Powered By Blogger

Thursday, 30 October 2014

రుధిర సౌధం 272కానీ అనిరుద్ధుడు మాట తప్పని వాడు .. ప్రియురాలి కోరిక ని కాదనని వాడు .. అంది విధాత్రి .

అసహనం గా తల విదిలించాడు యశ్వంత్ .

ఇది త్యాగమే కావొచ్చు .. లేదా మీ మనసుకి విరుద్ధమే కావోచ్చ్చు .. కానీ లోక కళ్యాణం .. ఈ కళ్యాణం ఆమె ని

ఈ మహల్ మీ ద ఉండి పోయిన మమకారాన్నుండి దూరం చేస్తుంది .. శాశ్వతం గా ఆమెని పరలోకానికి పంపు

తుంది .. నా సోదరికి ముక్తి ని ప్రసాదించండి .. అని అర్థించింది విధాత్రి .

ఏమీ అనలేక .. చిన్నగా నిట్టూర్చి .. నేనొక సారి స్వామీజీ తో మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ .

ఆమె సరేనని తల ఊపింది .

యశ్వంత్ స్వామీజీ వైపు నడిచాడు .

వీరిద్దరి సంభాషణ నంతా విన్న శివ , మురారి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .

తన వైపు వస్తున్న యశ్వంత్ ని చూసి .. రా నాయనా ? నీ నిర్ణయం తెలుపు .. అన్నారు .

స్వామీజీ .. అన్నీ తెలిసిన వారు .. ఇప్పుడు నా మదిలో సంఘర్షణ ని అర్థం చేసుకోలేరా ? అన్నాడు యశ్వంత్ .

చూడు నాయనా .. ఏ విషయాన్ని ఐనా మనం చూసే కోణాన్ని బట్టే అది మనకి అర్థమవుతుంది .. ఈ కార్యం

వైజయంతి , విధాత్రుల దృష్టి లోనే వివాహం .. కానీ నీ దృష్టి లో యుద్ధం .. కత్తి పట్టి తుదముట్టించ డానికి ఆమె

మరణం లేనిది .. తంత్ర విద్యా పారంగతురాలైన ఆమె ఓ రాచ కన్య . ఆమె లోని క్రూరత్వం నీతో పెళ్లి అనగానే

సౌమ్యతగా మారింది . తన కోరిక నేరవేరబోతుందన్న ఆనందం ఆమె లోని వివేకాన్ని మూసివేస్తుంది .. అదే నీవు

శత్రువు ని ఓడించగల తరుణం .. అని నర్మ గర్భం గా నవ్వారు స్వామీజీ .

యశ్వంత్ కి అర్థమైంది .. అతడి పెదవులపై చిరునవ్వు విరిసింది .. చిన్నగా తల ఊపాడు యశ్వంత్ .

మరేమిటి ? నీ నిర్ణయం కోసం అక్కడ పెళ్లి మండపం లో వధువు వేచి చూస్తుంది .. అన్నారు స్వామీజీ .

పదండి స్వామీజీ .. మండపం కి వెళ్దాం .. అని ముందుకి నడిచి .. రాకుమారి విధాత్రి ని కాదని .. అనిరుద్ధుడ నైన

నేను .. ఈ సుందరాంగి .. రాకుమారి వైజయంతి ని మనువాడ నిశ్చయించాను .. అని గట్టిగా అరిచాడు యశ్వంత్ .

శివ , మురారి అయోమయం గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే .. ఏం జరుగు తోంది ఇక్కడ ? అని

అడిగాడు  విక్కీ వగరుస్తూ .

మాకూ అర్థం కావడం లేదు .. కానీ చూస్తూ ఉండటమే మంచిది అన్నాడు శివ .

యశ్వంత్ ప్రకటన కి ఉబ్బితబ్బిబ్బయింది వైజయంతి .. నిస్సహాయం గా బేలగా చూసింది విధాత్రి ...

శుభం భూయాత్ .. అని గోపాలా వరునికి నూతన వస్త్రాలు తీసుకురా .. అన్నారు స్వామీజీ . 5 నిమిషాల్లో వచ్చాడు

గోపాల స్వామి .. రాచకుమారుల వస్త్రాలతో .

ఈ వస్త్రం ధరించి ఖడ్గం చేతబూని వరుని గా రా నాయనా ... అన్నారు స్వామీజీ .

యశ్వంత్ అతడు చెప్పినట్లే చేశాడు ..

వెళ్ళు .. మండపం లో ఆశీనుడివి కా .. అని తానూ మండపం వైపు నడిచారు స్వామీజీ ..

యశ్వంత్ వెళ్లి వైజయంతి పక్కన ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నాడు ..   ఆమె సిగ్గుతో తల

దించుకుంది. స్వామీజీ వారికి పక్కగా కూర్చుని వినాయక పూజ మొదలు పెట్టారు .. గోపాల స్వామి హోమ మ్

మండించి .. నేతి కోసం  పక్కకి రాగానే .. గోపాల స్వామీ .. ఏం జరుగుతుంది ? దెయ్యానికి , మనిషి కి పెళ్లి ఏంటండీ

?మా యశ్వంత్ ని ఏం చేస్తున్నారు ? అని అడిగాడు శివ కోపంగా .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 271మీరు సంపూర్ణ మనస్కులై  ఓ కార్యం చేయాల్సి ఉంటుంది .. అంది విధాత్రి .

మీకు నేను ఇవ్వ బోయే మాట నన్ను , రచన ని వేరు చేయదు కదా .. అన్నాడు యశ్వంత్ .

ఆమె .. వెంటనే ... లేదు .. లేదు .. యశ్వంత్ ని రచన ని ఎవ్వరూ వేరు చేయలేరు .. కానీ అనిరుద్ధుడు మాత్రం

విధాత్రి నుండి వేరు కాబోతున్నాడు . అంది విధాత్రి బాధగా .

మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు యువరాణీ .. నానుండి రచన వేరు కాదు కాబట్టి .. నేను .. అదే మీరు కోరు

కున్నట్టు అనిరుద్దుడిగా మాట ఇస్తున్నాను .. చెప్పండి .. అన్నాడు యశ్వంత్ .

ఆమె వెనుదిరిగి మంటపం వైపు చూసింది .. ఆమె చూపు మంటపం వైపు ఉండటం చూసి తానూ అటువైపు

చూశాడు .. అక్కడ ఓ సుందరాంగి సిగ్గులొలక బోస్తూ కూర్చుని ఉంది .

ఎవరామె ? హటాత్తుగా ఎక్కడ నుంచి వచ్చింది ? అన్నాడు యశ్వంత్ అటు చూస్తూనే .

అతని ప్రశ్న విని యశ్వంత్ వైపు తిరిగి .. మీరు ఆమె ని వివాహం చేసుకోవాలి .. అంది   విధాత్రి .

వ్వాట్ ? అదిరి పడ్డాడు యశ్వంత్ .

అవును .. మీరు విన్నది నిజమే .. మీరు ఆమే ని వివాహ మాడాలన్నదే నా కోరిక .. మీరు మాట మీద నిలబడ

తారు కదూ .. అంది విధాత్రి .

యువరాణీ .. మీరేం మాట్లాడుతున్నారో తెల్సా ? నన్ను , రచన ని వేరు చేయనన్నారు .. పోనీ మీ దృష్టి లోనే

చూసిన అనిరుద్ధుడిని విధాత్రి ఇలా అడగటం సబబేనా ? అన్నాడు కంగారుగా యశ్వంత్ .

సబబే .. ఎందువల్ల నంటే ఈ వివాహం .. మీరు కలసి జీవించటానికి కాదు .. ఆమె ఆత్మ శాంతి కోసం .. ఆమె పగ

చల్ల బడటం కోసం .. వైజయంతి లో దుష్టాత్మ ని సంహరించటం కోసం .. మీ అందరి మంచి కోసం .. ఈ వూరి

ప్రజల మంచి కోసం .. ఆవేశం గా అంది విధాత్రి .

మీరంటే నాకు గౌరవం యువరాణీ .. కానీ ఆమె ఎవరు ? ఆమె ని పెళ్లి చేసుకుంటే వైజయంతి పీడ వదలట మేంటి ?

అన్నాడు యశ్వంత్ .

ఎందుకంటే ఆమే వైజయంతి .. నా సోదరి .. తన జీవితం అంతా నిండి పోయిన అసంతృప్తి నేడు ఆమెని పిశాచం గా

మార్చివేశాయి . దుస్క్రుత్యాలకి పాల్పడేలా చేశాయి .. ఆమె కోరిక .. అనిరుద్ధుడిని మనువాడాలని ..

ఇప్పుడు ఆమె కి శరీరం లేక పోవొచ్చు .. కానీ ఆ కోరిక అలానే ఉండి పోయింది .. ఆ కోరిక నెరవేరితే ఆమె

శాంత చిత్తురాలై పరలోకానికి చేరుకుంటుంది .. మరుజన్మ కై ఎదురు చూస్తుంది .. అంది విధాత్రి .

కానీ నేను మనిషి ని .. ఆమె ఒక దెయ్యం .. ప్రేతాత్మ .. తనని నేనెలా పెళ్లి చేసుకోను . అయినా పెళ్లి అనేది ఓ

అనిర్వచనీయ మైన బంధం .. అది మనసు పడిన మనిషి ముడి పడాలి .. కానీ ఒక ప్రేతాన్ని పెళ్లి

చేసుకోమంటున్నారు మీరు .. కుదరని పని అది .. అయినా మీరు వైజయంతి ని పెళ్లి చేసుకోమని ఎలా అడుగు

తున్నారు .. ? అన్నాడు యశ్వంత్ .

కత్తి పట్టి యుద్ధం చేసేవాడే వీరుడు కాదు అనిరుద్దా .. అందరి క్షేమం కోసం తన సంతోషాన్ని అయినా వదులు

కొనేందుకు సిద్ధ పడేవాడే నిజమైన వీరుడు . అయినా  ఈ పెళ్లి యస్వంతుని గా మీరు చేసుకోవటం లేదు .

అనిరుద్దుడిగా చేసుకోండి .. అంది విధాత్రి .

అనిరుద్ధుడు కూడా విధాత్రి ని ప్రేమించాడు .. అనిరుద్ధుడు వైజయంతి తో మనువు కి ఎప్పటికీ సిద్ధ పడడు ..

అన్నాడు యశ్వంత్ .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 29 October 2014

రుధిర సౌధం270

ఆమాటలకి వైజయంతి కళ్ళలో వెలుగు కనిపించింది .. ఆమె దూరంగా పోరాడుతున్న యశ్వంత్ ని చూసింది ..

ఆమె కళ్ళు ఆనందం తో నిండిపోయాయి .

మీరు సత్యమే చెబుతున్నారా మహర్షీ .. అంది వైజయంతి .

నా నోటి నుండి అసత్యం రాదు .. అన్నారు స్వామీజీ .

ఆమె సంశయం గా విధాత్రి వైపు చూసింది ..

విధాత్రీ వైజయంతి వైపు చూస్తూ   .. సోదరీ .. నీవేన్నడు నన్ను అర్థం చేసుకోలేదు . నేనెప్పుడు నీ సంతోషం

కోరుకుంటాను .. అప్పుడే నన్ను అడిగి ఉంటె నేను అనిరుద్దునితో పెళ్లి కి అంగీకరించేదాన్నే కాదు .. అమ్మవారికి

నేను ఆత్మ నైవేద్యం ఇవ్వనున్నాను. కావున .. నీవే అనిరుధుని మనువాడు .. ఈ కోరికలు ఇకనైనా నెరవేరాలని ..

మన కుటుంబానికి పట్టిన గ్రహణం శాశ్వతం గా వీడిపోవాలని .. మనసారా కోరుకుంటున్నాను ..   అంది .

ఆమె సంశయం గా చూసింది విధాత్రి వైపు .

విధాత్రి చెప్పింది నిజమే .. కాలానికి పట్టిన గ్రహణం వీడాలంటే నీ పెళ్లి అనిరుద్దునితో జరగాలి .. జరిపిస్తాను .. నీ

కోర్కె నెరవేరే కాలం ఆసన్నమయింది వైజయంతి .. అన్నారు స్వామీజీ .

కానీ దీనికి అతడు అంగీకరిస్తాడా ? అంది వైజయంతి .

దానికి అతడు విధాత్రి వైపు చూసి .. వెళ్ళు .. నీవే అతడిని పెళ్లి కొడుకుగా తీసుకురా .. ఒప్పించి నొప్పించక

తీసుకురా .. అన్నారు స్వామీజీ .

కంటనీరు పెల్లుబుకుతుండగా .. యశ్వంత్ వైపు కదిలింది విధాత్రి .

వెళ్లి ఆ పెళ్లి మండపం లో పెళ్లి కుమార్తె గా ఆశీనురాలివి కా .. వెళ్ళు .. అన్నారు స్వామీజీ వైజయంతి ని చూసి .

ఆమె మహర్షికి నమస్కరించి మంటపం వైపు నడిచింది .

విధాత్రి మెల్లిగా అడుగు అడుగు వేసుకుంటూ .. యశ్వంత్ వైపు నడిచింది . యశ్వంత్ పోరాడుతున్న శక్తులు

అన్నింటిని మాయం చేసింది . విధాత్రి ని గమనించిన యశ్వంత్ .. మీరా ? ఆ వైజయంతి ఎక్కడ ? పారిపోయిందా ?

అని అడిగాడు ఉత్సాహం గా .


నేనీనాడు అనిరుద్ధుని తో మాట లాడాలని వచ్చాను . ఆ జన్మ లో ఎంతగానో నన్ను ప్రేమించారు .. అప్పుడే

మిమ్మల్ని అడగలనుకున్నా .. కానీ జరగకూడనివన్ని జరిగిపోయాయి .. అంది విధాత్రి .

నాకు గత జన్మ గుర్తులేదు .. మీ మీద పెంచుకున్న ప్రేమా గుర్తు లేదు .. కానీ మీరు ధరించిన ఈ శరీరం ఉందే ..

రచన .. తనే నా ప్రాణం .. తనే మడిగినా కాదన లేను .. తనే అడుగుతుందని భావిస్తాను .. మీరు నానుండి

ఏం ఆశిస్తున్నారు యువరాణీ .. అన్నాడు యశ్వంత్ .

నిజమే .. మరణాన్ని పొంది , మరుజన్మ పొందిన మీకు గతజన్మ అనుబంధం ఉండదని భావించవద్దు . ఉంది కాబట్టే

నా రూపం లోనే ఉన్న రచన ని ప్రేమించారు .. మీ రచనే అడుగుతున్దనుకుని నాకు మాటివ్వండి .. కానీ

అనిరుద్దుడిగా మాట ఇవ్వండి .. అంది కకావికలం అయిన మనసు తో ..

నాకవన్నీ అర్థం కావు . కానీ మాటిస్తున్నా .. ఏంటది ? అన్నాడు యశ్వంత్

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 28 October 2014

రుధిర సౌధం 269


వైజయంతి భయంకర రూపాన్ని వదిలి తన రాకుమారి రూపాన్ని దాల్చింది .. అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది .

మీరు చెబుతున్నది నిజమేనా మహర్షీ .. అంది వైజయంతి .

నిజమే .. నా వాక్కు అబద్ధం కాదు . నీవు అందరి లాంటి కన్యా మణి వే కదా .. నీకూ ఆశ లు ఉంటాయి .. నీకే

తెలియ కుండా నీ తల్లి నీవు ప్రేమించిన వాడు ఆస్తిపరుడు కాడని హత్య చేయించి అది నీ తండ్రి జరిపించాడని

చెప్పి నప్పుడు  ఓ పుత్రిక గా నువ్వు నీ తల్లి ని నమ్మావు .. అది నీ తప్పు కాదు కదా .. అన్నారు స్వామీజీ .

మహర్షీ మీరు  చెప్పేది నిజమా ? బేలగా అడిగింది వైజయంతి .

వారు చెప్పేది నిజమే సోదరీ .. తండ్రి గారు ఆ తప్పుడు పని చేయలేదు .. నీవే ఆయనని తప్పుగా భావించావు

అంది విధాత్రి బాధగా .

నీవు మాట్లాడకు .. అని కోపంగా విధాత్రి వైపు చూసి .. తండ్రి .. తండ్రా .. అతడు ? కుమార్తె ని అయిన ఏనాడు

ప్రేమని పంచాడు ? పక్షపాత వైఖరిని అవలంబించి అన్యాయం చేశాడు . మొగ్గ లాంటి నా జీవితాన్ని నిలువునా

నరికేశాడు . నా రక్తం తో తడిసింది ఈ మహల్ .. నాదే .. ఎప్పటికీ నాదే .. గట్టిగా అరచింది వైజయంతి .

కానీ అతడి ఆవేశము నీ చేతల వల్లనే కదా .. తల్లి చెప్పుడు మాటలు విని .. మేన మామ దుశ్చర్యలని

సమర్థించావు  .. వసుంధర ని , వదిన అయిన సుగుణ ని పొట్టన బెట్టుకున్నావు .. ఆడ బిడ్డ కి అవి తగిన పనులా ?

అని అడిగారు స్వామీజీ .

వారి ఈ సంభాషణ జరుగుతున్నపుడు .. ఆ ముగ్గురి చుట్టూరా మంత్రించిన జలం వారికే తెలియకుండా  జల్లు

తున్నాడు గోపాలస్వామి .

పెద్ద కుమార్తె అయిన నాకు రాచరిక సంభంధం చూడకుండా .. నా వెనక పుట్టిన ఈ కొసరు జన్మ కి అనిరుద్ధుడిని

నిశ్చయించారు .. అది తప్పు కాదా ? అనిరుద్ధుడిని నేను వలచాను . అతడు నాకే దక్కాలని అనుకోవటం తప్పా ?

జ్యేష్ట పుత్రిక కి లేని భాగ్యం దానికెందుకు ? దాని మీద ఉన్న ప్రేమ నా పై లేదెందుకు ? అందరూ నన్నే తప్పు

పడతారెందుకు ? గట్టిగా ఆవేశం గా అరిచింది వైజయంతి .

నిజమే .. నీ కోరికలో తప్పులేదు .. కానీ వాటిని తీర్చుకోడానికి నీవు నడిచిన మార్గమే తప్పు .. ప్రాణం విడిచిన

నువ్వు ? ఈ మహల్ ని ఏవిధంగా అనుభవించగలుగుతావు ?పట్టు పీతాంబరాలని ధరించగలవా ? శయనా గరం

లో ఆదమరచి నిద్రించగలవా ? పంచభక్ష్యాలతో భుజించగలవా ? దాస దాసీ జనం తో సేవలు పొంద గలవా ? ఏం

చేయగలవని ఈ మార్గాన్ని ఎంచుకున్నావు ? అన్నారు స్వామీజీ .

అవును .. కానీ .. కానీ .. నేనో గాలిగా తిరుగాడుతున్నా ఈ మహల్ ని వేరొకరికి దక్కనివ్వను .. అంది వైజయంతి .

అలాగే .. కానీ .. నిన్ను చూస్తె ఓ మార్గం చూపించాలని అనిపిస్తుంది .. ఇవన్నీ నీవు అనుభవించగల మార్గమది .

అన్నారు స్వామీజీ .

నిజమా ? చెప్పండి మహర్షి .. ఆ మార్గమేమిటి ? ఆత్రుతగా అడిగింది వైజయంతి .

అటు చూడు .. అతడే అనిరుద్ధుడు .. నువ్వు పొందాలనుకున్నవాడు .. మరుజన్మ ఎత్తి వచ్చాడు .. అతడ్ని వలచిన

 నువ్వూ, అతడు వలచిన ఈ విధాత్రి .. ఇరువురూ .. ఆత్మలే .. . కానీ ఆత్మ లయిన మీ ఇరువురూ .. ముక్తి ని

పొంది మరుజన్మ పొంది అతడి ప్రేమ ని పొందాలంటే ఆత్మగా ఉండి ఈ స్థితిలో అతడిని పెళ్లి చేసుకోవాలి .. నిర్ణయం

మీ ఇరువురిదీ .. మీ ఇరువురిలో ఏ ఒక్కరికో ఈ భాగ్యం దక్కుతుంది . మరుజన్మ ఈ కుటుంబం లోనే ఉంది .

ఈ మహల్ ని , భోగాభాగ్యాలని అనుభవించే అదృష్టం ఉంటుంది .. అన్నారు స్వామీజీ .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 26 October 2014

రుధిర సౌధం268శివ కి ధైర్యం వచ్చింది .. లేచి .. వాటి వైపు అబ్బురం గా చూశాడు ..

నేను వస్తాను శివా .. అందరం కలిసే పోరాడదాం .. అన్నాడు విక్కీ .

విక్కీ వద్దురా .. అంది భయంగా గిరిజ .

అమ్మా .. వద్దని చెప్పకు . చెల్లెలు ఇంతలా పోరాడింది .. నాకూ అవకాశ మొచ్చింది .. నన్ను వెళ్ళనీ .. అని ..

పద శివా .. అని గోపాల స్వామి చేతిలోని ఓ కత్తి ని తీసుకుని ముందుకి నడిచాడు విక్కీ ..

శివ .. మిగిలిన మూడు కత్తులను పట్టుకుని ముందుకి నడవగా .. స్వామీజీ .. మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి ..

గిరిజమ్మ ని వదిలి వేళ్ళకు .. అని అక్కడే భయంగా చూస్తున్న సరస్వతి వైపు చూస్తూ అన్నారు .

ఆమె సరే నని తల ఊపింది .. గిరిజ కళ్ళు అసృపూరితాలవుతున్నాయి .

స్వామీజీ .. గోపాల స్వామి కూడా బయటికి నడిచారు . శివ , విక్కీ గుమ్మం దగ్గిరకి రాబొయెసరికి లోనికి ప్రవేసించ

బోతున్న భయంకర ఆకారాన్ని ఖడ్గ మాల చదువుతూ ఆవేశం గా కత్తిని తాకించాడు విక్కీ . అంతే అది హాహా కరం

చేస్తూ నేల కొరిగింది .. వెనువెంటనే అక్కడి నుండి మాయ మయింది .

వావ్ .. విక్కీ .. ఈ ఖడ్ఘం భలే ఉందే .. ఇక చూసుకో నా స్వామీ రంగ .. అంటూ కదన రంగం లోకి ఉరికాడు శివ .

ఓ పక్క వాటితో పోరాడుతూనే ఇంకో కత్తి ని మురారి వైపు విసిరాడు శివ . మురారి కూడా ఉత్సాహం గా వాటిని

ఎదుర్కోసాగాడు . యశ్వంత్ కూడా శివ అందించిన కత్తిని తీసుకుని ఉరికాడు .

ఈలోపు బయటికి వచ్చిన స్వామీజీ .. చిరునవ్వు తో వైజయంతి , విధాత్రుల వైపు చూశాడు .

తన నోటి నుండి బయటికి వచ్చిన శక్తులతో వాళ్ళలా పోరాడటం చూసి ఆందోళన పడుతున్న వైజయంతి ని

చూసి .. వైజయంతీ .. అని పిలిచారు స్వామీజీ .

ఆమె ఉగ్రురాలై వెనుదిరిగింది .. స్వామీజీ ని చూసి .. నీ పనే కదూ రమణా నందా ? ఎల్లప్పుడూ నీవూ .. నీ

వంశీకులు .. అందరూ .. వీరినే సమర్థించారు .. మమ్మల్ని ఎవ్వరూ సమర్థించలేదు .. ఈ విధాత్రికి మునుపే నేను

ఈ గడ్డ పై జన్మించలేదా ? నా కోరిక లో తప్పేముంది ? ఆవేశం గా ప్రశ్నించింది ..

ఎవరు చెప్పారు ? ఎన్నడు న్యాయం వైపే .. నా చూపు ఉంటుంది .. అన్నారు స్వామీజీ చిరునవ్వుతో ..

న్యాయమా ? న్యాయా న్యాయాలు ఎక్కడున్నాయి ? నాకు జరిగిన అన్యాయం ఎవరికీ అర్థమైంది .. పక్షపాత బుద్ధి

తో మా తండ్రి .. ఈ మహల్ ని , నా వరుడిని నాకు కాకుండా చేసారు . అంగీకరించను .. ఈ అన్యాయం అంగీక

రించను . .. కోపంగా అన్నదామె .

నిజమే .. ఈనాటికీ నీలో బాధ ఇంకా పెరుగుతూనే ఉంది . నీకు నిజంగానే అన్యాయం జరిగింది .. అన్నారు

స్వామీజీ .

స్వామీజీ వైపు మౌనం గా చూసింది విధాత్రి .

ఏమిటి ? ఇప్పుడు నీవు నాకు అన్యాయాన్ని గుర్తిస్తున్నావా ? అంది వెటకారం గా వైజయంతి ..

అవును .. నిజం గానే గుర్తించాను . ఒక రాకుమారి మానసిక వేదన .. ప్రేమించిన వాడిని కోల్పోయి , గుర్తింపు

కోల్పోయి .. హక్కుని కోల్పోయి నప్పుడు .. ఎవరైనా ఏం చేస్తారు ? నువ్వూ అదే చేశావు .. సమంజసమే ..

అన్నారు స్వామీజీ .

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 23 October 2014

రుధిర సౌధం 267

రచన రూపం లో ఉన్న విధాత్రి ఆమె వైపు సూటిగా చూసింది . వైజయంతి విధాత్రి చుట్టూ ఎగురుతూ .. నా దేహం

లో కొన్ని వేల పిశాచాలున్నాయి .. అవన్నీ బయటకి రాగానే ఈ పరిసరాలన్నీ ధ్వంసం చేస్తాయి .. నువ్వు

అంతటినీ  మౌనం గా చూస్తూ ఉండు .. నీ ఆవేశం నన్ను ఏమీ చేయలేదు .. పైగా నన్ను నీవు నాశనం చేసేకొద్దీ

మరింత బలం గా తయారవుతాను .. అంటూ రెక్కలు టప టప లాడిస్తూ ఎగర సాగింది ..

ఆమె విధాత్రి తో అలా మాట్లాడుతుండగా దగ్గరలో ఉన్న కరవాలం అందుకొని .. వైజయంతి రెక్కల్ని గురిపెట్టి

కత్తి దూసాడు యశ్వంత్ .

రెక్కలు తెగిపడ్డాయి ..


వైజయంతి నేల పై పడి .. నిలదొక్కుకుంది .. మళ్ళి గట్టిగా నవ్వింది .. ఆమె మరింత భయంకరంగా మార సాగింది ..

అసహనం గా చూశాడు . . యశ్వంత్ .

ఆమె ని అలా నాశనం చేయలేము .. అంది విధాత్రి ..

మరెలా ? అన్నాడు యశ్వంత్ అసహాయతతో .

ఆమె మనసు మార్చాలి .. మాయ చేయాలి ,,నీ వల్లే సాధ్య పడుతుంది .. అనిరుద్దా .. అంది విధాత్రి .. ఆ మాట

అంటున్నప్పుడు ఆమె కనుకొలనులో తల్లుక్కుమంది కన్నీటి పొర .

అనిరుద్దా .. అన్న పిలుపు విన్నపుడు అతడి మనసులో కలుక్కుమంది ఏదో బాధ .

విధాత్రీ .. అన్నాడు .. యశ్వంత్ బాధగా .

సందర్భోచితం కాదు .. కానీ .. బాధగా ఉంది .. అంతా సవ్యం గా జరుగుతుంది .. బాధపడకండి .. అంది విధాత్రి .

చిన్నగా తల ఊపాడు యశ్వంత్ .

ప్రేయసీ ప్రియులిద్దరూ కబుర్లు చెప్పుకుంతున్నారా .. ఇప్పుడు చూడండి .. అంటూ భయంకరం గా తన నోటిని

తెరచి లోపలున్న నాలుక పట్టుకుని లాగసాగింది .. ఆమె నోటినుండి భయంకర రూపాలు వెలువడ సాగాయి .

యశ్వంత్ , శివ , మురారి భయంగా చూశారు .. ఆమె వైపు . విధాత్రి చీత్కారం గా చూసింది ఆమె వైపు ..

ఇక సమయం ఆసన్న మయింది .. శివా .. లోపలికి వెళ్ళు .. రామనానందుల వారిని పిలువు .. అంది విధాత్రి .

కానీ .. అని భయం గా వైజయంతి వైపు చూశాడు శివ .. ఆమె నోటివెంట వస్తున్న పిశాచాల వికృత చేష్ట లు చూసి .

సంకోచించకు .. నీకేమీ కాదు .. వెళ్ళు .. అంది విధాత్రి .

శివ .. చిన్నగా తల ఊపి .. భయం భయం గా ముందుకి నడిచాడు ..

నా రక్షణ నీకుంది .. వెళ్ళు .. అందామె ..

శివ వైజయంతి కి కొంచెం దూరంగా నడుస్తూ .. ఆమె ని దాటగానే మహల్ లోకి పరుగు తీశాడు . వగరుస్తూ

స్వామీజీ .. అని అరుస్తూ .. స్వామీజీ ముందు కూలబడ్డాడు .. అతడు దేవి ని ధ్యానిస్తూ .. కళ్ళు తెరచి .. అతడి

మేడలో ఉన్న రుద్రాక్ష హారాన్ని , తాకి .. గోపాల స్వామీ .. ఆ కరవాలాలను తీసుకురా .. అని అన్నారు .

స్వామీ బయట .. అని కంగారుగా అంటున్న శివ .. ఆగమన్నట్టు చేయి తో సంజ్ఞ చేశారు .

