Powered By Blogger

Monday, 20 October 2014

విశాఖ అంతా విషాదమే


హలో బ్లాగర్స్ అండ్ బ్లాగ్ రీడర్స్ ,,

        చాలా రోజుల తరువాత మళ్లి బ్లాగ్ లో రాస్తున్నాను . దసరా జరుపుకుందామని ఉత్తరాంధ్ర కి వెళ్ళిన మేము

హుడ్ హుడ్ తుఫ్ఫాను తాకిడి కి గురవక తప్పలేదు . కరెంటు లేదు .. నీళ్ళు లేవు .. ఒక్కసారిగా గతం లోకి

ప్రయాణం చేసినట్టని పించింది . సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు .. ఇక నా ఆలోచన నిజమేగా .. మనిషి దైనందిన

జీవితం లో ఉన్న ఇక్కట్లు అని చెప్పేకంటే  సుఖానికి అలవాటై పోయిన మనిషి .. భరించలేని కష్టాలవి .

నీటి విలువ , విద్యుత్ విలువ తెలిసిన రోజులవి . తిరిగి బెంగళూరు చేరిపోయాను .. అతికష్టం గా .. రైళ్ళు నడవడం

లేదుగా మరి . ఏమైతేనేం అక్కడనుంచి బయట పడ్డానని అనిపించలేదు .. నేర్చుకున్న కొత్త పాఠం మరి .

విశాఖ లో ఆణువణువూ అందమే .. ఎంతో అనుబంధం ఉంది విశాఖ  తో .. కానీ హుడ్ హుడ్ తుఫ్ఫాన్ ధాటి కి

విలవిల లాడిపోయి నీరసం గా కాంతిని కోల్పోయి .. సొమ్మసిల్లి పోయిన విశాఖ ని చూస్తె మాత్రం కన్నీళ్లు ఆగ

లేదు .. విశాఖ ని ఒక్కసారి దర్శిస్తే చాలు .. ఆ నగర అందచందాలకి ముగ్దులవని వారు ఉండరు .. అలాంటిది ..

విశాఖ తో అనుబంధం ఉన్నవారైతే .. ?

నిజంగా ఇది దుస్థితి .. బాధాకరమైన స్థితి .. ప్రక్రుతి ప్రకోపం విలయతాండవం చేస్తుంటే పోరాడి పోరాడి ..

జవసత్వాలు కోల్పోయి నట్టుంది నేడు విశాఖ . ఏళ్ళ కొద్దీ నిటారుగా , గంభీరం గా , ఎన్నో తరాలను చూసిన ..

చెట్లు కూకటి వేళ్ళతో నేల కూలాయి .. భవంతులు చిన్నాభిన్న మయ్యాయి .. ఇక పేదవాడి గుడిసెల గురించి

ఏం చెప్పేది ? ఒక్కసారిగా విశాఖ ప్రజల్ని పట్టి కుదిపేసింది తుఫాన్ .. నష్టం జరగని చోటు లేదు .. కష్టం తెలియని

మనిషి లేడు . అడుగడునా నీటి కోసం పాట్లే ..   నిత్యావసరాల కోసం పడిగాపులే .. రెక్క లొచ్చిన ధరలు .. !

కాలకృత్యాలు తీర్చుకోవడానికి కష్టమే .. నిజమే .. మనిషి ప్రక్రుతి ముందు ఎప్పుడూ చిన్నవాడే ..

కానీ ప్రజల్లో సంయమనం చూసాను .. కూలి పోయిన కరెంటు స్తంభాలని చూసి .. తట్టుకున్నారు .. కరెంటు మీద

ఆశ వదులు కున్నారు .. నీటి కోసం ప్రయత్నాలు చేసారు .. ఆ కష్టాన్ని భరిస్తూనే .. మోడుబారి పోయిన విశాఖ

ని మళ్ళి చిగురిమ్పజేయగలం అన్న నమ్మకాన్ని మనసులో పెంచుకున్నారు .. మనిషి కి మనిషి సాయపడ్డారు .

ఒక్కటిగా సహాయక చర్యలకి ముందుకి కదిలారు .. కష్టం మనుషుల్ని దగ్గర చేస్తున్నది నిజమే అనిపించింది .

సెల్ల్ఫోన్స్ , టీవీలు వచ్చి మనుషుల మధ్య బంధాలని ఎంత దూరం చేశాయో .. అవేమీ లేని ఆ వారం రోజులు

అందరి తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ .. కలసి ఒకరికొకరం సాయం చేసుకుంటుంటే తెలిసింది ..

ఏమైతేనేం .. గండం గడిచింది .. మళ్ళి మెల్లిగా వెలుగులు నింపుకుంటుంది విశాఖ .. నిజం చెప్పాలంటే ..

రాజకీయాల్ని , రాజకీయ నాయకుల్ని అస్సలు ఇష్టపడని నేను .. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గార్ని

ప్రశంసి0చ కుండా ఉండలేను .. కష్టం లో ఉన్నవాడికి మొదట ఓదార్పు అవసరం .. అదే ఆయన చేశారు .

దారిపొడవునా కూలిపోయినా స్తంభాలని , చెట్లని చూస్తే కరెంటు రావటానికే నెల పడుతుందేమో అనుకున్నాను .

కానీ ఆయన 6 రోజుల్లో అన్నీ చక్కదిద్దారు .. ఇంకా ఆ పనిలో నిమగ్నమయి ఉన్నారు .. తన బాధ్యతా యుత

వైఖరిని ఆయన ప్రదర్శించిన తీరు నిజంగా అభినంద నీయం ..

విశాఖ ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ని  తన వైపు తిప్పుకుంది . స్మార్ట్ సిటీగా ఎంపికైంది .. ఆంధ్ర వారికి ఆశల

వేదికైంది .. అభివృద్ధి వైపు శరవేగంగా పయనిస్తుంది .. ఇంతలోనే ఎవరి దిష్టి తగిలింది ? ఇంతలా జరిగిపోయింది .

ఓ చెడు ఓ మంచికే .. అంటారు .. అవును . పొరపాట్లని దిద్దుకుంటూ .. విశాఖ ముందుకే అడుగు వేస్తుంది ..

మళ్ళి వేగం పుంజుకుంటుంది .. అవకాశం ఉన్నవారంతా దయచేసి తుఫాన్ బాధితులకి సహాయం చేయండి .

హుడ్ హుడ్ ప్రభావానికి నా సీరియల్ కూడా ఎఫెక్ట్ అయ్యింది ..

ఈరోజు నుంచీ మళ్ళి మీ ముందుకి రుధిర సౌధం వస్తుంది .. ఆలస్యానికి క్షమించాలి .

ఈ పోస్ట్ లో  నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను .. ఏమైనా తప్పుగా రాసి ఉంటె మన్నించగలరు ..

                                                                                                               
                                                                                                                              మీ రాధికమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

1 comment:

శ్యామలీయం said...

దేవత అని ఒక పాతసినిమా ఉంది అందులో‌ ఘంటసాలవారి తలచేది జరుగదు జరిగేది తెలియదు అనే పాటలో ఒక చరణం

ఒక నాటి ఉద్యాన వనము
నేడు కనము
అదియే
మరుభూమిగా నీవు చేసేవులే

ఇక్కడ వినండి