బిత్తర బోయి చూసింది రచన .
ఎక్కడకి పోతావ్ ? ఎవ్వర్నీ రక్షించు కోలేవు .. కొన్నేళ్ళ కిందట నా రక్తం తో తడిసిన ఈ సౌధం .. మళ్ళి .. మళ్ళి ..
మీ అందరి రుధిర ధారలతో తడవ నుంది . ఎప్పటికీ ఈ మహల్ కి మహరాణి ని నేనే . అంది ముసలి అవ్వ .
యశ్వంత్ .. అది రచన దగ్గరకి పోయింది .. అన్నాడు శివ .. తమ ముందు నుండి మాయమైన వైజయంతి ..
రచన ముందు చేరటం గమనించి ..
లెట్స్ గో .. అని అంతా రచన వైపు పరుగు తీశారు .
వేషం మార్చుకొచ్చి .. మోసం చేసి మహారాణి వి అవుతావా ? .. ఇంకా నీ పిచ్చి పిశాచి కోరికలు నీనుండి పోగొట్టు
కోలేవు కదూ .. ఇంతవరకూ వచ్చాక యుద్ధానికి నేను సిద్ధమే .. అమ్మవారి గుడిలో దీపాలు వెలిగాయి ..
ఆయుష్షు తీరినా దురాశ ని వీడలేని నువ్వు ఎప్పటికీ గెలవలేవు వైజయంతీ .. అంది రచన ఆమె వైపు కోపంగా
చూస్తూ ..
ఇప్పుడు నేను తాంత్రిక శక్తి ని .. ఉత్త ప్రేతాత్మ ని కాను .. నీ ప్రేలాపన వింటూ ఊరికే ఉండటానికి .. అని రచన
వైపు పరుగున వస్తున్న శివ , మురారిల వైపు క్రూరంగా చూడగానే .. వాళ్ళు అల్లంత దూరం లో ఎగిరి పడ్డారు ..
గాల్లో ఎగిరి ఎగిరి పడుతున్న స్నేహితులని చూసి .. బిచ్ .. అని తిట్టుకుని చేతికి ఉన్న రక్షా దారాన్ని ఓ సారి
చూసుకుని .. నేను దీన్ని ఎదుర్కోవాల్సిందే .. అని రచన పక్కన నిలబడి .. ఆ గారడీ విద్యలు కట్టిపెట్టు ..
అన్నాడు కరుగ్గా ..
అవహేలనా ? అని గట్టిగా నవ్వింది .. వైజయంతి .. చేతికి ఉన్న ఆ దారం పడేసి రా .. నాతో పోరాడు అంది ..
ఆమె అలా అంటున్నప్పుడు .. ఆమె కురులు గాలికి ఎగురుతూ .. సెగలు కక్కుతున్న సర్పాల్లా ఉన్నాయి .
అదే సమయం లో ..
మహల్ లోపల .. పరుగున వెళ్లి .. స్వామీజీ .. వైజయంతి లోపలికి ప్రవేశించింది .. యశ్వంత్ బృందం దాన్ని
అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు .. అన్నాడు గోపాలస్వామి .
అక్కడే ఉన్న గిరిజాదేవి .. ఆ మాట వినగానే తన చేతిలో ఉన్న పాత్రని జార విడిచింది .. అయ్యో .. ఆ పిశాచి మళ్ళి
వచ్చిందా .. భయం గా అరచింది గిరిజ .
అమ్మా .. అంటూ ఆమె భుజాలని పట్టుకున్నాడు విక్కీ .
స్వామీజీ గంభీరంగా .. రచన ఎక్కడుంది ? అని అడిగారు ..
రచన కూడా బయటే ఉంది .. అన్నాడు గోపాలస్వామి .
అయ్యో .. నా తల్లి .. అని విలపిస్తూ .. స్వామీజీ .. నా బిడ్డని రక్షించండి .. కాపాడండి స్వామీజీ .. అంటూ స్వామీజీ
పాదాల మీద పడింది గిరిజ .
స్వామీజీ .. గట్టిగా .. విధాత్రీ ... అని కేక వేశారు ..
వెళ్ళు .. సమయం ఆసన్న మయింది .. ఇంకా ఊరకున్నావే .. వెళ్ళు .. గట్టిగా అరిచారు స్వామీజీ .. అతడలా
అరవగానే .. మహల్ పైభాగాన్నుంచి ఓ కాంతి సరాసరి బయటికి ప్రసరించి .. రచన దేహాన్ని తాకింది ..
ఆమె ఒక్కసారిగా ముందుకి తూలి పడినట్టయింది .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment