నేనే స్వయం గా పిలవాలని అందా ? అలా ఎందుకు ? బహుశా బాగా బతికి చెడ్డ కుటుంబమేమో .. అంది
సంశయం గా రచన .
ఏమోనమ్మా .. అన్నాడు బాలయ్య .
పోనీ నేనే వెళ్లి పిలుస్తాను .. ఆమె ఆకలి తీర్చటం కోసం నేనామాత్రం చేయటం లో నాకొచ్చిన చిన్నతనం ఏం లేదు ..
అని చేతిలో ఉన్న పూలని కింద పెట్టింది రచన .
మీరిక్కడే ఉండండి అమ్మా .. నేనే వెళ్లి మీరు స్వయం గా పిలుస్తున్నారని చెప్పోస్తాను .. దీని సిగదరగ .. మిమ్మల్ని
తన కాళ్ళ దగ్గరికి రప్పిస్తదా ? అన్నాడు బాలయ్య .
ఫర్వాలేదు బాలయ్య .. నువ్వు పని చూడు .. అని గేటు వైపు నడిచింది రచన .
సరిగ్గా ఆ సమయం లోనే ఇక పూజ పూర్తయింది .. ఆకాశదీపం వెలిగించి గాలిలోకి వేలాదనీయండి .. అన్నాడు
గోపాల స్వామీ .
ముగ్గురూ భక్తీ తో నమస్కరించి దీపం వెలిగించబోతు అప్రయత్నం గా కిందికి చూసాడు శివ .
కింద గేటు వైపు నడుస్తున్న రచన కన్పించింది .. రచన అటువైపు వెళ్తోంది ఏమిటి ? అన్నాడు కంగారుగా ..
అందరూ కిందకి చూశారు .. రచన ముసలవ్వ వైపే వెళ్తోందని వారికి అర్థం అయింది ..
ఆమె ఉదయం నుంచీ ఇక్కడే ఉంది .. కొంపదీసి రచన కోసమే ఆమె ఇంతవరకూ ఇక్కడే ఉందేమో .. అన్నాడు
యశ్వంత్ అనుమానం గా ..
గోపాల స్వామి .. పరీక్ష గా చూశాడు ముసలవ్వ వైపు ..
జరిగేది ఆపలేం .. ఆమె వైజయంతే .. అన్నాడు గోపాలస్వామి ..
చురుగ్గా కదిలి కిందకి వెళదామనుకున్న యశ్వంత్ ని చేయిపట్టి ఆపాడు గోపాలస్వామి ..
సంశయం గా గోపాలస్వామి వైపు చూసాడు యశ్వంత్ .
ముందు ఆకాశదీపాన్ని వెలిగించండి .. ఇది చాల ముఖ్యమైన పని అన్నాడు గోపాల స్వామి ..
కానీ స్వామీ .. అక్కడ రచన .. అని దీనం గా అన్నాడు యశ్వంత్ .
అదేసమయం లో గేటు దగ్గరికి చేరుకున్న రచన .. అవ్వా .. అని పిలిచింది ..
ముసలవ్వ ఆమె వైపు కన్నెత్తి చూసింది ..
ఆకలిగా ఉందా ? భోజనం ఎందుకు చేయలేదు ? అని అడిగింది రచన .
యశ్వంత్ .. దీపం వెలిగిస్తే మహల్ అపవిత్రం కాదు .. సమయం లేదు .. వెలిగించు .. అన్నాడు కిందికి చూస్తూ
శివ .. మురారి దీపాన్ని పట్టుకున్నాడు ..
యశ్వంత్ అగ్గిపుల్ల వెలిగిస్తున్నాడు .. గాలికి అగ్నిదేవుడు సహకరించడం లేదు .. అసహనం గా కిందికి చూస్తూనే
దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు యశ్వంత్ .
సరే .. నేను పిలిస్తే గానీ రానన్నావట . ఇప్పుడు నేనే స్వయంగా వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాను .. రా వచ్చి
భోజనం చెయ్యు .. అంది రచన చిరునవ్వుతో ..
సరిగ్గా అప్పుడే దీపపు వత్తి అంటుకుంది .. దీపం ప్రజ్వలం గా వెలిగింది ..
దీపం వెలిగింది .. వెలిగింది .. సంతోషంగా అన్నాడు మురారి .
వెంటనే తాడుకి కట్టి గాలిలో వేలాడ దీసారు .
అదే సమయం లో కింద .. ముసలవ్వ ఒక్కసారిగా లేచి వికటాట్ట హాసం చేసింది .. రచన బిత్తరపోయి చూసింది .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment