అది వాగిన మాటలు శివ బాబు కి చెప్పడం ఎందుకు ? పిచ్చి ముసల్ది .. అనుకొని .. అయ్యా .. ఆ ముసల్ది ఇక్కడ్నే
ఉంటాదట .. పూజలున్నై కదా .. అన్నాడు బాలయ్య .
లేదు బాలయ్య .. ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదని స్వామీజీ చెప్పారు కదా .. ఆమె ని ఇక్కడ్నుంచి పంపించి
అమ్మాయిగారు చెప్పిన పని మొదలు పెట్టు .. అన్నాడు శివ .
అలాగే అయ్యా .. అని ఆ ముసల్దాని వైపు కోపంగా చూసి ముందుకి నడిచిన వాడల్లా మళ్ళి వెనుదిరిగి ఆ
ముసల్దాని వైపు నడిచాడు బాలయ్య .
శివ మహాల్లోకి నడిచాడు .
ఏవమ్మా .. నువ్వు తిండి తినక పొతే పోయేవు .. ఇక్కడ్నుంచి వెళ్లి పోమ్మా .. నాకు విసిగించకు...
చేతులు జోడించి విసుగ్గా అన్నాడు బాలయ్య .
ఊరంతా తిండి తిన్నారు .. నాకు తిండి పెట్టకుండా పంపుతావా ? అందామె కోపంగా చూస్తూ ..
అయితే లోపల కి రా తిను .. ఎవరొద్దన్నారు ? రా .. అన్నాడు బాలయ్య .
పిలవని పేరంటానికి రాను .. యజమానే వచ్చి పిలిచేదాకా ఇక్కడ ఉంటాను .. నువ్వు నన్ను ఇక్కడ్నుంచి పంప
డానికి ప్రయత్నించకు .. అందామె గుర్రుగా చూస్తూ ..
ఒసేయ్ ముసిల్దానా ? నీకింత పొగరెందుకే .. నేను మళ్ళి వచ్చేసరికి నువ్విక్కడ ఉండకూడదు .. ఉన్నావో నా లో
పాత బాలయ్య ని చూస్తావు .. ఒంటి చేత్తో అవతలకి విసిరేస్తాను నిన్ను .. పో ఇక్కడ్నుంచి .. అని కోపంగా అని
విసవిసా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు బాలయ్య .
బాలయ్య వైపు కోపంగా చూసింది ఆ ముదుసలి అవ్వ .
*****************************
శివా .. ఆకాశ దీపాన్ని సిద్ధం చేస్తున్నారు .. మహల్ పై భాగం పై దీపం వెలిగించాలి .. పైకి వెళ్ళటానికి మార్గం
ఉందో లేదో చూడు శివా .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ .. మహల్ పై భాగానికి .. ఆ పక్క గా మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళొచ్చు .. నేను నిన్న పైకి వెళ్లాను కదా
చూశాను .. అదుగో .. అలా వెల్లొచ్చు .. అన్నాడు మురారి .
ఓహ్ గుడ్ .. అని మురారీ .. సత్య .. అని యశ్వంత్ అనబోయేంతలో .. సెలైన్ ఎక్కించాక లేచి కూర్చుంది సత్య .
ఇప్పుడు తను కొంచెం ఏక్టివ్ గానే ఉంది .. ఫర్వాలేదు .. సాయంత్రం మహల్లో జరిగే సహస్ర యజ్ఞం సరికల్లా
సత్య కూడా మన సంతోషం లో పాలు పంచుకుంటుంది .. అన్నాడు మురారి .
హమ్మయ్య .. అంతా హ్యాపీ గా జరిగిపోతే అదే పదివేలు .. .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ .. రచన బాలయ్య తో చెప్పి పందిరి వేయిస్తోంది .. ఎందుకు ? అని అడిగాడు శివ .
పందిరా ? ఏమో శివా .. బహుశా అవసరమేమో ... స్వామీజీ చెప్పి ఉండుంటారు .. అన్నాడు యశ్వంత్ .
అవును .. స్వామీజీ అందరికి చెరొపని అప్పజెప్పారు గా .. అన్నాడు మురారి .
సరే .. మురారీ నువ్వోసారి మహల్ పైకి నన్ను తీసుకు వెళ్ళు .. ఓసారి చూద్దాం అన్నాడు యశ్వంత్ .
సరే .. మీ ఇద్దరూ ఆ పని మీద ఉండండి .. నేవెళ్ళి తాడు తీసుకొని వస్తాను అన్నాడు శివ
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment