మీరు సంపూర్ణ మనస్కులై ఓ కార్యం చేయాల్సి ఉంటుంది .. అంది విధాత్రి .
మీకు నేను ఇవ్వ బోయే మాట నన్ను , రచన ని వేరు చేయదు కదా .. అన్నాడు యశ్వంత్ .
ఆమె .. వెంటనే ... లేదు .. లేదు .. యశ్వంత్ ని రచన ని ఎవ్వరూ వేరు చేయలేరు .. కానీ అనిరుద్ధుడు మాత్రం
విధాత్రి నుండి వేరు కాబోతున్నాడు . అంది విధాత్రి బాధగా .
మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు యువరాణీ .. నానుండి రచన వేరు కాదు కాబట్టి .. నేను .. అదే మీరు కోరు
కున్నట్టు అనిరుద్దుడిగా మాట ఇస్తున్నాను .. చెప్పండి .. అన్నాడు యశ్వంత్ .
ఆమె వెనుదిరిగి మంటపం వైపు చూసింది .. ఆమె చూపు మంటపం వైపు ఉండటం చూసి తానూ అటువైపు
చూశాడు .. అక్కడ ఓ సుందరాంగి సిగ్గులొలక బోస్తూ కూర్చుని ఉంది .
ఎవరామె ? హటాత్తుగా ఎక్కడ నుంచి వచ్చింది ? అన్నాడు యశ్వంత్ అటు చూస్తూనే .
అతని ప్రశ్న విని యశ్వంత్ వైపు తిరిగి .. మీరు ఆమె ని వివాహం చేసుకోవాలి .. అంది విధాత్రి .
వ్వాట్ ? అదిరి పడ్డాడు యశ్వంత్ .
అవును .. మీరు విన్నది నిజమే .. మీరు ఆమే ని వివాహ మాడాలన్నదే నా కోరిక .. మీరు మాట మీద నిలబడ
తారు కదూ .. అంది విధాత్రి .
యువరాణీ .. మీరేం మాట్లాడుతున్నారో తెల్సా ? నన్ను , రచన ని వేరు చేయనన్నారు .. పోనీ మీ దృష్టి లోనే
చూసిన అనిరుద్ధుడిని విధాత్రి ఇలా అడగటం సబబేనా ? అన్నాడు కంగారుగా యశ్వంత్ .
సబబే .. ఎందువల్ల నంటే ఈ వివాహం .. మీరు కలసి జీవించటానికి కాదు .. ఆమె ఆత్మ శాంతి కోసం .. ఆమె పగ
చల్ల బడటం కోసం .. వైజయంతి లో దుష్టాత్మ ని సంహరించటం కోసం .. మీ అందరి మంచి కోసం .. ఈ వూరి
ప్రజల మంచి కోసం .. ఆవేశం గా అంది విధాత్రి .
మీరంటే నాకు గౌరవం యువరాణీ .. కానీ ఆమె ఎవరు ? ఆమె ని పెళ్లి చేసుకుంటే వైజయంతి పీడ వదలట మేంటి ?
అన్నాడు యశ్వంత్ .
ఎందుకంటే ఆమే వైజయంతి .. నా సోదరి .. తన జీవితం అంతా నిండి పోయిన అసంతృప్తి నేడు ఆమెని పిశాచం గా
మార్చివేశాయి . దుస్క్రుత్యాలకి పాల్పడేలా చేశాయి .. ఆమె కోరిక .. అనిరుద్ధుడిని మనువాడాలని ..
ఇప్పుడు ఆమె కి శరీరం లేక పోవొచ్చు .. కానీ ఆ కోరిక అలానే ఉండి పోయింది .. ఆ కోరిక నెరవేరితే ఆమె
శాంత చిత్తురాలై పరలోకానికి చేరుకుంటుంది .. మరుజన్మ కై ఎదురు చూస్తుంది .. అంది విధాత్రి .
కానీ నేను మనిషి ని .. ఆమె ఒక దెయ్యం .. ప్రేతాత్మ .. తనని నేనెలా పెళ్లి చేసుకోను . అయినా పెళ్లి అనేది ఓ
అనిర్వచనీయ మైన బంధం .. అది మనసు పడిన మనిషి ముడి పడాలి .. కానీ ఒక ప్రేతాన్ని పెళ్లి
చేసుకోమంటున్నారు మీరు .. కుదరని పని అది .. అయినా మీరు వైజయంతి ని పెళ్లి చేసుకోమని ఎలా అడుగు
తున్నారు .. ? అన్నాడు యశ్వంత్ .
కత్తి పట్టి యుద్ధం చేసేవాడే వీరుడు కాదు అనిరుద్దా .. అందరి క్షేమం కోసం తన సంతోషాన్ని అయినా వదులు
కొనేందుకు సిద్ధ పడేవాడే నిజమైన వీరుడు . అయినా ఈ పెళ్లి యస్వంతుని గా మీరు చేసుకోవటం లేదు .
అనిరుద్దుడిగా చేసుకోండి .. అంది విధాత్రి .
అనిరుద్ధుడు కూడా విధాత్రి ని ప్రేమించాడు .. అనిరుద్ధుడు వైజయంతి తో మనువు కి ఎప్పటికీ సిద్ధ పడడు ..
అన్నాడు యశ్వంత్ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment