చిన్నగా తల ఊపి .. స్వామీజీ కి నమస్కరించి .. అక్కడ నుండి బయటకి వెళ్ళిపోయాడు యశ్వంత్ ..
ఇలా రా తల్లీ .. అన్నారు స్వామీజీ రచన నుద్దేశించి .
చెప్పండి స్వామీజీ .. అంది రచన .
ఈరోజు సాయంత్రానికి మీ వంశీకుల పద్దతిలో పెళ్లి మండపాన్ని సిద్ధం చేయండి .. అమ్మకి తెల్సు .. ఆమె సలహా
తీసుకుని ఏర్పాట్లు చేయించండి .. అన్నారు స్వామీజీ .
ఆమె విచిత్రం గా అతనికేసి చూసింది ..
ఎందుకు ఏమిటని ప్రశ్నించకు తల్లీ .. వెంటనే ఏర్పాట్లు మొదలు పెట్టండి .. అంతా తర్వాత నీకే అర్థమవుతుంది ...
అన్నారు స్వామీజీ .
అలాగే స్వామీజీ .. అని లేచి బయటికి నడిచింది రచన .
ఆమెకి ఏం అర్థం కాలేదు .. అలాగే గుమ్మం వైపు నడిచిన ఆమె కి యశ్వంత్ ఏదో ఆలోచిస్తూ కనిపించాడు ..
యశ్వంత్ కూడా అదోలా ఉన్నాడు .. పెళ్లి మండపం కోసం యశ్వంత్ కి చెప్పి ఉంటారు .. తానూ ఎందుకు
ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాడు .. అదే అయుంటుంది .. అని యశ్వంత్ దగ్గరకి నడిచి ... ఏంటి ? అంతలా
ఆలోచిస్తున్నావు ? స్వామీజీ ఏం చెప్పినా మన మంచికోసమే కదా .. అంది రచన .
సడన్ గా రచన అలా అనేసరికి .. ఏ విషయం కోసం మాట్లాడుతున్నావు నువ్వు ? అన్నాడు .. యశ్వంత్ .
మరి నువ్వేం ఆలోచిస్తున్నావు అంతలా ? తిరిగి ప్రశ్న వేసింది రచన .
అందుకే అంటారు .. మరీ తెలివైన అమ్మాయి ని లవ్ చేయకూడదు అని .. అన్నాడు యశ్వంత్ .
ఇప్పుడు తెలుసుకొని ప్రయోజనం ఏముంది కానీ .. చెప్పు దేనికోసం ఆలోచిస్తున్నావు అంది రచన చిరునవ్వుతో .
నువ్వు పాత కాలం కథలు బాగా చదువు తావుగా .. ఓ విషయం చెప్పు .. కామ రూప విద్య అంటే ఏంటి ? అని
అడిగాడు యశ్వంత్ .
ఏయ్ .. ఏమయ్యింది నీకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు ? ఎందుకిలా అడుగుతున్నావు ? అని అడిగింది
రచన ఆశ్చర్యంగా ..
తిరిగి ప్రశ్న వేయకుండా .. ఉండవు కదా .. పో రచనా .. అని వెళ్ళబోయాడు యశ్వంత్ .
హే ఆగు యశ్వంత్ .. నాకు తెల్సు .. చెప్తాను .. అంది రచన .
అయితే చెప్పు మరి అన్నాడు యశ్వంత్ .
ఎందుకు అడిగావో నాకు తెలీదు గానీ .. కామరూప విద్య చాలా ప్రాచీన మైనది .. ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు
వారు కోరుకున్న రూపం పొంద వచ్చు .. ఈ విద్య ద్వారానే ఇంద్రుడు అహల్యని మోసం చేయగలిగాడు .. అంది
రచన .
అహల్యా .. అన్నాడు యశ్వంత్ .
అహల్య , గౌతమ మహర్షి భార్య .. ఆమె మీదున్న మోహం తో ఇంద్రుడు ఆమె భర్త రూపాన్నే ధరించి .. ఆమె తో
గడిపాడు .. తర్వాత గౌతముడు వచ్చాడు .. ఇంద్రుడిని , అహల్యని శపించాడు .. అహల్య శిలగా మారిపోయింది ..
అని ఆమె ఇంకా చెప్పబోతుంటే ..
ఆమెనే కాదు శ్రీరాముడు .. శిల నుంచి అతివని చేసింది .. ఐ నో థట్ .. అన్నాడు యశ్వంత్ .
ఎస్ .. అంది రచన .
అంటే .. వైజయంతి కూడా తను కోరుకున్న రూపం లోకి మారగలదు .. ఓహ్ గాడ్ .. ఇప్పుడు ఇంతమందిలో
ఆమెని ఎలా గుర్తించవచ్చు ? అందుకే అన్నారు స్వామీజీ .. భవిషత్తు తెల్సుకుంటే వర్తమానం నరకం అవుతుందని
అనుకున్నాడు మనసులో యశ్వంత్ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment