Powered By Blogger

Wednesday, 5 November 2014

రుధిర సౌధం 275

అలా అయితే మళ్ళి వద్దాం .. కానీ ఇప్పుడైతే వెళ్దాం .. శివ ఎదురు చూస్తుంటాడు పద . అని సూట్ కేసు పట్టుకుని

గది బయటికి నడిచాడు మురారి .

హడావిడి గా తిరుగుతున్న సరస్వతి ని చూసి .. సరస్వతీ .. రచనా , యశ్వంత్ ఎక్కడున్నారు ? అని అడిగాడు

మురారి .

రత్నం బాబు సంగతి తెలిసిన కాడి నుంచీ బాధ గానే ఉన్నారు దాత్రమ్మ . ఆ పూల తోటలో కూర్చున్నారు యశ్వంత్

బాబు ఇప్పుడే అటు వెళ్లి నట్టున్నారు .. అంది సరస్వతి .

సరే .. ఈలోపు నేను ఆంటీ తో మాట్లాడతాను .. అని .. పద సత్యా .. అని ముందుకి దారి తీశాడు మురారి .

రచన పూల మధ్య ఒంటరిగా కూర్చుంది .ఆమె మనసు లో జరిగినవన్నీ జ్ఞాపకాలు గా సుళ్ళు తిరుగుతున్నాయి ..

అనుకున్నదాని కంటే వైభవం గా సహస్ర యాగం జరిగింది . గుళ్ళో అమ్మవారు స్థిరపడింది .. సరస్వతి ఊరి

బాగోగులు చూసుకునేందుకు ఒప్పుకుంది .. అంతా ఆనందమే .. ఒక్క రత్నం విషయం తప్ప .. యశ్వంత్ , శివ

మురారి అంతా నా దగ్గర దాచారు .. కానీ వాళ్ళ తప్పేముంది ? ఎంతో ఉన్నతం గా ఆలోచించారు .. వీరస్వామి

చనిపోయాడు .. అమ్మవారి హారాన్ని దూరం చేయాల్సిన అవసరం కలగలేదు .. ప్రతీ విషయం లోనూ ఒక స్థిరత్వం

ఏర్పడింది . స్వామీజీ తన శేష జీవితాన్ని అమ్మవారి సేవ లోనే గడుపు తానన్నారు .. ఆయన తో పాటూ గోపాలం .

ఈరోజు పరిస్థితులు అన్ని చక్క బడ్డాయంటే యశ్వంత్ , శివ , మురారి , సత్య .. వీళ్ళే కారణం .. నా జీవితం నుండి

ఎప్పటికీ వీరేవ్వర్ని దూరం   కానివ్వకు తల్లీ .. అని మనసులోనే అమ్మవారిని ప్రార్థించింది రచన .

రచనా .. అని పిలిచాడు యశ్వంత్ ..

ఆమె ముక్త సరిగా చూసింది ..

సారీ .. అన్నాడు యశ్వంత్ ఆమె పక్కనే కూర్చుంటూ .

ఎందుకు ... నేను అర్థం చేసుకోగలను .. యశ్వంత్ . నాకన్నా నువ్వే ఎక్కువగా నువ్వే బాధ పడున్టావు కదూ ..

అంది అతని భుజం మీద తల వాలుస్తూ .

నీకుకోపం లేదా నామీద ? నేను నీ దగ్గర రత్నం విషయం , వీరస్వామి విషయం తో పాటూ విధాత్రి కోసం కూడా

దాచాను కదా .. అన్నాడు యశ్వంత్ .

తర్వాత అయితే చెప్పెసావుగా .. నేను నిన్ను నమ్ముతాను యశ్ .. అన్ని పరిస్థితులని నువ్వే చక్కదిద్దావు ..

ఒక్క క్షణం ఆలోచిస్తే .. నా మనసు ఇప్పుడు ఎంత ప్రశాంతం గా ఉందో తెలుసా ? అంది రచన .

ఉంటుందే ఉంటుంది .. నాకు తెలియ కుండా ప్రేమా ? అన్న మాటలు విని ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు ..

అక్కడ గిరిజ , విక్కీ , సత్య , మురారి , సరస్వతి వీరి వైపు నవ్వుతూ చూస్తూ కనబడ్డారు .

అమ్మా .. అది .. అంటూ కంగారుగా ఏదో అనబోయింది రచన ..

రచనా .. నువ్వు చెప్పక పోయినా నీ ప్రేమ గురించి నాకు తెలిసి పోయింది .. నేను అమ్మ తో చెప్పేసా .. నిన్ను

ఎవరు  భరిస్తారా ? అనుకుంటే ఆఖరికి యశ్వంత్ బుక్ అయిపోయాడన్న మాట . అన్నాడు విక్కీ .

యశ్వంత్ హాయిగా నవ్వేశాడు .

అన్నయ్యా .. నిన్నూ .. అంది రచన .

ఈ రుధిర సౌధాన్ని ప్రేమ సౌధం గా మార్చారు మీరు .. ఈ మహల్లో జరిగే తోలి శుభకార్యం మీ పెళ్ళే కావాలి ..

యశ్వంత్ .. ముహూర్తాలు పెట్టించేయనా ? అంది గిరిజ .

మీ ఇష్టం .. ఆంటీ .. అన్నాడు చిరునవ్వుతో యశ్వంత్ .

ఐతే .. ఫంక్షన్ ఉంది .. నేనిప్పుడు నీతో రాను మురారి .. నా ఫ్రెండ్ పెళ్లి .. అంది సత్య అల్లరిగా .

నేను మాత్రం వెళ్తున్నానా ? పెల్లైయ్యేవరకు ఇక్కడే .. అన్నాడు మురారి .

ఇంతకీ శివ ఎక్కడ ? అని అడిగింది రచన .

మొన్న సరస్వతి వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా .. అప్పట్నించి శివ ఆమె వెనకాలే తిరుగుతున్నాడు .. అన్నాడు

మురారి .

అవునా ? అయితే సరస్వతి ఒప్పుకుంటే మరో పెళ్లి కూడా ఇక్కడే .. అన్నాడు యశ్వంత్ .

నాకేం అభ్యంతరం బాబు .. దాని అదృష్టం .. అంది సరస్వతి కృతజ్ఞతగా .

ముందు కాస్త మాకు ప్రైవసీ వదుల్తారా లేదా ? అరచింది రచన .

అందరూ నవ్వుతూ .. అన్నారు .. మాకు పెళ్లి పనులున్నాయి .. అని .. నవ్వుతూ అక్కడ్నించి వెళ్లి పోయారు .

యశ్వంత్ కళ్ళలోకి ఆరాధన గా చూసింది రచన .

మనకింకా చాలా బాధ్యతలు ఉన్నాయి కదా రచనా .. ఊళ్లోకి అన్ని సదుపాయాలు రావాలి. ప్రభుత్వం ఏదో

చేస్తుందని చూసేకంటె మనమే అన్ని కల్పిస్తే పోలే .. మన దగ్గర డబ్బు కూడా ఉంది .. ఏమంటావు ? అన్నాడు

యశ్వంత్ ఆమె ని దగ్గరకి తీసుకుంటూ .

నీ ఇష్టం యశ్వంత్ .. అని అతని గుండెలపై తలని వాల్చి వెచ్చగా ఒదిగిపోయింది రచన .

పూలు వారి వైపు నవ్వుతూ చూస్తున్నాయి ..

రావణ పురం తన రూపు రేఖల్ని మార్చుకోడానికి ముచ్చటగా ఆ ప్రేమికుల మనసులో లక్ష్యం లా నిలిచిపోయింది .

                                                         
                                                                  సమాప్తం 

ఈ సీరియల్ ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు .. మరో చక్కని సీరియల్ తో మళ్ళి కలసుకుందాం ..

                                                                                                                       - రాధికఆంద్ర

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: