మేము మిమ్మల్ని మరవలేము .. రాకుమారీ .. అన్నారు శివ , మురారీ బాధగా .
మీకందరికీ కృతఙ్ఞతలు .. అని కంటనీరుతో .. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్కీ దగ్గరికి వెళ్లి .. నీవు ఈ
వంశానికి మిగిలిన వారసుడివి . వంశ గౌరవాన్ని ఎల్లవేళలా కాపాడు . అంది విధాత్రి .
అయోమయం గా తల ఊపాడు విక్కీ .
అందర్నీ ఓసారి బాధగా చూసి .. ఇది ఆనందం .. ఈనాడు నా కల , నా కర్తవ్యమ్ నెరవేరింది .. సెలవు .. అని
అనగానే ఆమె శరీరం నుండి ఓ కాంతి వెళ్లి పోయి అచేతనం గా పడిపోయింది రచన .
వెంటనే రచనా .. అంటూ అందరూ ఆమె వైపు చేరుకున్నారు .
చిరునవ్వుతో .. ఆమె ని ఆమె గదిలోకి చేర్చండి . విశ్రాంతి అవసరం .. అన్నారు స్వామీజీ .
విక్కీ తన రెండు చేతులతో చెల్లెల్ని ఎత్తుకుని మహల్ లోకి నడిచాడు .. వెళ్తున్న అతడి వైపు , రచన వైపు
తదేకం గా చూస్తున్న యశ్వంత్ భుజం మీద వెచ్చగా ఓ చేయి పడటం తో .. ఒక్కసారిగా వెనుదిరిగి చూశాడు .
స్వామీజీ .. చిరునవ్వుతో .. ఇక ముందు వైజయంతి సమస్య లేదు .. మీరంతా ఆనందం గా ఉండొచ్చు .. అన్నారు
స్వామీజీ .
అవును స్వామీజీ .. చాలా ఆనందం గా ఉంది .. ఉద్వేగం తో మనసు నిండి పోయింది .. అన్నాడు యశ్వంత్ ..
హద్దుల్లేని ఆనందం తో .
మాకింకా ఇదంతా కలా నిజమా అని అనుమానం గా నే ఉంది స్వామీజీ .. అన్నారు శివ , మురారి .
సందేహించకండి .. మీరు విజయం సాధించారు .. అన్నారు స్వామీజీ .
ఇంత సులువుగా వైజయంతి కథ సమాప్తం అవుతుందని అనుకోలేదు .. అన్నాడు యశ్వంత్ .
ఇది సులువుగా జరిగిన పని కాదు నాయనా .. ఎవర్నైనా దెబ్బతీయాలంటే వారి బలహీనత ని తెల్సుకొని తగిన
సమయం కొరకు వేచి ఉండాలి .. అదే ఇప్పుడు మనమూ చేసింది . ఆమె అసంతృప్తి ని ఆమె నుండి దూరం చేసే
క్రమం లో విముక్తి పూజ జరిపి .. ఆమె మనసుని శుద్ధి పరచి మామూలు ఆత్మ గా ఆమె కి పరలోక ప్రాప్తి ని
కలిగించాం .. అంతే .. అన్నారు స్వామీజీ .
అవును స్వామీజీ .. కానీ ఇక్కడ మేము ఎదుర్కొన్న ప్రతీ అనుభవమూ .. విచిత్ర మైనదే .. జీవితం అంతా ..
బహుశా మా పిల్లలకి కథల్లా చెప్పుకోవోచ్చ్చు . అన్నాడు శివ .
ఇందులో మా కృషి కన్నా .. మీ తోడ్పాటు ఇంకా మరచిపోలేనిది స్వామీజీ .. అన్నాడు మురారి .
స్వామీజీ .. రచన త్వరగానే కోలుకుంటుంది కదా... అన్నాడు యశ్వంత్ .
మరో పది నిమిషాల్లో కోలుకుంటుంది .. మీకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది .. అదుగో జనం రావటం
మొదలు పెట్టారు .. యాగానికి సమయం కావొస్తుంది .. మీరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి అని లోపలికి నడిచారు
స్వామీజీ .
స్వామీజీ వెళ్ళిపోయాక .. యాహూ .. అంటూ ఒకర్నొకరు హత్తుకుని వారి ఆనందం పంచుకున్నారు ఆ ముగ్గురు
స్నేహితులు .
*********************************
మూడు రోజుల తరువాత
నిజమా ? అంత జరిగిందా ? అయ్యో నేనిదంతా చూడలేక పోయానే .. అంది సత్య .
ఇప్పటికి 51 వ సారి అన్నావు . టైం అవుతోంది సత్యా .. పద . అన్నాడు మురారి .
ఇప్పుడంతా క్లియర్ అయిపోయిందిగా మురారీ నాకూ కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది .. అంది గోముగా
సత్య .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment