ధాత్రమ్మా ... అంటూ వచ్చిన సరస్వతిని చూసి .. అరె నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా సరస్వతీ .. టైం అవుతోంది ..
అంది రచన కంగారుగా .
లేదమ్మా .. వెళ్లేసరికి స్వామీజీ .. వద్దన్నారమ్మ . మీరు రాచరిక దుస్తులే వేసుకోవాలి ఈరోజు అన్నారు .. ఆ పైన
గదిలో ఉన్నాయటమ్మా .. అంది సరస్వతి .
స్వామీజీ అలా చెప్పారా ? ఎన్నో ఏళ్ళ నాటి దుస్తులు నేనెలా వేసుకుంటాను ? అయినా అవి నాకెలా సరిపోతాయి ...
అంది రచన మొహం చిన్నబుచ్చుకుని ..
ఏమోనమ్మా .. అయినా సాములోరు చెప్పాక వినక తప్పుద్దా ? అంది సరస్వతి .
ఆయన ఏం చెప్పినా దానికి ఒక కారణం ఉంటుంది సరస్వతీ .. అంది రచన .. ఇంతకీ అయ్యగారు నిద్రలేచారా ?
అని అడిగింది రచన .
ఏ అయ్యగారు ? అని అమాయకం గా అడిగింది సరస్వతి ..
యశ్వంత్ .. అంది రచన .
ఏం నిద్రపోవటం ? నేను వెళ్దామని తలుపు తీసేసరికి బయట నుండి వస్తున్నారుగా .. అంది సరస్వతి .
అదేంటి ? ఎక్కడికి వెళ్ళాడు ? అందుకే నాకు కనబడలేదన్న మాట .. అంది రచన ఆతృతగా .
సాములోరి శిష్యుడు ఎవర్నో వెంట పెట్టుకోచ్చారమ్మా .. ఆయన్ని తేవడానికి వెళ్ళానని చెప్పారు .. అంది సరస్వతి .
ఓహ్ .. గోపాలస్వామి వచ్చుంటారు .. అంది సంతోషం గా రచన .
అమ్మా .. ముందు మీరెళ్ళి బట్టలు మార్చుకు రండి .. అంది సరస్వతి ..
సరే .. ఏ గదన్నారు స్వామీజీ అంది రచన .
ఆ పైన గది .. ఆ గది ఇంతవరకూ తెరవలేదట గా .. అక్కడే .. అంది సరస్వతి .
సరే .. నేవెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను .. అన్ని వెతుక్కోవాలి కదా .. అంది రచన .
వెళ్ళండమ్మా .. సమయం దగ్గర పడుతోంది కదా .. అంది సరస్వతి ..
రచన సరస్వతి చూపించిన గదివైపు కదిలింది .. అన్ని సార్లు మహల్ కి వచ్చినా ఆ పై గదుల జోలికి పోలేదు
రచన .
ఆమె గది గుమ్మం ముందు నిలబడింది .. తలుపులకి ఘడియ వేసి ఉంది .. మెల్లిగా ఘడియ తీసి లోపలికి
నడిచింది... లోపలంతా చీకటిగా ఉంది .. తన వెంట తెచ్చిన కొవ్వొత్తి వెలిగించే సరికి గదంతా కాస్త వెలుగు పరచు
కుంది ..
అస్పష్టం గా గదిలో ఏవేవో చిత్ర పటాలు .. మధ్యలో హంస తూలికా తల్పం .. ఆ పక్కకి గోడకి ఉన్న కాగడా ని
చూసి .. వావ్ .. అప్పటి విద్యుత్తు ఇవే కదా అనుకుంటూ .. కొవ్వొత్తి ని కాగడా కి తగిలించింది .. అది వెంటనే
మండి మంట రేగింది .. గదంతా చిక్కటి వెలుగు పరచుకుంది ..
అప్పటిడైనా ఇప్పటికి ఇందులో చమురు ఉందే .. అనుకుంటూ అప్రయత్నం గా గోడమీదున్న చిత్ర పటాన్ని
చూసిన రచన విస్మయం తో స్థానువై పోయింది ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment