నిజమా యశ్వంత్ ? ఆశ్చర్యం గా అడిగాడు శివ .
అవును శివా .. వీరాస్వామి మరణిస్తూ చెప్పిన మాటలివి .. వైజయంతి చాలా శక్తివంత మైంది ఇప్పుడు ..
వీరస్వామి నుండి తాంత్రిక శక్తి గ్రహించేసింది .. రత్నం రాజు ని , వీరస్వామి ని ఘోరం గా చంపేసింది .. బాధగా
అన్నాడు యశ్వంత్ ..
ఓహ్ గాడ్ .. రచన కి తెలిస్తే .. తనకి ఈ విషయం తెలియడం అంత మంచిది కాదు .. అన్నాడు శివ .
అవును .. ఈ పూజ మనసులో ఎటువంటి కలవరం లేకుండా చేయాల్సి ఉంటుంది .. అన్నాడు గోపాల స్వామి .
అయితే వైజయంతి మహల్ దగ్గరే ఉండుంటుంది .. ఏం జరుగుతుందో అక్కడ ? ఆందోళన గా అన్నాడు శివ .
శివ .. మహల్ దగ్గరికి వచ్చేశాం .. చూస్తుంటే అంతా ప్రశాంతం గానే ఉన్నట్టుంది .. అన్నాడు యశ్వంత్ .. ముందుకి
చూస్తూ ..
అవును .. మహల్ దగ్గర ఎవ్వరూ కనబడటం లేదే .. అన్నాడు శివ .
టైం ఎంత అయ్యింది శివా ? అని అడిగాడు యశ్వంత్ సాలోచనగా ..
2 గం సరిగా .. అన్నాడు శివ .
ఇక అందరూ మెల్లిగా లేస్తారు శివా .. మహల్ లోకి వైజయంతి రాలేదు .. ఈ చుట్టు పక్కలే ఎక్కడో ఉండి ఉంటుంది
మనం కేర్ఫుల్ గా ఉండాలి .. అన్నాడు యశ్వంత్ . వెహికల్ ఓ పక్క గా ఆపుతూ ..
శివ గారూ .. మీరు ఈ విగ్రహం పట్టుకోండి .. మిగతా సామాను నేను పట్టుకుంటాను .. అని ఓ పసుపు రంగు వస్త్రం
తో కప్పబడిన విగ్రహాన్ని ఇచ్చాడు శివ చేతికి గోపాలస్వామి . శివ దాన్ని పట్టుకొని దిగాడు .
యశ్వంత్ దిగి గోపాల స్వామి కి మిగతా సామాను దించటం లో సహాయం చేస్తుంటే శివ చుట్టూరా పరికిస్తూ
ఉన్నాడు . ఓ చోట శివ చూపు అప్రయత్నం గా ఆగిపోయింది .. మహల్ ప్రహరీ గోడ కి 2 మీటర్ ల దూరం గా ఉన్న
ఆ చెట్టు కొమ్మ పై .. ఓ తెల్లని ఆకారం .. శరీరం నుండి ముక్కలూడిపోతున్న మాంసపు ముద్దలా భయంకరంగా
వీరి వైపే చూస్తుంది .. ఆమె వైజయంతి అని అర్థం అయ్యింది శివ .. అతని ఒళ్ళు చిన్నగా ఒణక సాగింది ..
మెల్లిగా .. యశ్ .. యశ్ .. అని గొణిగాడు శివ .
ఏంట్రా ? అంటూ శివ వైపు చూసి .. అతడి చూపు వేరొకచోట ఉండటం గమనించి అటుకేసి చూశాడు యశ్వంత్ .
గోపాలస్వామి కూడా చూశాడు .. ఆమె రూపం యశ్వంత్ కి కూడా ఒళ్ళు గగుర్పోడిచేలా చేసింది .. కాళ్ళు ఊపు
తున్నట్టు ఉంది .. కానీ కాళ్ళ భాగం లో కాళ్ళు లేవు .. ఆమె చేతులు చెట్టు ప్రతి కొమ్మని పెనవేసుకొని ఉన్నాయి .
ఆమె కళ్ళు అగ్ని గోళాల్లా ఉన్నాయి ..
ఈమె .. ఆమే .. అన్నాడు గోపాలస్వామి .
అవును .. మనకోసమే ఎదురు చూస్తున్నట్టు ఉంది .. అన్నాడు యశ్వంత్ చూపు పక్కకి తిప్పి ..
ఏదో గర్ల్ ఫ్రెండ్ ఎదురుచూస్తుంది అన్నట్టు అంటున్నావు యశ్వంత్ .. దాని రూపం చూడు .. ఎంత భయంకరం గా
ఉందో .. అన్నాడు శివ .
మనం ముందు లోపలికి వెళ్దాం పదండి .. అది అక్కడే ఉంది అంటే మనం ఇప్పుడు రక్షణ వలయం లో ఉన్నట్టే ..
అన్నాడు గోపాల స్వామి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a Comment