
చేస్తుంది వైజయంతి .
కానీ ఆమె అడుగు పెట్టిన చోటల్లా భగ్గుమని మంటలు వస్తున్నాయి .. ఆమె కోపం గా వీరి వైపు చూసింది ..
చూడు .. నీ కళ్ళతో నీవే చూడు .. ఆమె లోపలికి రాలేదు నాయనా .. నువ్వు నిశ్చింత గా ఉండు .. అన్నారు
స్వామీజీ ..
మురారి .. ఆనందం గా తల ఊపాడు .. నిజమే స్వామీ .. కానీ కానీ .. అని మళ్ళి అనుమానం గా చూసాడు మురారి
చెప్పు నాయనా .. ఇప్పుడు మళ్ళి ఏం అనుమానం కలిగింది ? అని అడిగారు స్వామీజీ .
స్వామీ .. మనమంతా లోపలే ఉన్నాం .. కానీ .. యష్ , శివ .. బయటే ఉన్నారు .. అసలు బంధింప బడి ఉన్న
వైజయంతి బయటకేలా వచ్చింది ? అసహనం గా అన్నాడు మురారి ..
నువ్వు వారి కొరకు చింతించకు నాయనా ... సర్వం ఆ జగన్మాత చూసుకుంటుంది .. ఎట్టి పరిస్థితుల లోనూ
మీరెవ్వరు మహల్ ప్రధాన ద్వారం దాటి బయటికి పోకండి .. అని లోపలికి నడిచారు స్వామీజీ ..
ఆతడి వైపు మంత్ర ముగ్ధుడి లా చూశాడు మురారి ..
నన్ను .. నా భవనం లోకే పోకుండా చేస్తారా ? మిమ్మల్ని సర్వ నాశనం కావిస్తాను .. గట్టిగా అరుస్తుంది
వైజయంతి...
అవేవీ చెవిన వేసుకోకుండానే స్వామీజీ వెంట నడిచాడు మురారి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a comment