Powered By Blogger

Wednesday, 26 November 2014

స్వచ్చ భారతం


 రా రా ఫ్రెండు  మన మొక దండు .. ఊరూ వాడా శుభ్రం చేద్దాం ..
మనమే ఉండు స్థలమే ముందు .. పరిశుభ్రo గా చేసి చూపుదాం
త్యాగాలక్కర్లేదు .. ప్రాణాలను ఇవ్వక్కరలేదు ..
మన చుట్టూ పరిసరాలను శుభ్రం గా ఉంచితే చాలు ..
స్వచ్చంధం గా దేశాన్ని స్వచ్చ భారతం చేస్తే చాలు ..
రారా ఫ్రెండు మన మొక దండు .. ఊరూ వాడా శుభ్రం చేద్దాం .

పరిశుభ్రత లోనే ఆరోగ్యం ఇమిడి ఉంది ..
రోగాలను తరిమే వీలు పరిశుభ్రత తోనే ఉంది .
ఐనా ఇది మన దేశం ..మన మంతా ఒకరను సందేశం ..
ప్రతి చోటు మన సొంతం .. మన పని మనమే చేద్దాం ..
మన ఇంటిని శుభ్రపరచుదాం .. మన వీధి ని శుభ్ర పరచుదాం ..
ప్రతి ఒక్కరి లో ఈ ఆలోచనా .. దేశాన్ని కాపాడుదాం .
భరతావని ని స్వచ్చంగా ఉంచి చూపుదాం ..
విదేశాలలో కీర్తి పతాక ఎగరవేయుదాం ..
ఇది స్వచ్చ భారతం .. స్వేచ్చా భారతం ....

రండి .. మనమూ మన వంతు బాధ్యత ని నెరవేరుద్దాం ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 13 November 2014

నీ జీవితం.. it's your life

రెపరెప కన్నులు తెరవగా .. అది జననం ..

ఆ కనురెప్పలు మోయగా .. అది మరణం ..

నడుమ జీవనం తెలుసుకో ఈ క్షణం ..

రాసే ఉండుంటుంది ఎన్ని శ్వాసలు నీ వంతో ..

కలిసే తీరుతుంది నీకై ఏ బంధం ఉందో ..

ఉన్న నాళ్ళు గడుపు జీవితం .. సంతోషమే  పంచు జీవితాంతం   .

నువ్వు పెంచిన మంచినే తీసుకెళ్ల గలవు ..

మనసు పంచిన మమత నే మిగిలుంచగలవు ..

నీది నాదను దేముంది ? నీ వెంట వచ్చే దేముంది ?

ఈ నిజము తెలియని మనుషుల లెందరో ..

మనసు పడి జీవించ రెందుకో ..

పెదవి పైన చిందే నవ్వే ఆయువే పెంచేను ..

కల్మషాలు లేని నాడే బంధమే వికసించేను ..

కన్ను మూసినా తదుపరి కూడా ..

బ్రతగ గలగే వీలుంది ..

అది అంతరంగాల్లో నిలిచే జ్ఞాపకాలై  నీ జీవితం ..మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

నీతోనే నీ పోరాటం

నీ కనులలో కనిపించని చిరునవ్వుల నెతికా .. 

నీ పెదవులపై కమ్మని కల గురుతుల నెతికా .. 

కనరాని నిజమేదో కన్నది నా హృదయం .. 

ఎనలేని స్నేహాన్ని ఇవ్వాలని నేస్తం .. 

నీ గుండెకే ఓదార్పు నేను .. నీ అడుగు తో అడుగేస్తున్నాను 

కలిసే చేద్దాము లోకం తో యుద్ధం .. చిరకాల సమరానికి మన మనసులు సిద్ధం  -నీ కనులలో 

బడబాగ్ని దాచింది ఆ సంద్రమయితే .. 

నిలువెల్లా ఉప్పని కన్నీరే రూపయితే .. 

అలలల్లె నవ్వింది .. నింగి కి కడలగెగసింది.. 

హృదయాన్నే కాల్చేటి బాదే నీదయితే .. 

ఉదయాన్నే వెలివేసే వేదన నిను ముంచితే .. 

వెలుగుల్నే నీకిస్తా ..నీడగా నే తోడుంటా .. 

ఆకాశమంటే అoతె రుగని శూన్యం .. 


కొలవగలవా ఆ తీరం .. దూరం ..

 ఊగిస లాడకే ఓ మనసా .. నచ్చచెప్పవె నీ మది కీ ..         నీ కనులలో 


నటరాజు సిగలో జలపాతం .. నేలని తాకటం మానవ యత్నం .. 

సాధించటం నీ అభిమతం .. అయితే వెనుదిరిగి చూడకు ఏ మాత్రం .. 

కలలే కంటూనే నిదురిస్తూ ఉంటామా ?

కనులే తెరచి నిజమును కనమా ?

కన్నీటి కొలతెంతో లెక్కలు వేస్తుంటామా ?

చేరాల్సిన గమ్యం ముందర చూస్తామా ?

నీలోను ఉన్న శత్రువు నీవేలే .. నిన్నే నమ్మేది నువ్వేలే .. 

కనిపించని విరోధి తో పోరాటం చెయ్యాలి .. 

విషమించిన ఆవేదనని అంతం ఇక చేయాలి .. 

పొగమంచు పోయే ముందు ఈ శోధన తప్పదులే .. 

నునువెచ్చని కిరణాలు  లోకాన్ని మేల్కొలుపులే .... - నీ కనులలో   

    

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 5 November 2014

నిస్పృహ

ఎందుకో మనసు  మూగబోతుంది .. 

నా మదిలో  నిశ్శబ్దం నన్నే కలవర పెడుతోంది .. 

కన్నీటి అలలు ఎంత చెంప తడిమినా .. 

 గుండె భారం దిగను పొమ్మంది .. 

పెదవులపై మాటలతో యుద్ధం మౌనమే గెలిచినట్టుంది .. 

నింగి కృంగి నేల పై నిస్సహాయంగా పడుతున్నట్లుంది .. 

గాలి స్తంభించి కాలం ఆగిపోతున్నట్లుంది .. 

ఊపిరి శబ్దం కూడా ఉండుండి భయపెడుతోంది .. 

ఎందుకిలా ఉందంటే మూగగా రోదిస్తున్న హృదయం చెప్పింది .. 

నిన్ను నువ్వే కోల్పోయావే పిచ్చిదానా అని .. 

నిజమే ఈ క్షణం అర్థమయింది నాలో నేను లేనని .. 

కూలిపోయిన ఆత్మవిశ్వాసపు గోడల మీద .. 

చిరిగిపోయిన చిత్రపటం లా .. 

ఒంటరితనపు శిశిరం లో మోడువారిపోయిన వాసంతాన్నని .. 

ఓటమి , గెలుపుల మధ్య అంతరాన్ని అయ్యానని .. 

మొక్కని వీడి రాలిపోయిన పూల సుగంధాన్ని నేనేనని .. 

తెలుసుకున్నా .. చితికి పోయిన ఆశ కిక ఆయువు లేదని ...        

నిరాశా నిస్పృహ ల నడుమ జీవితం ఊగిస లాడుతుందని .. మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

"రుధిర సౌధం " పూర్తి చేశాను

డియర్ రీడర్స్ ..

             
              మీ అందరి అభిమానం తో విజయవంతం గా బ్లాగ్ లో "రుధిర సౌధం " పూర్తి చేశాను . ఈ రోజు తో

మీ అభిమాన పాత్రలు మీ మనసు లో చెరగని ముద్ర వేసి వీడుకోలు చెప్ప బోతున్నాయి .. మీ అభిమానం తో

పాటుగా మీ అభిప్రాయాలను పంచారు .. సలహాలను ఇచ్చారు . చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ .

మీ అందరికీ నచ్చే మరో నవల తో మళ్ళి మీ మనసుల్ని చూరగొనాలని ఆశిస్తాను . మీ అమూల్య మైన

సలహాలకి , అభిప్రాయాలకి " నా రచన " ఎప్పుడు స్వాగతం చెబుతుంది .

ధన్యవాదాలు ..                                                                                                     -   రాధిక ఆండ్ర 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 275

అలా అయితే మళ్ళి వద్దాం .. కానీ ఇప్పుడైతే వెళ్దాం .. శివ ఎదురు చూస్తుంటాడు పద . అని సూట్ కేసు పట్టుకుని

గది బయటికి నడిచాడు మురారి .

హడావిడి గా తిరుగుతున్న సరస్వతి ని చూసి .. సరస్వతీ .. రచనా , యశ్వంత్ ఎక్కడున్నారు ? అని అడిగాడు

మురారి .

రత్నం బాబు సంగతి తెలిసిన కాడి నుంచీ బాధ గానే ఉన్నారు దాత్రమ్మ . ఆ పూల తోటలో కూర్చున్నారు యశ్వంత్

బాబు ఇప్పుడే అటు వెళ్లి నట్టున్నారు .. అంది సరస్వతి .

సరే .. ఈలోపు నేను ఆంటీ తో మాట్లాడతాను .. అని .. పద సత్యా .. అని ముందుకి దారి తీశాడు మురారి .

రచన పూల మధ్య ఒంటరిగా కూర్చుంది .ఆమె మనసు లో జరిగినవన్నీ జ్ఞాపకాలు గా సుళ్ళు తిరుగుతున్నాయి ..

అనుకున్నదాని కంటే వైభవం గా సహస్ర యాగం జరిగింది . గుళ్ళో అమ్మవారు స్థిరపడింది .. సరస్వతి ఊరి

బాగోగులు చూసుకునేందుకు ఒప్పుకుంది .. అంతా ఆనందమే .. ఒక్క రత్నం విషయం తప్ప .. యశ్వంత్ , శివ

మురారి అంతా నా దగ్గర దాచారు .. కానీ వాళ్ళ తప్పేముంది ? ఎంతో ఉన్నతం గా ఆలోచించారు .. వీరస్వామి

చనిపోయాడు .. అమ్మవారి హారాన్ని దూరం చేయాల్సిన అవసరం కలగలేదు .. ప్రతీ విషయం లోనూ ఒక స్థిరత్వం

ఏర్పడింది . స్వామీజీ తన శేష జీవితాన్ని అమ్మవారి సేవ లోనే గడుపు తానన్నారు .. ఆయన తో పాటూ గోపాలం .

ఈరోజు పరిస్థితులు అన్ని చక్క బడ్డాయంటే యశ్వంత్ , శివ , మురారి , సత్య .. వీళ్ళే కారణం .. నా జీవితం నుండి

ఎప్పటికీ వీరేవ్వర్ని దూరం   కానివ్వకు తల్లీ .. అని మనసులోనే అమ్మవారిని ప్రార్థించింది రచన .

రచనా .. అని పిలిచాడు యశ్వంత్ ..

ఆమె ముక్త సరిగా చూసింది ..

సారీ .. అన్నాడు యశ్వంత్ ఆమె పక్కనే కూర్చుంటూ .

ఎందుకు ... నేను అర్థం చేసుకోగలను .. యశ్వంత్ . నాకన్నా నువ్వే ఎక్కువగా నువ్వే బాధ పడున్టావు కదూ ..

అంది అతని భుజం మీద తల వాలుస్తూ .

నీకుకోపం లేదా నామీద ? నేను నీ దగ్గర రత్నం విషయం , వీరస్వామి విషయం తో పాటూ విధాత్రి కోసం కూడా

దాచాను కదా .. అన్నాడు యశ్వంత్ .

తర్వాత అయితే చెప్పెసావుగా .. నేను నిన్ను నమ్ముతాను యశ్ .. అన్ని పరిస్థితులని నువ్వే చక్కదిద్దావు ..

ఒక్క క్షణం ఆలోచిస్తే .. నా మనసు ఇప్పుడు ఎంత ప్రశాంతం గా ఉందో తెలుసా ? అంది రచన .

ఉంటుందే ఉంటుంది .. నాకు తెలియ కుండా ప్రేమా ? అన్న మాటలు విని ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు ..

అక్కడ గిరిజ , విక్కీ , సత్య , మురారి , సరస్వతి వీరి వైపు నవ్వుతూ చూస్తూ కనబడ్డారు .

అమ్మా .. అది .. అంటూ కంగారుగా ఏదో అనబోయింది రచన ..

రచనా .. నువ్వు చెప్పక పోయినా నీ ప్రేమ గురించి నాకు తెలిసి పోయింది .. నేను అమ్మ తో చెప్పేసా .. నిన్ను

ఎవరు  భరిస్తారా ? అనుకుంటే ఆఖరికి యశ్వంత్ బుక్ అయిపోయాడన్న మాట . అన్నాడు విక్కీ .

యశ్వంత్ హాయిగా నవ్వేశాడు .

అన్నయ్యా .. నిన్నూ .. అంది రచన .

ఈ రుధిర సౌధాన్ని ప్రేమ సౌధం గా మార్చారు మీరు .. ఈ మహల్లో జరిగే తోలి శుభకార్యం మీ పెళ్ళే కావాలి ..

యశ్వంత్ .. ముహూర్తాలు పెట్టించేయనా ? అంది గిరిజ .

మీ ఇష్టం .. ఆంటీ .. అన్నాడు చిరునవ్వుతో యశ్వంత్ .

ఐతే .. ఫంక్షన్ ఉంది .. నేనిప్పుడు నీతో రాను మురారి .. నా ఫ్రెండ్ పెళ్లి .. అంది సత్య అల్లరిగా .

నేను మాత్రం వెళ్తున్నానా ? పెల్లైయ్యేవరకు ఇక్కడే .. అన్నాడు మురారి .

ఇంతకీ శివ ఎక్కడ ? అని అడిగింది రచన .

మొన్న సరస్వతి వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా .. అప్పట్నించి శివ ఆమె వెనకాలే తిరుగుతున్నాడు .. అన్నాడు

మురారి .

అవునా ? అయితే సరస్వతి ఒప్పుకుంటే మరో పెళ్లి కూడా ఇక్కడే .. అన్నాడు యశ్వంత్ .

నాకేం అభ్యంతరం బాబు .. దాని అదృష్టం .. అంది సరస్వతి కృతజ్ఞతగా .

ముందు కాస్త మాకు ప్రైవసీ వదుల్తారా లేదా ? అరచింది రచన .

అందరూ నవ్వుతూ .. అన్నారు .. మాకు పెళ్లి పనులున్నాయి .. అని .. నవ్వుతూ అక్కడ్నించి వెళ్లి పోయారు .

యశ్వంత్ కళ్ళలోకి ఆరాధన గా చూసింది రచన .

మనకింకా చాలా బాధ్యతలు ఉన్నాయి కదా రచనా .. ఊళ్లోకి అన్ని సదుపాయాలు రావాలి. ప్రభుత్వం ఏదో

చేస్తుందని చూసేకంటె మనమే అన్ని కల్పిస్తే పోలే .. మన దగ్గర డబ్బు కూడా ఉంది .. ఏమంటావు ? అన్నాడు

యశ్వంత్ ఆమె ని దగ్గరకి తీసుకుంటూ .

నీ ఇష్టం యశ్వంత్ .. అని అతని గుండెలపై తలని వాల్చి వెచ్చగా ఒదిగిపోయింది రచన .

పూలు వారి వైపు నవ్వుతూ చూస్తున్నాయి ..

రావణ పురం తన రూపు రేఖల్ని మార్చుకోడానికి ముచ్చటగా ఆ ప్రేమికుల మనసులో లక్ష్యం లా నిలిచిపోయింది .

                                                         
                                                                  సమాప్తం 

ఈ సీరియల్ ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు .. మరో చక్కని సీరియల్ తో మళ్ళి కలసుకుందాం ..

                                                                                                                       - రాధికఆంద్ర

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 4 November 2014

రుధిర సౌధం 274మేము మిమ్మల్ని మరవలేము .. రాకుమారీ .. అన్నారు శివ , మురారీ బాధగా .

మీకందరికీ కృతఙ్ఞతలు .. అని కంటనీరుతో .. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్కీ దగ్గరికి వెళ్లి .. నీవు ఈ

వంశానికి మిగిలిన వారసుడివి . వంశ గౌరవాన్ని ఎల్లవేళలా కాపాడు . అంది విధాత్రి .

అయోమయం గా తల ఊపాడు విక్కీ .

అందర్నీ ఓసారి బాధగా చూసి .. ఇది ఆనందం .. ఈనాడు నా కల , నా కర్తవ్యమ్ నెరవేరింది .. సెలవు .. అని

అనగానే ఆమె శరీరం నుండి ఓ కాంతి వెళ్లి పోయి అచేతనం గా పడిపోయింది రచన .

వెంటనే రచనా .. అంటూ అందరూ ఆమె వైపు చేరుకున్నారు .

చిరునవ్వుతో .. ఆమె ని ఆమె గదిలోకి చేర్చండి . విశ్రాంతి అవసరం .. అన్నారు స్వామీజీ .

విక్కీ తన రెండు చేతులతో చెల్లెల్ని ఎత్తుకుని మహల్ లోకి నడిచాడు .. వెళ్తున్న అతడి వైపు , రచన వైపు

తదేకం గా చూస్తున్న యశ్వంత్ భుజం మీద వెచ్చగా ఓ చేయి పడటం తో .. ఒక్కసారిగా వెనుదిరిగి చూశాడు .

స్వామీజీ .. చిరునవ్వుతో .. ఇక ముందు వైజయంతి సమస్య లేదు .. మీరంతా ఆనందం గా ఉండొచ్చు .. అన్నారు

స్వామీజీ .

అవును స్వామీజీ .. చాలా ఆనందం గా ఉంది .. ఉద్వేగం తో మనసు నిండి పోయింది .. అన్నాడు యశ్వంత్ ..

హద్దుల్లేని ఆనందం తో .

మాకింకా ఇదంతా కలా నిజమా అని అనుమానం గా నే ఉంది స్వామీజీ .. అన్నారు శివ , మురారి .

సందేహించకండి .. మీరు విజయం సాధించారు .. అన్నారు స్వామీజీ .

ఇంత సులువుగా వైజయంతి కథ సమాప్తం అవుతుందని అనుకోలేదు .. అన్నాడు యశ్వంత్ .

ఇది సులువుగా జరిగిన పని కాదు నాయనా .. ఎవర్నైనా దెబ్బతీయాలంటే వారి బలహీనత ని తెల్సుకొని తగిన

సమయం కొరకు వేచి ఉండాలి .. అదే ఇప్పుడు మనమూ చేసింది . ఆమె అసంతృప్తి ని ఆమె నుండి దూరం చేసే

క్రమం లో విముక్తి పూజ జరిపి .. ఆమె మనసుని శుద్ధి పరచి మామూలు ఆత్మ గా ఆమె కి పరలోక ప్రాప్తి ని

కలిగించాం .. అంతే .. అన్నారు స్వామీజీ .

అవును స్వామీజీ .. కానీ ఇక్కడ మేము ఎదుర్కొన్న ప్రతీ అనుభవమూ .. విచిత్ర మైనదే .. జీవితం అంతా ..

బహుశా మా పిల్లలకి కథల్లా చెప్పుకోవోచ్చ్చు . అన్నాడు శివ .

ఇందులో మా కృషి కన్నా .. మీ తోడ్పాటు ఇంకా మరచిపోలేనిది స్వామీజీ .. అన్నాడు మురారి .

స్వామీజీ .. రచన త్వరగానే  కోలుకుంటుంది కదా...  అన్నాడు యశ్వంత్ .

మరో పది నిమిషాల్లో కోలుకుంటుంది .. మీకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది .. అదుగో జనం రావటం

మొదలు పెట్టారు .. యాగానికి సమయం కావొస్తుంది .. మీరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి అని లోపలికి నడిచారు

స్వామీజీ .

స్వామీజీ వెళ్ళిపోయాక .. యాహూ .. అంటూ ఒకర్నొకరు హత్తుకుని వారి ఆనందం పంచుకున్నారు  ఆ ముగ్గురు

స్నేహితులు .

                                       *********************************
మూడు రోజుల తరువాత


నిజమా ? అంత జరిగిందా ? అయ్యో నేనిదంతా చూడలేక పోయానే .. అంది సత్య .

ఇప్పటికి 51 వ సారి అన్నావు . టైం అవుతోంది సత్యా .. పద . అన్నాడు మురారి .

ఇప్పుడంతా క్లియర్ అయిపోయిందిగా మురారీ నాకూ కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది .. అంది గోముగా

సత్య .

ఇంకా ఉంది మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 3 November 2014

కనులు కలువలాయే .. నా కనులు కలువ లాయే ..

కనులు కలువలాయే .. నా కనులు కలువ లాయే .. 

కలల కొలను లోనా విరిసే కనులు కలువలాయే .. 

మనసు ముత్య మాయె .. నా మనసు ముత్యమాయే .. 

కురిసే స్వాతి చినుకు తాకి నా మనసు ముత్యమాయె .. 

ఆశలు .. నా ఊహలు .. విహరించనీ అంబరాలు .. 

శ్వాసలు .. నా ఊసులు .. జరిపించనీ సంబరాలు .. 

వీచే గాలితో సాగిపోనీ .... ఎల్లలెరుగని మదినీ ...      -కనులు 


హిమములా పూల సొగసుని ముద్దాడనీ .. తనివి తీరా .. 

తరంగమై సెలయేటినే పలకరించనీ ... మనసు తీరా .. 

ఊపిరే సంగీతమై .. నినదించనీ వేణుగానమా  .. 

అల్లరి గారాలని .. చూపించనీ ప్రేమ మధురిమా .. 

కొత్తగా ఉండదా .. ఈ లోకమే నిండుగా ... నవ్వగా .. నవ్వగా .. -- కనులు రుతువులన్ని ముస్తాబయి వచ్చాయిలే ..  ఒక్కసారిగా .. 

నాల్గు కాలాలు వింతగా స్నేహ హస్త మందిన్చగా .. 

ఆకాశమే తారల సాక్షి గా .. ఈ భూమి తో జోడీ కట్టగా 

ఆనందమే దిక్కుల సాక్షిగా .. నలువైపులా వ్యాపించగా .. 

బ్రతకడం పండుగా .. ప్రతిక్షణం అండగా .. నవ్వుండగా .. నవ్వు తుండగా ..                                                                                              -కనులు 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 273బాధ పడకండి .. ఆ దెయ్యం పీడ శాశ్వతం గా వదిలి పోతుంది . మీరలా చూస్తూ ఉండండి అంతే .. అన్నాడు

గోపాల స్వామీ .

నిస్సహాయం గా తల లూపారు శివ , మురారి , విక్కీ .

స్వామీజీ ఏవేవో మంత్రాలు చదువుతున్నారు .. యశ్వంత్ అతడి కనుసైగల్ని అర్థం చేసుకుని మెలగుతున్నాడు .

తల్లీ .. ముందు నువ్వు లేచి అగ్ని దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు ఒనర్చు .. అన్నారు స్వామీజీ .

వైజయంతి లేచి అలానే చేసింది .. స్వామీజీ పెదవులపై చిరునవ్వు విరిసింది ..

కలశం మీద ఉన్న మాంగల్యాన్ని పూజించు తల్లీ .. అన్నారు స్వామీజీ .. ఆమె తన ముందర ఉన్న అక్షితలని

చేతిలోకి తీసుకోబోయింది .. కానీ ఆమె చేత వాటిని ధరించలేక పోయింది ..

స్వామీజీ .. నేను వీటిని తాక లేక పోతున్నాను .. అన్నదామె ఆవేదనగా .

చింతించకు తల్లీ .. మీ కులదైవమైన అమ్మవారిని తలచుకొని అక్షితలు తాకే భాగ్యం కల్పించ మని అడుగు ..

అన్నారు స్వామీజీ .

అమ్మవారినా ? నేనే ఆమెని బయటకి వెళ్ళ గొట్టాను .. ఆమె నా ప్రార్థన మన్నిస్తుందా ? అని అడిగింది వైజయంతి .

తప్పక మన్నిస్తుంది . ఎందువల్లనంటే ఆమె తల్లి . తల్లి కి బిడ్డలందరూ సమానమే .. అన్నారు స్వామీజీ .

అలాగే అని .. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్ధించ సాగింది వైజయంతి .

ఆమె కళ్ళు మూసుకోగానే .. గోపాల స్వామి ఒక దారపు పోగుని యశ్వంత్ కి అందించాడు .

అది అందుకొని స్వామీజీ వైపు చూశాడు యశ్వంత్ .

ఆ దారాన్ని ఆమె చుట్టూరా గుండ్రం గా చుట్టమని సైగలతో చెప్పారు స్వామీజీ .

యశ్వంత్ లేచి కళ్ళు మూసుకుని ప్రార్ధిస్తున్న ఆమె ని చూసి దారం చివరికొన  ని పట్టుకుని క్షణం లో ఆమె ని

చుట్టి చివరి కొనని హోమ గుండం లోకి వేశాడు .. శివ , మురారి , విక్కీ ఉత్కంట గా చూశారు . విధాత్రి ఆశ్చర్యం

గా చూసింది . హోమాగ్ని క్షణాలలో దారపు కొనని తాకి ఓ వెలుగులా ఎగబాకి వైజయంతి ని గుండ్రం గా చుట్టబడిన

దారాన్ని తాకుతూ ఒక్కసారిగా ఆమెని హోమగుండం లోకి లాగింది . అందరూ చూస్తుండగానే వైజయంతి

హోమ గుండం లో ఆవిరై పోయింది .

ఏమిటి స్వామీజీ ఇది ? నా సోదరి కోరిక ని తీర్చ కుండా ఆమెని మోసం చేశారా ? బాధగా అడిగింది విధాత్రి .

ఈ పసుపు కలిపిన బియ్యాన్ని తాకలేని ఆమె మాంగల్యం మెడన ఎలా ధరించగలదు విధాత్రీ ? ఆమె కి ముక్తి

లభించింది .. పరలోకానికి సాగే ఆఖరి నిమిషం లో ఆమె తన తప్పుని మన్నించి శుభాన్ని కలగ జేయమని

అమ్మవారిని ప్రార్థించింది . ఆమె ప్రార్థన ని అమ్మవారు మన్నించింది . ఒక ప్రేతం గా ఈ వివాహం జరగరానిది ..

అందుకే ఆమెకి మరుజన్మ ప్రసాదిస్తుంది .. మాంగల్య భాగ్యాన్ని కలగజేస్తుంది .. నీ సోదరి ముక్తి ని పొందింది

ఇక నీ వంతు .. సమయం ఆసన్న మయింది .. ఆత్మ నైవేద్యం అమ్మవారికి నివేదించి శంఖం పూరించు ..

సహస్ర యాగానికి సమయమయింది .. అన్నారు స్వామీజీ .

చిత్తం మహర్షి .. అని యశ్వంత్ దరిచేరి .. ఇక సెలవు .. రచన ని మనువాడి ఆనందం గా ఉండండి .. అంది విధాత్రి .

విధాత్రీ .. మీరిక మళ్ళి కనబడరు కదా .. బాధగా ఉంది .. అన్నాడు యశ్వంత్ .. అతడి కనుకోసల్లో తలుక్కుమన్న

కన్నీటి పొర .

ఎందుకు కనబడను ? రచన రూపం నాదేగా .. కానీ మీ ప్రేమ పొందాలని ఉంది .. అందుకై మీకు , రచన కి బిడ్డగా

జన్మించే అదృష్టం ఇమ్మని అమ్మని ప్రార్థిస్తాను .. అంది విధాత్రి .

ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది