Powered By Blogger

Tuesday, 30 September 2014

రుధిర సౌధం 255
వంటలు జరుగుతున్న స్థలం దగ్గరికి వెళ్లి అక్కడ పనుల్లో బిజీ గా ఉన్న బాలయ్య ని చూసి ... బాలయ్యా .. అంటూ

గట్టిగా పిలిచాడు యశ్వంత్ ..

ఆ .. అయ్యా .. అంటూ పరుగున వచ్చాడు బాలయ్య ..

వంటలు సిద్ధమవుతున్నాయా ? అని అడిగాడు యశ్వంత్ .

దాదాపు అయిపోయినట్టే నయ్యా ..  అన్నాడు  వినయం గా బాలయ్య .

సరే .. గేటు అవతల ఓ బిచ్చగత్తె అడుక్కుంటోంది .. భోజనాలు మొదలయ్యాక ఆమె నీ లోపలికి వచ్చి భోజనం

చెయ్ మను .. తనకేమన్న డబ్బు కావాలంటే కూడా నన్ను అడిగి ఇవ్వు తనకి .. అందరూ తృప్తి గా భోజనం

చేయాలి .. అర్థం అయిందా ? అన్నాడు యశ్వంత్ .

అలాగే నయ్యా .. తప్పకుండా ఆ బిచ్చమడుక్క్కునే దాన్ని పిలుత్తానయ్యా .. గొప్పమనసయ్యా మీది .. అన్నాడు

బాలయ్య .

నాది కాదు .. అమ్మాయి గారిది .. మర్చిపోకు సుమీ .. అన్నాడు యశ్వంత్ .

సరే నయ్యా .. అని తిరిగి పనిలో నిమగ్న మయ్యాడు బాలయ్య .

యశ్వంత్ .. నువ్విక్కడ ఉన్నావా ? అంటూ వచ్చాడు శివ .

ఏం ? నన్ను వెతుక్కుంటు న్నావ? ఇప్పటి వరకూ రచన నేను కనబడట్లేదని గోల పెట్టింది .. ఇప్పుడు నువ్వా ?

అన్నాడు యశ్వంత్ .

ఏంటీ ? రచన తో గొడవా ? తమాషాగా అన్నాడు శివ .

అదేo లేదు లే .. కూల్ అయిపొయింది గానీ .. విషయం చెప్పు ? అన్నాడు యశ్వంత్ .

అయ్యో .. అది మర్చిపోయాను చూడు .. నిన్ను స్వామీజీ రమ్మన్నారు యశ్వంత్ . కోట పై బురుజు మీద ఆకాశ

దీపం వెలగాల్సి ఉందట .. దానికోసం పిలిచారు .. నీతో మాట్లాడాలి అన్నారు .. అన్నాడు శివ .

ఓహ్ .. పద .. వెళదాం .. అని ముందుకి  నడిచాడు యశ్వంత్ ..

ఇద్దరూ కాసేపట్లో స్వామీజీ ముందు ఉన్నారు ..

చెప్పండి స్వామీజీ .. పిలిచారట .. అన్నాడు యశ్వంత్ వినయం గా ఆయన ముందు నిలబడి ..

అప్పటికే అక్కడ మురారి , విక్కీ కూర్చుని ఉన్నారు ..

అవును నాయనా .. ముందర కూర్చోండి మీ ఇరువురూ కూడా .. అన్నారు స్వామీజీ .

యశ్వంత్ , శివ కూడా ఆశీనులయ్యారు .

శ్రద్ధగా వినండి .. భోజన కార్యక్రమం అయ్యాక ఊరివాల్లన్దర్నీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు  వెళ్లి వారి వారి ఇళ్ళల్లో

పూజాదికాలు నిర్వహించమని చెప్పండి .. సాయంత్రం అయ్యేవరకూ ఎవ్వరు ఇంటి గడప దాట రాదు .. ఆ

సమయంలోనే .. సాయంత్రం మీ నలుగురూ .. కోట బురుజు పైకి వెళ్లి ఆకాశ దీపం వెలిగించ వలసి ఉంటుంది ..

ఇది మహత్తర కార్యం .. మీరు సంసిద్ధులై ఉంటారని మిమ్మల్ని పిలిపించాను అన్నారు స్వామీజీ .

అలాగే స్వామీజీ .. అన్నారు అందరూ ..

ఇక మీ ముగ్గురూ వెళ్ళండి .. నేను యశ్వంత్ తో మాట్లాడాలి అన్నారు స్వామీజీ ..

శివ , విక్కీ , మురారి లేచి వెళ్ళిపోయారు ..

చెప్పండి స్వామీజీ ? విపత్తు ఎటువైపు నుండి రాబోతుంది ? అని అడిగాడు యశ్వంత్ సీరియస్ గా ..

అది చెప్పేందుకే నిన్ను పిలిపించింది నాయనా అన్నారు స్వామీజీ ..

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 29 September 2014

రుధిర సౌధం 254

రచనా .. పిలిచావా .. అంటూ వచ్చిన యశ్వంత్ ని చూసి .. అరె .. అస్సలు ఇంటి పట్టున ఉండవా ? ఎక్కడికి వెళ్లి

పోతుంటావు ? కోపంగా అడిగింది .. రచన .

ఆమె వైపు నవ్వుతూ చూశాడు యశ్వంత్ .

అలా నవ్వుతావేంటి యశ్ .. అసలు బుద్ధుందా నీకు ? నన్నసలు పట్టించుకోవటమే లేదు నువ్వు .. బాగా

మారిపోయావ్ .. అంది రచన బుంగ మూతి పెట్టి .

అయ్యో మేరీ ప్యారీ రచనా .. నువ్వలా పెళ్ళాం లా అడిగేసరికి .. నాకు నవ్వొచ్చింది .. ఇంటి పట్టున ఉండవా ..

పట్టించుకావట్లేదు .. ఇలాంటి వన్ని పెళ్ళాల కంప్లైంట్స్ కదా .. అన్నాడు యశ్వంత్ నవ్వుతూ .

హమ్మ్ .. ఎంత కోపం తెప్పించినా సరే .. ఇట్టే నవ్వించేస్తావు కూడా యశ్ .. ఐ లవ్ యు .. అంది చిరునవ్వుతో

రచన ..

ఓకే మేడం .. ఇంతకీ ఎందుకు పిలిచారు తమరు ? అన్నాడు యశ్వంత్ ఆమె భుజాల మీద చేతులు వేస్తూ ..

యశ్ .. అమ్మ .. నా ఫేవరెట్ లడ్డు తెచ్చింది .. అందరూ తలొకటి పట్టుకుపోయారు .. నేను నీకోసం దాచి మరీ

తెచ్చా.. అంది రచన .. చిన్న కవర్ లోంచి లడ్డులు తీస్తూ ..

అవునా ? చూసావా ప్రేమలో పడగానే నువ్వెంత సెల్ఫిష్ అయిపోయావో .. నాకోసం లడ్డులు దాయటం .. ఇలాంటి

పనులు చేస్తున్నావు .. అన్నాడు యశ్వంత్ .. ఆమె చేతిలో లడ్డు అందుకుంటూ ..

అనుకో బాబు .. ఎన్నయినా .. మీ మగాళ్ళు మా ప్రేమని ఏరోజు అర్థం చేసుకున్నారు గనుక .. అంది రచన .

హే .. ఇన్ని నిందలోద్దు గానీ .. మా బామ్మర్ది ఏమంటున్నాడు ? అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. మీ ఇద్దరూ బాల్య స్నేహితులు .. నన్ను అడుగుతావేం .. సర్లే .. ఇప్పుడే సత్య కి సెలైన్ పెట్టాం ..

ఇంజక్షన్ చేశాడు అన్నయ్య .. సాయంత్రం కల్లా సత్య మనతో ఆడుతూ పాడుతూ ఉంటుంది .. అంది రచన .

ఓహ్ .. పోనీ లే .. సత్య కి బాగయిపోతే ఇంకేం కావాలి .. మురారి మోహంలో సంతోషం చూడాలి .. చాలా మంచి

వాడు మురారి .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ మాట్లాడుతూ వీధి వైపు చూసి గేటు అవతల ఉన్న ముసలి బిచ్చగత్తె ని చూసి .. యశ్వంత్ .. ఎవరు

మహల్ ముందు కూర్చుందామే . .. ? అని అడిగింది రచన .

తానో బెగ్గెర్ .. ఏం ? అన్నాడు యశ్వంత్ రచన వైపు చూస్తూ ..

ఈరోజు మనం ఊరిజనం అందరికీ భోజనాలు పెట్టబోతున్నాం .. ఆమె అక్కడ అడుక్కోవట మెందుకు ? లోపలికి

వచ్చి భోజనం చేయమని మన వాల్లెవర్నో పంపు  యశ్వంత్  .. ఈరోజు అందరూ ఇక్కడ తృప్తి గా భోజనం చేయాలి

.. అంది రచన  .

అవును .. నేను బాలయ్య కి చెప్పి పంపిస్తాను .. సరేనా ? అన్నాడు యశ్వంత్ .

అలాగే యశ్ .. ఇంతకీ లడ్డు ఎలా ఉందొ చెప్పలేదు .. అంది రచన .

చాలా .. చాలా బావుంది .. నీ ప్రేమంత తీయగా .. అన్నాడు యశ్వంత్ .

కానీ నీకు స్వీట్ నచ్చదుగా .. అంది కొంటెగా అతడి వైపు చూస్తూ రచన ..

ఈమధ్య నచ్చేస్తోంది లే .. అన్నాడు నవ్వుతూ యశ్వంత్ .

అతడి నవ్వులో శృతి కలిపింది రచన .
                                                *************************************


ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 26 September 2014

రుధిర సౌధం 253
యశ్వంత్ .. అసలు వైజయంతి ఎత్తుగడ ఏమయి ఉంటుందో అర్థం కావడం లేదు .. అసహనం గా అన్నాడు శివ .

శివా .. మనం అప్రమత్తం గానే ఉంటాం కదా .. ఏం ఫర్వాలేదు .. అని గేటు వైపు చూసి .. శివా .. ఆ వస్తున్న వాళ్ళు

ఆరోజు మనం అడవిలో చూసిన ఫామిలీ కదా .. అన్నాడు యశ్వంత్ .

అవును యశ్ .. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వస్తామన్నారు .. ఆరోజు అడవిలో అమ్మవారిని అర్చిస్తూ కనిపించారు

కదూ.. అన్నాడు శివ .

అవును .. శివా .. వాళ్ళని రచనకి , ఆంటీ కి పరిచయం చేసి విషయం చెప్పు .. వాళ్లకి ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు

చేయమని సరస్వతి కి చెప్పు .. అని వాళ్లకి ఎదురెళ్ళి .. రండి .. మనం మళ్ళి కలసుకోవడం ఆనందంగా ఉంది ..

అన్నాడు యశ్వంత్ .

ఆ కుటుంబ పెద్ద (ముసలాయన ) .. అవును నాయనా .. అమ్మవారు ఇక్కడికి తరలి వచ్చేసి నపుడు మేము

రాకుండా ఎలా ఉండగలం ? అన్నాడు .

సరే .. మీరు మా శివ తో పాటుగా వెళ్ళండి .. రాజ వంశీకులు కూడా ఇక్కడే ఉన్నారు .. అని శివ వైపు తిరిగి

తీసుకు వెళ్ళు శివా .. అన్నాడు యశ్వంత్ . శివ వాళ్ళని పట్టుకుని లోపలికి వెళ్ళాక బాలయ్య లోపలికి వస్తూ

కనిపించడం తో అటుగా నడిచాడు యశ్వంత్ .

అయ్యా .. ఇప్పుడే వచ్చామయ్యా .. అన్నాడు బాలయ్య .

రత్నం బాడీ ని పోస్టుమార్టం కి అప్పగించారా ? అని అడిగాడు మెల్లిగా యశ్వంత్ .

అవునయ్యా .. రేపు ఉదయానికి తెస్తారయ్యా మళ్ళి .. శంకరం , భూపతి అక్కడ్నే ఉన్నారయ్యా .. భూపతి బుర్ర

ఇంకా కొడుకు చావు ని అంగీకరించడం లేదయ్యా .. అన్నాడు బాధగా .

ఏం చేస్తాం బాలయ్యా .. సరే .. ముందు నువ్వు స్నానం చేసే వచ్చావా ? అన్నాడు యశ్వంత్ .

ఇక్కడ దైవ కార్యం కదయ్యా .. చేసే వచ్చినా .. అన్నాడు బాలయ్య .

ఈరోజు గడిచేదాకా రత్నం విషయం ఎవరితో చెప్పకుండా ఉండటం మంచిది బాలయ్యా .. అన్నాడు యశ్వంత్ .

తెలుసయ్యా .. పనే ముందయ్యా ? అన్నాడు బాలయ్య .

అక్కడ వంటలు జరుగుతున్నాయి .. వెళ్లి చూసుకో .. మధ్యాహ్నం ఊరి వాళ్ళంతా భోజనాలు ఇక్కడే చేస్తారు కదా

అన్నాడు యశ్వంత్ .

అలగేనయ్య .. అని వంటలు జరిగే జరిగే వైపు కి పరుగు తీసాడు బాలయ్య .

మెల్లిగా జనం పెరుగుతున్నారు మహల్ ప్రాంగణం లో .. అప్రయత్నం గా గేటు వైపు చూశాడు యశ్వంత్ ..

గేటు కి కొంచెం దూరం లో .. ఓ పండు ముదుసలి వణుకుతూ కూర్చుంది .. వచ్చే పోయే వాళ్ళని దానం చేయమని

అడుగుతోంది .

బావుంది .. నిన్నటి వరకు జనం ఇటు వైపు రావటానికి భయపడే వారు .. ఇప్పుడు మహల్ ముందు బిచ్చం

అడిగేవాళ్ళు కూడా రెడీ అయ్యారు .. అనుకున్నాడు యశ్వంత్ మనసులో ..

యశ్వంత్ .. యశ్వంత్ .. మహల్ లోంచి గట్టిగా రచన గొంతు వినబడే సరికి .. మహల్ వైపు నడిచాడు యశ్వంత్ .

అంత వరకు యశ్వంత్ దృష్టి ని ఆకట్టుకున్న ఆ ముసలి అవ్వ .. వికృతంగా చూసింది మహల్ వైపు .

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 25 September 2014

రుధిర సౌధం 252
ముగ్గురూ గదిలోకి ప్రవేశించారు . మంచం మీద నీరసం గా పడున్న సత్య నిర్లిప్తంగా చూసింది వీరి వైపు ..

హలో సత్యా .. హౌ ఆర్ యు .. అంది రచన .

చిన్నగా తల ఊపింది సత్య ..

సత్యా .. తను మా అన్నయ్య విక్కీ .. అప్పుడప్పుడు చెబుతూ ఉండేదాన్ని గుర్తుందా ... తను డాక్టర్ .. అంది సత్య

పక్కనే కూర్చుంటూ రచన .

సత్య నీరసంగా నవ్వింది విక్కీ ని చూసి ..

బాగా నీరసం గా ఉంటోంది విక్కీ .. ప్లీజ్ ఏదైనా చేయండి .. అర్థించి నట్టే అడిగాడు మురారి .

యు డోంట్ వర్రీ మురారీ .. ఇక నేను చూసుకుంటాను .. అని రచన వైపు చూసి .. రచనా నువ్వు ఆ గదిలో నా బాగ్

ఉంటుంది కదా .. దానిలో సెలైన్ బాటిల్ ఉంది తీసుకురా .. అని చెప్పి సత్య చేతిని పట్టుకుని నాడిని పరీక్షించాడు

విక్కీ ..

సత్యా .. ఏం కాలేదు నీకు .. ఎందుకిలా నీరసంగా పడుకున్నావు ? సరదాగా తిరగాలి కదా .. అని చిరునవ్వు

నవ్వాడు విక్కీ .

ఆమె కూడా నీరసం గా నవ్వింది .

మురారి వైపు చూసి .. ఇంజక్షన్ చేస్తాను మురారీ .. కొంచెం తన చేయి ఎత్తి పట్టుకోండి .. అన్నాడు విక్కీ ..

మురారి అలానే చేసాడు .. ఈలోపు రచన సెలైన్ బోటిల్ పట్టుకొచ్చింది ..

విక్కీ సత్య కి ఇంజక్షన్ చేసి సెలైన్ పెట్టాడు ..

మురారీ తను కొన్ని రోజులుగా ఏమీ తినలేదు .. అందుకే అంత నీరసం గా ఉంది .. ముందు ఏమైనా తినిపిస్తే

బెటర్ .. సెలైన్ కూడా పెట్టాం కనుక తను తేరుకుంటుంది .. మోస్ట్ లీ తను సాయంత్రానికి మనతో గడప

గలుగుతుంది .. సో నో నీడ్ టు వర్రీ అన్నాడు విక్కీ ..

థాంక్ యు విక్కీ .. అన్నాడు మురారీ ..

థాంక్స్ చెప్పాల్సిన అవసరమేమీ లేదు మురారీ ..  నాకు రచన మీ అందరి గురించి చెప్పింది .. అలా అయితే

మీరు చేసిన వాటికి నేను థాంక్స్ అని ఓ చిన్న మాట చెప్పి మిమ్మల్ని అవమానించ దలచుకోలేదు .. అది

ఎన్నటికీ సరిపోదు ..   కానీ ఇంకా మిమ్మల్నే ఇంకో హెల్ప్ అడుగుదామనుకుంటున్నాను .. అన్నాడు విక్కీ .

అయ్యో .. ఎంత మాట ?  విక్కీ ప్లీజ్ అడగండి .. అన్నాడు మురారి .

నన్నూ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో జాయిన్ చేస్కుంటారా ? అన్నాడు విక్కీ కొంటెగా ..

ఓహ్ .. అన్నయ్యా .. అంది నవ్వుతూ రచన .

ష్యూర్ విక్కీ .. వుయ్ ఆల్ లవ్ యు .. అని ప్రేమగా హత్తుకున్నాడు మురారి విక్కీ ని .

సత్య .. రచన ని తనకి దగ్గరగా రమ్మని సైగ చేసింది .

సత్య దగ్గరగా వెళ్లి ఏంటి సత్యా ? అంది ప్రేమగా రచన .

ఐ యాం సారి .. రచ్ .. నా .. నేను నీతో ఆరోజు .. ఎలా మాట్లాడానో  .. నువ్వే నన్నిక్కడకి సేఫ్ గా తెచ్చుంటావుగా ..

మాటలు కూలబడుక్కుంటూ అంది సత్య మెల్లిగా .

ఓహ్ .. మురారీ .. సెలైన్ , ఇంజక్షన్ బాగానే పనిచేసి నట్టుంది .. చూడు మేడం సారీ లు చెప్పడం మొదలు పెట్టింది

అంది తమాషాగా రచన .

అంతా హాయిగా నవ్వేసారు .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 24 September 2014

రుధిర సౌధం 251

ఉదయం 10 గం .. నులువెచ్చని ఎండ మహల్ చుట్టూ పరచుకుంది .. ఓ పక్కగా వంటలు , మరో పక్క పూజా కార్య

క్రమాలు జోరుగా సాగుతున్నాయి .. ఊళ్ళో జనం మెల్లి మెల్లిగా పనుల్లో పాలు పంచుకుంటున్నారు .. కొంత మంది

ఇంకా రావాల్సి ఉంది .. అందరిలోనూ ఉత్సాహం వెల్లి విరుస్తోంది ..

రచన , గిరిజ , విక్కీ స్వామీజీ ముందు కూర్చున్నారు ..

జరిగినదంతా రచన కొన్ని మాటల్లో చెప్పింది .. గానీ ఆ పరిస్థితులను తను దాటి వచ్చింది అంటే మాత్రం .. ఎందుకో

గుండెల్లో వణుకు పుడుతుంది స్వామీజీ .. అంది వణుకుతున్న కంఠం తో గిరిజ ..

నువ్వే అంటున్నావు గా తల్లీ .. ఆ పరిస్థితులు అన్నింటిని దాటి వచ్చిందని ... అంటే .. అవన్నీ ముగిసి పోయాయి ..

ముగిసిపోయిన విషయాల కోసం చర్చించి సమయాన్ని వ్యర్థం చేసుకోవటం దేనికి ? అన్నారు స్వామీజీ .

నిజమే కదమ్మా .. ముందు నేనూ భయపడ్డాను .. కానీ ఇప్పుడు రచన ని చూస్తుంటే నాకు గర్వం గా ఉంది ..

మన వంశం లో ఎవ్వరూ చేయలేని పని తాను చేసింది .. ఇప్పుడు ఇలా మహల్లో కూర్చుని మాట్లాడుకుంటాం

అని  కనీసం ఏనాడూ మనం ఊహించనే లేదు .. అన్నాడు విక్కీ .

అన్నయ్యా .. నేనేం చేసినా నీకీ హక్కు దక్కటం కోసం చేశాను .. నాన్న కోరిక తీరాలని చేశాను .. మన కుటుంబం

, వంశం కారణం గా  ఈ ఊరు వెనుక బడ కూడదు గనుక చేశాను .. అయినా నాకైతే ఒక కారణం ఉంది .. ఏమైనా

చేయటానికి .. కానీ  యశ్వంత్  , శివ , మురారి , సత్య .. వాళ్ళు నిస్వార్థం గా కష్ట పడ్డారు .. ఎన్నో ఇబ్బందులు

పడినా అనుక్షణం నాకు తోడుగా ఉన్నారు .. వాళ్ళ ప్రాణాలను కూడా పణం గా పెట్టారు .. అందుకే అంటారేమో ...

డబ్బులున్నవాడు ధనవంతుడు కాదు స్నేహితులు ఉన్నవాడే ధనవంతుడు .. అని ..

ఆ మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి ..

నిజమేరా .. నువ్వు  లక్కి .. ఒప్పుకోవాల్సిందే .. నవ్వుతూ అన్నాడు విక్కీ .

అన్నయ్యా .. ముందు సత్య ని ఓసారి చూడు .. తను కోలుకుని తిరగక పొతే నాకు పూర్తి సంతోషం లేనట్టే .. అంది

రచన .

అవును నాయనా .. వెళ్లి  ఆమె కి బలానికి ఏమైనా సూది మందు వెయ్యి .. అన్నారు స్వామీజీ ..

అలాగే స్వామీజీ .. అని లేచాడు విక్కీ .

రచన కూడా లేచి .. అమ్మా .. నువ్విక్కడే ఉండు .. మేము సత్య దగ్గరకి వెళ్లి వస్తాం .. అంది .

అలాగే .. ముందు తనకి టిఫిన్ పెట్టండి .. అంది గిరిజ .

ఆ .. అలాగే .. అంటూ గది లోంచి బయటికి నడిచారు అన్నా చెల్లెళ్ళు .

వాళ్ళ వైపు తృప్తిగా చూసింది గిరిజ .. గిరిజ కళ్ళలో సంతృప్తి చూసి మందహాస వదనం తో ... సంతోషమా .. తల్లీ ..

అన్నారు స్వామీజీ .

ఇంతకీ సత్య కి ఏం జరిగింది ? ప్రొబ్లెం ఏంటి ? అని అడిగాడు సత్య గది వైపు నడుస్తూ విక్కీ .

వీక్ గా ఉంది బాగా ... అంది రచన .

ఎందుకంత వీక్ అయింది అని అడుగుతున్నా రాచీ .. అన్నాడు విక్కీ .

ఆ కారణాలు మన మెదడుకి అంతు పట్టదు లెండి డాక్టర్ .. రండి ఇదే ఆ గది .. అని గది తలుపులు తీసి లోపలికి

నడిచాడు మురారి .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 23 September 2014

రుధిర సౌధం 250

250 వ భాగం 


ఇంత వరకు మా యువరాణి నే చూశామను కున్నాం .. మహారానమ్మ కుడా చుసేసినాం .. అంది సరస్వతి

తమాషాగా ..

సరస్వతి మాటలకి గలగలా నవ్వింది రచన .

అలా నవ్వుతున్న కూతుర్ని ముచ్చటగా చూసింది గిరిజ ..

ఏంటమ్మా ? అలా చూస్తున్నావు ? అంది రచన నవ్వటం ఆపి .. తన వైపే తదేకం గా చూస్తున్న తల్లిని చూసి ..

నాకిప్పటికి నమ్మశక్యంగా లేదు రచనా .. నేను కలగనడం లేదు కదా .. అంది గిరిజ .. అమాయకంగా .

లేదు .. ఇదంతా నిజం .. నిజంగా నిజం .. సాయంత్రం గుళ్ళో సహస్రయాగం .. అంటే మన పూర్వీకుల ఆత్మ

లన్నింటికి శాంతి .. నాన్న సంతోషిస్తారమ్మా .. అంది రచన ఆర్ద్రతగా ..

నువ్వు సాధించావు రచనా .. నిజంగా ఇదంతా అంత తేలిగ్గా జరిగే పని కాదు .. కానీ జరిగింది .. నువ్విక్కడ ఏం

కష్టం పాలవుతున్నావో అని భయంగా వచ్చాను .. బట్ .. ఇప్పుడు నిన్నింత సంతోషం గా చూస్తుంటే .. బావుంది ..

అన్నాడు విక్కీ చెల్లెలి భుజం మీద ప్రేమగా చేయి వేస్తూ ..

ఇదంతా ఏం అంత సులువుగా కాలేదు .. నేనొక్కదాన్నే కష్టపడలేదు .. యశ్వంత్ , శివ , మురారీ , సత్య .. అందరూ

.. అందరూ నాకు తోడుగా నిలిచారు .. అని సత్య అంటే గుర్తొచ్చింది .. నిన్న స్వామీజీ చెప్పారు నాకు .. రేపు

ఉదయానికి ఓ డాక్టర్ సత్య ని చూడటానికి రాబోతున్నారని .. కానీ నాకర్థం కాలేదు .. ఇప్పుడు అర్థమయ్యింది

ఆ డాక్టర్ నువ్వేనని .. అంది రచన ..

ఏం ఆ అమ్మాయి కి ఏం జరిగింది ? అంది గిరిజ బాధగా ..

అమ్మా .. ఏం జరిగినా .. సరే .. అదంతా అయిపొయింది .. ఇప్పుడు అంతా జరిగేది శుభమే .. సత్య కి కొంచెం

బాలేదు .. అని విక్కీ వైపు తిరిగి .. అన్నయ్యా .. నువ్వు సత్యని బాగు చేస్తావుగా .. అంది రచన ముద్దుగా ..

ఎందుకు చేయను ? నా ముద్దుల చెల్లెలికి అంత సహాయం చేసిన ఆ అమ్మాయి కి తప్పనిసరిగా బాగవుతుంది రా ..

అన్నాడు విక్కీ .

వీళ్ళ కెదురుగా కూర్చున్న మురారిని చూసి .. మురారీ .. అన్నయ్య యు . ఎస్ లో పెద్ద డాక్టర్ .. సత్య కి తనే

ట్రీట్ మెంట్ చేస్తాడు .. అంది రచన .

థాంక్ యు .. విక్కీ .. అన్నాడు మురారీ .

ఇంతకీ మై బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ? వాడు బయటే ఉండిపోయాడా ? అని మురారిని అడిగాడు విక్కీ .

యశ్వంత్ , శివ బయటే ఉన్నట్టున్నారు .. పిలవనా ? అన్నాడు మురారి లేస్తూ ..

వద్దొద్దు .. వాడే వస్తాడు .. ఇడియట్ .. అని గిరిజ వైపు తిరిగి ,అమ్మా .. స్వామీజీ పూజ ముగించుకు వచ్చేలోపు

నేను , నువ్వు ఫ్రెష్ అయిపోతే బెటర్ కదా .. అన్నాడు విక్కీ .

అవును .. అని సరస్వతి వైపు చూసి .. సరస్వతీ .. నువ్వు గది సిద్ధం చేసి ఉంచావుగా .. అంది రచన .

అవునమ్మా .. ఆ మూల గది .. అన్నయ్య గారు వస్తున్నారని తెలీక గది సిద్ధం చేయలేదమ్మ .. అంది సరస్వతి .

ఏం ఫర్వాలేదు .. విక్కీ మా గదిలో ఉంటాడు .. అన్నాడు యశ్వంత్ ఆ హాల్ లోకి ప్రవేశిస్తూనే ..

హే ఇడియట్ .. ఇంతసేపు బయటే ఉండిపోయావెం ? అన్నాడు విక్కీ యశ్వంత్ ని చూస్తూనే ..

సారీ విక్కీ .. పద గదిలోకి ముందు ఫ్రెష్ అవుదువ్ గానీ .. తర్వాత స్వామీజీ ని కలుద్దురు .. ఆయన గుడిలో

ఉన్నారు .. అని విక్కీ భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్తుండగా .. యశ్ .. అని పిల్చింది రచన .

ఆమె వైపు ప్రస్నార్థకంగా చూశాడు యశ్వంత్ .

సరస్వతీ .. నువ్వు అమ్మని తీసుకెళ్ళు .. అని యశ్వంత్ కేసి నడిచింది రచన .

శివ వచ్చి .. మీరు పదండి .. నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని గదిలోకి .. అని విక్కీ ని వారి గది లోకి తీసుకు

వెళ్ళాడు .

ఏంటి ? అని వచ్చిన యశ్వంత్ ని చూసి .. నువ్వు చాలా బిజీ అయిపోయావ్ యశ్ .. అంది బుంగమూతి పెట్టి ..

రచన .

మేడం గారూ .. మా బావమరిది వచ్చాడు .. కొంచెం మంచి చేసుకోవాలిగా .. లేకుంటే పిల్ల నివ్వడు .. అసలే చిన్న

నాటి ఫ్రెండ్ .. చెల్లెల్ని ప్రేమించానని తెలిస్తే శత్రువై పోతాడేమో .. ఇక హారర్ స్టొరీ ముగించి లవ్ స్టొరీ లోకి వెళ్ళాలి

కదా .. అన్నాడు కొంటె గా కన్ను గీటుతూ .. యశ్వంత్ .

హు .. బావుంది .. అయితే మా అన్నయ్య కి కాకా పడతావన్న మాట .. ప్రయత్నించు .. నాకేం ఫర్వాలేదు ..

అంది తానూ తమాషాగా .

ఆహా .. పీత కష్టాలు పీతవి .. అన్నాడు యశ్వంత్ .

పో యశ్ .. నేనీ రోజు చాలా సంతోషం గా ఉన్నాను .. అందుకే మన విషయం కూడా అమ్మ తో చెప్పేయనా ?

అంది ఎర్రబడిన వదనం తో రచన

అయ్యో .. వద్దు రచనా .. తొందర పడకు .. ఈరోజు కార్యక్రమం అంతా సవ్యంగా అయిపోనీ .. ఈ హడావుడి ముగిసి

పోనీ .. అన్నాడు యశ్వంత్ .

నువ్వేగా అన్నావు ? హారర్ అయిపొయింది .. ఇంకా లవ్ స్టొరీ మొదలు .. అని .. అంది బుంగమూతి పెట్టి రచన .

అవును .. ఈరోజు తో ఈ హరెర్ స్టొరీ కి శుభం కార్డు పడాలి కదా .. ఈ ఒక్క రోజు ఆగు .. అన్నాడు యశ్వంత్ .

సరే .. నీ ఇష్టం .. అంది చిన్నబోయిన మొహం తో రచన .

డల్ గా ఉండకు .. ప్లీజ్ .. తెలుసుగా .. ఈరోజంతా నువ్వు సంతోషంగా ఉండాలి .. బోలెడు పని ఉంది .. మరి నేను

వెళ్ళనా ? అన్నాడు యశ్వంత్ ..

అలాగే నంటూ తల ఊపింది రచన . యశ్వంత్ గదిలోకి వెళ్లిపోతుంటే మనసులో అనుకుంది " నేను బాగానే ఉన్నా

యశ్ .. కానీ నువ్వే ఏదో కలవరం గా ఉన్నావని పిస్తుంది .. కానీ ఆ విషయం నాదగ్గర ఎందుకు దాయాలను కుంటు

నావో .. అర్థం చేసుకోగలను.. నువ్వు హ్యాపీ గా ఉన్నప్పుడే అమ్మతో , అన్న తో మన విషయం చెబుతాను  ".

ఇంకా ఉంది 

ఈరోజుతో 250 భాగాలు పూర్తి చేసుకుంది రుధిర సౌధం . ఇదంతా నా ప్రయత్నమే కాదు .. ఆదరిస్తున్న పాఠకుల అభిమానం . 
ధన్యవాదాలు మీ అందరికీ .. 

                                                                                      - రాధిక 

Monday, 22 September 2014

రుధిర సౌధం 249భయం ఏమీ లేదా రచనా ? అంది భయం గా గిరిజ .

 తల్లి వైపు చిరునవ్వుతో చూస్తూ .. ఈరోజు ఉదయం అమ్మవారి గుడిలో దీపాలు వెలిగించి వచ్చానమ్మా ... అంది

రచన .

గిరిజ నమ్మలేనట్టు చూసింది కూతురివైపు ..

అవునాంటీ .. అందరం పూజ ముగించుకుని వచ్చాం .. వెంటనే మీరు రాబోతున్నారని స్వామీజీ చెప్పారు ..

అన్నాడు యశ్వంత్

మరి వైజయంతి .. అంది గిరిజ వణుకుతున్న స్వరంతో ..

ఆమె నోటి వెంట వైజయంతి పేరు వినగానే .. టక్కున ఆ చెట్టు వైపు చూశాడు యశ్వంత్ .. వైజయంతి కనబడ లేదు

అతని కళ్ళు చుట్టూ చూశాయి .. ఆమె కనబడలేదు .. చిన్నగా నిట్టూర్చాడు యశ్వంత్ .

ఇప్పుడు అలాంటి భయాలు ఏమీ లేవమ్మా ? ఇక మహల్ మనదే .. చూడు ఇంత మంది ఉన్నాం మహల్లో అంది

ఆప్యాయంగా తల్లి భుజం మీద చేయి వేసి రచన.

అవునమ్మా ? ఇప్పుడీ వాతావరణం చూస్తుంటే ప్రసాంతంగా ఉంది .. అయినా స్వామీజీ ఇక్కడే ఉన్నారు కదా ..

ముందు వెళ్లి ఆయన్ని కలుద్దాం పదమ్మా .. అన్నాడు విక్కీ .

అవును ఇదంతా వారి దయే .. పదండి వెళ్దాం .. అంది గిరిజ ..

వీరందరినీ చూస్తూ నవ్వుతూ నిలబడ్డ శివ , మురారి లని గిరిజకి , విక్కీ కి పరిచయం చేసింది రచన .

అందరూ మహాల్లోకి నడిచారు .. యశ్వంత్ , శివ తప్ప .

యశ్ .. ఆ చెట్టు దగ్గర వైజయంతి లేదు .. అన్నాడు మెల్లిగా శివ .

దానర్థం ఆమె ఎక్కడికో వెళ్ళిపోయిందని కాదు శివా .. మనం ఆమె ని చూడలేక పోతున్నామని .. ఇప్పుడు

వైజయంతి ఆలోచన ఏమిటో .. అన్నాడు యశ్వంత్ సాలోచన గా .

నిజమే .. యశ్ ... రచన అమ్మగారి కళ్ళలో ఎంత భయం కనిపించిందో .. సమస్య ఇంకా పరిష్కారం కాలేదని తెలిస్తే

ఈ మహల్లో ప్రశాంతత  మళ్ళి కోల్పోతుంది యశ్ .. అన్నాడు శివ .

శివా .. స్వామీజీ చెప్పిన వన్నీ నిజమవుతున్నాయి .. ఆయన మళ్ళి సమస్య ఉంది అని చెప్పారు .. తెల్లవారే

లోపు ఏదైనా జరగొచ్చని అనుకున్నాను .. కానీ ఇప్పుడు టైం 5 . 30 .. తెల్లారి పోయింది .. సో .. రాత్రే కాదు

వైజయంతి పగలు కూడా సిద్ధంగా .. అవకాశం కోసం చూస్తూ ఉంటుంది .. మనం అప్రమత్తంగా ఉండి తీరాలి

అన్నాడు    యశ్వంత్ .

అవును యశ్వంత్ .. నాకెందుకో గోపాలస్వామి మాటలు గుర్తుకొస్తున్నాయి .. వైజయంతి ని రచన స్వయం గా

లోపలికి ఆహ్వానిస్తే వైజయంతి లోపలికి రాగలదు అని .. అన్నాడు శివ .

అవును .. కానీ రచన వైజయంతి లేదనే అనుకుంటుంది .. ఉన్నా తనెందుకు ఆహ్వానిస్తుంది చెప్పు ? అన్నాడు

యశ్వంత్ .

లేదు యశ్వంత్ .. ఇందులో ఏదో మతలబు ఉంది .. మనకి అర్థం కావడం లేదు గానీ .. ఏదేమైనా మనం రచన కే

తెలియకుండా రచన ని కనిపెట్టుకుని ఉండాలి .. ఏవిధమైన తప్పు జరగకూడదుగా .. అన్నాడు శివ .

సాలోచనగా తల ఊపాడు యశ్వంత్ .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 21 September 2014

నువ్వు


కొమ్మల్లో కోయిలా .. కూసేటి వేళలా ..

గల గల గోదారి . .. నవ్వేటి  వేళలా ..

తెరచాప చిరుగాలికి రాగం తీసేవేళా  ..

ఆమని పరిమళాలు వీచేటి వేళల ..

మధురస ఊహలెన్నో మనసును తాకేవేళ ..

నీ పేరు గుర్తు కొచ్చే తేనె తీపి మాటలా ..

నీ ఊసులెన్నో చెప్పే అల్లి బిల్లి ఆశలా ..

గిల్లి గిల్లి చంపెస్తాయే నీ అల్లరి తలపులా ..మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 19 September 2014

రుధిర సౌధం 248

రచన , యశ్వంత్ తదితరులు మహల్ వెనుక భాగం నుంచి మహల్ ముందు భాగం కి చేరుకునేసరికి చీకట్లు చీల్చు

కుంటూ కార్ ఫ్లడ్ లైట్స్ కాంతి మహల్ గేటు పై పడింది ..

రచన .. మనసు సంతోషం లో తేలియాడుతుంది .. శివ ఫాస్ట్ గా వెళ్లి గేటు ఓపెన్ చేశాడు .. కార్ గేటు దగ్గరకి

చేరుకున్నాక ఎందుకో ఆగింది .. శివ కార్ దగ్గరికి వెళ్ళాడు .. లోపల్నుంచి గిరిజ .. గ్లాస్ దించి .. మేము బొంబాయి

నుండి వస్తున్నాము .. రచన ఉందా ఇక్కడ ? అని అడిగింది సంకోచం గా ..

శివ నవ్వుతూ .. మేము మీకోసమే ఎదురుచుస్తున్నాము ఆంటీ .. అదిగో అటు చూడండి .. అని రచన వైపు చేయి

చూపాడు  శివ .

శివ చూపించిన వైపు చూసిన గిరిజ .. పరుగున వస్తున్న రచన ని చూసి ఆశ్చర్యపోయింది .. ఆమె ఆ దుస్తుల్లో దేవ

కన్యలా ఉంది .. " వస్తుంది నా కూతురేనా ? " అంది స్వగతం గానే .

అనుమానం లేదు ఆంటీ .. తను ఈ కోట కి యువరాణి .. పదండి .. అని ముందుకి నడిచాడు శివ .. కార్ డ్రైవర్ కి

లోపలికి రమ్మని సైగ చేస్తూనే ..


గిరిజ వడివడిగా నడిచి గేటు దాటుకుని లోపలికి నడిచింది .. ఈలోపు .. పరుగున వచ్చిన రచన .. అమ్మా .. అంటూ

హత్తుకుంది .. ఆప్యాయంగా తన కూతుర్ని గుండెలకి అడుముకుంది గిరిజ .. వాళ్ళిద్దరి కళ్ళల్లోంచి ఆనంద

భాష్పాలు పొంగి ప్రవహిస్తున్నాయి .. ఈలోపు డ్రైవర్ కార్ ని మహల్ ప్రాంగణం లో పార్క్ చేశాడు ..

యశ్వంత్ నవ్వుతూ రచన , గిరిజల దగ్గరి కొచ్చాడు ..

ఆంటీ .. మీ కూతురు విజయం సాధించింది .. కానీ ఆ సంతోషపు సంబరాల్లో మీరు తనతో లేరని బాధ పడింది ..

అమ్మ కదా మీరు .. తన మనసు గ్రహించినట్టే ఇక్కడికి సమయానికి చేరుకున్నారు .. అన్నాడు యశ్వంత్ గిరిజ

పాదాలకి నమస్కరిస్తూ .. అతన్ని ఓ చేతితో దగ్గరికి తీసుకుని .. నువ్వు తనకి తోడుగా ఉన్నావు కదా యశ్వంత్ ..

ఇంకా నాకు భయం ఏముంది ? అంది ప్రేమగా రచన ని , యశ్వంత్ ని చూస్తూ ..

ఏ కోతీ .. నేనూ వచ్చాను నన్నసలు చూడనే లేదు నువ్వు .. అన్న మాటలు విని వెనక్కి తిరిగారంతా .. అక్కడ

చిరునవ్వుతో విక్కీ నిలబడి ఉన్నాడు ..

విక్కీ ని చూడగానే .. సంతోషంతో కూడిన  ఆశ్చర్యం తో .. అన్నయ్యా .. అని వెళ్లి అమాంతంగా అతడిని హత్తుకుంది

రచన ..

ఏంటిరా ఇదంతా ? ఏంటీ అవతారం ? అన్నాడు ఆమె వైపు ఆశ్చర్యం గా చూస్తూ విక్కీ .

ఐ యాం ద ప్రిన్సెస్ అన్నయ్యా .. అంది తమాషా గా .. రచన .

హే విక్కీ .. అంటూ వచ్చి చేయి కలిపాడు యశ్వంత్ .

యశ్ .. నువ్వు ఇక్కడే ఉన్నావు .. దీన్ని పట్టుకుని వచ్చేయక .. నాకు బోర్ కొట్టింది .. అందుకే అమ్మని పట్టుకుని

వచ్చేసాను .. అన్నాడు విక్కీ .

చాలా మంచి పని చేసావు విక్కీ .. వుయ్ ఆర్ వేరి హ్యాపీ .. అన్నాడు యశ్వంత్ .

రచనా .. ఇదంతా ఎలా ? మహల్ రూపు రేఖలే మారిపోయాయి .. ఇదంతా నమ్మశక్యం గా లేదు నాకు .. అంది

గిరిజ  వీరి వద్దకి వచ్చి ..

ముందు మీ ఇద్దరూ లోపలికి పదండి .. అన్నీ అవే అర్థ మవుతాయి .. అంది రచన ..

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 18 September 2014

రుధిర సౌధం 247ఆ .. అవును .. ఏంది భయపడతున్నారా ? ఆ రోజులు పోయినాయి .. యువరానమ్మ వచ్చింది గదా .. అదే మా

ధాత్రమ్మ .. చాలా మంచిది .. ఈరోజు ఊరందరికీ భోజనాలు ఆడే .. అన్నాడు అతడు .

సరే .. ధన్యవాదాలు .. అన్నాడు విక్కీ .

అతడు చిరునవ్వుతో ముందుకి సాగిపోయాడు ..

అమ్మా .. ధాత్రమ్మ అంటున్నాడు .. బహుశా మన రచనే అయుండొచ్చు .. కానీ మహల్ లో ఉన్నారంటే ఆశ్చర్యం

గా ఉంది .. అన్నాడు విక్కీ .

విక్కీ .. నాకు మాత్రం సంతోషం గా ఉంది .. చూస్తుంటే రచన అనుకున్నది సాధించింది అనిపిస్తుంది .. పద విక్కీ ..

మహల్ కె పోదాం .. అంది గిరిజ .

విక్కీ కార్ లో కూర్చున్నాక .. స్ట్రెయిట్ గా పోనీ .. అంది గిరిజ .

అమ్మా .. మనం మహల్ కి వెళ్తున్నాం .. అతడి మాటలు నమ్మి .. ఇది కర్రెక్టేనా ? అన్నాడు సంకోచంగా విక్కీ .

విక్కీ .. ఊరంతా అలంకరించి ఉంది గమనించావా ? అంటే ఏదో సంతోషం ఈ గ్రామస్తులని చేరింది .. అది నీ చెల్లెలే

అని నా నమ్మకం .. అనుమానం పెట్టుకోకు .. వెళ్తున్నాం కదా .. అంది గిరిజ ఉత్సాహం గా ..

 కార్ మహల్ కేసి సాగిపోయింది ..

                                                         **********************

ఆలయం నుండి వెలుపలకి రాగానే ఎదురుగా ఉన్న స్వామీజీ పాదాలకి సంతోషం గా నమస్కరించింది రచన .

తల్లీ .. నీ సంతోషాన్ని అర్థం చేసుకోగలను .. మనో వాంఛా ఫల సిద్ధి రస్తు .. అని దీవించారు స్వామీజీ ..

స్వామీజీ .. నాన్నగారికి ఇదంతా తెలుస్తుంది కదా .. అంది రచన ..

తప్పక తెలుస్తుంది తల్లీ .. ఈరోజు నువ్వు చేస్తున్న ఈ కార్యం నీ పూర్వీకులు అందరికి శాంతి నిస్తుంది .. ఈ ఊరు

బాగుపడుతుంది .. అన్నారు స్వామీజీ ..

స్వామీజీ .. రచన కె కాదు మా అందరికి కూడా ఇది జీవితాంతం మరవలేని జ్ఞాపకం .. అన్నాడు మురారి ..

అవును .. మా మనస్సులో ఈ అదృష్టానికి సంతోషం పొంగి పోర్లుతోంది .. అన్నారు శివ ,యశ్వంత్ .

నిజమే .. ఈ తల్లి మనసులో ఇంకా ఏదో చిన్న వెలితి .. కదూ .. అన్నారు స్వామీజీ ..

అయ్యో .. అదేం లేదు స్వామీజీ .. అంది కంగారుగా రచన .

స్వామీజీ చిరుమంద హాసం తో .. నా ముందరే అబద్ధం చెబుతున్నావా తల్లీ .. ఆ తల్లి కోసం ఇంత చేశావు .. ఆ తల్లి

నిన్ను నీ తల్లి ని దూరంగా ఉంచుతుందా ? వెళ్ళు .. వెళ్లి గిరిజా దేవిని లోపలకి ఆహ్వానించు .. అన్నారు స్వామీజీ .

స్వామీజీ .. ఏమంటున్నారు మీరు ? ఆశ్చర్యంగా  అడిగింది రచన .

శివ , యశ్వంత్ , మురారిలు కూడా అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు ..

స్వామీజీ ఎప్పుడన్నా అబద్ధం చెప్పారా ? అనుమానం వద్దు వారిని ఆహ్వానిద్దాం పదండి .. అన్నాడు నవ్వుతూ

గోపాలస్వామి .

సంతోషం తో కళ్ళు చెమ్మగిల్లాయి రచన కి .. రచన భుజం మీద చేయి వేసి .. నువ్వు అమ్మవారి సన్నిధి లో అమ్మ

ఉంటే బావుండు ననుకున్నావు .. ఆ వైష్ణవీ మాత ఎంత దయగలదో చూడు .. పద రచనా .. వెళ్లి ఆంటీ ని లోపలికి

ఆహ్వానిద్దాం .. అన్నాడు యశ్వంత్ .

 కళ్ళు తుడుచుకుని ముందుకి  సంతోషం గా కదిలింది రచన .. అంతా మెయిన్ గేటు వైపు నడిచారు ..

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 17 September 2014

తల్లి గోదావరీ .

దివి నుండి భువికి వలస వచ్చిన విధంబుగా .. ..

ఇల నలవోకగా  కౌగిలించిన ప్రావాహిగా ..

దక్షిణ గంగగా .. పిలవబడేవు గా ..

ఉరుకుల పరుగుల  తల్లీ గోదారిగా ..

రాజ మహెంద్రిన అనంత వాహినిగా ..

హరిత సస్య ములకు నీవు హేతువుగా ..

ప్రవహించినావు జీవ జలధారగా ..

రాముని చరణములు తాకిన  పునీతగా ..

పొంగి పరవళ్ళు తొక్కేవు గౌతమీ రూపుగా ..

వరి ని పండించు గోదావరిగా ..

పచ్చని ప్రకృతి కి ఆలంబనగా ..

పాపి కొండల నడుమ పారాడు ముగ్ధగా

సాగేవు మును ముందుకే కడలి దిశ గా ..

తల్లి గోదావరీ .. సస్యశ్యామలము చేయగా ..

ఆంధ్ర నడిబొడ్డున కొలువు తీరావు స్వయముగా ..

అభివందనం తల్లి గోదావరీ ..

శుభ మంటూ దీవించగా  .. వరి చేలు పండించగా  ..

కరువు కాటకములకు తావివ్వక ..

ప్రవహించు .. ప్రవహించు గోదావరీ ..

తలవొంచి నిను కొలిచే చేలో వరీ ..

 చిరుగాలి వింజామరలు వీచగా .. తెరచాపలే చీరల్లె మారగా

ఉదయించు సూర్యుడే నిను చుంబించగా ..

ఎర్రబడిన వదనమే అలల రూపుగా ..

జీవనాధారమై .. జీవన రాగమై ..

నిలిచావే .. నిలిచావే గోదావరీ ..

పరుగుళ్లు పెట్టావే గోదావరీ ..

మా తల్లి గోదావరీ .. పుష్కర స్నానమే పుణ్యమేగా మరీ ........ 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 246


దీపాల కాంతుల్లో ధగ ధగాయ మానం గా వెలుగుతున్న ఆలయాన్ని మనసారా చూసుకుంది రచన . ముచ్చటగా

ఆమె వైపు చూశాడు యశ్వంత్ .

సంతోషం అంటే అర్థం ఈరోజే తెలిసినట్టుంది కదూ .. అన్నాడు ఆమె ని చూసి ..

ఆమె అందంగా నవ్వింది .. అతని కళ్ళలోకి చూస్తూ .. ఎదుటి వారి మంచి ని కాంక్షించి చేసే పని ఏదైనా సరే

విజయం సాధిస్తుంది యశ్ .. ఎందుకో ఈ క్షణం అమ్మ  ఎక్కువగా గుర్తొస్తుంది .. తను నాతో ఇప్పుడు ఉండి

ఉండుంటే బావుండు నని పిస్తుంది .. అంది రచన .

నిజమే .. ఆంటీ ఉండుంటే సంతోషం పట్టలేకపోయేవారు .. పోనీ ఈ కార్యక్రమం పూర్తి కాగానే వెళ్లి ఆంటీ ని

తీసుకువద్దాం.. అన్నాడు యశ్వంత్ .


ఊ .. అని మెల్లగా తలాడించింది రచన .

ఇంతలో గుడి నంతటినీ వీడియో తీసిన శివ , మురారి వీళ్ళ  ని చూసి .. రచనా .. ఇక వెళ్దామా ? అంతా మనకోసం

ఎదురు చూస్తూ ఉంటారు .. అన్నారు .

పద .. సాయంత్రం సహస్ర యాగం జరగాలి కదా .. ఆ ఏర్పాట్లు చూసుకోవాలి .. అని కూర్చున్న చోటినుండి లేచి

తన చేయి రచన కి అందించాడు . అతని చేయి పట్టుకుని లేచి నిలబడి  ఒకసారి అంతా తనివితీరా చూసుకొని ..

ఏమిటో .. ఇక్కడ్నుంచి వెళ్ళాలని పించడం లేదు .. అంది రచన .

మనం వెళ్తే స్వామీజీ వచ్చి ఏదో పూజ చేయాలన్నారు కదా .. వెళ్దాం రచనా .. అన్నాడు యశ్వంత్ .

సరే .. అని ముందుకి కదిలింది రచన ... ఆమెని అనుసరించారు మిగిలిన ముగ్గురూ ..

                                          *************************************

విక్కీ .. మనం ఊర్లోకి ప్రవేశించాం .. అంది గిరిజ కిటికీ లోంచి బయటికి చూస్తూ ..

మెల్లిగా చీకట్లు పల్చబడుతున్నాయి .. వెలుగు రాక మొదలయింది ...

అమ్మా .. రచన ఎక్కడుంటుంది ? ఏమైనా చెప్పిందా ? అన్నాడు విక్కీ తాను చుట్టూ చూస్తూ ..

తెలీదు .. అదేం చెబుతుందా ఏం ? అని .. డ్రైవర్ కాస్త పక్కగా ఆపు .. అంది గిరిజ .

కార్ ఓ పక్కగా ఆగింది .. ఎదురుగా చెంబు పట్టుకుని వస్తున్న ఓ వ్యక్తీ ని చూసి .. విక్కీ అతన్ని కాస్త అడుగు ..

రచన ఎక్కడున్నదీ చెబుతాడు .. అంది గిరిజ .

విక్కీ కార్ దిగి .. ఏమయ్యా .. అని అరిచాడు ..

అతడు విక్కీ ని ఎగాదిగా చూసి కార్ వైపు , కార్ లో ఉన్న గిరిజ వైపు చూసి .. పట్నమోల్లు .. అనుకుంటూ విక్కీ

దగ్గరికి వచ్చి .. ఏం కావాలె ? అన్నాడు ,

ఆ .. అదీ .. రచన .. రచన తెలుసా మీకు ? అన్నాడు విక్కీ సంకోచంగా .

రచనా .. ఆ పేరు తో ఎవరున్నరాబ్బ ఈ ఊళ్ళో .. అని అన్నాడు సాలోచన గా అతడు .

యశ్వంత్ .. యశ్వంత్ .. తెలుసా మరి ? అని అడిగింది గిరిజ కార్ లోంచే .

ఓహ్ .. మీరు యశ్వంత్ బాబు కోసం వచ్చారా ? ఆల్లంతా మహల్ కాడే ఉన్నారు .. ఈనాడు ఆడ పెద్ద పండగ కదా ..

మీరూ అందుగే వచ్చారా ? హుషారుగా ఎదురు ప్రశ్నించాడు అతడు .

మహల్ దగ్గరా ? ఆశ్చర్యంగా అడిగారు గిరిజ , విక్కీ ఒక్కసారిగా ..

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 16 September 2014

రుధిర సౌధం 245

I
ఆ ప్రమిద నిండుగా నేతిని పోసి ఒత్తి ని నేతిలో ముంచి దీపం వెలిగించింది రచన .. ఒక్కసారిగా ఆ ప్రాంగణ మంతా

వెలుగుతో నిండి పోయింది ..

జై వైష్ణవీ మాతా .. అని అరిచారు నలుగురూ ఏక కంఠం తో ..

అమ్మవారు జ్యోతిని దర్శించాక విగ్రహాన్ని యథాస్థితి కి తీసుకు వచ్చింది రచన .. ఆమె మనసంతా ఆనందం తో

నిండి పోయింది .. ఆ అఖండ జ్యోతి వెలుగులో అమ్మవారు వారిని చిరునవ్వుతో చూస్తున్నట్టు ఉంది ..

అందరూ సంతోషం గా అమ్మ కి నమస్కరించారు ..

రచనా .. ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా దీపాలు వెలిగించాలి .. అమావాస్య రోజే దీపావళి వస్తుంది .. కానీ ఏ పౌర్ణమి

వెలుగు నిoపకపోయినా  .. ఈ పౌర్ణమి మాత్రం ఈ మహల్ కి ఎప్పటికీ నిలిచిపోయే వెలుగు నిచ్చింది .. అన్నాడు

యశ్వంత్ తృప్తి గా అమ్మవార్ని చూస్తూ ..

మా నాన్న , మా పూర్వీకుల ఆత్మలు శాంతించి ఉంటాయి కదా యశ్వంత్ .. నా కళ్ళతో చూశాను వారి ఆత్మ

ఘోషించటం .. అంది రచన కళ్ళ నిండా నీళ్ళతో ..

తప్పకుండా రచనా .. బి హ్యాపీ .. కంట నీరు పెట్టాల్సిన సమయం కాదిది అన్నాడు యశ్వంత్ ..

రచనా .. ఇప్పుడు మేముకూడా దీపాలు వెలిగించవచ్చు కదా ఇక్కడ ? అని సంతోషం గా అడిగిన శివ ని చూసి

అవునన్నట్లు తల ఊపింది రచన .

వెంటనే దీపాలు వెలిగించటం లో  నిమగ్నమయ్యారు వారంతా ...


గుడి ప్రాంగణ మంతా దీపకాంతులతో దేదీప్యమానం గా వెలగసాగింది .. అదే సమయం లో మహల్ బయట చెట్టు

మీద కూర్చుని తగిన అవకాశం తో ఎదురు చూస్తున్న వైజయంతి ఆత్మ ఆ వెలుగు ని భరించలేక హృదయ

విదారకం గా ఏడ్చింది ..

మహల్ అంతా ఓ చిత్రమైన కాంతి నిండి పోవటం తో .. స్వామీజీ .. మహల్ అంత టా ఏదో వెలుగు నిండి పోతోంది  ..

పరుగున వచ్చి అంది స్వామీజీ తో సంతోషం గా సరస్వతి .

మహల్ అంతటా నిండిన ఆ కాంతిని చూసి మందహాస వదనం తో .. ఆలయం లో అఖండ జ్యోతి వెలిగింది ..

అమ్మవారు మహల్ కి తిరిగివచ్చిన శుభ సూచన ఇది .. అన్నారు స్వామీజీ ..

గోపాల స్వామీ , సరస్వతి ఇద్దరు స్వామీజీ వైపు చిరునవ్వుతో చూశారు ..

సరస్వతి .. వెళ్లి ఓ గది ని సిద్ధం చెయ్యి .. అయినవారు వస్తున్నారు .. అన్నారు స్వామీజీ ..

అలాగే స్వామీ .. అని అక్కడ్నించి కదిలింది సరస్వతి .

ఎవ్వరు స్వామీ ? అని అడిగాడు గోపాలస్వామి .. వినయంగా ..

గిరిజా దేవి .. తన బిడ్డతో పాటూ మరికొద్ది సేపటిలో ఇక్కడికి చేరుకోనుంది .. ఇక్కడి మంచి చెడులను

అనుభవించడానికి ఆమె కీ హక్కు ఉన్నది కదా .. అన్నారు స్వామీజీ ..

సంతోషం స్వామీ .. రచనమ్మ మనసులో కూడా ఆమె తల్లి ఇక్కడ ఉంటే బావుండునన్న భావన దాగి ఉన్నది ..

అన్నాడు గోపాలస్వామి .

స్వామీజీ మందహాసం తో తిరిగి ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారు

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 15 September 2014

రుధిర సౌధం 244

వావ్ .. ఇది నిజంగా అద్భుతమే .. అన్నాడు యశ్వంత్ ..

ఆ తరువాత .. ఆసక్తిగా అడిగారు శివ , మురారి ఆసక్తిగా ..

ఆ తరువాత .. ఇంకేముంది .. విగ్రహాన్ని యథా స్థానానికి తెచ్చే ప్రక్రియలో .. విగ్రహాన్ని పడమట దిక్కుని చూసే

విధం గా తిప్పవలసి ఉంటుంది .. అటు చూడండి .. విగ్రహం పక్కకి  వైపు .. అతి పెద్ద రాతి ప్రమిద ఉంది .. మనం

దానిలో మొట్ట మొదటిగా దీపం వెలిగించడానికే నెయ్యి ని తీసుకువచ్చాం .. అది ఎంతో కాలం నుండి అఖండ జ్యోతి

గా వెలిగింది .. ఆ జ్యోతి ఆరిపోయాకే .. ఈ మహల్ కి చెడ్డ రోజులు వచ్చాయి .. అందుకే ఆ శ్లోకం లో కూడా

పడమరని చూసిన వాలుజడ కనబడుతుంది .. అంటే అమ్మవారి వెనుకభాగం .. ఉత్తరానికి తిప్పగానే ఆ జ్యోతి ..

మళ్ళి తూర్పు చూడటమంటే .. విగ్రహం యథాస్థితి కి వస్తుందన్న మాట .. ఈ ప్రక్రియ లో ఈ వాటర్ అంతా విగ్రహం

కింద ఉన్న సెలయేటి లోకి చేరుకుంటుంది .. నీరు అంతా పోయాక విగ్రహం యథా స్థితి కి వచ్చినప్పుడు రంధ్రాలు

మళ్ళి మూయ బడతాయి .. అంది రచన విగ్రహం వైపు చూస్తూ ..
చాలా బాగా అర్థమైంది నీకా శ్లోకం .. నీ తెలివి తేటలు అమోఘం .. అన్నాడు శివ .

ఈ విగ్రహాన్ని మనం కదపగలమoటావా ? అన్నాడు మురారి ..

ఇంత వరకూ వచ్చాక అనుమానం ఎందుకు ? మంచి పనికి ఆలస్యం పనికి రాదు .. అని రచన వైపు చూసి ..

విగ్రహాన్ని మనం తాక వచ్చు కదా ? అని అడిగాడు యశ్వంత్ .

యశ్వంత్ విగ్రహాన్ని నేను మాత్రమే కదపగలను .. మీరిక్కడే ఉండండి .. అని ఆమె ముందుకి వంగి గర్భగుడి

ద్వారానికి  నమస్కరించి  లోపలికి ప్రవేశించింది .. అప్పుడు పడింది ఆమె దృష్టి అమ్మవారి మెడలో ఉన్న హారం

మీద .. ఈ హారమే అనుకుంటా వీరస్వామి అడిగింది .. అనుకొని విగ్రహం కి నమస్కరించి ఆమె హారం

తీయబోతుండగా  ఆమె ఉద్దేశ్యం అర్థమైన వాడిలా .. రచనా .. ప్లీజ్ .. ఈరోజుకి ఉండనీ ,.. ఆ హారాన్ని .. ఈరోజు

ఆమె నుండి ఆ హారాన్ని దూరం చేయకు అన్నాడు యశ్వంత్ .

ఆమె యశ్వంత్ వైపు తిరిగి .. కానీ యశ్వంత్ .. అది .. అంది సందేహంగా రచన .

రచనా .. వద్దు .. అంతా మంచే జరుగుతుంది .. ఇప్పుడు వేరోకరికోసం ఆలోచన వద్దు .. హారాన్ని ఉండనీ ..

అన్నాడు శివ ..

అలాగేనని తల ఊపి అమ్మ కి మనసారా నమస్కరించి .. ఆ శ్లోకాన్ని చదువుతూ విగ్రహాన్ని కుడివైపు కి తిప్పింది .

రచన చెప్పినట్టే విగ్రహం అటువైపు తిరిగింది .. అంత వరకూ ఉన్న విగ్రహం పక్కకి జరగగానే రంధ్రాలు బయట

పడ్డాయి .. కింద ప్రవహిస్తున్న అంతర్వాహిని పరవళ్ళ శబ్దాలు ఆమెకి స్పష్టం గా వినిపించాయి .. మెల్లిగా  వాళ్ళ

చుట్టూ ఉన్న నీరంతా ఆ రంధ్రాల గుండా అంతర్వాహినిలో కలసి పోయింది ..

అబ్బురంగా చూశారు అంతా ఆ దృశ్యాన్ని ..

వెంటనే విగ్రహాన్ని పడమటికి తిప్పింది రచన .. అమ్మవారి వాలుజడ సుందరం గా కనిపించే సరికి ఆ ముగ్గురూ

మనస్ఫూర్తి గా నమస్కరించారు ఆమె కి .

రచన వెంటనే అమ్మవారిని ఉత్తరానికి తిప్పింది .. ఉత్తరాన ఉన్న రాతి ప్రమిదలో కూడా అంత వరకు ఉన్న నీళ్ళు

మాయం మయ్యాయి .. యశ్వంత్ బాగ్ లోంచి నెయ్యి ప్యాకెట్ తీసి ఆమెకి అందించాడు .. శివ ఒత్తులు ఇవ్వగా ..

మురారి అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు ..

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 12 September 2014

రుధిర సౌధం 243


ఎదురుగా ముగ్ధ మోహన సౌందర్యం పాల రాతి శిల్పం ఆకృతి లో .. ముజ్జగాలను ఏలే తల్లి ,దశాబ్దాలుగా అజ్ఞాత

వాసం చేస్తున్న జగత్జనని పరమానంద భరితురాలై చిరుమంద హాసం తో దర్శనమిచ్చింది ..

కనులెదురుగా కనిపించిన వైష్ణవీ మాతని చూసిన వారి కనులు ఆనంద భాస్పాలను వర్షిస్తుండగా వారి చేతులు

అప్రయత్నం గా అమ్మవారికి నమస్కరించాయి ..

రచన కళ్ళు ఆర్పకుండా ఆ అమ్మ ని చూస్తుంది .. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి .. ఆమె ని అలానే చూస్తూ ఓ పది

నిమిషాలు గడిపేశారు వారంతా ..

ముందుగా తేరుకున్న యశ్వంత్ .. రచన వైపు చూశాడు .. ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకున్న అతడు , ఆమె

భుజం పై చేయి వేసి .. రచనా .. కంగ్రాట్స్ .. నీ కల నెరవేరింది .. అమ్మ కొన్ని ఏళ్ళ తర్వాత మనకే దర్శన

మిచ్చింది .. మొట్ట మొదటగా మనకే .. ఈ అదృష్టాన్ని మేమంతా నీ వల్లే పొందాము .. అన్నాడు ఆర్ద్రతగా .

అతని మాటలకి చిన్నగా తలూపి మళ్ళి అమ్మ వైపు చూస్తూ ఉండి పోయింది రచన .

నిజమే యశ్వంత్ .. నిజమైన ఆనందాన్ని ఈరోజే అనుభవిస్తున్నట్టు ఉంది .. మన కళ్ళు ఇంతకన్నా సౌందర్యాన్ని

ఇంకెన్నడూ చూడలేదు అనిపిస్తుంది .. అన్నాడు మురారి ఆనందం తో పూడుకు పోతున్న గొంతుతో ..

అవును .. ఈ తల్లి కి ఎంత దయ ? మనకే ఈ అదృష్టాన్ని ప్రసాదించింది .. ఈ జన్మ కి ఇది చాలు .. అన్నాడు శివ .

అమ్మవారింకా నీటిలోనే ఉంది .. ఈ నీరంతా ఎలా పోతుంది .. ? అనుమానం గా అడిగాడు యశ్వంత్ .

నాకు తెల్సు యశ్వంత్ .. నేను ఆ గ్రంథం చదివాను .. దానిలో ఓ చిన్న క్లూ ఉంది .. అది ఒక శ్లోకం .. బాగా

ఆలోచిస్తే  గానీ అర్థం కాదు .. అంది రచన వీరి వైపు తిరిగి .

ఏంటి ఆ శ్లోకం అర్థం ? ముగ్గురూ ఒక్కసారే అడిగారు ..

ఆ శ్లోకం అర్థం ఏంటంటే .. దక్షిణాన్ని చూసిన నాడు సోదరి ని తనలో ఇముడ్చుకొనును .. పడమట ని చూడగానే

వాలు జడ సొగసుని  చూపు కొనును .. ఉత్తరాన్ని చూడగానే జ్యోతిలా వెలుగు చూపు .. తూరుపు ని చూడగానే

సవతి నొదిలి దయను చూపు .. అని .. అంది రచన .

ఏం అర్థం కాలేదు .. అంటూ తల గోక్కున్నారు .. శివ , మురారి .

ఇందులో ఏదో నిగూ ఢమ్ గా చెప్పబడి ఉంది .. అన్నాడు యశ్వంత్ .

అవును .. అది ఆ విగ్రహం లోనే ఉంది రహస్యమంతా .. అంది రచన .

స్పష్టం గా చెప్పు రచనా .. అన్నాడు మురారి .. ఆసక్తిగా చూసాడు శివ .

అసలు రహస్యం ఏంటంటే .. ఈ విగ్రహం కదులుతుంది .. అంది రచన .

వ్వాట్ ? అన్నారు ముగ్గురూ ఒక్కసారిగా ..

అవును .. అప్పటి శిల్ప కారుల నైపుణ్యం ఇది .. ఇది పాలరాతి శిల్పం ఐనప్పటికీ ఇందులో మధ్యలో సాల గ్రామ

శిల ఉంది .. అది ఒక ఇనుము ఊచ మాదిరిగా .. విగ్రహాన్ని మరియు విగ్రహ ప్రతిష్ట చేసిన పీఠం కి అది  కలప బడి

ఉంది .. కాబట్టి విగ్రహాన్ని నాలుగు దిక్కులు చూస్తున్నట్టు గా మనం విగ్రహాన్ని గుండ్రం గా తిప్పవచ్చు ..

అంటే కరెక్ట్ గా విగ్రహాన్ని కుడి వైపు కి తిప్పగానే అంటే దక్షిణ దిశకి .. విగ్రహం దక్షిణ దిశ ని చూస్తుంది .. అక్కడే

రహస్యం ఉంది .. విగ్రహం కింద కొన్ని రంధ్రాలు ఉన్నాయి .. విగ్రహం దక్షిణ దిశకి తిప్పగానే ఆ రంద్రాలకి అడ్డు తొలిగి

ఆ రంధ్రాల గుండా ఈ నీరంతా వెళ్ళిపోతుంది .. ఎందుకంటే .. నీటిని గంగ అంటారు .. గంగాదేవి అమ్మకి సోదరి వరస

అని వారి వైపు చిరునవ్వుతో చూసింది రచన .

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది