స్వామీజీ మళ్ళి తన గదిలోకి వెళ్లి కూర్చున్నారు .. స్వామీజీ వెనుకనే వెళ్ళిన మురారి .. స్వామీజీ .. మీతో కొంచెం
సేపు మాట్లాడొచ్చా అన్నాడు..
రా నాయనా .. సందేహ నివృత్తి చేసుకోవటం తప్పేం కాదే .. ఇలా వచ్చి కూర్చో .. అని అన్నారు స్వామీజీ
ఆప్యాయంగా .
మురారి వెళ్లి అతని కెదురుగా కూర్చున్నాడు ... పక్కనే ఉన్న అమ్మవారి పటానికి నమస్కరించి .. స్వామీజీ వైపు
చూసి ... స్వామీ .. మాతరం సైన్స్ నే నమ్ముతుంది .. ఇలాంటి వన్ని కొట్టిపడే స్తుంది.. కానీ ఇప్పుడు మా
అనుభవాలు .. మరోలా చెబుతున్నాయి .. ఆత్మ అనేది ఉంది .. అది చనిపోయిన తరువాత కూడా
మనగలుగుతుంది అని .. అన్నాడు స్వామీజీ .
అవును నాయనా .. కాలం ఎంత మారినా .. విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా మనిషి మెదడు కి అందని
సత్యాలెన్నో ఈ విశ్వ గర్భం లో దాగి ఉన్నాయి .. ఆనాడు మహా భారత కాలం లో శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీత లో
ఆత్మ గురించి సవివరంగా చెప్పబడింది కదా .. ఆత్మ నాశనం లేనిది .. మనిషి బట్టలను ఎలా మార్చుకుంటా డో
అలాగే ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది .. అన్నారు స్వామీజీ .
స్వామీజీ .. మరైతే వైజయంతి ఆత్మ కి నాశనం లేనట్టేనా ? మరి అలాంటప్పుడు ఈ సమస్య ఎలా పరిష్కార మవు
తుందో మీరే చెప్పండి ? అన్నాడు ఆసక్తిగా మురారి ..
మంచి ప్రశ్న నాయనా .. నే చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం .. ఆత్మ నాశనం లేనిది .. కానీ ఏ ఆత్మ అయితే
కోరికలు తీరకుండా బంధ విముక్తి లేకుండా గాలిలో తిరుగాడుతూ ఉంటుందో ఆ ఆత్మ దుష్టాత్మ కాగలదు .. అలాగే
ఏదైనా సత్కార్యం కొరకై బంధ విముక్తి కి నోచుకోక పరమాత్మ లో లీనమవటానికి ప్రయత్నించే ఆత్మ కి దైవం
తోడుగా ఉండగలదు .. నీ అనుమానం .. ఒక దుష్టాత్మ దురుద్దేస పూరితమై , నాశనం లేనిడైతే పరిణామాలు
దారుణం గా ఉంటాయనేగా .. అన్నారు స్వామీజీ .
అవును స్వామీజీ .. పరిష్కారం ఎలా ? గుడిలో దీపాలు పెట్టి మహల్ లో పూజలు నిర్వహించడం వల్ల వైజయంతి
మహల్ ని వీడిపోవోచ్చు .. కానీ ఆమె వేరొక చోట ఇటువంటి సమస్యే కలగజేస్తే .. అన్నాడు మురారి .
అవును నాయనా .. కానీ ఏ ప్రేతాత్మ కైనా తమ కోరికల నుండి , దురుద్దేశాల నుండి విముక్తి లభియిస్తే వారికీ
గతజన్మ జ్ఞాపకాలు ఉండవు .. భవ భందాల నుండి విముక్తి పొందిన ఆత్మ పరమాత్మ లో లీనం కాగలదు ..
అన్నారు స్వామీజీ .
మరి .. వైజయంతి కి అటువంటి ముక్తి లభిస్తుందా ? మహల్ తనకే దక్కాలన్న కోరిక ఇప్పటికీ ఆమెని దహిస్తూ
ఉంటే ఆమె కి ముక్తి ఎలా లభిస్తుంది స్వామీజీ ? అన్నాడు మురారి .
కోరిక అనేది అశాశ్వత మైనది నాయనా .. ఆ కోరిక వెనక ఉన్న పూర్వాపరాలు గ్రహించినప్పుడు దాని నుండి
విముక్తి పొందే మార్గం ఉదయిస్తుంది .. ఒక ప్రేతాత్మ గా ఈ మహల్ ని అనుభవిమ్పలేనని ఆమె కి అర్థం
అయినప్పుడు ఆమె ఆ కోరిక నుండి విముక్తురాలవుతుంది .. అన్నారు స్వామీజీ .
కానీ వైజయంతి కి ఆ విషయం అర్థం అవుతుందా స్వామీజీ ? అన్నాడు మురారి ..
అవుతుంది నాయనా .. అందుకోరకే కదా మన ఈ విశ్వ ప్రయత్నం .. ఆత్మ నాశనం లేనిదే కానీ సమస్య పరిష్కారం
లేనిది కాదు .. అన్నారు స్వామీజీ .
మీతో మాట్లాడుతున్నపుడు మనసులో ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది స్వామీజీ .. అన్నాడు మురారి .
స్వామీజీ చిరునవ్వు తో తల పంకించారు .
******************
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:
Good one
Thank you padmarpita garu
Post a comment