ఆ కరవాలాలను స్వీకరించి ఆ దుష్ట శక్తులను తరిమి కొట్టండి .. ఈ కరవాలాలలో అమ్మ శక్తి కేంద్రీకృతం అయి

ఉన్నది . వీటిని తాకిన వెంటనే అవి నాశనం కాక తప్పదు .. అన్నారు స్వామీజీ ..

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 266


నువ్వూ నీ తాంత్రిక శక్తి ని వదిలి గాలిలో తేలే ధూళి మాదిరి ఆత్మ గా నాతో పోరాడు .. నేనే ఈ దారాన్ని తొలగించి

నీతో పోరాడతా .. అన్నాడు యశ్వంత్ .

నిజమేగా సోదరీ .. నీవు క్షుద్ర శక్తి వి అయితే .. అతడికి దైవ శక్తి తోడూ .. అటు చూడు .. మహల్ పై ఆకాశ దీపం

వెలిగింది .. అది నీ నాశనానికి హేతువు .. అన్న రచన వైపు ఆశ్చర్యం గా చూసి .. విధాత్రీ .. అన్నాడు యశ్వంత్ .

ఆమె అతడి వైపు చూడకుండా .. వైజయంతి వైపు చూస్తూ నీవు జీవించి లేవు .. నేను జీవించి లేను .. కానీ

మన మధ్య శత్రుత్వం మాత్రం ఇంకా జీవించే ఉంది .. అంది బాధగా రచన శరీరం లో ఉన్న విధాత్రి .

ముసలవ్వ రూపంలో ఉన్న వైజయంతి భయంకర రూపం లోకి మారింది .. భయంకరం గా మూలుగుతూ ..

వచ్చేసావే .. నా ఎదుట కి వచ్చేశావు .. ఇప్పుడు నీ శక్తి నా ముందు ఏపాటి ? నాతో పోరాడటానికి వచ్చావ ?\

రా .. అంటూ ఎగిరి స్థంభం మీద కూర్చుంది వైజయంతి ..

విధాత్రి శివ , మురారిల వైపు చూసి .. తన చేయి ని గాలిలో ఆడించింది . వెంటనే .. గాలిలో ఎగిరెగిరి పడుతున్న

వారిద్దరూ నేల మీద పడ్డారు .

నీరసంగా విధాత్రి వైపు కృతజ్నతగా చూశారు .

పూజలు చేస్తారా ? హహహా హ్హా .. అని వికృతంగా నవ్వి .. మీ పూజలు జరగవు .. అర్థాంతరం గా ఆగిపోతున్నాయి

నేను జరగనివ్వను . వెలుగుతున్న ఆ ఆకాశ దీపం నా రాక ని నియంత్రించలేదు .. అంది వైజయంతి .. స్తంభానికి

పాములా వేలాడుతూ .

సోదరీ .. ఆకాశ దీపం నీ అపవిత్రత నుంచి మహల్ కాపాడేందుకు .. నీ రాక ఈ పరిసరాలను అపవిత్రం చేయదు ..

అమ్మవారి ఆగమనం జరిగిపోయింది .. ఆ తల్లి త్రిశూలం నిన్ను తాకక మునుపే నీ దురాశ ని వీడి వెళ్ళిపో ..

అంది విధాత్రి .

ఇక ఏ బెదిరింపులు చెల్లవు చెల్లెలా .. మహల్ రక్త ధారల్లో తడిపితే గానీ నేను శాంతించను . అని .. అంతా  భయం

గా నోరెళ్ళ బెట్టి చూస్తున్న బాలయ్య వైపు చూసింది .. అంతే అతడు గాల్లో ఎగిరి మహల్ స్తంభానికి గుద్దుకుని

రక్తసిక్త మైన శరీరం తో కింద పడ్డాడు .

బాలయ్యా .. బాధగా గట్టిగా అరిచారు .. శివ , యశ్వంత్ , మురారి .

అమాయకుల ప్రాణాలతో  చెలగాట మాడితే నా ఆగ్రహం వెల్లువవక తప్పదు సోదరీ .. గట్టిగా అరచింది విధాత్రి ..

విధాత్రీ .. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? దయచేసి ఏదో ఒకటి చేయండి ? బాధగా అరిచాడు .. మురారి .

గట్టిగా భయంకరంగా నవ్వింది వైజయంతి .

విధాత్రి ఆమె వైపు కోపంగా చూసింది .. ఆమె చూపుల నుండి అగ్ని కీలలు వెలువడి వైజయంతి ని దహించ

సాగాయి.

ఆమె హృదయ విదారకం గా అరచింది .. కానీ ఆ మరుక్షణమే ఆ అగ్ని కీలలు మాయమై ఆమె మరింత భయంకర

మైన రూపు దాల్చింది .

సోదరివని ఇంకా ఆలోచిస్తున్నాను .. కానీ అమ్మవారి శూలం నిన్ను తాకక తప్పేలా లేదు .. అంది విధాత్రి .

సోదరీ .. నేను నీ సహోదరిని గాన .. నన్నూ , ఈ మహల్ ని , ఈ పునర్జన్మ ఎత్తిన ఈ అనిరుద్ధుడిని నాకు వదిలి

వెళ్ళిపో .. వెటకారంగా అని ఆమె ఓ చేయి ని శరీరం నుండి వేరు చేసి మహల్ బురుజు వైపు విసిరింది వైజయంతి .

ఆమె చేయి తాకినా చోటల్లా రక్తపు ధారలు పొంగి పొర్లుతున్నాయి .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 22 October 2014

రుధిర సౌధం 265బిత్తర బోయి చూసింది రచన .

ఎక్కడకి పోతావ్  ? ఎవ్వర్నీ రక్షించు కోలేవు .. కొన్నేళ్ళ కిందట నా రక్తం తో తడిసిన ఈ సౌధం .. మళ్ళి .. మళ్ళి ..

మీ అందరి రుధిర ధారలతో తడవ నుంది . ఎప్పటికీ ఈ మహల్ కి మహరాణి ని నేనే . అంది ముసలి అవ్వ .

యశ్వంత్ .. అది రచన దగ్గరకి పోయింది .. అన్నాడు శివ .. తమ ముందు నుండి మాయమైన వైజయంతి ..

రచన ముందు చేరటం గమనించి ..

లెట్స్ గో .. అని అంతా రచన వైపు పరుగు తీశారు .

వేషం మార్చుకొచ్చి .. మోసం చేసి మహారాణి వి అవుతావా ? .. ఇంకా నీ పిచ్చి పిశాచి కోరికలు నీనుండి పోగొట్టు

కోలేవు కదూ .. ఇంతవరకూ వచ్చాక యుద్ధానికి నేను సిద్ధమే .. అమ్మవారి గుడిలో దీపాలు వెలిగాయి ..

ఆయుష్షు తీరినా దురాశ ని వీడలేని నువ్వు ఎప్పటికీ గెలవలేవు వైజయంతీ .. అంది రచన ఆమె వైపు కోపంగా

చూస్తూ ..

ఇప్పుడు నేను తాంత్రిక శక్తి ని .. ఉత్త ప్రేతాత్మ ని కాను .. నీ ప్రేలాపన వింటూ ఊరికే ఉండటానికి .. అని రచన

వైపు పరుగున వస్తున్న శివ , మురారిల వైపు క్రూరంగా చూడగానే .. వాళ్ళు అల్లంత దూరం లో ఎగిరి పడ్డారు ..

గాల్లో ఎగిరి ఎగిరి పడుతున్న స్నేహితులని చూసి .. బిచ్ .. అని తిట్టుకుని చేతికి ఉన్న రక్షా దారాన్ని ఓ సారి

చూసుకుని .. నేను దీన్ని ఎదుర్కోవాల్సిందే .. అని రచన పక్కన నిలబడి .. ఆ గారడీ విద్యలు కట్టిపెట్టు ..

అన్నాడు కరుగ్గా ..

అవహేలనా ? అని గట్టిగా నవ్వింది .. వైజయంతి .. చేతికి ఉన్న ఆ దారం పడేసి రా .. నాతో పోరాడు అంది ..

ఆమె అలా అంటున్నప్పుడు .. ఆమె కురులు గాలికి ఎగురుతూ .. సెగలు కక్కుతున్న సర్పాల్లా ఉన్నాయి .

అదే సమయం లో ..

మహల్ లోపల .. పరుగున వెళ్లి .. స్వామీజీ .. వైజయంతి లోపలికి ప్రవేశించింది .. యశ్వంత్ బృందం దాన్ని

అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు .. అన్నాడు గోపాలస్వామి .

అక్కడే ఉన్న గిరిజాదేవి .. ఆ మాట వినగానే తన చేతిలో ఉన్న పాత్రని జార విడిచింది .. అయ్యో .. ఆ పిశాచి మళ్ళి

వచ్చిందా .. భయం గా అరచింది గిరిజ .

అమ్మా .. అంటూ ఆమె భుజాలని పట్టుకున్నాడు విక్కీ .

స్వామీజీ గంభీరంగా .. రచన ఎక్కడుంది ? అని అడిగారు ..

రచన కూడా బయటే ఉంది .. అన్నాడు గోపాలస్వామి .

అయ్యో .. నా తల్లి .. అని విలపిస్తూ .. స్వామీజీ .. నా బిడ్డని రక్షించండి .. కాపాడండి స్వామీజీ .. అంటూ స్వామీజీ

పాదాల మీద పడింది గిరిజ .

స్వామీజీ .. గట్టిగా .. విధాత్రీ ... అని కేక వేశారు ..

వెళ్ళు .. సమయం ఆసన్న మయింది .. ఇంకా ఊరకున్నావే .. వెళ్ళు .. గట్టిగా అరిచారు స్వామీజీ .. అతడలా

అరవగానే .. మహల్ పైభాగాన్నుంచి ఓ కాంతి సరాసరి బయటికి ప్రసరించి .. రచన దేహాన్ని తాకింది ..

ఆమె ఒక్కసారిగా ముందుకి తూలి పడినట్టయింది .

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 21 October 2014

రుధిర సౌధం 264ఆమె తెరలు తెరలుగా నవ్వుతోంది .

రచన ఆమె వైపు అయోమయం గా చూస్తూ .. ఎందుకు నవ్వుతున్నావు అవ్వా ? నేనేమన్నానని .. అంది ..

స్వామీ .. దీపం వెలిగింది కదా .. నేను రచనని రక్షించాలి .. ఆందోళన గా అన్నాడు యశ్వంత్ .

హా .. మీరు వెళ్ళండి .. నేను స్వామీజీ కి చెప్పి వస్తాను .. అని ముందుకి కదిలాడు గోపాల స్వామి ..

గోపాల స్వామి అటు కదల గానే అక్కడే ఉన్న తాడు ని అందుకుని సర్రున కిందికి జారాడు .. యశ్వంత్ . శివ ,

మురారి మెట్ల వైపు పరుగు తీశారు .

ఆమె నవ్వటం ఆపి ఈ  క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను .. నువ్వే వచ్చి నన్ను ఆహ్వానించావు .. ఇక

ఎవ్వరూ నన్ను లోపలికి రాకుండా ఆపలేరు .. అంది చిరునవ్వుతో .

నిన్ను లోపలికి రాకుండా ఎవ్వరు ఆపారు ? మేము ఊరందర్నీ రమ్మన్నాం .. అందరూ ఆహ్వానితులే కదా .. అంది

రచన అయోమయం గా .

ముసలవ్వ చిరునవ్వు నవ్వి .. వస్తున్నా .. అని లేచి నించుంది .. ఇంతలో పరుగున యశ్వంత్ రచన ని చేరు

కున్నాడు .

ఆగు .. ఆగు .. నువ్వు లోపలకి రావటానికి వీల్లేదు .. అన్నాడు యశ్వంత్ కంగారుగా .

ఆమె బిగ్గరగా నవ్వి ముందుకి నడిచింది ..

యశ్వంత్ .. ఆమెని ఎందుకు వద్దంటున్నావు ? యశ్వంత్ చేయి పట్టి అడిగింది రచన .

రచనా .. నువ్వు లోపలకి ఫో .. అని ఆమె చేయి పట్టుకుని .. మహల్ వైపు విసురుగా తోశాడు యశ్వంత్ ..

ఆమె కిందకి పడబోతుండగా .. సరిగ్గా అప్పుడే వచ్చిన శివ , మురారి .. ఆమె ని ఒడిసి పట్టుకున్నారు ..

ఆమె ఆశ్చర్యం గా యశ్వంత్ వైపు వెనుదిరిగి చూసి .. మళ్ళి ముసలవ్వ వైపు చూసింది ..

ముసలవ్వ క్రూరంగా యశ్వంత్ వైపు చూస్తూ అతడ్ని సమీపిస్తుంది .

 శివా .. ఎవ్వరా మె ? సంశయం గా శివాని చూస్తూ అడిగింది రచన .

రచనా .. నువ్వు లోపలికి వెళ్ళు .. ఎవ్వర్నీ బయటకి రానివ్వకు .. తను..  తను.. వైజయంతి  అన్నాడు శివ ..

కంగారుగా యశ్వంత్ వైపు కదులు తూనే .

మురారి అప్పటికే శరవేగంగా వెళ్లి యశ్వంత్ దగ్గర కి చేరాడు .

రచన ఆశ్చర్యంగా .. వైజయంతా .. వీరస్వామి తనను బంధించాడు కదా .. మరిప్పుడు .. తనెలా రాగలిగింది ?

తనలో తానే ప్రస్నించుకుంది రచన .

ఆగు వైజయంతీ .. మమ్మల్ని దాటి మహాల్లోకి నువ్వు ప్రవేసించలేవు .. అన్నాడు యశ్వంత్ కరుగ్గా ..

ఆమె భయoకరంగా నవ్వింది ..

ఏం చేయాలి ? లోపల అమ్మ ఉంది .. భయపడుతుందేమో .. అని లోపలకి పరుగుతీయబోయింది రచన .

కానీ ఆమె ఆలోచన పసి గట్టినట్టుగా .. ఒక్కసారిగా యశ్వంత్ వాళ్ళ ముందున్న ముసలవ్వ ఎగిరి రచన ముందు

ప్రత్యక్ష్య మయింది ..

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 20 October 2014

రుధిర సౌధం 263నేనే స్వయం గా పిలవాలని అందా ? అలా ఎందుకు ? బహుశా బాగా బతికి చెడ్డ కుటుంబమేమో .. అంది

సంశయం గా రచన .

ఏమోనమ్మా .. అన్నాడు బాలయ్య .

పోనీ నేనే వెళ్లి పిలుస్తాను .. ఆమె ఆకలి తీర్చటం కోసం నేనామాత్రం చేయటం లో నాకొచ్చిన చిన్నతనం ఏం లేదు ..

అని చేతిలో ఉన్న పూలని కింద పెట్టింది రచన .

మీరిక్కడే ఉండండి అమ్మా .. నేనే వెళ్లి మీరు స్వయం గా పిలుస్తున్నారని చెప్పోస్తాను .. దీని సిగదరగ .. మిమ్మల్ని

తన కాళ్ళ దగ్గరికి రప్పిస్తదా ? అన్నాడు బాలయ్య .

ఫర్వాలేదు బాలయ్య .. నువ్వు పని చూడు .. అని గేటు వైపు నడిచింది రచన .  

సరిగ్గా ఆ సమయం లోనే ఇక పూజ పూర్తయింది .. ఆకాశదీపం వెలిగించి గాలిలోకి వేలాదనీయండి .. అన్నాడు

గోపాల స్వామీ .

ముగ్గురూ భక్తీ తో నమస్కరించి దీపం వెలిగించబోతు అప్రయత్నం గా కిందికి చూసాడు శివ .

కింద గేటు వైపు నడుస్తున్న రచన కన్పించింది .. రచన అటువైపు వెళ్తోంది ఏమిటి ? అన్నాడు కంగారుగా ..

అందరూ కిందకి చూశారు .. రచన ముసలవ్వ వైపే వెళ్తోందని వారికి అర్థం అయింది ..

ఆమె ఉదయం నుంచీ ఇక్కడే ఉంది .. కొంపదీసి రచన కోసమే ఆమె ఇంతవరకూ ఇక్కడే ఉందేమో .. అన్నాడు

యశ్వంత్ అనుమానం గా ..

గోపాల స్వామి .. పరీక్ష గా చూశాడు ముసలవ్వ వైపు ..

జరిగేది ఆపలేం .. ఆమె వైజయంతే .. అన్నాడు గోపాలస్వామి ..

చురుగ్గా కదిలి కిందకి వెళదామనుకున్న యశ్వంత్ ని చేయిపట్టి ఆపాడు గోపాలస్వామి ..

సంశయం గా గోపాలస్వామి వైపు చూసాడు యశ్వంత్ .

ముందు ఆకాశదీపాన్ని వెలిగించండి .. ఇది చాల ముఖ్యమైన పని అన్నాడు గోపాల స్వామి ..

కానీ స్వామీ .. అక్కడ రచన .. అని దీనం గా అన్నాడు యశ్వంత్ .

అదేసమయం లో గేటు దగ్గరికి చేరుకున్న రచన .. అవ్వా .. అని పిలిచింది ..

ముసలవ్వ ఆమె వైపు కన్నెత్తి చూసింది ..

ఆకలిగా ఉందా ? భోజనం ఎందుకు చేయలేదు ? అని అడిగింది రచన .

యశ్వంత్ .. దీపం వెలిగిస్తే మహల్ అపవిత్రం కాదు .. సమయం లేదు .. వెలిగించు .. అన్నాడు కిందికి చూస్తూ

శివ .. మురారి దీపాన్ని పట్టుకున్నాడు ..

యశ్వంత్ అగ్గిపుల్ల వెలిగిస్తున్నాడు .. గాలికి అగ్నిదేవుడు సహకరించడం లేదు .. అసహనం గా కిందికి చూస్తూనే

దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు యశ్వంత్ .

సరే .. నేను పిలిస్తే గానీ రానన్నావట . ఇప్పుడు నేనే స్వయంగా వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాను .. రా వచ్చి

భోజనం చెయ్యు .. అంది రచన చిరునవ్వుతో ..

సరిగ్గా అప్పుడే దీపపు వత్తి అంటుకుంది .. దీపం ప్రజ్వలం గా వెలిగింది ..

దీపం వెలిగింది .. వెలిగింది .. సంతోషంగా అన్నాడు మురారి .

వెంటనే తాడుకి కట్టి గాలిలో వేలాడ దీసారు .

అదే సమయం లో కింద .. ముసలవ్వ ఒక్కసారిగా లేచి వికటాట్ట హాసం చేసింది .. రచన బిత్తరపోయి చూసింది .

ఇంకా ఉంది                                      


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

విశాఖ అంతా విషాదమే


హలో బ్లాగర్స్ అండ్ బ్లాగ్ రీడర్స్ ,,

        చాలా రోజుల తరువాత మళ్లి బ్లాగ్ లో రాస్తున్నాను . దసరా జరుపుకుందామని ఉత్తరాంధ్ర కి వెళ్ళిన మేము

హుడ్ హుడ్ తుఫ్ఫాను తాకిడి కి గురవక తప్పలేదు . కరెంటు లేదు .. నీళ్ళు లేవు .. ఒక్కసారిగా గతం లోకి

ప్రయాణం చేసినట్టని పించింది . సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు .. ఇక నా ఆలోచన నిజమేగా .. మనిషి దైనందిన

జీవితం లో ఉన్న ఇక్కట్లు అని చెప్పేకంటే  సుఖానికి అలవాటై పోయిన మనిషి .. భరించలేని కష్టాలవి .

నీటి విలువ , విద్యుత్ విలువ తెలిసిన రోజులవి . తిరిగి బెంగళూరు చేరిపోయాను .. అతికష్టం గా .. రైళ్ళు నడవడం

లేదుగా మరి . ఏమైతేనేం అక్కడనుంచి బయట పడ్డానని అనిపించలేదు .. నేర్చుకున్న కొత్త పాఠం మరి .

విశాఖ లో ఆణువణువూ అందమే .. ఎంతో అనుబంధం ఉంది విశాఖ  తో .. కానీ హుడ్ హుడ్ తుఫ్ఫాన్ ధాటి కి

విలవిల లాడిపోయి నీరసం గా కాంతిని కోల్పోయి .. సొమ్మసిల్లి పోయిన విశాఖ ని చూస్తె మాత్రం కన్నీళ్లు ఆగ

లేదు .. విశాఖ ని ఒక్కసారి దర్శిస్తే చాలు .. ఆ నగర అందచందాలకి ముగ్దులవని వారు ఉండరు .. అలాంటిది ..

విశాఖ తో అనుబంధం ఉన్నవారైతే .. ?

నిజంగా ఇది దుస్థితి .. బాధాకరమైన స్థితి .. ప్రక్రుతి ప్రకోపం విలయతాండవం చేస్తుంటే పోరాడి పోరాడి ..

జవసత్వాలు కోల్పోయి నట్టుంది నేడు విశాఖ . ఏళ్ళ కొద్దీ నిటారుగా , గంభీరం గా , ఎన్నో తరాలను చూసిన ..

చెట్లు కూకటి వేళ్ళతో నేల కూలాయి .. భవంతులు చిన్నాభిన్న మయ్యాయి .. ఇక పేదవాడి గుడిసెల గురించి

ఏం చెప్పేది ? ఒక్కసారిగా విశాఖ ప్రజల్ని పట్టి కుదిపేసింది తుఫాన్ .. నష్టం జరగని చోటు లేదు .. కష్టం తెలియని

మనిషి లేడు . అడుగడునా నీటి కోసం పాట్లే ..   నిత్యావసరాల కోసం పడిగాపులే .. రెక్క లొచ్చిన ధరలు .. !

కాలకృత్యాలు తీర్చుకోవడానికి కష్టమే .. నిజమే .. మనిషి ప్రక్రుతి ముందు ఎప్పుడూ చిన్నవాడే ..

కానీ ప్రజల్లో సంయమనం చూసాను .. కూలి పోయిన కరెంటు స్తంభాలని చూసి .. తట్టుకున్నారు .. కరెంటు మీద

ఆశ వదులు కున్నారు .. నీటి కోసం ప్రయత్నాలు చేసారు .. ఆ కష్టాన్ని భరిస్తూనే .. మోడుబారి పోయిన విశాఖ

ని మళ్ళి చిగురిమ్పజేయగలం అన్న నమ్మకాన్ని మనసులో పెంచుకున్నారు .. మనిషి కి మనిషి సాయపడ్డారు .

ఒక్కటిగా సహాయక చర్యలకి ముందుకి కదిలారు .. కష్టం మనుషుల్ని దగ్గర చేస్తున్నది నిజమే అనిపించింది .

సెల్ల్ఫోన్స్ , టీవీలు వచ్చి మనుషుల మధ్య బంధాలని ఎంత దూరం చేశాయో .. అవేమీ లేని ఆ వారం రోజులు

అందరి తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ .. కలసి ఒకరికొకరం సాయం చేసుకుంటుంటే తెలిసింది ..

ఏమైతేనేం .. గండం గడిచింది .. మళ్ళి మెల్లిగా వెలుగులు నింపుకుంటుంది విశాఖ .. నిజం చెప్పాలంటే ..

రాజకీయాల్ని , రాజకీయ నాయకుల్ని అస్సలు ఇష్టపడని నేను .. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గార్ని

ప్రశంసి0చ కుండా ఉండలేను .. కష్టం లో ఉన్నవాడికి మొదట ఓదార్పు అవసరం .. అదే ఆయన చేశారు .

దారిపొడవునా కూలిపోయినా స్తంభాలని , చెట్లని చూస్తే కరెంటు రావటానికే నెల పడుతుందేమో అనుకున్నాను .

కానీ ఆయన 6 రోజుల్లో అన్నీ చక్కదిద్దారు .. ఇంకా ఆ పనిలో నిమగ్నమయి ఉన్నారు .. తన బాధ్యతా యుత

వైఖరిని ఆయన ప్రదర్శించిన తీరు నిజంగా అభినంద నీయం ..

విశాఖ ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ని  తన వైపు తిప్పుకుంది . స్మార్ట్ సిటీగా ఎంపికైంది .. ఆంధ్ర వారికి ఆశల

వేదికైంది .. అభివృద్ధి వైపు శరవేగంగా పయనిస్తుంది .. ఇంతలోనే ఎవరి దిష్టి తగిలింది ? ఇంతలా జరిగిపోయింది .

ఓ చెడు ఓ మంచికే .. అంటారు .. అవును . పొరపాట్లని దిద్దుకుంటూ .. విశాఖ ముందుకే అడుగు వేస్తుంది ..

మళ్ళి వేగం పుంజుకుంటుంది .. అవకాశం ఉన్నవారంతా దయచేసి తుఫాన్ బాధితులకి సహాయం చేయండి .

హుడ్ హుడ్ ప్రభావానికి నా సీరియల్ కూడా ఎఫెక్ట్ అయ్యింది ..

ఈరోజు నుంచీ మళ్ళి మీ ముందుకి రుధిర సౌధం వస్తుంది .. ఆలస్యానికి క్షమించాలి .

ఈ పోస్ట్ లో  నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను .. ఏమైనా తప్పుగా రాసి ఉంటె మన్నించగలరు ..

                                                                                                               
                                                                                                                              మీ రాధికమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 10 October 2014

రుధిర సౌధం 262


దీన్ని పై బురుజు కి కట్టండి .. దీపం గాలిలో తేలుతున్నట్టు కనబడాలి .. అన్నారు స్వామీజీ .

అలాగే స్వామీజీ .. అని భక్తి పూర్వకం గా అందుకున్నాడు యశ్వంత్ .

వినాయకుడ్ని ప్రార్థించి కట్టాలి .. ఎటువంటి విఘ్నాలు రాకూడదని ప్రార్థించాలి .. మరవకండి .. మీతో గోపాలం

వస్తాడు .. అని గోపాల స్వామి వైపు తిరిగి .. వీరితో పాటూ నువ్వు వెళ్ళు .. పని సక్రమం గా జరగనివ్వు .. అన్నారు

స్వామీజీ .

పదండి ..ఆలస్యం కాకుండా .. పని ముగించాలి .. అని పసుపు వినాయకుణ్ణి పట్టుకొని .. ముందుకి నడిచాడు

గోపాలస్వామి .

గోపాలస్వామి వెనకాలే .. నడిచారు యశ్వంత్ , మురారి , శివ .

మహల్ కి పక్కగా ఉన్న మెట్ల వైపు నడుస్తూ .. మహల్ ముందు పందిరిని అలంకరిస్తున్న రచన కేసి ఓసారి

చూశాడు .. పూలని అలంకరిస్తూ .. ఆ పూల మధ్య అరవిరిసిన మందారం లా ఉంది ఆమె ..

తను పూలని అలంకరిస్తూ బాలయ్య కి పనులు పురమాయిస్తుంది .. రచన .

నలుగు రూ .. మహల్ బురుజు పైకి చేరుకున్నారు ..

ఇప్పుడు ముందుగా వినాయక పూజ కానిద్దాం .. అన్నాడు  గోపాల స్వామి .

తాను తెచ్చిన పసుపు వినాయకుడి ని ఆకాశ దీపం ఉన్న బుట్ట లో పెట్టి పసుపు వినాయకుడిని గరికలతో

అర్చిస్తూ శుక్లాం బరధరం .. అంటూ చదవడం మొదలు పెట్టాడు గోపాల స్వామీ .

అదే సమయం లో కింద పెళ్లి పందిరి సిద్ధం చేస్తున్న రచన చెవులకి  అతిదీనం గా "అమ్మా .. ఆకలి " అన్న

మాటలు  వినబడ్డాయి .. ఒక్కసారిగా ఉలిక్కి పడి చుట్టూ చూసింది రచన .

దూరం గా గేటు బయట ఉన్న ముసలి అవ్వ మీద పడింది ఆమె ద్రుష్టి .

అరె .. ఈమె ఇంకా ఇక్కడే ఉంది .. అనుకొని .. బాలయ్య వైపు చూసి .. బాలయ్యా .. ఆ గేటు బయట ఉన్నామె

భోజనం చేయలేదా ? అని అడిగింది రచన .

రచన అడిగిన ప్రశ్న కి తల గోక్కున్నాడు బాలయ్య .. అదీ .. అమ్మాయి గారూ .. ఆమె కి భోజనానికి ఎంత పిలిచినా

రాలేదు .. అన్నాడు  బాలయ్య .

నిజం చెబుతున్నావా ? నువ్వు భోజనానికి పిలిచి ఉంటె ఆమె .. ఆకలని అడుగుతుందా ఇపుడు ? అని సూటిగా

ప్రశ్నించింది రచన అతడిని .

లేదు అమ్మాయి గారు .. నిజంగానే .. ఆమె ని నేను పిలిచాను .. మీతో నేను అబద్ధం చేబుతానా ? అన్నాడు

బాలయ్య .

బాలయ్య కళ్ళలో నిజాయితీ కనిపించింది రచన కి .

అయితే అప్పుడు ఆమె కి ఆకలి లేదేమో .. ఇప్పుడు ఆకలంటుంది బాలలయ్య .. వెళ్ళు ఆమె ని లోపలికి

పిల్చుకొని రా .. ఏమైనా పెట్టు .. మనింటి ముందు ఎవ్వరూ ఆకలి తో ఉండకూడదు .. అంది రచన .

ఆ ముసల్దానితో మా చెడ్డ చికాకైతది ధాత్రమ్మా .. అలా దీనం గా అడుగుతోందా ? నేను లోపలికి రా బువ్వెడతాను

అంటే .. మీరే స్వయంగా వచ్చి పిలిస్తే గానీ తిననంటది .. అన్నాడు బాలయ్య .

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 8 October 2014

రుధిర సౌధం261యశ్వంత్ , మురారీ ఇద్దరూ మహల్ పైభాగానికి చేరుకున్నారు . ఆకాశ దీపాన్ని వెలిగించి వేలాడ దీసేందుకు తగిన

బురుజు ని ఎంచుకుంటూ అనుకోకుండా యశ్వంత్ గేటు బయట కూర్చున్న ముసలి అవ్వ ని చూశాడు .

అరే .. ఇంకా ఈమె ఇక్కడే ఉందే .. అనుకున్నాడు యశ్వంత్ .

ఇంతలో శివ తాడు పట్టుకుని పైకి వచ్చాడు ..

యశ్వంత్ .. ఇదిగో తాడు .. ఎక్కడ కడదాం ? అని చుట్టూ చూస్తుంటే ..

శివా.. ఈ బురుజు పై శిఖరానికి తాడు కడదాం .. అన్నాడు మురారి .

సరే .. అని తాడు ని గిరా గిరా తిప్పి శిఖరం వైపు విసిరాడు శివ . తాడు శిఖరానికి చిక్కుకుంది ..

పర్ఫెక్ట్ .. అన్నాడు యశ్వంత్ .

అయితే ఇంకా దీపాన్ని కింది నుంచి పైకి తీసుకు రావటమే తరువాయి .. అన్నాడు మురారి .

సరే .. కిందికి పదండి .. అని ముగ్గురూ కిందికి నడిచారు ..

వారు మహాల్లోకి నడుస్తుంటే రచన పూల మాలలతో ఎదురు వచ్చింది .

హే .. ఏంటి ? బయటెం పని నీకు ? అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. అస్తమానూ నాకు అడ్డు పడకు . నేను పెళ్లి పందిరి సిద్ధం చేస్తున్నాను .. పూలు అవసరమే కదా ..

పూలతో అలంకరించాలి .. అంది చిరుకోపంగా రచన .

పెళ్లి పందిరా ? దేనికి ? ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు ? అని కంగారుగా అడిగాడు యశ్వంత్ .

కొంపదీసి మీ ఇద్దరూ .. చేసుకుంటున్నారా ? అని అడిగాడు శివ , ఫక్కున నవ్వాడు మురారి .

అదేంటి ? మీకు తెలీదా ? అలా అడుగుతున్నారు ? అని అడిగింది రచన ఆశ్చర్యంగా ..

హే .. జొకులెయ్యకు .. చెప్పు .. నిజంగా మాకు తెలీదు .. అన్నాడు యశ్వంత్ .

మరి .. మరి .. స్వామీజీ .. మీతో  ఈ విషయం .. చెప్పలేదా ? మరేం చెప్పారు మీతో ? నాతో పెళ్లి ఏర్పాట్లు చేయాల్సి

ఉంటుందని చెప్పారు .. ఆశ్చర్యంగా అడిగింది రచన .

అవునా ? అన్నాడు ఆశ్చర్యం గా యశ్వంత్ .

ఇందులో అంత ఆశ్చర్యం కలిగే విషయం ఏముంది యశ్ .. బహుశా అమ్మవారి కల్యాణం నిర్ణయించారేమో ...

గుళ్ళలో స్వామి వారి , అమ్మవారి కల్యాణం చేస్తూ ఉంటారుగా .. అన్నాడు మురారి .

నిజమే .. మనం ఆ కోణం లో ఆలోచించనే లేదు .. అన్నాడు శివ .

సరే .. అలా అయితే .. రచనా .. ఆ పూలు ఇలా ఇవ్వు .. మేమే డెకరేట్ చేస్తాం .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. నీకేం పని లేదా ? అదుగో .. భోజనాలు పూర్తి అయ్యాయి కదా .. బోలెడన్ని పాత్రలు పడున్నాయి

అక్కడ .. తోమడానికి .. అంది కోపంగా రచన .

హే .. అలాంటి పని మాకు చెప్తావా ? టూ మచ్ .. అన్నాడు యశ్వంత్ .

సో .. మీ పన్లు మీరు చూసుకోండి .. నా పని నేను చూసుకుంటా .. అంది రచన చిరుకోపంగా ..

సరే సరే .. రచనా .. నువ్వే చూసుకో .. పోనీ నేను నీకు సాయం గా రానా అన్నాడు శివ .

ఓకే శివా .. బట్ .. నేను అడుగుతాను సాయం కావాల్సి వస్తే .. ముందు .. మీకోసం స్వామీజీ మీకోసం ఎదురు

చూస్తున్నారు వెళ్ళండి ... అంది రచన .

పూలబుట్ట పట్టుకుని రచన బయటికి రాగానే .. బాలయ్య .. ఆమె చేతిలో పూల బుట్ట అందుకుని పదండి

అమ్మాయి గారు .. అని పందిరి వేస్తున్న వైపు కదిలాడు . రచన అతడి వెనుకాలే వెళ్తుంటే .. చూసి .. చిన్నగా

నిట్టూర్చి .. యశ్ .. పెళ్ళయ్యాక నీ పరిస్థితి తలచుకుంటుంటే జాలి వేస్తోంది .. అన్నాడు శివ నవ్వుతూ ..

యశ్ .. శివ , మురారిల వైపు చూసి హాయిగా నవ్వేశాడు .

స్వామీజీ ఆకాశ దీపం సిద్దం చేసుంటారు .. పద .. అన్నాడు మురారి .

ముగ్గురూ లోపలికి నడిచారు
 
 ఇంకా ఉంది                               ********************************మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 7 October 2014

రుధిర సౌధం 260అది వాగిన మాటలు శివ బాబు కి చెప్పడం ఎందుకు ? పిచ్చి ముసల్ది .. అనుకొని .. అయ్యా .. ఆ ముసల్ది ఇక్కడ్నే

ఉంటాదట .. పూజలున్నై కదా .. అన్నాడు బాలయ్య .

లేదు బాలయ్య .. ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదని స్వామీజీ చెప్పారు కదా .. ఆమె ని ఇక్కడ్నుంచి పంపించి

అమ్మాయిగారు చెప్పిన పని మొదలు పెట్టు .. అన్నాడు శివ .

అలాగే అయ్యా .. అని ఆ ముసల్దాని వైపు కోపంగా చూసి ముందుకి నడిచిన వాడల్లా మళ్ళి వెనుదిరిగి ఆ

ముసల్దాని వైపు నడిచాడు బాలయ్య .

శివ మహాల్లోకి నడిచాడు .

ఏవమ్మా .. నువ్వు తిండి తినక పొతే పోయేవు .. ఇక్కడ్నుంచి వెళ్లి పోమ్మా .. నాకు విసిగించకు...

చేతులు  జోడించి విసుగ్గా అన్నాడు బాలయ్య .

ఊరంతా తిండి తిన్నారు .. నాకు తిండి పెట్టకుండా పంపుతావా ? అందామె కోపంగా చూస్తూ ..

అయితే లోపల కి రా తిను .. ఎవరొద్దన్నారు ? రా .. అన్నాడు బాలయ్య .

పిలవని పేరంటానికి రాను .. యజమానే వచ్చి పిలిచేదాకా ఇక్కడ ఉంటాను .. నువ్వు నన్ను ఇక్కడ్నుంచి పంప

డానికి ప్రయత్నించకు .. అందామె గుర్రుగా చూస్తూ ..

ఒసేయ్ ముసిల్దానా ? నీకింత పొగరెందుకే .. నేను మళ్ళి వచ్చేసరికి నువ్విక్కడ ఉండకూడదు .. ఉన్నావో నా లో

పాత బాలయ్య ని చూస్తావు .. ఒంటి చేత్తో అవతలకి విసిరేస్తాను నిన్ను .. పో ఇక్కడ్నుంచి .. అని కోపంగా అని

విసవిసా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు బాలయ్య .

బాలయ్య వైపు కోపంగా చూసింది ఆ ముదుసలి అవ్వ .

                                               *****************************

శివా .. ఆకాశ దీపాన్ని సిద్ధం చేస్తున్నారు .. మహల్ పై భాగం పై దీపం వెలిగించాలి .. పైకి వెళ్ళటానికి మార్గం

ఉందో లేదో చూడు శివా .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. మహల్ పై భాగానికి .. ఆ పక్క గా మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళొచ్చు .. నేను నిన్న పైకి వెళ్లాను కదా

చూశాను .. అదుగో .. అలా వెల్లొచ్చు .. అన్నాడు మురారి .

ఓహ్ గుడ్ .. అని మురారీ .. సత్య .. అని యశ్వంత్ అనబోయేంతలో .. సెలైన్ ఎక్కించాక లేచి కూర్చుంది సత్య .

ఇప్పుడు తను కొంచెం ఏక్టివ్  గానే ఉంది .. ఫర్వాలేదు .. సాయంత్రం మహల్లో జరిగే సహస్ర యజ్ఞం సరికల్లా

సత్య కూడా మన సంతోషం లో పాలు పంచుకుంటుంది .. అన్నాడు మురారి .

హమ్మయ్య .. అంతా హ్యాపీ గా జరిగిపోతే అదే పదివేలు .. .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. రచన బాలయ్య తో చెప్పి పందిరి వేయిస్తోంది .. ఎందుకు ? అని అడిగాడు శివ .

పందిరా ? ఏమో శివా .. బహుశా అవసరమేమో ... స్వామీజీ చెప్పి ఉండుంటారు .. అన్నాడు యశ్వంత్ .

అవును .. స్వామీజీ అందరికి చెరొపని అప్పజెప్పారు గా .. అన్నాడు మురారి .

సరే .. మురారీ నువ్వోసారి మహల్ పైకి నన్ను తీసుకు వెళ్ళు .. ఓసారి చూద్దాం అన్నాడు యశ్వంత్ .

సరే .. మీ ఇద్దరూ ఆ పని మీద ఉండండి .. నేవెళ్ళి తాడు తీసుకొని వస్తాను అన్నాడు శివ

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 6 October 2014

రుధిర సౌధం259

మెల్లిగా భోజనాలు ప్రారంభమయ్యాయి ... ఊరి జనం అంతా కడుపారా భోజనం గావించి మనసారా దీవించి

వెళ్తున్నారు .. భోజనాలలో ప్రతీ పంక్తి లోనూ భోజన కార్యక్రమం తరువాత గ్రామస్తులందరూ తమ తమ ఇళ్ళకి వెళ్లి

అమ్మవారిని పూజించ వలసిందిగా సాయoత్రం యజ్ఞం కార్యక్రమాలను  పూర్తి చేసేంతవరకూ  ఎవ్వరూ తమ తమ

నివాసాలను వదిలి బయటకి రారాదని స్వామీజీ ఆనతి ఇది అని గోపాల స్వామి అందరికి తెలియ జేస్తున్నాడు .

అందరూ స్వామీజీ ఆశీస్సులు తీసుకొని తిరుగు పయనం అయ్యారు ..

గ్రామస్తులు , మిగతా వారి భోజనం పూర్తి అయ్యేసరికి 4గం అయ్యింది .

అన్నీ సర్ది పెడుతూ అప్రయత్నం గా చూసాడు బాలయ్య . గేటు బయట కూర్చున్న పండు ముదుసలి వైపు ...

అయ్యో .. ఈ ముసల్ది భోజనానికి వచ్చిందో లేదో .. యశ్వంత్ బాబు ఈ ముసల్దానికే లోపల పిలిచి అన్నం పెట్ట

మన్నారు .. అని గేటు వైపు కదిలాడు .


ముసల్దాని దగ్గరికి వెళ్లి .. ఏవమ్మా ? తిన్నావా ? అన్నాడు ... బాలయ్య .

ఆమె వంచుకున్న తల ఎత్తకుండానే తల అడ్డం గా తిప్పిందామే .

అయ్యో .. ఊరంతా వచ్చి తిన్నారు కదా .. నువ్వు వచ్చి తినొచ్చు కదమ్మా .. సర్లే .. పద తిందువు గానీ .. అన్నాడు

బాలయ్య .

ఆమె మెల్లిగా అతడి వైపు చూసి .. అతడి చేతికి కట్టి ఉన్న తాడు ని చూసి అదోలా నవ్వింది .

అలా నవ్వుతావేంటి ? అన్నీ ఉన్నాయి లే .. పద పద తిందువు గానీ .. అన్నాడు బాలయ్య .

నేను రాను .. స్థిరం గా అన్నది ఆమె .. ఆమె చూపులు భయంకరం గా ఉన్నాయి .

ఏం ఎందుకు ? ఆకలిగా లేదా ? అమ్మాయి గారే స్వయంగా నీకు అన్నం పెట్టమని అడిగారు .. అలాంటిది ఇలా

నువ్వు మొండికేస్తావేంటి ? చిరాగ్గా అన్నాడు బాలయ్య .

పిలవని పేరంటానికి నేను రాను .. వణుకుతున్న స్వరం తో అన్నదామె .

అదేమిటి ? నేనే స్వయంగా పిలుస్తున్నా కదా .. అన్నాడు బాలయ్య ..

నువ్వీ ఇంటి యజమాని వా ? పనోడివి .. అంది ఆమె నవ్వుతూ ..

ఆ .. చాల్లేవే .. ముసల్దానా ? పోన్లే కదాని  కూర్చోడానికి చోటిస్తే తొంగోటానికి చోటు అడిగిందట .. నీలాంటామె ఒకరు

నీకొచ్చి అమ్మాయిగారు పిలవాలా ? వస్తే రా .. లేదంటే మానేయ్ .. అని చిరాగ్గా అని భుజం మీదున్న కండువా

విసురుగా తీసి మళ్లి భుజం మీద వేసి లోపలికి నడిచాడు బాలయ్య .

బాలయ్య కి ఎదురుగా వచ్చిన శివ .. బాలయ్య .. ఇక్కడేం చేస్తున్నావు? బోలెడంత పని ఉంది .. అయినా రచన

నీకోసం వెదుకుతుంది .. అన్నాడు శివ .

అవునయ్యా .. అమ్మాయి గారు పందిరి వేయమన్నారు . భోజనాలు పూర్తి కాగానే ఆ పనిలోనే ఉంటానని చెప్పాను

మర్చేపోయాను .. అన్నాడు బాలయ్య .

పందిరా ? పందిరెందుకు ? సర్లే .. మేడం గారు చెప్పారుగా .. అందుకే వెదుకు తున్నట్లు ఉంది .. వెళ్ళు .. అన్నాడు

శివ .

బాలయ్య...  అలాగే నయ్యా .. అని  ముందుకి నడుస్తుండగా .. శివ కన్ను ఆ ముసలిదానిపై పడింది .. హే బాలయ్య

.. ఈమె భోజనం చేసిందా ? ఇంకా ఇక్కడే ఉందే .. అన్నాడు శివ .

ఇంకా ఉందిమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 3 October 2014

రుధిర సౌధం 258

ఏంటీ మళ్ళి ఆలోచనలు మొదలయ్యయా ? సర్లే బాబూ .. నాకు చాలా పన్లు ఉన్నాయి .. బాయ్ .. అని మహల్

లోపలికి వెళ్లి పోయింది రచన .

రచన అలా వెళ్లిందో లేదో .. వెంటనే ప్రత్యక్షమయ్యాడు శివ .

యశ్ .. ఏంటీ ? ఏం మాట్లాడారు స్వామీజీ నీతో ? వైజయంతి కోసం ఏమైనా చెప్పారా...  చెప్పారా ? గుక్క తిప్పు

కోకుండా అడిగేశాడు శివ .

శివ .. నా మైండ్ పనిచేయట్లేదు .. ఇప్పుడు మరింత కష్టం .. వైజయంతి రూపాలు మార్చుకోగలదు .. మనం

ఆమెని గుర్తుపట్టలేక పోవొచ్చు .. రచనే ఆమె ని లోపలికి ఆహ్వానించి తీరుతుంది .. అదే జరగబోతుంది .. అర్థం

అవుతోందా నీకు ? వైజయంతి .. నీ రూపం లో రావొచ్చు .. నా రూపం లో రావొచ్చు .. ఆఖరికి స్వామీజీ రూపం లో

కూడా .. మనం తనని ఎలా గుర్తించగలం శివా ? అన్నాడు ఆందోళన గా .

ఓహ్ గాడ్ .. అలా అయితే కష్టమే యశ్వంత్ .. నాకూ ఏం తోచడం లేదు .. అన్నాడు శివ .

శివా .. ఏం జరిగినా సరే .. విజయం మాత్రం మనదే .. అదిమాత్రం నిజమే .. కానీ మనసు మాత్రం కుదురుగా

లేదు శివా .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. నాకు ఐడియా వచ్చింది .. ఏ రూపం లో ఉన్నా సరే .. వైజయంతి లోపలికి రాలేదు .. సో .. ఎవరైతే లొపలికి

రాకుండా ఇబ్బంది పడతారో వాళ్ళని మనం అనుమానించ వచ్చు కదా .. అన్నాడు శివ .

శివా .. రచనే వెళ్లి పిలిస్తే తను వస్తుంది కదా .. ఆ  పిలిపించు కునే వ్యక్తి మనలో ఎవ్వరిదో ఎవ్వరికి తెల్సు ?

అన్నాడు యశ్వంత్ కంగారుగా ..

ఓహ్ .. అంటే .. ఇంకో శివ .. ఇంకో యశ్వంత్ మన పక్కనే .. ఐ మీన్ గేటు అవతల తిరుగుతూ ఉంటారేమో ..

అన్నాడు భయంగా శివ .

అవును శివా .. అన్నాడు యశ్వంత్ అసహనం గా .

మన ముందు ఒక్కటే మార్గం ఉంది యశ్ .. అది రచన . తనని మనం గుమ్మం దిగకుండా చూసుకుంటే చాలు

అన్నాడు శివ .

అవును శివా .. అనుక్షణం మనం రచన కదలికల్ని గమనిస్తూ ఉండాలి .. అన్నాడు యశ్వంత్ .

అయితే ముందు ఆ పనిలో ఉందాం .. నువ్వు రచన దగ్గరే ఉండు .. భోజనాల ఏర్పాట్లు నేను చూసుకుంటాను

అన్నాడు శివ .

ఇంతలో రచన బయటికి వచ్చి .. యష్ , శివా .. బాలయ్య ఎక్కడున్నాడు ? అని అడిగింది ..

వంటల దగ్గర .. అన్నాడు యశ్ ..

ఓహ్ .. నేను వెళ్లి కలవాలి తనని .. అని ముందుకు కదల బోయిన ఆమెని .. హే రచనా .. ఇప్పుడు నీకు బాలయ్య

తో పనేంటి ? మాకు చెప్పొచ్చుగా .. అన్నాడు యష్ .

నాకు బాలయ్య ఆ పనిలో సహాయం చేయాల్సి ఉంటుంది యశ్వంత్ .. నేను కలుస్తానులే తనని .. అంది రచన .

అంతగా పనుంటే తనని శివ పిలుస్తాడు .. నువ్వు లోపలికి వెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .

ఏం నేను స్వయంగా వెళ్ళకూడదా ఏం ? అంది రచన .

కందిపోతావమ్మ .. వెళ్ళు .. మేము బాలయ్యని పంపిస్తాముగా .. అన్నారు ఇద్దరూ ఒకేసారి .

ఏంటో .. మీఇద్దరు మరీ ఓవర్ చేస్తున్నారు .. అనుకొని లోపలికి వెళ్ళిపోయింది రచన .

ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది