నీతో పోరాడతా .. అన్నాడు యశ్వంత్ .
నిజమేగా సోదరీ .. నీవు క్షుద్ర శక్తి వి అయితే .. అతడికి దైవ శక్తి తోడూ .. అటు చూడు .. మహల్ పై ఆకాశ దీపం
వెలిగింది .. అది నీ నాశనానికి హేతువు .. అన్న రచన వైపు ఆశ్చర్యం గా చూసి .. విధాత్రీ .. అన్నాడు యశ్వంత్ .
ఆమె అతడి వైపు చూడకుండా .. వైజయంతి వైపు చూస్తూ నీవు జీవించి లేవు .. నేను జీవించి లేను .. కానీ
మన మధ్య శత్రుత్వం మాత్రం ఇంకా జీవించే ఉంది .. అంది బాధగా రచన శరీరం లో ఉన్న విధాత్రి .
ముసలవ్వ రూపంలో ఉన్న వైజయంతి భయంకర రూపం లోకి మారింది .. భయంకరం గా మూలుగుతూ ..
వచ్చేసావే .. నా ఎదుట కి వచ్చేశావు .. ఇప్పుడు నీ శక్తి నా ముందు ఏపాటి ? నాతో పోరాడటానికి వచ్చావ ?\
రా .. అంటూ ఎగిరి స్థంభం మీద కూర్చుంది వైజయంతి ..
విధాత్రి శివ , మురారిల వైపు చూసి .. తన చేయి ని గాలిలో ఆడించింది . వెంటనే .. గాలిలో ఎగిరెగిరి పడుతున్న
వారిద్దరూ నేల మీద పడ్డారు .
నీరసంగా విధాత్రి వైపు కృతజ్నతగా చూశారు .
పూజలు చేస్తారా ? హహహా హ్హా .. అని వికృతంగా నవ్వి .. మీ పూజలు జరగవు .. అర్థాంతరం గా ఆగిపోతున్నాయి
నేను జరగనివ్వను . వెలుగుతున్న ఆ ఆకాశ దీపం నా రాక ని నియంత్రించలేదు .. అంది వైజయంతి .. స్తంభానికి
పాములా వేలాడుతూ .
సోదరీ .. ఆకాశ దీపం నీ అపవిత్రత నుంచి మహల్ కాపాడేందుకు .. నీ రాక ఈ పరిసరాలను అపవిత్రం చేయదు ..
అమ్మవారి ఆగమనం జరిగిపోయింది .. ఆ తల్లి త్రిశూలం నిన్ను తాకక మునుపే నీ దురాశ ని వీడి వెళ్ళిపో ..
అంది విధాత్రి .
ఇక ఏ బెదిరింపులు చెల్లవు చెల్లెలా .. మహల్ రక్త ధారల్లో తడిపితే గానీ నేను శాంతించను . అని .. అంతా భయం
గా నోరెళ్ళ బెట్టి చూస్తున్న బాలయ్య వైపు చూసింది .. అంతే అతడు గాల్లో ఎగిరి మహల్ స్తంభానికి గుద్దుకుని
రక్తసిక్త మైన శరీరం తో కింద పడ్డాడు .
బాలయ్యా .. బాధగా గట్టిగా అరిచారు .. శివ , యశ్వంత్ , మురారి .
అమాయకుల ప్రాణాలతో చెలగాట మాడితే నా ఆగ్రహం వెల్లువవక తప్పదు సోదరీ .. గట్టిగా అరచింది విధాత్రి ..
విధాత్రీ .. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? దయచేసి ఏదో ఒకటి చేయండి ? బాధగా అరిచాడు .. మురారి .
గట్టిగా భయంకరంగా నవ్వింది వైజయంతి .
విధాత్రి ఆమె వైపు కోపంగా చూసింది .. ఆమె చూపుల నుండి అగ్ని కీలలు వెలువడి వైజయంతి ని దహించ
సాగాయి.
ఆమె హృదయ విదారకం గా అరచింది .. కానీ ఆ మరుక్షణమే ఆ అగ్ని కీలలు మాయమై ఆమె మరింత భయంకర
మైన రూపు దాల్చింది .
సోదరివని ఇంకా ఆలోచిస్తున్నాను .. కానీ అమ్మవారి శూలం నిన్ను తాకక తప్పేలా లేదు .. అంది విధాత్రి .
సోదరీ .. నేను నీ సహోదరిని గాన .. నన్నూ , ఈ మహల్ ని , ఈ పునర్జన్మ ఎత్తిన ఈ అనిరుద్ధుడిని నాకు వదిలి
వెళ్ళిపో .. వెటకారంగా అని ఆమె ఓ చేయి ని శరీరం నుండి వేరు చేసి మహల్ బురుజు వైపు విసిరింది వైజయంతి .
ఆమె చేయి తాకినా చోటల్లా రక్తపు ధారలు పొంగి పొర్లుతున్నాయి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment