రచన ఆమె వైపు అయోమయం గా చూస్తూ .. ఎందుకు నవ్వుతున్నావు అవ్వా ? నేనేమన్నానని .. అంది ..
స్వామీ .. దీపం వెలిగింది కదా .. నేను రచనని రక్షించాలి .. ఆందోళన గా అన్నాడు యశ్వంత్ .
హా .. మీరు వెళ్ళండి .. నేను స్వామీజీ కి చెప్పి వస్తాను .. అని ముందుకి కదిలాడు గోపాల స్వామి ..
గోపాల స్వామి అటు కదల గానే అక్కడే ఉన్న తాడు ని అందుకుని సర్రున కిందికి జారాడు .. యశ్వంత్ . శివ ,
మురారి మెట్ల వైపు పరుగు తీశారు .
ఆమె నవ్వటం ఆపి ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను .. నువ్వే వచ్చి నన్ను ఆహ్వానించావు .. ఇక
ఎవ్వరూ నన్ను లోపలికి రాకుండా ఆపలేరు .. అంది చిరునవ్వుతో .
నిన్ను లోపలికి రాకుండా ఎవ్వరు ఆపారు ? మేము ఊరందర్నీ రమ్మన్నాం .. అందరూ ఆహ్వానితులే కదా .. అంది
రచన అయోమయం గా .
ముసలవ్వ చిరునవ్వు నవ్వి .. వస్తున్నా .. అని లేచి నించుంది .. ఇంతలో పరుగున యశ్వంత్ రచన ని చేరు
కున్నాడు .
ఆగు .. ఆగు .. నువ్వు లోపలకి రావటానికి వీల్లేదు .. అన్నాడు యశ్వంత్ కంగారుగా .
ఆమె బిగ్గరగా నవ్వి ముందుకి నడిచింది ..
యశ్వంత్ .. ఆమెని ఎందుకు వద్దంటున్నావు ? యశ్వంత్ చేయి పట్టి అడిగింది రచన .
రచనా .. నువ్వు లోపలకి ఫో .. అని ఆమె చేయి పట్టుకుని .. మహల్ వైపు విసురుగా తోశాడు యశ్వంత్ ..
ఆమె కిందకి పడబోతుండగా .. సరిగ్గా అప్పుడే వచ్చిన శివ , మురారి .. ఆమె ని ఒడిసి పట్టుకున్నారు ..
ఆమె ఆశ్చర్యం గా యశ్వంత్ వైపు వెనుదిరిగి చూసి .. మళ్ళి ముసలవ్వ వైపు చూసింది ..
ముసలవ్వ క్రూరంగా యశ్వంత్ వైపు చూస్తూ అతడ్ని సమీపిస్తుంది .
శివా .. ఎవ్వరా మె ? సంశయం గా శివాని చూస్తూ అడిగింది రచన .
రచనా .. నువ్వు లోపలికి వెళ్ళు .. ఎవ్వర్నీ బయటకి రానివ్వకు .. తను.. తను.. వైజయంతి అన్నాడు శివ ..
కంగారుగా యశ్వంత్ వైపు కదులు తూనే .
మురారి అప్పటికే శరవేగంగా వెళ్లి యశ్వంత్ దగ్గర కి చేరాడు .
రచన ఆశ్చర్యంగా .. వైజయంతా .. వీరస్వామి తనను బంధించాడు కదా .. మరిప్పుడు .. తనెలా రాగలిగింది ?
తనలో తానే ప్రస్నించుకుంది రచన .
ఆగు వైజయంతీ .. మమ్మల్ని దాటి మహాల్లోకి నువ్వు ప్రవేసించలేవు .. అన్నాడు యశ్వంత్ కరుగ్గా ..
ఆమె భయoకరంగా నవ్వింది ..
ఏం చేయాలి ? లోపల అమ్మ ఉంది .. భయపడుతుందేమో .. అని లోపలకి పరుగుతీయబోయింది రచన .
కానీ ఆమె ఆలోచన పసి గట్టినట్టుగా .. ఒక్కసారిగా యశ్వంత్ వాళ్ళ ముందున్న ముసలవ్వ ఎగిరి రచన ముందు
ప్రత్యక్ష్య మయింది ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment