హ.. అని ఆ ప్రేతం వైపు చూస్తూనే లోపలికి నడిచాడు యశ్వంత్ . శివ , గోపాలస్వామి కూడా యశ్వంత్ ని
అనుసరించారు.
మహల్ గేటు తీసి వారు లోపలికి వెళ్తుంటే .. ఆవేశం గా అరచింది వైజయంతి ... ఆ అరుపు కర్ణ కటోరం గా ఉంది .
యశ్వంత్ వాళ్ళు మహల్ ద్వారం చేరుకునే సరికి .. వీరు తలుపు తీద్దామనే సరికి తలుపు తెరచుకుంది ..
ఎదురుగా సరస్వతి ... వీరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ .. మీరు బయట నుండి వస్తున్నారెంటి ? అంది ఆశ్చర్యం
గా ..
ఆ .. అదీ .. ఇదుగో .. ఈయన స్వామీజీ శిష్యులు .. వీరిని తీసుకు రావటానికే వెళ్లాం .. అన్నాడు యశ్వంత్
గోపాల స్వామి కేసి చూస్తూ ..
ఓహ్ అవునా బాబు .. అందరూ ఇప్పుడే లేస్తున్నారు .. ధాత్ర మ్మ పరికిణీ వేసుకుంటారట .. వెళ్లి తీసుకొస్తాను ..
అని అడుగు ముందుకి వేయబోయింది సరస్వతి ..
నో .. వద్దు .. సరస్వతీ .. ఇంత రాత్రి పూట పరికిణి కోసం వెళ్ళడం ఏంటి ? వద్దు .. నేను తనకి చెప్తాను .. అన్నాడు
కంగారుగా యశ్వంత్ .
అయ్యో అదేంటి బాబూ .. ఇప్పుడు భయం ఏముంది .. ఊరంతా మెల్లిగా మేలుకోదా ఈరోజు .. వెళ్లి తెస్తాను బాబు
పాపం ఎంతో సరదాగా అడిగారు .. అంది సరస్వతి ..
యశ్వంత్ ఏదో చెప్పేలోగా .. వీరిమాటలు విన బడ్డాయేమో స్వామీజీ .. అక్కడికి వచ్చారు ..
సరస్వతీ .. రచన వేసుకోవాల్సిన బట్టలు నీవు తేనవసరం లేదు .. ఆ పైన గదిలో రాచరిక దుస్తులు ఉంటాయి ..
ఆమె అవే ధరించాల్సి ఉంటుంది .. వెళ్లి ఆమె తో చెప్పు .. ఈరోజంతా ఆమె తోనే ఉండు .. ఎక్కడికీ వెళ్ళవద్దు ..
వెళ్ళు .. అన్నారు స్వామీజీ .
సరస్వతి .. తల ఊపి అక్కడ్నించి వెళ్లిపోయింది ..
స్వామీజీ .. అంటూ గోపాలం వెళ్లి స్వామీజీ పాదాలకి వంగి నమస్కరించాడు ..
లే గోపాలా .. అని అతని భుజాలపై చేతులు వేసి లేపి .. అన్నీ తీసుకు వచ్చావా ? అని అడిగారు స్వామీజీ .
తెచ్చాను స్వామీజీ .. మీరీ వస్తువులన్నీ తెమ్మని చెప్పినపుడు నాకేందు కనేది అర్థం కాలేదు .. కానీ ఇక్కడకి
వచ్చాక అవగతమైంది స్వామీజీ .. అన్నాడు గోపాలం .
స్వామీజీ చిన్నగా నవ్వి .. శివ వైపు చూసి .. నాయనా .. గోపాలాన్ని తన గదిలోకి తీసుకుపో .. అన్నారు .
అలాగే స్వామీ .. అని శివ ముందుకి కదిలాడు .. సామానుతో పాటు గోపాలం అతడిని అనుసరించాడు ..
స్వామీజీ .. వైజయంతి . .. అని ఆగి .. అనుమానం గా వెనక్కి చూస్తున్న యశ్వంత్ కేసి నవ్వుతూ చూసి ...
ముందు నువ్వు బయటికి పద యశ్వంత్ .. అని అన్నారు స్వామీజీ ..
ఎందుకు స్వామీజీ ..?అన్నాడు యశ్వంత్ సందేహం గా ..
రెండు శవాలని తాకి వచ్చావు కదా నాయనా .. లోపలికి ప్రవేశించక ముందే స్నానం చేసుకుని రావాలి కదా ..
అన్నారు స్వామీజీ .
స్వామీజీ .. మీకెలా .. అయినా మీరు సర్వజ్ఞులు . మీకు తెలియకుండా ఎలా ఉంటుంది ? అని .. స్నానం చేసి
వస్తాను .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ భవనం వెనుక ఉన్న మడుగులో స్నానం చేసిరా .. అన్నారు స్వామీజీ .
తల ఊపి బయటికి నడిచాడు యశ్వంత్ .
***********************
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment