ఏంటీ మళ్ళి ఆలోచనలు మొదలయ్యయా ? సర్లే బాబూ .. నాకు చాలా పన్లు ఉన్నాయి .. బాయ్ .. అని మహల్
లోపలికి వెళ్లి పోయింది రచన .
రచన అలా వెళ్లిందో లేదో .. వెంటనే ప్రత్యక్షమయ్యాడు శివ .
యశ్ .. ఏంటీ ? ఏం మాట్లాడారు స్వామీజీ నీతో ? వైజయంతి కోసం ఏమైనా చెప్పారా... చెప్పారా ? గుక్క తిప్పు
కోకుండా అడిగేశాడు శివ .
శివ .. నా మైండ్ పనిచేయట్లేదు .. ఇప్పుడు మరింత కష్టం .. వైజయంతి రూపాలు మార్చుకోగలదు .. మనం
ఆమెని గుర్తుపట్టలేక పోవొచ్చు .. రచనే ఆమె ని లోపలికి ఆహ్వానించి తీరుతుంది .. అదే జరగబోతుంది .. అర్థం
అవుతోందా నీకు ? వైజయంతి .. నీ రూపం లో రావొచ్చు .. నా రూపం లో రావొచ్చు .. ఆఖరికి స్వామీజీ రూపం లో
కూడా .. మనం తనని ఎలా గుర్తించగలం శివా ? అన్నాడు ఆందోళన గా .
ఓహ్ గాడ్ .. అలా అయితే కష్టమే యశ్వంత్ .. నాకూ ఏం తోచడం లేదు .. అన్నాడు శివ .
శివా .. ఏం జరిగినా సరే .. విజయం మాత్రం మనదే .. అదిమాత్రం నిజమే .. కానీ మనసు మాత్రం కుదురుగా
లేదు శివా .. అన్నాడు యశ్వంత్ .
యశ్ .. నాకు ఐడియా వచ్చింది .. ఏ రూపం లో ఉన్నా సరే .. వైజయంతి లోపలికి రాలేదు .. సో .. ఎవరైతే లొపలికి
రాకుండా ఇబ్బంది పడతారో వాళ్ళని మనం అనుమానించ వచ్చు కదా .. అన్నాడు శివ .
శివా .. రచనే వెళ్లి పిలిస్తే తను వస్తుంది కదా .. ఆ పిలిపించు కునే వ్యక్తి మనలో ఎవ్వరిదో ఎవ్వరికి తెల్సు ?
అన్నాడు యశ్వంత్ కంగారుగా ..
ఓహ్ .. అంటే .. ఇంకో శివ .. ఇంకో యశ్వంత్ మన పక్కనే .. ఐ మీన్ గేటు అవతల తిరుగుతూ ఉంటారేమో ..
అన్నాడు భయంగా శివ .
అవును శివా .. అన్నాడు యశ్వంత్ అసహనం గా .
మన ముందు ఒక్కటే మార్గం ఉంది యశ్ .. అది రచన . తనని మనం గుమ్మం దిగకుండా చూసుకుంటే చాలు
అన్నాడు శివ .
అవును శివా .. అనుక్షణం మనం రచన కదలికల్ని గమనిస్తూ ఉండాలి .. అన్నాడు యశ్వంత్ .
అయితే ముందు ఆ పనిలో ఉందాం .. నువ్వు రచన దగ్గరే ఉండు .. భోజనాల ఏర్పాట్లు నేను చూసుకుంటాను
అన్నాడు శివ .
ఇంతలో రచన బయటికి వచ్చి .. యష్ , శివా .. బాలయ్య ఎక్కడున్నాడు ? అని అడిగింది ..
వంటల దగ్గర .. అన్నాడు యశ్ ..
ఓహ్ .. నేను వెళ్లి కలవాలి తనని .. అని ముందుకు కదల బోయిన ఆమెని .. హే రచనా .. ఇప్పుడు నీకు బాలయ్య
తో పనేంటి ? మాకు చెప్పొచ్చుగా .. అన్నాడు యష్ .
నాకు బాలయ్య ఆ పనిలో సహాయం చేయాల్సి ఉంటుంది యశ్వంత్ .. నేను కలుస్తానులే తనని .. అంది రచన .
అంతగా పనుంటే తనని శివ పిలుస్తాడు .. నువ్వు లోపలికి వెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .
ఏం నేను స్వయంగా వెళ్ళకూడదా ఏం ? అంది రచన .
కందిపోతావమ్మ .. వెళ్ళు .. మేము బాలయ్యని పంపిస్తాముగా .. అన్నారు ఇద్దరూ ఒకేసారి .
ఏంటో .. మీఇద్దరు మరీ ఓవర్ చేస్తున్నారు .. అనుకొని లోపలికి వెళ్ళిపోయింది రచన .
ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment