ఆమె తన కళ్ళని తానే నమ్మలేక మరి కాస్త దగ్గరగా వెళ్లి చూసింది ... ఆ చిత్రపటం లో రూపం తనలాగే ఉండటం
ఆమె కి అర్థం కాలేదు .. నా చిత్రపటమా ? లేక మరెవరిదైనా ? ఆమె కళ్ళు చిత్రపటాన్ని అంతటినీ పరికించాయి ..
కింది భాగం లో సంస్కృతం లో "యువరాణి విధాత్రీ దేవి " అని వ్రాసి ఉంది ... ఎందుకో ఆమె కి ఆ పేరు సుపరిచితం
గా తోచింది ... మరోసారి ఆమె మొహం కేసి చూసింది .. ఆ ముఖాన్ని చూస్తున్నప్పుడు ఆమె స్మృతి పథం లో
ఏవేవో దృశ్యాలు లీలగా .. తలంతా భారం గా అనిపించి వచ్చి అక్కడున్న తల్పం పై కూర్చుంది ..
ఏమిటిదంతా .. ఈమె అచ్చు నాలాగే ఉంది .. నేను ఈ ఊరు వచ్చినపుడు .. నాపేరు ధాత్రి అని చెప్పాను .. ఇది
కాకతాళీయమా లేక ? లేదు ఇది సమయం కాదు .. నా మనసు లో ఎటువంటి కలవరం ఉండకూడదని స్వామీజీ
చెప్పారు .. నేను ఎటువంటి ఆలోచనలకి తావివ్వకూడదు .. ముందు బట్టలు మార్చుకోవాలి .. అని చుట్టూరా
చూసింది .. ఓ పెద్ద భోషాణం లాంటి పెద్ద పెట్టె నగిషీలతో .. ఓ మూలగా ఉంది .. ఆ పక్కనే మరో చిన్న పెట్టె ..
బహుశా అందులో ఏమైనా ఉండొచ్చు .. అనుకొని అటువైపు నడచి పెట్టె ను తెరచింది రచన .
ఆమె ఆలోచన నిజమే .. బంగారపు నగిషీ వస్త్రాలు .. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా .. వెరీ నైస్ అనుకుంటూ .. ఆమె
ఆ దుస్తులను పైకి తీసింది ... వాటిని పరీక్షించి చూసిన తదుపరి ... ఉహ్ .. అప్పుడు లేహేన్గాస్ ఉన్నాయన్న మాట
అనుకొని ఆ దుస్తులను తీసుకొని మళ్ళి పెట్టె మూసేసింది .. పక్కనే ఉన్న చిన్న పెట్టె తెరచి చూసింది .. ఆమె ..
ఆశ్చర్యంతో నోరు తెరచింది .. ఆ పెట్టె నిండా బంగారు నగలు .. ఓహ్ గాడ్ .. ఇదంతా రాచరిక సంపద .. ఇప్పటికి
ఇలానే ఉండటం ఆశ్చర్యం .. మొత్తానికి వైజయంతి ఈ ఇంటికి కాపలా బాగానే కాసింది .. అనుకొని ఒక్క నగ ని
తీసుకొని తన మెడలో వేసుకుంది .. తరువాత దుస్తులు మార్చుకొని అద్దం ముందు నిల్చుంది ..
ఆమె అద్దం లో చూసుకుంటూ తన దుస్తులు సరిచేసుకుంటుంటే .. అద్దం లో ప్రతి బింబం ఆమె లానే ఉన్నా ఆమె
వైపు ప్రేమగా కన్నీళ్ళతో చూస్తుంది .. రచన భయంగా తన చేతుల్ని కదిలించి చూసింది .. లేదు .. అద్దం లో రూపం
తనది కాదు ఆ ప్రతిబింబం తనలా ప్రవర్తించడం లేదు .. ఆమె తనువు సన్నగా వణికింది .. నుదుటికి పట్టిన చెమట
మెల్లిగా తుడుచుకొని మళ్ళి అద్దం వైపు చూసింది .. మామూలుగా ఆమె ప్రతిబింబమే కనబడింది .. మళ్ళి తన
చేతులు కదిపి చూసింది రచన .. అంతా మామూలుగా ఉంది .. ఉహ్ .. అని నిట్టూర్చి .. ఆ చిత్రపటం చూశాక
కొంచెం భ్రమ కి లోనై నట్టున్నాను .. ముందు ఇక్కడ్నించి వెళ్లి పోవాలి .. అని గది నుంచి బయటకి నడచింది .
********************************
యశ్వంత్ స్నానం ముగించుకొని బట్టలు మార్చుకొని వస్తూ ఉంటే మురారి ఎదురుపడ్డాడు ..
యశ్ .. ఆర్ యు ఓకే ? అంటూ వచ్చి హత్తుకున్నాడు మురారి .
ఐ యం ఓకే మురారీ .. అని మురారి భుజం మీద చిరునవ్వుతో తట్టాడు యశ్వంత్ .
అసలు శివ నాతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు .. కంగారు పడ్డాను .. శివ కూడా కనిపించాడు .. మీ ఇద్దరూ
క్షేమం గా ఉన్నారు .. అది చాలు .. అన్నాడు మురారి ..
ఏం అవుతుంది మురారీ ? ఏం కాదు గానీ ఇంతకీ రచన ఏదీ ? కనపడ్డం లేదు .. టైం దగ్గర పడుతోంది .. సిద్ధం
కావాలిగా .. అంటూ అప్రయత్నం గా మెట్ల వైపు చూసిన .. యశ్వంత్ మెట్ల మీద నుంచి నడచి వస్తున్న రచన ని
చూసి .. విధాత్రీ .. అని అన్నాడు మెల్లిగా ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment