థాంక్ గాడ్ .. అని.. సత్య .. సత్య కెలా ఉంది ? అని అడిగాడు .. యశ్వంత్ .
ఇంతకు ముందే నిద్రలేచింది .. నాతో మాట్లాడింది కూడా .. నేను మరి కాసేపు నిద్రపోమ్మన్నాను .. అన్నాడు
మురారి .
సత్యకేం తెలియనివ్వకు మురారీ అన్నాడు యశ్వంత్ .
అలాగేనంటూ తల ఊపాడు మురారి .
ఇంతలో .. మీరిద్దరూ ఇక్కడున్నారా ? అంటూ అక్కడి కొచ్చాడు శివ .. స్వామీజీ పిలుస్తున్నారు .. మీ ఇద్దర్నీ ..
అని అన్నాడు శివ .
పద వెళదాం .. అన్నాడు యశ్వంత్ .. ముగ్గురూ స్వామీజీ గదివైపు నడిచారు .
లోపల హోమం ఏర్పాటు చేశారు .. గోపాలస్వామి పూజద్రవ్యాలన్ని సర్దుతున్నాడు .. హోమం ముందు రచన
కూర్చుని ఉంది .
వీరు ముగ్గురూ లోపలికి వెళ్ళగానే .. రండి .. అన్నారు స్వామీజీ ..
వెళ్లి స్వామీజీ చూపించిన చోట కూర్చున్నారు .. ముగ్గురు స్నేహితులు .
పౌర్ణమి ఘడియలు మరో కొద్ది నిమిషాల్లో రాబోతున్నాయి .. రచన ఒక్కతే గుడి తలుపులు తెరవ వలసి ఉంటుంది
వేరెవ్వరు ఆ తలుపుల్ని ముట్టుకున్నా అమ్మ అనుమతించదు .. అన్నారు స్వామీజీ .
యశ్వంత్ కి తాను తలుపు తీయబోతు ఎగిరిపడ్డ సంగతి గుర్తుకొచ్చింది ..
రచన కళ్ళు మూసుకొనే ఉంది ..
నేను రచన లో కుండలిని జాగృతం చేశాను .. మీరు రచన తో వెళ్ళాలి అనుకుంటే .. మిమ్మల్ని ఈ ద్రవ్యం ద్వారా
పవిత్రం చేయదలిచాను .. అన్నారు స్వామీజీ .
ఈ కార్యం కోసం మేమందరం ఎంతగానో శ్రమించాం స్వామీజీ .. ఆ వైష్ణవీ మాతని కళ్ళారా చూడాలని .. మాకూ
కోరికగా ఉంది .. అనుమతిస్తే మేమూ వెళ్తాము స్వామీజీ .. అన్నాడు యశ్వంత్ .
తప్పకుండా .. అని గోపాల స్వామి వైపు చూసారు స్వామీజీ ..
గోపాలస్వామి అతని చేతికి కమండలం అందించాడు .. స్వామీజీ ఆ నీటిని ఆ ముగ్గురి మీదా చల్లి ముగ్గురికి
మంత్రోపదేశం చేసారు ..
ఎందుకో ఆ ముగ్గురికి తనువు , మనసు పవిత్రమైన భావన కలిగింది ..
ఓ మూలగా నిలుచున్న సరస్వతి ని చూసి .. వీరందరూ తిరిగి మహల్ కి వచ్చేవరకూ ఏ ఒక్కరూ మహల్ ని వీడి
బయటకి వెళ్ళరాదు .. లోపలికి రారాదు .. అన్నారు స్వామీజీ .
చిత్తం స్వామీజీ .. అంది సరస్వతి .
తరువాత రచన నుదుటి మీద తన బొటన వేలు పెట్టి ఏదో మంత్రం ఉచ్చరించారు స్వామీజీ .. మెల్లిగా కళ్ళు
తెరచింది రచన . స్వామీజీ కి నమస్కరించింది .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment