వైజయంతి భయంకర రూపాన్ని వదిలి తన రాకుమారి రూపాన్ని దాల్చింది .. అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది .
మీరు చెబుతున్నది నిజమేనా మహర్షీ .. అంది వైజయంతి .
నిజమే .. నా వాక్కు అబద్ధం కాదు . నీవు అందరి లాంటి కన్యా మణి వే కదా .. నీకూ ఆశ లు ఉంటాయి .. నీకే
తెలియ కుండా నీ తల్లి నీవు ప్రేమించిన వాడు ఆస్తిపరుడు కాడని హత్య చేయించి అది నీ తండ్రి జరిపించాడని
చెప్పి నప్పుడు ఓ పుత్రిక గా నువ్వు నీ తల్లి ని నమ్మావు .. అది నీ తప్పు కాదు కదా .. అన్నారు స్వామీజీ .
మహర్షీ మీరు చెప్పేది నిజమా ? బేలగా అడిగింది వైజయంతి .
వారు చెప్పేది నిజమే సోదరీ .. తండ్రి గారు ఆ తప్పుడు పని చేయలేదు .. నీవే ఆయనని తప్పుగా భావించావు
అంది విధాత్రి బాధగా .
నీవు మాట్లాడకు .. అని కోపంగా విధాత్రి వైపు చూసి .. తండ్రి .. తండ్రా .. అతడు ? కుమార్తె ని అయిన ఏనాడు
ప్రేమని పంచాడు ? పక్షపాత వైఖరిని అవలంబించి అన్యాయం చేశాడు . మొగ్గ లాంటి నా జీవితాన్ని నిలువునా
నరికేశాడు . నా రక్తం తో తడిసింది ఈ మహల్ .. నాదే .. ఎప్పటికీ నాదే .. గట్టిగా అరచింది వైజయంతి .
కానీ అతడి ఆవేశము నీ చేతల వల్లనే కదా .. తల్లి చెప్పుడు మాటలు విని .. మేన మామ దుశ్చర్యలని
సమర్థించావు .. వసుంధర ని , వదిన అయిన సుగుణ ని పొట్టన బెట్టుకున్నావు .. ఆడ బిడ్డ కి అవి తగిన పనులా ?
అని అడిగారు స్వామీజీ .
వారి ఈ సంభాషణ జరుగుతున్నపుడు .. ఆ ముగ్గురి చుట్టూరా మంత్రించిన జలం వారికే తెలియకుండా జల్లు
తున్నాడు గోపాలస్వామి .
పెద్ద కుమార్తె అయిన నాకు రాచరిక సంభంధం చూడకుండా .. నా వెనక పుట్టిన ఈ కొసరు జన్మ కి అనిరుద్ధుడిని
నిశ్చయించారు .. అది తప్పు కాదా ? అనిరుద్ధుడిని నేను వలచాను . అతడు నాకే దక్కాలని అనుకోవటం తప్పా ?
జ్యేష్ట పుత్రిక కి లేని భాగ్యం దానికెందుకు ? దాని మీద ఉన్న ప్రేమ నా పై లేదెందుకు ? అందరూ నన్నే తప్పు
పడతారెందుకు ? గట్టిగా ఆవేశం గా అరిచింది వైజయంతి .
నిజమే .. నీ కోరికలో తప్పులేదు .. కానీ వాటిని తీర్చుకోడానికి నీవు నడిచిన మార్గమే తప్పు .. ప్రాణం విడిచిన
నువ్వు ? ఈ మహల్ ని ఏవిధంగా అనుభవించగలుగుతావు ?పట్టు పీతాంబరాలని ధరించగలవా ? శయనా గరం
లో ఆదమరచి నిద్రించగలవా ? పంచభక్ష్యాలతో భుజించగలవా ? దాస దాసీ జనం తో సేవలు పొంద గలవా ? ఏం
చేయగలవని ఈ మార్గాన్ని ఎంచుకున్నావు ? అన్నారు స్వామీజీ .
అవును .. కానీ .. కానీ .. నేనో గాలిగా తిరుగాడుతున్నా ఈ మహల్ ని వేరొకరికి దక్కనివ్వను .. అంది వైజయంతి .
అలాగే .. కానీ .. నిన్ను చూస్తె ఓ మార్గం చూపించాలని అనిపిస్తుంది .. ఇవన్నీ నీవు అనుభవించగల మార్గమది .
అన్నారు స్వామీజీ .
నిజమా ? చెప్పండి మహర్షి .. ఆ మార్గమేమిటి ? ఆత్రుతగా అడిగింది వైజయంతి .
అటు చూడు .. అతడే అనిరుద్ధుడు .. నువ్వు పొందాలనుకున్నవాడు .. మరుజన్మ ఎత్తి వచ్చాడు .. అతడ్ని వలచిన
నువ్వూ, అతడు వలచిన ఈ విధాత్రి .. ఇరువురూ .. ఆత్మలే .. . కానీ ఆత్మ లయిన మీ ఇరువురూ .. ముక్తి ని
పొంది మరుజన్మ పొంది అతడి ప్రేమ ని పొందాలంటే ఆత్మగా ఉండి ఈ స్థితిలో అతడిని పెళ్లి చేసుకోవాలి .. నిర్ణయం
మీ ఇరువురిదీ .. మీ ఇరువురిలో ఏ ఒక్కరికో ఈ భాగ్యం దక్కుతుంది . మరుజన్మ ఈ కుటుంబం లోనే ఉంది .
ఈ మహల్ ని , భోగాభాగ్యాలని అనుభవించే అదృష్టం ఉంటుంది .. అన్నారు స్వామీజీ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment