సమయం దగ్గర పడుతుంది ఆకాశ దీపానికి .. ఆకాశ దీపం వెలిగిస్తేనే దీప సేవ పూర్తి అయినట్టు నాయనా .. ఈ
విషయం ఖచ్చితంగా తనకి తెలుసు .. కాబట్టి నువ్వు అప్రమత్తం గా ఉండు నాయనా .. అన్నారు స్వామీజీ .
స్వామీజీ మీకంతా ముందే తెలుస్తుంది కదా .. గిరిజ ఆంటీ వాళ్ళు సడన్ గా బయల్దేరారు .. కానీ అది మీకు ముందే
తెలిసింది .. మీకన్ని ముందే తెలుస్తున్నప్పుడు వైజయంతి ఏం చేయబోతుందో కూడా ముందే తెలిసుండాలి కదా ..
మీరు చెప్పినప్పటి నుండీ నేను మనస్సాంతి గా ఉండలేక పోతున్నాను స్వామీజీ .. ప్రతీ క్షణం ప్రమాదం ఎటువైపు
నుండి పొంచి వస్తుందో అని టెన్షన్ తో పిచ్చెక్కి పోతుంది స్వామీజీ .. ప్లీజ్ .. దయ ఉంచి చెప్పండి .. లేదంటే నేను
టెన్షన్ తోనే ఏమయిపోతానో తెలియడం లేదు స్వామీజీ .. ఏం చేయబోతోంది వైజయంతి ? చెప్పండి స్వామీజీ ..
ఆవేశం గా అన్నాడు యశ్వంత్ .
చూడు నాయనా .. భవిష్యత్ ని తెలుసుకోవాలన్న కుతూహలం తప్పు లేదు .. కానీ తెల్సుకోవడం వల్ల వర్తమానం
కూడా నరకం కావొచ్చు నాయనా .. అన్నారు స్వామీజీ .
స్వామీజీ .. మీకు స్పష్టం గా తెల్సు .. నేను మిమ్మల్ని నా స్వార్థం కోసం అడగటం లేదు .. కానీ ఇది తప్పే .. ..
నన్ను క్షమించండి స్వామీజీ .. బాధగా అన్నాడు యశ్వంత్ .
ఇప్పుడు నీ మానసిక స్థితి ని అర్థం చేసుకోగలను .. అందుకే నేను చెప్పేది స్పష్టం గా ఆకళింపు చేసుకో ... ఆకాశ
దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ .. వెలిగి తీరాలి .. అది జరిగితే రచన మీద అశుభ దృష్టి పడినా సరే .. ఆమె పవిత్రురాలై
ఉంటుంది .. పూజ నిర్వహించేందుకు అర్హురాలే అవుతుంది .. అందుకే ఆకాశ దీపం వెలిగి తీరాలి .. అన్నారు
స్వామీజీ .
అంటే .. అంటే రచన మీద అశుభ దృష్టి పడబోతుంది ... అన్నాడు యశ్వంత్ నిరాశగా ..
అవును .. నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి , చెబుతున్నాను .. రచనే స్వయం గా వైజయంతి ని ఆహ్వానించ
బోతుంది .. వైజయంతి మహల్ ప్రాంగణం లోనికి ప్రవేశించడం తధ్యం . అన్నారు స్వామీజీ స్థిరంగా ..
రచన .. రచన .. ఎలా ఆహ్వానిస్తుంది ? వైజయంతి ని తనే ఆహ్వానించాల్సి రావాల్సిన పరిస్థితి ఏమైయుంటుంది ?
స్వగతం గానే అన్నాడు యశ్వంత్ .
చూడు నాయనా .. ఇప్పుడు వైజయంతి శక్తి మంతురాలు .. తాంత్రిక విద్య ఇప్పుడు ఆమె కి తోడుగా ఉంది ..
తాంత్రిక విద్యల్లో ఒకటి కామరూప విద్య .. అన్నారు స్వామీజీ .
కామ రూప విద్యా ? అంటే ? అన్నాడు సంకోచంగా యశ్వంత్ .
అవును .. ఇప్పుడు ఆ విద్యనే నమ్ముకుని మహల్ లోకి ప్రవేసించబోతుంది వైజయంతి .. అన్నారు స్వామీజీ .
మరి వైజయంతి లోపలికి వస్తే ఆమె ని ఎలా ఎదుర్కొనాలి స్వామీజీ ? అని అడిగాడు యశ్వంత్ ..
ఆ విషయం లో నేను నీకు సహాయం చేయబోతున్నాను నాయనా .. చింతించకు .. అంతా ఆ తల్లి దయే .. అన్నారు
స్వామీజీ ..
ఇంతలో టక్కున ఆ గదిలోకి రచన వచ్చింది .. వీరిరువురి వదనాల్ని చూసి .. మీరేదో మాట్లాడుకుంటున్నట్టు
ఉన్నారు .. రాకూడని సమయం లో వచ్చానా ? అంది రచన .
తగిన సమయం లోనే వచ్చావు తల్లీ .. నేనే నిన్ను పిలిపిద్దామనుకున్నాను .. అన్నారు స్వామీజీ ..
ఎందుకు స్వామీజీ ? అంది రచన ఆసక్తిగా ..
యశ్వంత్ .. ఇక నువ్వు వెళ్ళు అన్నారు స్వామీజీ యశ్వంత్ వైపు తిరిగి ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment