Powered By Blogger

Thursday, 30 October 2014

రుధిర సౌధం 272కానీ అనిరుద్ధుడు మాట తప్పని వాడు .. ప్రియురాలి కోరిక ని కాదనని వాడు .. అంది విధాత్రి .

అసహనం గా తల విదిలించాడు యశ్వంత్ .

ఇది త్యాగమే కావొచ్చు .. లేదా మీ మనసుకి విరుద్ధమే కావోచ్చ్చు .. కానీ లోక కళ్యాణం .. ఈ కళ్యాణం ఆమె ని

ఈ మహల్ మీ ద ఉండి పోయిన మమకారాన్నుండి దూరం చేస్తుంది .. శాశ్వతం గా ఆమెని పరలోకానికి పంపు

తుంది .. నా సోదరికి ముక్తి ని ప్రసాదించండి .. అని అర్థించింది విధాత్రి .

ఏమీ అనలేక .. చిన్నగా నిట్టూర్చి .. నేనొక సారి స్వామీజీ తో మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ .

ఆమె సరేనని తల ఊపింది .

యశ్వంత్ స్వామీజీ వైపు నడిచాడు .

వీరిద్దరి సంభాషణ నంతా విన్న శివ , మురారి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .

తన వైపు వస్తున్న యశ్వంత్ ని చూసి .. రా నాయనా ? నీ నిర్ణయం తెలుపు .. అన్నారు .

స్వామీజీ .. అన్నీ తెలిసిన వారు .. ఇప్పుడు నా మదిలో సంఘర్షణ ని అర్థం చేసుకోలేరా ? అన్నాడు యశ్వంత్ .

చూడు నాయనా .. ఏ విషయాన్ని ఐనా మనం చూసే కోణాన్ని బట్టే అది మనకి అర్థమవుతుంది .. ఈ కార్యం

వైజయంతి , విధాత్రుల దృష్టి లోనే వివాహం .. కానీ నీ దృష్టి లో యుద్ధం .. కత్తి పట్టి తుదముట్టించ డానికి ఆమె

మరణం లేనిది .. తంత్ర విద్యా పారంగతురాలైన ఆమె ఓ రాచ కన్య . ఆమె లోని క్రూరత్వం నీతో పెళ్లి అనగానే

సౌమ్యతగా మారింది . తన కోరిక నేరవేరబోతుందన్న ఆనందం ఆమె లోని వివేకాన్ని మూసివేస్తుంది .. అదే నీవు

శత్రువు ని ఓడించగల తరుణం .. అని నర్మ గర్భం గా నవ్వారు స్వామీజీ .

యశ్వంత్ కి అర్థమైంది .. అతడి పెదవులపై చిరునవ్వు విరిసింది .. చిన్నగా తల ఊపాడు యశ్వంత్ .

మరేమిటి ? నీ నిర్ణయం కోసం అక్కడ పెళ్లి మండపం లో వధువు వేచి చూస్తుంది .. అన్నారు స్వామీజీ .

పదండి స్వామీజీ .. మండపం కి వెళ్దాం .. అని ముందుకి నడిచి .. రాకుమారి విధాత్రి ని కాదని .. అనిరుద్ధుడ నైన

నేను .. ఈ సుందరాంగి .. రాకుమారి వైజయంతి ని మనువాడ నిశ్చయించాను .. అని గట్టిగా అరిచాడు యశ్వంత్ .

శివ , మురారి అయోమయం గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే .. ఏం జరుగు తోంది ఇక్కడ ? అని

అడిగాడు  విక్కీ వగరుస్తూ .

మాకూ అర్థం కావడం లేదు .. కానీ చూస్తూ ఉండటమే మంచిది అన్నాడు శివ .

యశ్వంత్ ప్రకటన కి ఉబ్బితబ్బిబ్బయింది వైజయంతి .. నిస్సహాయం గా బేలగా చూసింది విధాత్రి ...

శుభం భూయాత్ .. అని గోపాలా వరునికి నూతన వస్త్రాలు తీసుకురా .. అన్నారు స్వామీజీ . 5 నిమిషాల్లో వచ్చాడు

గోపాల స్వామి .. రాచకుమారుల వస్త్రాలతో .

ఈ వస్త్రం ధరించి ఖడ్గం చేతబూని వరుని గా రా నాయనా ... అన్నారు స్వామీజీ .

యశ్వంత్ అతడు చెప్పినట్లే చేశాడు ..

వెళ్ళు .. మండపం లో ఆశీనుడివి కా .. అని తానూ మండపం వైపు నడిచారు స్వామీజీ ..

యశ్వంత్ వెళ్లి వైజయంతి పక్కన ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నాడు ..   ఆమె సిగ్గుతో తల

దించుకుంది. స్వామీజీ వారికి పక్కగా కూర్చుని వినాయక పూజ మొదలు పెట్టారు .. గోపాల స్వామి హోమ మ్

మండించి .. నేతి కోసం  పక్కకి రాగానే .. గోపాల స్వామీ .. ఏం జరుగుతుంది ? దెయ్యానికి , మనిషి కి పెళ్లి ఏంటండీ

?మా యశ్వంత్ ని ఏం చేస్తున్నారు ? అని అడిగాడు శివ కోపంగా .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: