యశ్వంత్ ముఖ కవళికలు చూసి తానూ మెట్లవైపు చూసి .. అవును విధాత్రే .. అన్నాడు మురారి ..
రచన వీరివైపు చూసి చిరునవ్వు నవ్వుతూ దిగుతుంది ..
ఇంతలో సరస్వతి అక్కడకి వచ్చి .. అరె .. ధాత్రమ్మా .. అచ్చు దేవకన్యలా ఉన్నారు ఈ దుస్తుల్లో .. అంది సరస్వతి .
సరస్వతి వైపు ఆశ్చర్యంగా చూశారు యశ్వంత్ , మురారి .
ఏంటి అలా చూస్తున్నారు ? మీరు చెప్పరా నేనీ దుస్తుల్లో ఎలా ఉన్నానో ? అంది వీరిదగ్గరి కొచ్చి రచన గోముగా .
రచనే .. విధాత్రి కాదు .. మురారి మెల్లిగా గొణిగాడు .
నీకీ దుస్తులు .. ఆశ్చర్యంగా సంకోచం గా అడిగాడు యశ్వంత్ ..
బావున్ననా అని అడిగితే నువ్విలా రెస్పాండ్ అవుతావా ? పో యశ్వంత్ .. అని మురారి వైపు తిరిగి . .. నువ్వైనా
చెప్పు మురారీ ? ఈ బట్టలు నాకు బావున్నాయా ? అని అడిగింది రచన .
చాలా చాలా బావున్నావు రచనా .. యువరాణిలా ఉన్నావు .. యశ్వంత్ ప్రేమ సామ్రాజ్యపు యువరాణిలా ..
అన్నాడు మురారి .
స్వామీజీ రాచరికపు దుస్తులు వేసుకోమని సరస్వతితో చెప్పటం గుర్తుకొచ్చింది యశ్వంత్ .. ఓహ్ .. అందుకే ..
రచన ఈ దుస్తుల్లో ఉంది .. అనుకుంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు యశ్వంత్ .
మురారి అభినందనకి కిలకిలా నవ్వింది రచన .. ఆమెని అలానే చూస్తూ ఉండి పోవాలనిపించింది యశ్వంత్ కి .
యశ్ .. నువ్వు నన్నేం పొగడక పోయినా నాకు తెలుసులే .. అని అంది రచన ..
ఏం తెలుసు నీకు ? అన్నాడు యశ్వంత్ కొంటెగా ..
నీకళ్ళు నన్ను పోగిడేసాయి లే .. అని నేను స్వామీజీ ని కలవాలి అని అక్కడనుంచి వయ్యారం గా నడచుకుంటూ
సరస్వతితో పాటు వెళ్ళిపోయింది రచన .
అల్లరి పిల్ల .. అనుకొని మురారి వైపు చూశాడు యశ్వంత్ .
యశ్ .. మనకి విధాత్రి ఇదే దుస్తుల్లో కనిపించేది కదా .. అన్నాడు మురారి .
అవును .. సరేగాని మురారీ నీకో విషయం చెప్పాలి .. అన్నాడు యశ్వంత్ .
వైజయంతి ఇస్ బ్యాక్ .. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది .. అన్నాడు మురారి .
నీకెలా .. ? సందేహంగా అన్నాడు యశ్వంత్ .
నేను చూసాను యశ్వంత్ .. వైజయంతి లోపలికి రావటానికి ప్రయత్నించింది .. కానీ స్వామీజీ రక్షణ వలయాన్ని
కల్పించటం తో తను లోపలికి రాలేక పోయింది .. మీరు వచ్చేటప్పుడు మీకు హాని చేస్తుందేమోనని కలవర పడ్డాను
కానీ యు ఆల్సో సేఫ్ .. అన్నాడు మురారి .
ఇంకెవరైనా చూశారా వైజయంతి ని .. రచన చూడలేదు కదా .. అన్నాడు యశ్వంత్ కంగారుగా .
లేదు యశ్ .. నేను , స్వామీజీ అంతే .. మహల్ నుంచి ఎవ్వర్నీ బయటికి వెళ్ళ వద్దన్నారు స్వామీజీ .. అన్నాడు
మురారి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
2 comments:
రాధిక గారూ, మీరు ఈమధ్య శనివారాలు కూడా సెలవు పుచ్చేసుకుంటున్నారు.
అవునండీ .. బట్ నా సిస్టం ట్రబుల్ ఇవ్వటం తో అలా జరిగింది .. సారీ
Post a Comment