వెళ్తున్నారు .. భోజనాలలో ప్రతీ పంక్తి లోనూ భోజన కార్యక్రమం తరువాత గ్రామస్తులందరూ తమ తమ ఇళ్ళకి వెళ్లి
అమ్మవారిని పూజించ వలసిందిగా సాయoత్రం యజ్ఞం కార్యక్రమాలను పూర్తి చేసేంతవరకూ ఎవ్వరూ తమ తమ
నివాసాలను వదిలి బయటకి రారాదని స్వామీజీ ఆనతి ఇది అని గోపాల స్వామి అందరికి తెలియ జేస్తున్నాడు .
అందరూ స్వామీజీ ఆశీస్సులు తీసుకొని తిరుగు పయనం అయ్యారు ..
గ్రామస్తులు , మిగతా వారి భోజనం పూర్తి అయ్యేసరికి 4గం అయ్యింది .
అన్నీ సర్ది పెడుతూ అప్రయత్నం గా చూసాడు బాలయ్య . గేటు బయట కూర్చున్న పండు ముదుసలి వైపు ...
అయ్యో .. ఈ ముసల్ది భోజనానికి వచ్చిందో లేదో .. యశ్వంత్ బాబు ఈ ముసల్దానికే లోపల పిలిచి అన్నం పెట్ట
మన్నారు .. అని గేటు వైపు కదిలాడు .
ముసల్దాని దగ్గరికి వెళ్లి .. ఏవమ్మా ? తిన్నావా ? అన్నాడు ... బాలయ్య .
ఆమె వంచుకున్న తల ఎత్తకుండానే తల అడ్డం గా తిప్పిందామే .
అయ్యో .. ఊరంతా వచ్చి తిన్నారు కదా .. నువ్వు వచ్చి తినొచ్చు కదమ్మా .. సర్లే .. పద తిందువు గానీ .. అన్నాడు
బాలయ్య .
ఆమె మెల్లిగా అతడి వైపు చూసి .. అతడి చేతికి కట్టి ఉన్న తాడు ని చూసి అదోలా నవ్వింది .
అలా నవ్వుతావేంటి ? అన్నీ ఉన్నాయి లే .. పద పద తిందువు గానీ .. అన్నాడు బాలయ్య .
నేను రాను .. స్థిరం గా అన్నది ఆమె .. ఆమె చూపులు భయంకరం గా ఉన్నాయి .
ఏం ఎందుకు ? ఆకలిగా లేదా ? అమ్మాయి గారే స్వయంగా నీకు అన్నం పెట్టమని అడిగారు .. అలాంటిది ఇలా
నువ్వు మొండికేస్తావేంటి ? చిరాగ్గా అన్నాడు బాలయ్య .
పిలవని పేరంటానికి నేను రాను .. వణుకుతున్న స్వరం తో అన్నదామె .
అదేమిటి ? నేనే స్వయంగా పిలుస్తున్నా కదా .. అన్నాడు బాలయ్య ..
నువ్వీ ఇంటి యజమాని వా ? పనోడివి .. అంది ఆమె నవ్వుతూ ..
ఆ .. చాల్లేవే .. ముసల్దానా ? పోన్లే కదాని కూర్చోడానికి చోటిస్తే తొంగోటానికి చోటు అడిగిందట .. నీలాంటామె ఒకరు
నీకొచ్చి అమ్మాయిగారు పిలవాలా ? వస్తే రా .. లేదంటే మానేయ్ .. అని చిరాగ్గా అని భుజం మీదున్న కండువా
విసురుగా తీసి మళ్లి భుజం మీద వేసి లోపలికి నడిచాడు బాలయ్య .
బాలయ్య కి ఎదురుగా వచ్చిన శివ .. బాలయ్య .. ఇక్కడేం చేస్తున్నావు? బోలెడంత పని ఉంది .. అయినా రచన
నీకోసం వెదుకుతుంది .. అన్నాడు శివ .
అవునయ్యా .. అమ్మాయి గారు పందిరి వేయమన్నారు . భోజనాలు పూర్తి కాగానే ఆ పనిలోనే ఉంటానని చెప్పాను
మర్చేపోయాను .. అన్నాడు బాలయ్య .
పందిరా ? పందిరెందుకు ? సర్లే .. మేడం గారు చెప్పారుగా .. అందుకే వెదుకు తున్నట్లు ఉంది .. వెళ్ళు .. అన్నాడు
శివ .
బాలయ్య... అలాగే నయ్యా .. అని ముందుకి నడుస్తుండగా .. శివ కన్ను ఆ ముసలిదానిపై పడింది .. హే బాలయ్య
.. ఈమె భోజనం చేసిందా ? ఇంకా ఇక్కడే ఉందే .. అన్నాడు శివ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment